tag:blogger.com,1999:blog-6982090862782011703.post8233280245784909700..comments2023-08-29T07:38:14.908-07:00Comments on అధికారభాషగా తెలుగు: తెలుగు భాషకు సత్యసాయి అండNrahamthullahttp://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6982090862782011703.post-4165680696149080292016-05-14T06:31:39.931-07:002016-05-14T06:31:39.931-07:00తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
"భాష...తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
"భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే.భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును.ముందు 'భాష' పుట్టుతుంది.తర్వాత 'లిపి' పుట్టుతుంది.ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలు.లిపి లేని భాషలు 696.మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు.కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రము శబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు.తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు.నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. చాలా భాషల పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది ,ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును.తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది.సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగు భాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోని లిపి వలన వ్రాయవచ్చును.సంస్కృత భాషకు లిపిలేదు.సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగా వాడబడుచున్నది.అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది.ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు.ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి.తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్ద భాష ఏదీ లేదు.వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా ,చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి.శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప.ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు.''ఆత్మ'' అను పదము తెలుగు భాషలోనే పుట్టినది.వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". --- ఆచార్య ప్రభోదానంద యోగి (లు అంటే ఏమిటి? 2016)https://www.facebook.com/nrahamthulla/posts/1167077539990901Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-91263269802264653322014-06-17T06:26:56.901-07:002014-06-17T06:26:56.901-07:00ఇదంతయు తెలుగుభాష యొక్క గొప్పతనమునకు కనిపించు సత్యమ...ఇదంతయు తెలుగుభాష యొక్క గొప్పతనమునకు కనిపించు సత్యము కాగా, కనిపించని సత్యమొకటి కలదు. అది తెలుగు భాష పుట్టుకకే కారణమైనదని చెప్పవచ్చును. దానిని వివరించి చెప్పుకొంటే తెలుగు భాష దేశభాషలలో గొప్పదని కనిపించు వివరముల ప్రకారము చెప్పగలిగితే, తెలుగు భాష ‘దేహి’ భాషలలోనే గొప్పదని కనిపించని వివరముల ప్రకారము చెప్పవచ్చును. దేశము కనిపించునది. దేహి కనిపించనిది. దేశములో మనుషుల చేత చెప్పబడు భాషలు ప్రపంచ విషయములను తెలియజేయునవిగా ఉన్నవి. దేహములోని దేహిచేత చెప్పబడు భాష పరమాత్మ విషయము లను తెలియజేయునదిగా ఉన్నది. బయట దేశము మీద దృష్ఠికలిగి చెప్పునది దేశభాష అగును. లోపల దేహిమీద దృష్ఠికలిగి చెప్పునది దేహిభాష అగును. వివరముగా చెప్పితే దేశభాష అనగా అజ్ఞానముతో కూడుకొన్నదనీ, దేహి భాషయనగా జ్ఞానముతో కూడుకొన్నదనీ చెప్పవచ్చును. తెలుగుభాష లోని ప్రావీణ్యత ఇటు బయట దేశభాష ప్రకారమూ గలదు, అట్లే లోపలి దేహి భాష ప్రకారమూ గలదు. లోపలి ఆత్మయొక్క జ్ఞానమును చెప్పునపుడు ఆత్మజ్ఞానమునకు చాలా దగ్గరగా యున్నది ఒకే ఒక్క తెలుగుభాష. తెలుగు భాషలోని శబ్దములు, పద ఉచ్చరణలు ఆత్మజ్ఞానమునకు ఉన్నంత దగ్గరగా మరి ఏ ఇతర భాషలోనూ లేవు. అందువలన తెలుగు భాష దైవజ్ఞానమును దగ్గరగా చెప్పుట కొరకే తయారు చేయబడినదనీ, ఆత్మజ్ఞానమును తెలుపుటకు ప్రత్యేకముగా తయారు చేయబడిన భాష ఇదియేననీ చెప్ప వచ్చును. ఈ కారణమున తెలుగు భాషను తెలిసినవారికే దైవజ్ఞానమును తెలుసుకొను అవకాశము ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. ఆత్మ జ్ఞానమును తెలిసినవారు ఏ ప్రాంతమువారైనా, తెలుగు భాషను తెలిసిన తర్వాత తమ జ్ఞానమునకు తెలుగు భాషకు ఉన్న సంబంధమును చూచి, ఆత్మజ్ఞానము కొరకు ప్రత్యేకముగా తయారు చేయబడినది తెలుగుభాషయని తప్పక చెప్పుదురు. దేవుడు తన భావములను తెలుపుటకు ఎక్కువ అనుకూలముగా ఉండునట్లు తెలుగు భాషను ముందే తయారు చేసి వుంచాడనీ, భూమిమీద తన ధర్మములను మూడవ అవతారములో సంపూర్ణము చేయుటకు తెలుగుభాషను ఉపయోగించుకొనునని తెలియు చున్నది. దేవుడు భగవద్గీతలో చెప్పిన తన త్రైతసిద్ధాంతమును అనుసరించి, తన ధర్మములను జ్ఞానరూపములో పూర్తి వివరముగా తెలుపుటకు మూడు మార్లు భూమిమీదకు రావలసివున్నది. మూడవమారు వచ్చినపుడు ఏమాత్రము సంశయము లేకుండా, ప్రశ్న అనునది మిగలకుండా, శాస్త్రబద్ధముగా సంపూర్ణ సమాచారమును అందివ్వవలసివున్నది. అటువంటపుడు తన భావమును (దైవ భావమును) బాహ్యముగా తెలుపునది భాషయే. లోపలి భావమును బయటికి తెలుపునది భాష అయినపుడు, ఆ భాషను తన భావములకు దగ్గరగా ప్రజలు అర్థము చేసుకొనునట్లు తెలుగుభాషను తయారు చేసియుంచాడు. సంపూర్ణముగా దైవ భావములను ప్రకటించు భాష ఏదైతే ఉందో, ఆ భాషయందే తన మూడవ అవతారము ద్వారా ధర్మ ప్రకటన సంపూర్ణము చేసిపోవును---ప్రబోదానందయోగి (ఇందుత్వమును కాపాడుదాం)Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-38156749907603534462014-06-17T06:26:10.248-07:002014-06-17T06:26:10.248-07:00తెలుగు భాష దైవజ్ఞానము కొరకే దేవుడే నిర్మించిన భాష...తెలుగు భాష దైవజ్ఞానము కొరకే దేవుడే నిర్మించిన భాష. అచ్చులతో మొదలు పెట్టి చెప్పినా అందులోని మొదటి మూడక్షరములలో త్రైత సిద్ధాంతము ఇమిడివుండి, తెలుగుభాష దైవభాష అని చెప్పుటకు ఆస్కారమైనది. అచ్చుల లోని మొదటి మూడు అక్షరములు అ, ఆ, ఇ అని కలవు. మొదటి మూడు అక్షరములను దైవ సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతముతో పోల్చుకుంటే అ ` జీవాత్మ, ఆ ` ఆత్మ, ఇ ` పరమాత్మగా చెప్పవచ్చును.దైవ ధర్మములను సంపూర్ణముగా వ్యక్తము చేయు భాష ఒకే ఒక తెలుగు భాష. ‘‘దేశభాషలలో తెలుగు లెస్స’’ అని కొందరనినా ఇపుడు మేము ‘‘దేహి భాషలలో తెలుగు గొప్ప’’ అని అంటున్నాము. భగవద్గీత భావమును మొదట హిందీ భాషలో శ్రీకృష్ణుడు వ్యక్తము చేయగా, వ్యాసుడు సంస్కృత భాషతో హిందీ లిపిలో వ్రాసియుంచాడు. దేవుని చివరి అవతారము భారతదేశములో దక్షిణ ప్రాంత భాష అయిన తెలుగు భాషలోనే తన ధర్మములను తెలియజేయుననుటకు ఎన్నో ఆధారములు గలవు.తెలుగుభాషకు దేవుని జ్ఞానమునకు దగ్గర సంబంధములున్నవి.మొత్తము దేశములో లిపియున్న భాషలలో తెలుగు గొప్పది.‘‘దేశభాషలలో తెలుగు లెస్స’’ తెలుగు భాషలోనున్న అక్షరములు మరి ఏ ఇతర భాషలోనూ లేవు. అందువలన ఏ శబ్దమునైన సులభముగా ఉన్నదున్నట్లు వ్రాయవచ్చును.దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశములో కేవలము ఒక్క రాష్ట్రములో మాత్రమున్న తెలుగు భాషయందు పూర్వపు యుగములలో కవులు, పండితులు లేనిదానివలన తెలుగు భాషయొక్క గొప్పతనము దేశములోని చాలా ప్రాంతముల వారికి తెలియకుండా పోయినది. ఆంధ్ర దేశమును పాలించిన కృష్ణదేవరాయలు తెలుగు భాషను, తెలుగు భాషా కవులను పోషించిన దానివలన తెలుగు భాష యొక్క ప్రావీణ్యత కొంత బయటపడినది. అంతకు ముందు వ్యాసుడు సంస్కృతములో వ్రాసిన భారత భాగవత గ్రంథములను తెలుగులోనికి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అను ముగ్గురు కవులు వ్రాయడము వలన, తెలుగుభాషలో పాట, పద్య, గద్య, ద్విపద రూపములో వ్రాయుటకు అనుకూలముండుట వలన, మరి ఏ ఇతర భాషలలో ఇటువంటి అనుకూలము లేని దానివలన, తెలుగుభాష ఇతర ప్రాంతములవారికి కొందరికి తెలియడమేకాక, దేశభాషలలో తెలుగు గొప్ప భాషయని తెలిసిపోయినది. తెలుగు భాష యొక్క పదముల కూర్పులోని నైపుణ్యత, శబ్ద ఉచ్ఛారణలోని అందము ఇతర భాషలయందు వెదకినా కనిపించక పోవడము వలన, తెలుగు భాషను చూచిన ఎవ్వరైనా, ఇది దేశభాషలలోనే గొప్ప భాషయని చెప్పక తప్పదు..---ప్రబోదానందయోగి (ఇందుత్వమును కాపాడుదాం)Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-83637462675313752712014-02-21T03:28:01.939-08:002014-02-21T03:28:01.939-08:00తెలుగు దేవ భాషే అనటానికి సమర్ధనగా ఎక్కడ ఋజువులు ద...తెలుగు దేవ భాషే అనటానికి సమర్ధనగా ఎక్కడ ఋజువులు దొరికినా సేకరిస్తున్నాను.ఆసక్తి ఉన్నపెద్దలు మరిన్ని ఉదాహరణలు జోడించండి

1."ఒక రోజు నేను సాయి బాబాను అని మల్లె పూలు విసరగా అవి సాయిబాబా అనే పేరున తెలుగు అక్షరాలలో పడినవి. అప్పటి నుండి భక్తులు భజనలు చేయ డం మొదలు పెట్టారు. ఆ పూలు విసిరిన చోటే బాబా జన్మించిన చోటు".(http://www.suryaa.com/main/showSunday.asp?cat=1&subCat=11&ContentId=6044).

2.తెలుగుభాషను గూర్చితెలుగులిపిని గూర్చి కొంత పరిశీలిద్దాం. ఈ రెంటిలోనూ కొన్ని విశేషా లున్నవి. పరాశక్తి యంత్రానికి తెలుగులిపి ఉపయోగింపబడ్డది. పరాశక్తి స్త్రీస్వరూపిణి. అమ్మవారికి వామావర్త పూజ ఏర్పడిఉన్నది. తెలుగులిపి కూడా వామావర్తమైనది. అనగా ఎడమప్రక్క చుట్టివ్రాయబడేది. తక్కినవి దక్షిణావర్తమైనవి. అనగా కుడిప్రక్కకు చుట్టివ్రాయబడేది. ఆవర్త మనగా చక్రం. తెలుగు వర్తులాకారలిపి, అందులోనూ వామావర్తం. వామావర్తపూజ లందుకొనే అమ్మ వారి యంత్రంలోనూ చక్రంలోనూ తెలుగులిపి వున్నది. అందుచే తెలుగులిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది. తెలుగుభాష శివప్రదానం. లిపి శక్తిస్వరూపం. భాష శివ స్వరూపం. వాగర్థాలు పార్వతీపరమేశ్వరులనికదా కాళిదాసు రఘువంశంలో అన్నాడు. తెలుగుభాష శివప్రధానమైన దని గుర్తించినది అప్పయదీక్షితులవారు. వారు పరమశివభక్తులు. దక్షిణాదిని, ఆరణి (తమిళనాడు) అనుఊరికి సమీపంలోఉన్న ఆడెయపాలెం వారు పుట్టినఊరు.దక్షిణ భారతాన శివోత్కృష్టత స్థాపించినవారు. ఈక్రిందిశ్లోకం చెప్పారు.

ఆంధ్రత్వ మాంధ్రభాషా చా ప్యాంధ్రదేశః స్వజన్మభూః,

తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్||

ఆంధ్రం త్రిలింగదేశం. దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినది. దక్షిణాన దక్షిణకాశి కాళహస్తిక్షేత్రం ఉన్నది. పడమట శ్రీశైలక్షేత్రమున్నూ, ఉత్తరమున కోటిలింగక్షేత్రమున్నూ ఎల్లలుగాకలది ఆంధ్రదేశం. అట్టి త్రిలింగదేశంలో తాను జన్మించలేదన్న విషయమూ ఆంధ్రభాష తన మాతృభాష కాకపోయినదే అన్నసంగతీ ఆయనకు కొరతయట. ఇవి రెండేకాక మరొక్క కొరతకూడా ఆయన కున్నదిట.

ఆంధ్రులు శైవులైనా సరే, వైష్ణవులైనాసరే, అక్షరాభ్యాస సమయంలో ''ఓం నమః శివాయ'' అని చదువు ప్రారంభిస్తారు. జన్మతారకమైన శివపంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈభాష నేర్చేవారికి ఏర్పడిఉన్నది. పంచాక్షరి, యజుర్వేదమధ్యంలో ఉన్నది. అంటే యజుర్వేదం శివసంబంధమైనది. దానికి తగినట్టు తెలుగువారిలో యజుఃశాఖేయులు ఎక్కువమంది. అంటే యజుర్వేదం పఠించేవారు ఎక్కువ. సామశాఖీయులులేనేలేరు. ఋగ్వేదుల సంఖ్యకూడా తక్కువ. ఇట్లా సామశాఖేయులున్నూ పరమశివ భక్తులు అయిన అయ్యప్ప దీక్షితుల వారు శివసంబంధమైన తెలుగు దేశంలో జన్మించకపోతినే అని విచారపడేవారట. తెలుగుకు లిపి శక్తిస్వరూపమై, భాష శివస్వరూపమై ఎల్లలుత్రిలింగములై, వేదము యజుర్వేదమై ఒప్పుతుండడం ఒక విశేషం.--- చాగంటి కోటేశ్వర రావు
https://www.facebook.com/photo.php?fbid=699914203392267&set=gm.535268379904876&type=1&theaterNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-88332537262194141102012-05-16T22:34:19.571-07:002012-05-16T22:34:19.571-07:00పెద్దలు అర్జున్,నారాయణస్వామి,చింతా రామకృష్ణారావు,ప...పెద్దలు అర్జున్,నారాయణస్వామి,చింతా రామకృష్ణారావు,ప్రవాసరాజ్యం,పులికొండ సుబ్బాచారి గార్లకు ధన్యవాదాలుNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-67256196845975492532012-03-27T19:10:57.390-07:002012-03-27T19:10:57.390-07:00ప్రియమైన రహమతుల్లా గారూ
మీ వివేచన బాగుంది.
సుమార...ప్రియమైన రహమతుల్లా గారూ
మీ వివేచన బాగుంది.
సుమారు పది రోజుల క్రితం మనదేవుళ్ళకు తెలుగు రాదా అనే వ్యాసాన్ని రాసి ఒక ప్రముఖ దినపత్రికకు పంపాను.
త్వరలో రావచ్చు. దాన్ని మీరు చదివిన తర్వాత మనం మంచి చర్చ చేయవచ్చు.
మంచి ఆలోచనలను నలుగురికి పంచుతున్నందుకు సంతోషం
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.Pulikonda Subbacharyhttps://www.blogger.com/profile/11385884160781413252noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-55670245449675808562012-03-27T13:02:57.059-07:002012-03-27T13:02:57.059-07:00http://pravasarajyam.com/1/telugu/2012/03/27/telug...http://pravasarajyam.com/1/telugu/2012/03/27/telugu-is-deva-basha/pravasarajyamhttp://www.pravasarajyam.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-14599129393286198842012-03-27T12:49:08.849-07:002012-03-27T12:49:08.849-07:00శ్రీ సత్యసాయిబాబా జీవితం లో అంతగా చర్చించని భాషాదృ...శ్రీ సత్యసాయిబాబా జీవితం లో అంతగా చర్చించని భాషాదృక్కోణాని చక్కగా ఆవిష్కరించారు. ఇది తెలుగు భాషాభిమానులకు స్ఫూర్తినిస్తుంది.pravasarajyamhttp://www.pravasarajyam.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-87607607139237008232012-03-27T12:47:44.344-07:002012-03-27T12:47:44.344-07:00పెద్దలు రహంతుల్లాహ్ గారికి,
నమస్కారములు.
తెలుగు కళ...పెద్దలు రహంతుల్లాహ్ గారికి,
నమస్కారములు.
తెలుగు కళామతల్లికి మీరు చేస్తున్న సేవ సదా అభినందనీయం.
మాలాంటి ఎందరో ప్రవాస తెలుగు ప్రజలకు మీరు ఆదర్శనీయులు.pravasarajyamhttp://www.pravasarajyam.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-72473221146440747092012-03-27T06:01:36.435-07:002012-03-27T06:01:36.435-07:00చాలా అపురూపమైన అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యాంశాలను...చాలా అపురూపమైన అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యాంశాలను, బాబా గారు స్వయంగా వ్రాసినవి ప్రకటించి, మా హృదయోల్లాస కారకులైన మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-56947737845183008652012-03-27T04:14:04.291-07:002012-03-27T04:14:04.291-07:00ఇంత చక్కని, విలువైన వ్యాసమును అందించిన మీకు నమోవాక...ఇంత చక్కని, విలువైన వ్యాసమును అందించిన మీకు నమోవాకములు.Satyanarayana Piskahttps://www.blogger.com/profile/17138578747801302572noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-57686489864997814162012-03-27T03:12:13.727-07:002012-03-27T03:12:13.727-07:00అద్భుతమైన కోణాన్ని ఎత్తుకున్నారు.అద్భుతమైన కోణాన్ని ఎత్తుకున్నారు.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-16034415581599108362012-03-27T02:28:33.226-07:002012-03-27T02:28:33.226-07:00మీ రచన చాలా బాగుంది. సత్యసాయిబాబా జీవితం లో అంతగా ...మీ రచన చాలా బాగుంది. సత్యసాయిబాబా జీవితం లో అంతగా చర్చించని భాషాదృక్కోణాని చక్కగా ఆవిష్కరించారు. ఇది తెలుగు భాషాభిమానులకు స్ఫూర్తినిస్తుంది.Arjunhttps://www.blogger.com/profile/17127590465505527469noreply@blogger.com