తెలుగు నిఘంటువులో చేరాల్సిన ఇంగ్లీషు పదాలు. నిఘంటువులలోని పదాల సంఖ్య పెరిగే కొద్దీ ఆ భాష శక్తివంతమవుతుంది. పరాయి భాషలకు చెందిన పదాలనే వ్యతిరేకతతో ప్రజల్లో పాతుకుపోయిన పదాలనుకూడ మనం నిఘంటువులలో చేర్చుకోకపోయినందు వలన మన తెలుగు నిఘంటువు చిక్కిపోయింది. ఇంగ్లీషు నిఘంటువు మాత్రం ఏటేటా కొత్తపదాలతో బలిసిపోతోంది.మన తెలుగులో ధీటైన పదాలు పల్లెప్రజల్లో వాడుకలో ఉన్నా మన నిఘంటువులో ఆ పదాలు చోటుచేసుకోలేదు. ఒకవేళ పై ఇంగ్లీషు పదాలకు అర్థాలు చెప్పాలన్నా సంస్కృత పదాలు వాడుతారుగానీ, తెలుగు పదాలు వాడరు. వాడటం అవమానకరంగా భావిస్తారు. తెలుగు ప్రజలు పుట్టించినవి, ఎంత నీచమని మనం అనుకొనే పదాలైనా నిఘంటువులో చేరాలి. మన మాటల్ని పోగొట్టుకోకూడదు. అలాగే సంస్కృతపదం అర్ధంకాకపోయినా మన తెలుగు పదంలాగానే భావించి ఆదరిస్తాం. వేలాది ఉర్దూ, ఇంగ్లీషు పదాలు మన తెలుగు ప్రజల వాడుకలోకి వచ్చాయి.
తెలుగువారు అనుదిన జీవితంలో విస్తృతంగా వాడే ఇంగ్లీషు పదాలుః
అబార్షును, అబ్సెంటు, యాక్సిలరేటరు, యాక్సిడెంటు, అకౌంటు, ఆసు, అకనాల్జెడ్జిమెంటు, ఎకరా, యాక్టు, యాక్షను, యాక్టరు, అడ్రసు, అడ్జస్టుమెంటు, అడ్మిరలు, అడ్మిషను, అడ్వన్సు, ఎఫెక్షను, అఫిడవిటు, ఆఫ్‌ట్రాల్, ఏజి, ఏజెన్సీ, ఏజెంటు, అగ్రిమెంటు, ఎయిడు, ఎయిరుపంపు, అలారం, అల్బం, అల్కహాలు, ఆల్జీబ్రా, అలాట్‌మెంటు, అలవెన్సు, అంబాసిర్, ఆమెన్, యాంకరు, యాంగిలు, యానివర్సరీ, ఆన్సరు, అపార్టుమెంటు, ఆర్చి, ఆర్కిటెక్టు, ఏరియా, ఆర్గుమెంటు, ఆర్టు, ఆర్టిస్టు, అపెంబ్లీ, అసైన్‌మెంటు, అసిస్టెంటు, అసోసియేషను, ఆస్తమా, అట్లాసు, అటెండెన్సు, అటెన్షను, అటెస్టేషను, ఆక్షను, అదారిటీ, ఆటో, ఆటోమాటిక్, ఏవరేజి, అవార్డు, అకాడమీ, ఎయిర్‌కండిషను, ఎయిర్‌పోర్టు, ఆర్మీ, అరెస్టు, అరియర్సు, ఆర్టికిల్స్, అసెస్‌మెంటు, ఆడియన్సు, ఆడిటు, ఎయిడ్సు, ఆంటీ, బాచిలరు, బాసు, బ్యాగు, బెయిటు, బ్యాంకు, బ్యాలెన్సు, బాలు, బెలూను,బ్యాలెటు, బ్యాను, బ్యాండు, బ్యాంగిల్సు, బ్యానరు, బాప్తిస్మం, బారు, బార్బరు, బార్లీ, బ్యారను, బ్యారేజి, బారికేడు,బేసుబాలు, బేసుమెంటు, బేసిను, బాస్కెటు, బ్యాచి,బాత్‌రూము, బ్యాటరీ, బెడ్రూము, బేరరు, బీటు, చీఫు, బెగ్గరు, బిగినింగు, బిలీవరు, బెల్లు, బెంచి, బెనిఫిటు, బెస్టు, బెటర్‌మెంటు, బైబిలు, బిడ్డు, బిట్టు, బిల్లు, బర్త్‌డే, బిషపు, బ్లాక్‌బోర్డు, బ్లాస్టింగు, బ్లూ, బోల్టు, బాంబు, బెల్టు, బాండు,బోరు, బోనసు, బుక్కు, బూటు, బూతు, బోర్డరు, బోటటిలు, బాక్సు, బ్రేకు, బ్రాంచి, బ్రాండు, బ్రోకరు, బ్రదరు, బస్సు, బ్రష్షు, బబుల్‌గము, బకెట్టు, బఫూను, బగ్గీ, బిల్డింగు, బల్బు, బులెట్టు, బులియను, బుల్‌డోజరు, బడ్జెటట్, బరెస్ట్, బిజినసు, బిజీ, బైలా, బైపాసు, బెటటాలియను, బిల్లు, బ్లాక్‌మార్కెటు, బ్లాక్‌లిస్టు, బ్లాకౌటు, బ్లాక్‌మనీ, బ్లాంకుచెక్కు, బ్యాంకు, బ్లూప్రింటు, బోగస్. కేబినేటు, కేబులు, కేడరు, కేలిక్యులేటరు, కేలండరు, కాలింగ్‌బెల్లు, క్యాంపు, క్యాంపసు, కేన్సిలు, కేపిటలు, కెప్టెను, క్యారటు, కార్డు, కార్గో, క్యారేజి, సెస్సు, కాట్రిట్జి, కేసుఫైలు, క్యాషియరు, కేటలాగు, కేటగిరీ, కెవేటు, సీలింగు, సెల్, సెన్సారు, సెన్ససు, సెంటరు, సర్టిఫికేటు, చైన్‌మాను, చైర్మన్, చాలెంజి, చాంబరు, చాంపియను, చాన్సు, చానెలు, చార్జి, చెక్, కెమికలు, చీఫ్, చిట్‌ఫండు,సర్కిలు, సివిలు, సర్కులరు, క్లెయిము, క్లాసు, క్లియరెన్సు, క్లర్కు, క్లయింటు, క్లబ్బు, కోచింగు, కోటు, కోడు, కలెక్టరు, కోల్డ్‌స్టోరేజి, కాలనీ, కలరు, కాలం, కోమా, కమాండరు, కమర్షియలు, కమీషను, కమిటీ, కామన్, కంపార్ట్‌మెంటు, కంపెనీ, కాంప్లెక్సు, కంపల్సరీ, కన్సెషను, కాంక్రీటు, కాన్పిడెన్సు, కండిషను, కండక్టరు, కాన్పరెన్సు, కాంగ్రెసు, కన్సొలేషను, కంటెస్టు, కానిస్టేబులు, కంటిన్యూ, కంటింజెన్సీ, కాంట్రాక్టు, కంట్రోలు, కోపరేషను, కాపీ, కార్సొరేషను, కారు, కాస్టు, కౌంటరు, కూపను, కోర్సు, కోర్టు, క్రేను, క్రిమినలు, క్రాస్‌ఓటింగు, కల్చర్, కర్ఫ్యూ, కరెన్సీ, చెస్టు, కరెంటు, కస్టమరు, కట్‌మోషను, కాఫీ, సిగిరెట్టు, కాన్వెంటు, డైలీ, డేంజరు, డ్యాము, డేస్కాలరు, డాలరు, డిబారు, డిబెంచరు, డిక్లరేషను, డిక్రీ, డిఫాల్డు, డిఫెన్సు, డిగ్రీ, డెలివరీ, డిమాండు, డిపార్ట్‌మెంటు, డిపాజిటు, డిపో, డెప్యుటేషను, డిజైను, డిస్పాచ్, డిటెక్టివ్, డైరీ, డిజిటలు, డివైడెడ్బై, డాడీ, డిప్లామా, డైరెక్టరు, డిసిప్లైన్, డిస్కౌంటు, డిస్మిసు, డిస్పెన్సరీ, డిస్సెంటు, డిస్టిలరీ, డిటో, డివిజను, డక్‌యార్డు, డక్యుటమెంటు, డలరు, డైమండు, డౌటు, డౌన్‌లోడు, డబలెంట్రీ, డ్రాఫ్టు, డ్రైనేజి, డ్రయరు, డ్రిల్లు, డ్యూటీ, డమ్మీ, డ్రైవరు, డూపు, డూప్లికేటు, ఈజీ, ఎలాస్టికు, ఎలక్షను, ఎమర్జన్సీ, ఎంప్లాయిమెంటు, ఇ.సి., ఎండర్సుమెంటు, ఎన్‌లార్జు, ఎంట్రెన్సు, ఈక్విటీషేర్లు, ఎస్కార్టు, ఎస్టాబ్లిష్‌మెంటు, ఎస్టేటు, ఎస్టిమేటు, ఎట్‌సెట్రా, ఎగ్జాంపులు, ఎగ్జామినేషను, ఎక్సేంజి, ఎక్సర్సైజ్ , ఎక్స్‌పర్టు, ఎక్స్‌ప్రెసు, ఫేస్‌పౌడరు, ఫ్యాక్షను, ఫెయిలు, ఫైలు, ఫెయిర్‌కాపీ, ఫాల్స్ ప్రిస్టేజి, ఫ్యామిలీ, ఫేవరేటు, ఫెరలు, ఫ్యూడలు, ఫీల్డు, ఫిగరు, ఫైనలు, ఫైనాన్సు, ఫైర్‌స్టేషను, ఫస్టు, ఫిష్‌ప్లేటు, ఫిట్‌నెసు, ఫిక్సుడుడిపాజిటు, ఫ్లాట్‌రేటు, ఫ్లడ్ లైటు, ఫ్లోర్‌లీడరు, ఫోల్డరు, ఫుడ్‌పోయిజను, ఫుట్‌బోర్డు, ఫుట్‌పాతు, ఫోరెన్సిక్‌లాబరేటరీ, ఫోర్జరీ, ఫారం, ఫార్ములా, ఫోరం, ఫౌండేషను, ఫండటమెంటల్‌రూల్సు, ఫ్రేము, ఫ్రీలాన్సు, ఫ్రైటు, ప్రెష్‌వాటరు, ఫుల్‌బెంచి, ఫర్నిచరు, ప్యాను, ఫ్రిజు, గేము, గ్యాపు, గేటుకీపరు, గజెటు, గజిటెడ్ఆఫీసరు, గేరు, జిన్నింగుమిల్లు, గ్లాసు, జీ.వో., గోడౌను, గోల్డెన్‌బిలీ, గూడ్సు, గుడ్‌విల్లు, గవర్నమెంటు, గవర్నరు, గ్రేడు, గ్రాడ్యుయేటు, గ్రాంటు, గ్రీన్‌కార్డు, గ్రౌండ్‌ఫ్లోరు, గ్రూపు, గ్యారంటీ, గార్డు, గన్‌పౌడరు, జీప్సీ, గ్రిల్లు, హాలు, హల్‌టటిక్కెట్టు, హాల్టు, హెల్మెటు, హేండిలు, హార్బరు, హెడ్‌పోస్టాఫీసు, హెడ్‌క్వార్టర్సు, హెలీకాప్టరు, హెల్పరు, హీరో, హీరోయిను, హైక్లాసు, హైకోర్టు, హైస్కూలు, హైజాక్, హోంగార్డు, హాస్పిటలు,హౌస్‌కమిటీ, హరికేన్‌లాంతరు, హైబ్రీడు, ఇంటర్మీడియటు, ఇమ్మిడియేటు, ఇంపార్టెంట్, ఇంప్రెస్టు, ఇన్‌చార్జి, ఇన్‌కంటాక్సు, ఇంక్రిమెంటు, ఇండెలిబుల్‌ఇంకు, ఇండెమ్నిటీబాండు, ఇండెంటు, ఇండిపెండెంటు, ఇండెక్సు, ఇండియను, ఇండికేటరు, ఇన్‌డైరెక్టు, ఇండస్ట్రీ, ఇనిషియల్సు, ఇన్నింగ్స్, ఇంక్వెస్టు, ఐ.పి, ఇన్స్‌పెక్షను, ఇన్‌స్టాల్‌మెంటు, ఇన్యూరెన్సు, ఇంటరెస్టు, ఇంటర్య్వూ, ఇన్‌వెస్టిగేషను, ఇన్విటేషన్‌కార్డు, ఇన్‌వాయిసు, ఇరిగేషన్‌బంగళా, ఇంటు, ఇంజెక్షను, జైలు, జాయింటుకలెక్టరు, జెట్, జాబ్‌వర్కు, జాయినింగ్‌రిపోర్టు, జర్నలిస్టు, జడ్జి, నియరు, జంక్షను, జస్టిసు, కీ, కిడ్నాపు, కిచ్చెను, కిలో, కమాండరు, కమిటీ, కంప్యూటరు, కీబోర్డు, లాబరేటరీ, లేబులు, లేబరు, ల్యాండు, లాస్టు, లాప్సు, లైసెన్సు, లేటు, లాయరు, లీడరు, లీజు, లీవు, ల్జెరు, లీగల్‌నోటటిసు, లెటర్‌లెటవెలు, లెవీ, లెవెల్‌క్రాసింగు, లెబ్రరీ, లీను, లైఫు, లిఫ్టు, లిమిట్స్, లైను, లింకు, లిక్కరు, లోడు, లోను, లాబీ, లోకలు, లొకాలిటీ, లాకప్, లాడ్జి, లాంగ్‌జంపు, లాసు, లక్కీ, లాకులు, లెన్సు, మెషిను, మేగజైను,మెజిస్ట్రేటు, మేడటమ్, మెయిలు, మెయిను, మెంబరు, మేజరు, మేకపు, మేనేజరు, మాండేటు, మేనిఫోల్డ్‌పేపరు, మానర్సు, మ్యాపు, మార్జిను, మార్కెటు, మార్షల్, మాస్టరు, మేట్రన్, మెచ్యూర్, మెడికల్‌కాలేజి, మెకానిక్, మీడియం, ఎం.ఎల్.ఎ, టమోటా,మెంటలు, మెరిటు, మెసేజి, మెటలు, మెట్రికు, మైలు, మిలిటరీ, మిల్లు, మినరల్, మినిస్టరు, మైనరు, మైనారిటీ, మింటు, మైనసు, మిషనరీ, మినిటట్స్, మిసైలు, మిక్చరు, మొబైలు, మోడలు, మనియార్డరు, మంత్లీ, మునిసిపాలిటీ, మమ్మీ, మీటరు, నేమ్‌ప్లేటు, నేరోగేజి, ఎన్.సి.సి, నేవీ, నెగిటివు, నెట్‌క్యాషు, నెట్‌వర్కు, న్యూస్‌రీలు, నైట్‌షిఫ్టు, నోవేకెన్సీ, నామినేషను, నాన్‌టీచింగ్ స్టాఫు, నార్మలు, నోటరీ, నోటు, నోటీసు, నవల, న్యూసెన్సు, నంబరు, నర్సు, ఆఫరు, ఆఫీసరు, ఆఫీసు, ఆయిల్‌పెయింట్సు, ఒలంపిక్సు, ఆన్ డ్యూటీ, ఓపెన్‌ఎయిర్ దియోటరు, ఆపరేటరు, ఆపరేషను, అపోజిషన్, ఆప్షను, ఆర్డరు, ఆర్డినరీ, ఆర్గనైజేషను, ఔట్ డోర్ షూటింగు, ఒరిజినలు, అవుట్ పేషంటు (ఓ.పి), ఓవర్‌బ్రిడ్జి, ఓవర్‌డ్రఫ్టు, ఓవర్‌హాలు, ఓవర్‌టైము, ఓనరు, ఓవర్‌హెడ్‌ట్యాంకు, పేకెటు, పేజి, పెయింటరు, పేపరు, పార్సిలు, పార్టనరు, పేరెంట్సు, పర్సంటేజి, పార్లమెంటు, పెట్రోలు, పార్టీ, పార్ట్‌టైము, పాసు, పాస్‌బుక్కు, పాసెంజరు, పాస్‌పోర్టు, పేటెంటు, ప్యాట్రను, పాన్‌బ్రోకరు, పెండింగ్ ఫైలు, పెనాలిటీ, పెన్షను, పిరియడు, పర్సను, పర్మనెంటు పోస్టు, పర్మిషను, పర్మిటు, పిటీషను, ఫేజు, ఫోటోస్టాట్, పైలట్, పయెనీరు, ప్లాను, ప్లాస్టిక్, ప్లీ ర్, ప్లీజు, ప్లింత్ ఏరియా, ప్లెబిసైటు, ప్లాటు, పాయింటు, పోలు, పోలీసు, పాలసీ, పాలిటిక్సు, పోలింగు, పాలిటెక్నికు, పాపులరు, పోర్టు, పోర్షను, పోజిటివ్, పోస్టు, పోస్టింగు, పోస్టుమార్టం, పొటెన్సీ, పవరు, ప్రాక్టికల్స్, ప్రాక్టీసు, ప్లేయరు, ప్రికాషను, ప్రిఫరెన్సు, ప్రిగ్నెంటు, ప్రిలిమినరీ, ప్రజెంటు, ప్రసిడెంటు, ప్రెస్సు, ప్రైజు, ప్రైమరీ, ప్రిన్సిపాలు, ప్రింటింగుప్రెస్, ప్రైవేటు, ప్రొబేషనరు, ప్రాబ్లం, ప్రొసీజరు, ప్రొడ్యూసరు, ప్రోఫిటు, ప్రోగ్రెస్ రిపోర్టు, ప్రాజెక్టు, ప్రామిసరినోటు, ప్రమోషను, ఫ్రూఫు, ప్రాపర్టీ, ప్రొప్రయిటరు, ప్రాసిక్యూటరు, ప్రొటోకాలు, సైకియాట్రిస్టు, పబ్లిక్‌గార్డెను, పబ్లిషరు, పంచరు, పనిష్‌మెంటు, పర్పసు, పజిలు, పెన్ను, పెన్సిలు, ప్లగ్గు, పంపు, క్వాలిఫికేషను, క్వాలిటీ, క్వార్టరు, కొర్రీ, కొచ్చిను, కోరం, కోటా, కొటేషను, కారు, కార్నరు, ర్యాకు, రేడియో, రెయిడింగ్, రైలు, రైసు, రైన్‌గేజి, ర్యాలీ, రేంజి, ర్యాంకు, రేపు, రేటు, రేషను, ఆర్.సి.సి, రియాక్షన్, రీడరు, రియాక్టరు, రిక్రియేషన్ క్లబ్బు, రీడింగ్‌రూం, రెడీమేడు, రీలు, రియల్‌ఎస్టేటు, రీజను, రిబేటు, రీకాలు, రిసీటు, రిసెప్షను, రికగ్నిషను, రికార్డు, రీకౌంటింగు, రికవరీ, రిక్రూట్‌మెంటు, ఆర్.డి, రిఫరెన్సు, రిఫరెండం, రిఫండు, రిజిస్టర్డు పోస్టు, రిజిస్ట్రేషను, రిజిస్టరు, రెగ్యులరు, రిలేషను, రిలీజు, రిమైండరు, రెమిషను, రిమోట్‌కంట్రోలు, రెన్యూవలు, రీచార్జికూపను, రిపేరు, రిప్లై, రిపోర్టు, రిప్రజెంటేటివు, రిపబ్లికు, రిక్వెస్టు, స్టాపు, రీసేలు, రీసెర్చి, రిజర్వేషను, రెసిడెన్సు, రిజైను, రెస్పెక్టు, రెస్టు, రెస్పాన్సిబులు, రిజల్టు, రిటైల్ డీలరు, రిటైర్‌మెంటు, రెవిన్యూ, రివర్షను, రివార్డు, రిబ్బను, రైటు, రిస్కు, రోబోటు, రోల్‌నంబరు, రఫ్, రొటేషను, రూటు, రాయల్, రాయల్టీ, రబ్బర్‌స్టాంపు, రూల్సు, రన్నింగు, రూము, రెంచి, రోడ్డు, రేజరు, రింగురోడ్డు, రెగ్యులేటరు, రిజర్వాయరు, సేఫ్‌టీలాకరు, శాలరీ, సేల్సు, సెలైను, శాంక్షను, శానిటరీ ఇన్స్‌పెక్టరు, శాటిలైటు, సేవింగ్సు, స్కేలు, షెడ్యూలు, స్కీము, స్కూలు, సైన్సు, స్కోపు, స్క్రీను, స్క్రిప్టు, సీలు, సీజను, సీటు, సెకండు, సీక్రెటు, సెక్రటరీ, సెక్షను, సెక్టారు, సెక్యూరిటీ, సెగ్మెంటు, సెలెక్షను, సెల్ప్‌సర్వీసు, సెమినారు, సెనేటు, సీనియరు, సెన్సు, సెంట్రటీ, సీరియలు, సర్వీసు, సెటిల్‌మెంటు, సర్వెంటు, సెషన్స్‌కోర్టు, షేరు, షిఫ్టు, షెల్ప్, షాపు, షోకాజ్‌నోటీసు, షోరూము, సైటు, సిగ్నలు, సిల్వర్‌జూబిలీ, సింపులు, స్కిప్పింగు, శ్లాబు, స్లోగను, స్మగ్లింగు, సొసైటీ, స్పేర్‌పార్టు, స్పీకరు, స్పెషలు, స్పెషలిస్టు, స్పెసిమన్‌సిగ్నేచరు, స్పాంజి, స్పాట్‌లైటు, స్టాఫ్, స్టేజి, స్టాంపు, స్టాండు, స్టేటు, స్టేట్‌మెంటు, స్టేటస్‌కో, స్టే, స్టెప్స్, స్టైఫెండు, స్టాకు, స్టోరు, స్ట్రెయిటు, స్ట్రీటు, స్ట్రయికు, స్ట్రాంగ్‌రూము, స్టయిలు, సబ్‌డివిజను, సబ్జెక్టు, సబ్‌స్క్రిప్షను, సబ్సిడీ, సెస్సు, సూటు, సమను, సస్పెన్సు, సుపీరియరు, సూపరు, సప్లై, సుప్రీంకోర్టు, సరెండరు, స్వీపరు, సర్‌చార్జీ, సస్పెన్షను, సిండికేటు, సిస్టము, స్విచ్‌బోర్డు, సెప్టిక్‌ట్యాంకు, సెంటిమెంటు, షట్టరు, సైడ్ఎఫెక్టు, సూటుకేసు, స్వీటు, సర్వరు, స్కూటరు, స్క్రూడ్రైవరు, స్టెనో, స్టీరియో, టేబులు, టాలెంటు, ట్యాంకరు, టేపు, టార్గెటు, తారు, టారిఫ్, టాక్సు, టీచరు, టెక్నికలు, టెలిఫోను, టెల్లర్‌కౌంటరు, టెంపరరీ, టెండరు, టెర్మ్, టెస్టు, టెక్స్ట్ బుక్, తీసిసు, టైటిల్ , టోకెను, టన్ను, టానిక్కు, టోటలు, టూరు, ట్రేసింగ్ పేపర్, ట్రేడ్ మార్కు,ట్రాఫిక్ కంట్రోల్, ట్రైనింగు, ట్రాన్స్‌ఫరు, ట్రాన్సిట్, టి.ఎ.బిల్లు, ట్రెజరీ, ట్రెండు, ట్రయల్, ట్రబుల్, ట్రంక్‌కాల్, ట్రస్టీ, టర్నోవర్, ట్యూటోరియల్, టైపిస్టు, ట్యూబులైటు, ట్యాపు, టాపు, ట్లాబ్లెటు, టీ, అండర్‌లైను, అండర్‌టేకింగ్, అండర్‌ట్రయల్, యూనిఫారం, యూనియన్, యూనిట్, యూనిటీ, యూనివర్సిటీ, అన్‌లాక్, అర్జెంటు, అగ్లీ, అంపైర్, అంకులు వేకెన్సీ, వెరైటీ, వెజిటేరియన్, వెహికిల్, వెంచర్, వెన్యూ, వెరిఫికేషన్, వయా,వయామీడియా, వైస్‌వర్సా, విజిల్, విజిలెన్సు, విలేజి, వీసా, వి.ఐపి, విటమిను, వాల్యూమ్, వాలంటరీ, ఓటు, వోల్టు,వారంటు, వాచి, వాటర్‌ఫ్రూఫ్, వేబిల్లు, వీక్లీ, విత్‌డ్రయల్ ఫారం, రైట్ ఆఫ్, వైరు, వాషింగ్ మెషను, వర్కరు, విల్లు,వార్డు,వైఫు, వాటర్, జీరో, జోను.ఇలా ఎప్పటికప్పుడు తెలుగుప్రజల నోళ్ళలో స్థిరపడిపోతున్న ఆంగ్లపదాలను తెలుగు నిఘంటువులలోకిచేర్చుతూ పోవాలి.
తెలుగునాట ఆంగ్లభాష ఉపయోగంపై విమర్శలుః
మాతృ భాష అంటే పసిపిల్ల వాడికి తల్లి ఉగ్గుపాలతో పాటు రంగరించి పోసే భాష. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్, బ్యాగు, బుక్కు, స్లేట్ పెన్సిల్ లాంటి మాటలు తెలుగు తల్లులు తమ పిల్లలకు రంగరించి పోస్తున్నారు. బయట స్కూలు, ఆఫీసు, మార్కెట్టు, కోర్టుల్లో ఎన్నెన్నో పదాలు ఎడతెరిపి లేకుండ వాడుతున్నారు. మాటకు వాడుకే గదా ప్రాణం? వాడకం అంతా ఆంగ్లపదాల్లో జరుగుతూఉంటే తెలుగు గ్రంధానికి పరిమితమై పోయింది. కవులు, సాహితీవేత్తలు మాత్రమే భాష గురించి బాధపడుతున్నారు. పాలక భాషకు ఉండవలసినంత పదసంపద ఎన్నేళ్లు గడిచినా సమకూర్చలేక పోతున్నారు.
అనువాదకులు తేటతెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడం లేదు. ఇది మన జాతి చేతకానితనం, దౌర్భాగ్యం. పైన పేర్కొన్న వందలాది పదాలేగాక ఇంకెన్నో ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్దూ, సంస్కృత పదాలెన్నింటటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది. సంస్కృత, ఉర్దూ పదాలు వేలాదిగా తెలుగులో చేరకపోయి ఉన్నట్లయితే తెలుగు భాషకీపాటి శక్తి వచ్చి ఉండేది కాదు గదా?
కొందరికి పూర్తిగా ఆంగ్లభాషపై వెర్రి వ్యామోహం ఉంటుంది. అలాకాకుండ వాస్తవస్థితిని గ్రహించి మనభాషను రక్షించుకుంటూ, ఆంగ్లపదాలను వాడుకోవడం తెలివైన పద్ధతి. లెక్కల మాస్టరు 2+2=4 అనే దాన్ని రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్‌టు నాలుగు అంటాడు. ఇప్పటి వరకు ప్లస్, ఈజీక్వల్టు, మైనస్, ఇంటు లాంటి ఆంగ్ల పదాలకు సమానార్ధక పదాలను కల్పించి లెక్కలు చెప్పలేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడ ప్లస్, మైనస్ అనే శబ్దాలనే వాడుతున్నారు. గత్యంతరం లేదు, అనుకున్న ఆంగ్ల పదాలను మాత్రం తెలుగు నిఘంటువులో చేర్చటం అవశ్యం, అత్యవసరం. వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాష పదాలు కూడ కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీషు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీషును గత్యంతరం లేక హద్దు మీరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించటం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించటమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి. మరోభాషా పదం మనలో పాతుకు పోకూడదనే ఆశయం ఉంటే, మనభాషలోనే కొత్త పదాలను సృష్టించటమే గాక, వాటిని ప్రజలంతా నిరంతరం వాడుతూ ఉండాలి.
సెల్‌ఫోన్‌లో ఎస్సెమ్మెస్‌లు వచ్చాక.. పొడిపొడి అక్షరాలతో ఇంగ్లి ష్‌లో మెసేజ్‌లు పంపటం అందరికీ అలవాటైంది. అలాగే అన్న దానికి ఇన్నాళ్లూ వాడిన 'ఓకే' కాస్తా.. ఇప్పుడు 'కే' అయిపోయింది. టేక్ కేర్ అని చెప్పడానికి.. టీసీ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేస్తే చాలు. ఇలా ఎస్సెమ్మెస్‌లలో వాడే సరికొత్త సంక్షిప్త పదాలు ఎన్నో.. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన 'న్యూ ఆక్స్‌ఫర్డ్ అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లిష్' మూడో సంచికలో చేరాయి.
బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనే అర్థానిచ్చే బీఎఫ్ఎఫ్.. అలాగే టాక్ టూ యూ లేటర్ అని చెప్పే టీటీవైఎల్ వంటి సంక్షిప్త పదాలు వీటిల్లో కొన్ని. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీ ల్లో ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిన నోటితో ఊదే వాయి ద్యం 'వువుజెలా' కూడా ఈ డిక్షనరీలోకి వచ్చి చేరింది.
ఇంగ్లిషు భాషలో ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తున్న.. సోషల్ నెట్‌వర్కిం గ్ (ఒకే అభిరుచి కలిగిన వాళ్లు ఓ సమూహంగా ఏర్పడటం), లిప్‌స్టిక్ లెస్బియన్ (మహిళల్లాగా దుస్తులేసుకొనే నపుంసకులు), స్టేకాషన్ (ఇంటి దగ్గరే ఉండి సెలవులను ఎంజాయ్ చే యడం) వంటి పదాలతో పాటు.. పర్యావరణానికి సంబంధించిన కార్బన్ ఆఫ్‌సెట్టింగ్, గ్రీన్ ఆడిట్, కార్బన్ క్రెడిట్ వంటి కొ త్త కొత్త పదాలను కూడా ఈ నిఘంటువులో పొందుపరిచారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో కొత్తగా దొర్లుతున్న పదాలు వాటర్‌బోర్డింగ్, ఎగ్జిట్ స్ట్రాటజీలతో పాటు సరికొత్త సాంకేతిక పదాలు క్లౌడ్ కంప్యూటింగ్, హాష్‌ట్యాగ్, ట్యాగ్ క్లౌడ్ వంటి వాటిని కూడా ఈ డిక్షనరీలో చేర్చారు. ఇలా రెండు వేలకు పైబడిన కొత్త పదాలు, పదబంధాలు, నుడికారాలు ఈ నిఘంటువులో చేరాయి.(ఆంధ్రజ్యోతి23.9.2010)
తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.తెలుగునిఘంటువును కూడా ఇలా విస్తరించుకుంటూ పోతే మనభాషకు కొత్తశక్తి వస్తుంది.తెలుగు ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి