14, జూన్ 2011, మంగళవారం

తెలుగు వెబ్ సైట్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. ఇక నుంచి ప్రతి వెబ్‌సైట్‌ ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.తెలుగు భాషకు ఏక సంకేత లిపి సమాఖ్య (యూనీకోడ్‌ అథారిటీ)లో సభ్యత్వం తీసుకుంది. దీంతో తెలుగు అక్షర, పదాలు, సంఖ్యలు, అర్థాలకు సంబంధించిన సంకేతాలు(కోడ్‌), అనువర్తనాలు (అప్లికేషన్లు) అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది.రాష్ట్రంలో వెబ్‌సైట్లకు ఒకే రకమైన ప్రమాణాలు రూపొందించనున్నారు. సెర్చింజన్‌లో తెలుగు భాషలోనూ వెబ్‌సైట్లు సెర్చ్‌ చేయడానికి వీలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సలహా కమిటీకి ఛైర్మన్‌గా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా వ్యవహరిస్తారు. సభ్యులుగా మండలి బుద్ధ ప్రసాద్‌, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జి.ఉమామహేశ్వర రావు, టోక్యో యూనివర్సిటీ ఆఫ్‌ ఫారిన్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ పెన్‌ భాస్కర్‌ రావు, ఈ-తెలుగు గ్రూపు ప్రతినిధి వి.వీరవెంకటచౌదరి, తెలుగు అధికార భాష కేంద్రం తరఫున ప్రతినిధి, ఐఈజీ సీఈవో ఉంటారు.

కమిటీ పర్యవేక్షించాల్సిన అంశాలు
* తెలుగు రాయడానికి, తెలుగులో సమాచారం చదవడానికి, చూడటానికి అనుకూలంగా బ్రౌజర్లు ఉండేలా చూడాలి. ప్రతి సమాచారం ప్రజలకు తెలుగులో డాక్యుమెంటు రూపంలో అందుబాటులో పెట్టాలి.
* ఆరు భిన్న రూపాల్లో ఏక సంకేత లిపి తెలుగు ఫాంట్‌ అభివృద్ధి.
* తెలుగు అక్షరక్రమం (స్పెల్లింగ్‌) సరిచూసుకోవడానికి 'పదాల విశ్లేషణ' సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలి. ఇది ఉచితంగా అందరికీ అందుబాటులో పెట్టాలి.
* 'న', 'జ' కార పొల్లులతో సహా తెలుగు పదాలు పలికేతీరు ఆధారంగా అచ్చులు, హల్లులకు తేడా లేకుండా యూనికోడ్‌ భాష ఉండాలి.
* తెలుగుభాష అక్షరాలతో బహుభాషా కీలక ఫలకం(కీబోర్డు) ప్రమాణాలు రూపొందిస్తారు.(ఈనాడు 14.6.2011)
తెలుగు యూనీకోడ్ కన్సార్టియమ్ లో ప్రభుత్వ సభ్యత్వం వల్లనే ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్ లో తెలుగు వాడకంలోకి రావటంలేదు.మనందరం ఎన్నో ఏళ్లుగా తెలుగులో మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ వంటి వాటిలోనూ టైప్ చేస్తూనే ఉన్నాం, అలాగే గౌతమి, వేమన, పోతన, ఆకృతి వంటి 50కి పైగా యూనీకోడ్ ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్న ఫళాన ఇప్పటికే అందుబాటులో ఉన్న తెలుగు వాడే పద్ధతులు ప్రజలకు ప్రచారం చేయాలి. ఇప్పటిదాకా తయారై వాడుకలో ఉన్న ఫాంట్లను యూనికోడ్ లోకి మార్చే టెక్స్ట్ ట్రాన్స్ ఫార్మర్లు కూడా అనేకం వచ్చాయి.కన్సార్టియమ్ ద్వారా కొత్తగా కొన్ని ఫాంట్లను తేవటం తప్ప ఒరిగింది ఏమిటో అర్ధం కావటం లేదు.తెలుగు అక్షరారూపాల వాడుకపై నేటికీ ఆంక్షలున్నాయి.తెలుగు ఫాంట్లను తయారు చేసిన కొన్నివ్యాపార సంస్థలు ఆయా ఫాంట్ల మీద గుత్తాధిపత్యాన్ని ఇంకా వదులుకోలేదు.ఈ పరిస్థితుల్లో నాఆశలు కొన్ని :ముందు ఇలాంటి ప్రాచుర్యం పొందిన ఫాంట్లన్నిటినీ జాతీయం చేసేందుకు,వాటిని యూనికోడ్ లోకి మార్చేందుకు,అనువాద సాఫ్ట్ వేర్ లు తయారుచేసేందుకు ఖర్చుపెట్టాలి.తమిళనాడు తరహాలో బహుమతులు కూడా ఇవ్వవచ్చు.తెలుగు మీడియం లో కంప్యూటర్ చదువులు కూడా రావాలి.అలా చదివిన డిగ్రీ విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.

కంప్యూటర్లో తెలుగు వ్రాయడం
* http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe నుండి ''iComplex_2.0.0.exe''' ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది.
వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.
Win98 --http://etelugu.org/node/207
Win2000 --http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210
కంప్యూటర్లో తెలుగు రాసే పరికరాలుః
లేఖిని --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్ -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-oth...
అను ఆపిల్ -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
అక్షర్ ---http://www.kamban.com.au/
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx
Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
• ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
• పద్మ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
• తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
• ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx
సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/
ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).
http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store
వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:
మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenSho...
లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
హరివిల్లు ప్లగిన్‌:
యూనీకోడ్ వెబ్‌పేజీని RTS లోకి మారుస్తుంది : http://plugins.harivillu.org/
అను2యూనికోడ్ :అను 6లో గానీ 7లో గానీ టైప్ చేయబడి, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను ఇది యూనీకోడులోకి మారుస్తుంది. http://anu2uni.harivillu.org/
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --
http://specials.msn.co.in/ilit/Telugu.aspx
http://eemaata.com/font2unicode/index.php5
http://scriptconv.googlelabs.com/
Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana లాంటి కొన్నిఅను ఫాంట్ల సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి మార్చాలి . ఫాంట్లపై పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.
అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
ఇవికూడాచూడండిః


నడుస్తున్న చరిత్ర సెప్టెంబర్ 2011 సంచికలో హైదరాబాదు యూనివర్సిటీ ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు గారు
యూనికోడ్ వ్యాసం లో చాలా కొత్త సంగతులు తెలిపారు.యంత్రానువాదాలకూ,లిప్యంతరీకరణకూ,విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికీ అనుకూలంగా తెలుగులో కంప్యూటర్ వాడకం పెరగాలి అన్నారు.ఆయనకు ఇలా మెయిల్ చేశానుః
"'సజీవ వాహిని' నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంధాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్ సైట్ రూపొందించారు.అయితే ఆన్ లైన్ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్ లైన్ లో కూడా అందజేస్తే ఇంటర్ నెట్ లేనివారికి కూడా సౌకర్యంగా ఉంటుంది.నేను రాసే వ్యాసాలకు సజీవ వాహిని ఎంతగానో ఉపయోగ పడుతున్నది.
తెలుగు భగవద్గీతకు గానీ,తెలుగు కేతలిక్ బైబిల్ కు గానీ,తెలుగు ఖురాన్ కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible/ అందరూ చూడదగినది.ఇలాంటి సాఫ్ట్ వేర్ మిగతా మత గ్రంధాలకు కూడా లభించేలా కృషి చేస్తే లేఖనాల పరిశీలన సులభం అవుతుంది.
తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంధాలకు ఇలాంటి సాఫ్ట్ వేర్ ఎంతో అవసరం".
అందుకాయన "
తెలుగు గ్రంధాలలో వెతుక్కోడానికి సాఫ్ట్ వేర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏ తెలుగు రచనలోనైనా వెదకడానికి సాధ్యమే" అని 2.2.2012 న జవాబిచ్చారు.నా పుస్తకం 'తెలుగు అధికార భాష కావాలంటే...' పి.డి.ఎఫ్. ఫైల్ పంపించాను.దానిని యూనికోడ్ లోకి మార్చి ఇస్తే యూనికోడ్ లోనే ప్రింట్ చేయించాలని నా కోరిక.ఎందు కంటే తెలుగు గ్రంధాలు యూనీకోడ్ లో ఉంటేనే ఇప్పుడున్న సాఫ్ట్ వేర్ ఆయా విషయాలను వెతుక్కోటానికి పనికొస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి .








4 కామెంట్‌లు:

  1. Google translate added support to Telugu,
    http://translate.google.com/#te|en|

    రిప్లయితొలగించండి
  2. సజీవ వాహిని నిర్వాహకులకు ధన్యవాదాలు,అభినందనలు.తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంధాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్ సైట్ రూపొందించారు.అయితే ఆన్ లైన్ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్ లైన్ లో కూడా అందజేస్తే ఇంటర్ నెట్ లేనివారికి కూడా సౌకర్యంగా ఉంటుంది.నేను రాసే వ్యాసాలకు సజీవ వాహిని ఎంతగానో ఉపయోగ పడుతున్నది.తెలుగు భగవద్గీతకు గానీ,తెలుగు కేతలిక్ బైబిల్ కు గానీ,తెలుగు ఖురాన్ కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.
    http://sajeevavahini.com/telugubible/ అందరూ చూడదగినది.మిత్రులారా ఇలాంటి సాఫ్ట్ వేర్ మిగతా మత గ్రంధాలకు కూడా లభించేలా కృషి చేస్తే లేఖనాల పరిశీలన సులభం అవుతుంది.
    తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంధాలకు ఇలాంటి సాఫ్ట్ వేర్ ఎంతో అవసరం.

    రిప్లయితొలగించండి
  3. http://nrahamthulla3.blogspot.in/2011/06/blog-post.html
    గౌ|| శ్రీ శ్రీ రహమతుల్లా గారికి కృతజ్ఞతాపూర్వక నమః స్సుమాంజలులు.
    నాటి తెలుగు గడ్డ ఖ్యాతి ప్రఖ్యాతులు నేడు విశ్వ వ్యాపకం అయినందున, మేటి తెలుగు బిడ్డ ఖండఖండాంతరాలలో వ్యాపించి అంతర్జాలకం ద్వారా విశ్వగ్రామాన్ని(Global Village) సృష్టించాడు అనడానికి సందిగ్ధం అవసరము లేదు. అంతర్జాలకంలో నేడు వాడబడుతున్న అత్యాధునిక సాంకేతిక మరియు సాహిత్య ప్రజ్ఞకు మన మాతృభాష బహుళ ప్రయోగకారి కావాలనే మా ఆకాంక్ష. తెలుగు భాషా వెబ్సైట్లపై మీరు చేస్తున్న అధ్యయనం ప్రశంశనీయం.
    సజీవ వాహిని ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న తరుణంలో మీలాటి వారి గుర్తింపు, ఆదరణ మాకెంతగానో స్పూర్తి దాయకం. పరిశుద్ధ గ్రంథం ఆదారంగా సజీవ వాహిని చేసే కృషికి అంతర్జాలకంలో దాని శోధకులకు అనుగుణంగా తీర్చిదిద్దే మా భవిష్యత్ ప్రయత్నాలకు, పరిశోధనలకు మరియు ప్రయోగాలకు మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ
    సజీవ వాహిని (వ్యవస్థాపకులు)
    info@sajeevavahini.com

    రిప్లయితొలగించండి
  4. ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు.మీరు తయారు చేసిన ఈ అద్భుతమైన సాఫ్ట్ వేర్ ఆఫ్ లైన్ లోకూడా వినియోగించేలా అందరికీ అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి