చిన్న జిల్లాలైతే శీఘ్రగతిన అభివృద్ధి చెందుతాయి
“పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతమున్న 23 జిల్లాల్లో కొన్నింటిని విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న జిల్లాల ఏర్పాటు 'నిర్వహణ చాలా కష్టంతో కూడుకొని ఉంది.మనకంటే జనాభాలో తక్కువ ఉన్న కర్నాటక వంటి రాష్ట్రంలో కూడా మనకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. తమిళనాడులో మనకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి.కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉన్నా యి. తూర్పుగోదావరి, అనంతపురం, పశ్చిమగోదావరి వంటి కొన్ని జిల్లాలు చాలా పెద్దగా ఉన్నాయి .ఒక్కో జిల్లాలో దాదాపు యాభై లక్షల జనాభా ఉండడమే కాకుండా జిల్లా సరిహద్దులు సుదూరంగా ఉండడం వల్ల మారుమూల గ్రామా లకు జిల్లా అధికార యంత్రాంగం చేరుకునే పరిస్థితి లేకుండా పోతుంది. జనాభా, దూరం దృష్టిలో ఉంచుకోవాలి.వెనుక బడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని పాలనా సౌలభ్యం, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కోసం రాష్ట్రంలో కనీసం ఏడు నుంచి 10 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి” అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిపాదించారు.
“ఒక లోక్‌సభ నియోజవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా కొంత మంది కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో 50 లక్షల జనాభా ఉంటే, జిల్లా కేంద్రానికి రేపల్లె 150 కిలో మీటర్ల దూరంలో ఉంది.దీనివల్ల పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రేపల్లె నుంచి నాగార్జునసాగర్ మధ్య దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది.వినుకొండ, మాచర్ల ప్రాంతాలు చాలా దూరంగా ఉన్నాయి.వినుకొండలో వెంటనే ఏదైనా సమస్య వస్తే అధికారులు వెళ్ళేసరికి ఆలస్యమవుతోంది.గురజాల,మాచర్లలలో ఏదో ఒక పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి.కొత్త జిల్లా ఏర్పాటైతే గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.అధికారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రావడానికి చాలా ఇబ్బంది కలుగుతోంది.అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో కర్నాటకకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉన్నందున అభివృద్ధికి నోచుకోలేదు.చిన్న జిల్లాలైతే శీఘ్రగతిన అభివృద్ధి చెందుతాయి.కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చాలా సూచనలు వచ్చాయి.పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని,ఇతర రాష్ట్రాలకు పక్కనున్న ప్రాంతాలతో జిల్లాలను ప్రారంభించాలని కూడా కోరుతున్నారు.అందుకోసం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారం జిల్లాలను ఏర్పాటుచేసినా మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకూ, కొత్త జిల్లాల ఏర్పాటుకూ సంబంధం లేదు.జిల్లాల విభజనపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తాను.కొత్త జిల్లాలు ఏర్పటుకు సంబంధించిన నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాం” అని కూడా మంత్రి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గుంటూరు ఎం.పి రాయపాటి సాంబశివరావు రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు యు.పి.ఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దృష్టికి తెస్తే ఆమె కొత్త జిల్లాల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారట.
కొత్త జిల్లాల కోసం ఎన్నో ప్రతిపాదనలు:-
1982 ప్రాంతంలో భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరసరావుపేట, మార్కాపురం, తెలంగాణ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లను కలిపి నాగార్జున జిల్లా గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు.
నంద్యాల, మంచిర్యాల వంటి కొత్త జిల్లాల డిమాండు ఎప్పటినుంచో ఉంది. ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు నంద్యాలకు ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో కూడా దానిని జిల్లా కేంద్రంగా చెయ్యాలని,నందమూరి జిల్లా గా చెయ్యాలని అక్కడి నాయకులు కోరారు.
విజయవాడ కేంద్రంగా జిల్లా చేయాలని గతంలో కొంతకాలం ఉద్యమం కూడా జరిగింది.
"తిరుపతి రాజధానిగా బాలాజీ జిల్లా ప్రతిపాదన కొత్తది కాదు.పలు కారణాల వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.ఇప్పటికైనా తిరుపతి జిల్లా ఏర్పాటు చేయాలి.తిరుపతి జిల్లా ఏర్పాటు వల్ల పుణ్యక్షేత్రమైన తిరుపతి, పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది" అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డి రాంభూపాల్ రెడ్డి రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
1990 లో మెదక్,భద్రాచలం,శ్రీశైలం మొదలైన 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు.
1998 లో కొంతమంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 10 కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలని నారా చంద్రబాబు నాయుడు ను కోరారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు గతంలో చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది నేతలు హామీలిచ్చారు.
వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.గతంలో రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌ను కేంద్రంగా ప్రకటించాలనే విజ్ఞప్తి ఉండేది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడిన నేపథ్యంలో వికారాబాద్‌నే కొత్త జిల్లాగా ప్రకటించాలని, పశ్చిమ జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలతో లేదా చేవెళ్ల పార్లమెంటు పరిధితో వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు ఇటీవల ముఖ్య మంత్రిని కోరారు. .
ప్రొద్దుటూరు ,నంద్యాల, గుంతకల్, తిరుపతి జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా ఆయా ప్రాంతాల ప్రజలు కూడా కోరుతున్నారు.“కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల మావోయిస్టుల ప్రాంతాల్లో కూడా పథకాలను పకడ్భందీగా అమలు చేయవచ్చు.పాలన సౌలభ్యం కూడా కలుగుతుంది.ఒక్కో జిల్లాలో 50 నుండి 60 మండలాలు ఉండటం వల్ల పాలన కష్టమవుతుంది.నంద్యాల, ప్రొద్దుటూరు, హిందుపురం, తిరుపతి జిల్లాలుగా చేయాలి” అని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త కోరారు.
ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, తూర్పు, పశ్చి గోదావరి, విశాఖపట్నం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని గిరిజన, అటవీ ప్రాంతాలను విభజించి కొత్తగా పలు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లున్నాయి.
దేశంలోజిల్లాల పరిస్థితి :-
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
పార్లమెంటు సభ్యుల సంఖ్య
|
శాసన సభ సభ్యుల సంఖ్య
|
రాష్ట్రం అవతరించిన సంవత్సరం
|
వైశాల్యం చ.కి.మీ.
|
జనాబా
|
1985 లో జిల్లాల సంఖ్య
|
2011లో జిల్లాల సంఖ్య
|
జిల్లాలు సగటు విస్తీర్ణం చ.కి.మీ
|
జిల్లాల వారీగా సగటు జనాబా
| |
1
|
2
|
3
|
4
|
5
|
6
|
7
|
8
|
9
|
10
|
11
| |
1
|
42
|
294
|
1956
|
275069
|
84665533
|
23
|
23
|
11960
|
3681110
| ||
2
|
2
|
60
|
1972
|
83743
|
1382611
|
10
|
16
|
5234
|
86413
| ||
3
|
14
|
126
|
1950
|
78438
|
31169272
|
16
|
27
|
2905
|
1154417
| ||
4
|
40
|
243
|
1950
|
94163
|
103804637
|
38
|
38
|
2478
|
2731701
| ||
5
|
11
|
90
|
2000
|
136034
|
24540196
|
27
|
5038
|
908896
| |||
6
|
2
|
40
|
1987
|
3702
|
1457723
|
1
|
2
|
1851
|
728862
| ||
7
|
26
|
182
|
1960
|
196024
|
60383628
|
19
|
26
|
7539
|
2322447
| ||
8
|
10
|
90
|
1966
|
44212
|
25353081
|
12
|
21
|
2105
|
1207290
| ||
9
|
4
|
68
|
1950
|
55673
|
6856509
|
12
|
12
|
4639
|
571376
| ||
10
|
6
|
87
|
1950
|
222236
|
12548926
|
14
|
22
|
10102
|
570406
| ||
11
|
14
|
81
|
2000
|
79714
|
32966238
|
24
|
3321
|
1373593
| |||
12
|
28
|
224
|
1950
|
191791
|
61130704
|
19
|
30
|
6393
|
2037690
| ||
13
|
20
|
140
|
1956
|
38863
|
33387677
|
14
|
14
|
2776
|
2384834
| ||
14
|
29
|
230
|
1956
|
308000
|
72597565
|
45
|
50
|
6160
|
1451951
| ||
15
|
48
|
288
|
1960
|
307713
|
112372972
|
30
|
35
|
8792
|
3210656
| ||
16
|
2
|
60
|
1972
|
22327
|
2721756
|
8
|
|
2481
|
302417
| ||
17
|
2
|
60
|
1972
|
22429
|
2964007
|
5
|
7
|
3204
|
423430
| ||
18
|
1
|
40
|
1987
|
21081
|
1091014
|
3
|
8
|
2635
|
136377
| ||
19
|
1
|
60
|
1963
|
16579
|
1980602
|
7
|
11
|
1507
|
180055
| ||
20
|
21
|
147
|
1950
|
155707
|
41947358
|
13
|
30
|
5190
|
1398245
| ||
21
|
13
|
117
|
1950
|
50362
|
27704236
|
12
|
20
|
2518
|
1385212
| ||
22
|
25
|
200
|
1956
|
342239
|
68621012
|
27
|
33
|
10371
|
2079425
| ||
23
|
1
|
32
|
1975
|
7096
|
607688
|
4
|
4
|
1774
|
151922
| ||
24
|
39
|
234
|
1950
|
130058
|
72138958
|
18
|
32
|
4064
|
2254342
| ||
25
|
2
|
60
|
1972
|
10492
|
3671032
|
3
|
4
|
2623
|
917758
| ||
26
|
80
|
403
|
1950
|
240928
|
199581477
|
56
|
71
|
3393
|
2811007
| ||
27
|
5
|
70
|
2000
|
53484
|
10116752
|
17
|
3146
|
595103
| |||
28
|
42
|
294
|
1950
|
88752
|
91347736
|
16
|
19
|
4671
|
4807776
| ||
మొత్తం
|
530
|
4020
|
3276909
|
1189110900
|
425
|
632
|
5185
|
1881505
| |||
కేoద్రపాలిత ప్రాంతాలు
| |||||||||||
1
|
1
|
1956
|
8249
|
379944
|
2
|
3
|
2750
|
126648
| |||
2
|
1
|
1966
|
114
|
1054686
|
1
|
1
|
114
|
1054686
| |||
3
|
1
|
1961
|
491
|
342853
|
1
|
1
|
491
|
342853
| |||
4
|
1
|
1987
|
112
|
242911
|
2
|
2
|
56
|
121456
| |||
5
|
1
|
1956
|
32
|
64429
|
1
|
1
|
32
|
64429
| |||
6
|
7
|
70
|
1991
|
1483
|
16753235
|
3
|
9
|
165
|
1861471
| ||
7
|
1
|
30
|
1963
|
479
|
1244464
|
4
|
4
|
120
|
311116
| ||
మొత్తం
|
13
|
100
|
10960
|
20082522
|
14
|
21
|
3727.19444
|
3882658
| |||
ఇండియా
|
543
|
4120
|
3287869
|
1209193422
|
439
|
653
|
8912.17704
|
5764163
|
విస్తీర్ణంలో మన కంటే చిన్న రాష్ట్రాలైన ఉత్తరపదేశ్ లో 71 జిల్లాలు, గుజరాత్ లో 26 జిల్లాలు, చత్తీస్ గడ్ లో 27 జిల్లాలు, బీహార్ లో 30 జిల్లాలు, జార్ఖండ్ లో 24 జిల్లాలు, అస్సాం లో 27 జిల్లాలు తమిళనాడులో 32 జిల్లాలు, కర్ణాటకలో 28 జిల్లాలు, ఒరిస్సాలో 30 జిల్లాలు ఉన్నాయి.
అలాగే జనాభా ప్రకారం చూసినా మనకంటే తక్కువ జనాభా కలిగిన మధ్యప్రదేశ్ లో 50, తమిళనాడులో 32, రాజస్ధాన్ లో 33, కర్ణాటకం లో 30, గుజరాత్ లో 26, ఒడిషా లో 30, అస్సాం లో 27, చత్తీస్ గడ్ లో 27 జిల్లాలున్నాయి.
మొట్టమొదట 1990 లో దేశంలోని జిల్లాల సంఖ్య లోక్ సభ స్థానాల సంఖ్యను దాటింది.
1985 నుండి దేశవ్యాప్తంగా 214 కొత్త జిల్లాలు ఏర్పడగా మన రాష్ట్రంలో ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పడలేదు. దేశంలో అతి పెద్దది,ఎడారి రాష్ట్రమైన రాజస్ధాన్ లో కూడ 6 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.2012 లో ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా 9 జిల్లాలు ఏర్పాటు చేశారు. సుక్మా, కందగావ్, గరియాబంద్, బలోదా బజర్, ముంగేలి, బలోద్, బెమెతరా, సురాజ్‌పూర్, బలరామ్‌పూర్ జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 18 నుంచి 27కి పెరిగింది. రారుపూర్, దుర్గ్, సర్గుజా, బస్తర్, బిలాస్‌పూర్, దంతెవాడ జిల్లాలను విభజించి కొత్తగా 9 జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు పాలన మరింత చేరువై, అభివృద్ధి వేగవంతమ వుందని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. 2008 లో కూడా రమణ్‌సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం బస్తర్, దంతెవాడ జిల్లాలను విభజించి, కొత్తగా కంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాలను ఏర్పాటు చేసింది.
దేశంలో 19 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు జిల్లాల సంఖ్య పెంచుకున్నాయి.
పార్లమెంటు స్థానాల కంటే జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు(19),కేంద్ర పాలిత ప్రాంతాలు(4) :
అరుణాచల్ ప్రదేశ్,అసోం,చత్తీస్ గఢ్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్,జమ్ముకాశ్మీర్,ఝార్ఖండ్,కర్నాటక,మధ్యప్రదేశ్,మణిపూర్,మేఘాలయ,మిజోరం,నాగాలాండ్,ఒరిస్సా,పంజాబ్,రాజస్తాన్,సిక్కిం,త్రిపుర,ఉత్తరాఖండ్,అండమాన్ నికోబార్ దీవులు,డామన్ డయ్యు,పుదుచ్చేరి,ఢిల్లీ.
జిల్లాల సంఖ్య అసలు పెరగని రాష్ట్రాలు(6):
ఆంధ్రప్రదేశ్,బీహార్,హిమాచల్ ప్రదేశ్,కేరళ,సిక్కిం,
మన రాష్ట్రం లోజిల్లాల పరిస్థితి:-
1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 56 ఏళ్ళ కాలం లో కేవలం మూడే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), రంగారెడ్డి (1978), విజయనగరం (1979) జిల్లాలు.కొత్త జిల్లాల ఏర్పాటు సమస్య మన రాష్ట్రం లో అలా నానుతూనే ఉంది.ప్రజల చేరువకు ప్రభుత్వం అంటూ కబుర్లు తప్ప అధికార యంత్రాంగాన్ని చేరువచేయలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. జాతీయ స్ధాయిలో జిల్లాల సగటు వైశాల్యం 5035 చ.కి.మీ. ఉండగా ఆంధ్ర ప్రదేశ్ 11,960 చ.కి.మీ. తో దేశంలోనే మొదటి స్ధానంలో ఉంది.
కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసే పనే.దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర కేబినెట్ మాత్రమే.రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ వేర్వేరు ప్రాంతాల ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం పట్టుబడుతున్నప్పటికీ ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు కాలేదు . ''రాష్ట్రంలో కొన్ని జిల్లాలను చూసినప్పుడు అవి దేశంలో కొన్ని రాష్ట్రాల కన్నా పెద్దవిగా ఉన్నాయి. ఇది పాలనాపరమైన అనేక సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ప్రభుత్వ సేవా యంత్రాంగం వైఫల్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిటీష్ పాలకులు కొన్ని జిల్లా కేంద్రాలను సముద్ర తీరంలో ఒక అంచున ఏర్పాటు చేశారు.వాటిని ఇంతవరకు ఆయా జిల్లాల నడిమధ్యకు కూడా తేలేదు.కలక్టర్ ను కలిసి రావటానికి ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని ఆ జిల్లాల ప్రజలు బాధపడుతున్నారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన పక్షంలో పాలనా భవనాలు లాంటి మౌలిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్కసారి చేసే పెట్టుబడి మాత్రమే. కానీ దీనివల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పొందే ప్రయోజనాలు చాలా ఉంటాయి. కొత్త జిల్లాలు పరిపాలనను సులభ సాధ్యం చేస్తాయి.ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వస్తున్న డిమాండ్లతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు వేర్పాటు ఉద్యమాల వేడిని వాడిని కూడా తగ్గించగలదు.తెలంగాణా ఏర్పడితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కే.సి.ఆర్.కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అన్ని ప్రాంతాలలోని ప్రజల దీర్ఘకాల కామన్ డిమాండ్.
విస్తీర్ణం లో మనది 4వ అతి పెద్ద రాష్ట్రం. జిల్లా కేoద్రాలు గ్రామాలకు దూరంగా ఏదో ఒక మూలన ఉండటం వల్ల ప్రజలు చాలా యాతన పడుతున్నారు. తరచుగా తుఫాను తాకిడికి, వరదలకు గురయ్యే కోస్తా ప్రాంతం లో చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల సహాయ కార్యక్రమాలు చురుకుగా అమలు జరుగుతాయి. నదులు, కాలువలు, వాగులు దాటి జిల్లా కేoద్రాలకు చేరుకోవలసిన పల్లె ప్రజలకు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల దూరం భారం తగ్గుతాయి. మనరాష్ట్రంలో ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు సగటున 20 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ 37 లక్షల మంది అవసరాలను ఆలకిస్తున్నాడు. అరుణాచలప్రదేశ్ లో 86 వేల మంది జనాభా కొక జిల్లా ఉంటే, మన రాష్ట్రం లో 37 లక్షల మందికొక జిల్లా ఉంది. అలాగే నాగాలాండ్ లో 1500 చ.కి.మీ.లకు ఒక జిల్లా కలక్టర్ ఉంటే మన రాష్ట్రం లో 11960 చ.కి.మీ ల భూబాగానికి ఒక కలక్టర్ ఉన్నాడు..పనులకోసం వచ్చే ప్రజలకు అత్యంత దూరం భారం కలిగించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్ధానం లో ఉంది.
మన అనంతపురం జిల్లా వైశాల్యం 19130 చ.కి.మీ. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకంటే మన అనంతపురం జిల్లా పెద్దది. అంతేకాదు మన అనంతపురం జిల్లా కంటే మాల్ధీవులు, మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రెయిన్, బ్రూనే, కేప్ వర్ధీ, స్రై ప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్, పోర్టోరికో, కటార్, సీషెల్స్, సింగపూర్, స్వాజీలాండ్, టోoగో, ట్రినిడాడ్ మరియు టుబాగో, వనౌటూ లాంటి దేశాలన్నీ చిన్నవి.
చిన్న జిల్లాల ఏర్పాటు తప్పనిసరి అవసరం. ప్రభుత్వం ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు కానీ రేపైనా వాటిని ఏర్పాటు చేయక తప్పదు! అధికార వికేoద్రీకరణ అనేది ఒక అందమైన నినాదంగా మిగిలిపోయింది. అధికారం అంతా హైదరాబాద్ లో కేoద్రీకృతమై ఉంది. కొరవాసరవా ఉంటే కలెక్టరేట్ల లో ఉంది. భూమి శిస్తు కమిషనర్ కు కలెక్టర్లకు మధ్య ప్రాంతీయ అధికారులు లేరు.సబ్ కలెక్టర్లకు తగిన అధికారాలు లేవు. ప్రతిజోన్ లోను ల్యాండ్ రెవిన్యూ జోనల్ కమీషనర్ లేరు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జిల్లాలు, రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలి. ప్రజలకు అధికారుల్ని చేరువచేయాలి.
గ్రామ సర్పంచ్ లకు మండలాద్యక్షులకూ ఆఫీసు భవనాలు ఉన్నాయి గానీ కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ హోదా కలిగిన ఎంపీలకూ,కలక్టర్ స్థాయి జీతంవచ్చే ఎమ్మెల్యేలకు సొంత ఆఫీసు భవనాలు లేవు.
తాలూకాలను మండలాలుగా విడగొట్టినందువలన ప్రజలకు పాలనా యంత్రాంగం దగ్గరయ్యింది.అలాగే ప్రతి ఎంపీకి ఒక కలెక్టరు,ప్రతి ఎమ్మెల్యేకి ఒక సబ్ కలెక్టర్ ను అనుసంధానం చేసి ఆయా భవనాలలో కూర్చోబెడితే మన రాష్ట్రంలోజిల్లాలు 23 నుండి 42 కు,డివిజన్లు82 నుండి 294 కు పెరిగి ప్రజలకు పాలన మరింత దగ్గరౌతుంది.ఆమేరకు శాశ్వతభవనాలూ,మౌలికఆస్తులూ,సౌకర్యాలు ఎక్కువ ప్రాంతాలకు వికేంద్రీకరించబడతాయి. రాష్ట్రంలో ఇప్పుడు 338 మంది డిప్యూటీ కలక్టర్లు,171 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్లు మొత్తం 509 మంది ఉన్నారు.అయితే ఇంతమందిలో 82 ఆర్.డి.వో.లు,23 డి.ఆర్.వో.లు,23 అడిషనల్ జాయింట్ కలక్టర్లు (మొత్తం 128 మంది) తప్ప మిగిలిన 381 మంది స్పెషల్ పోస్టుల్లో ఉంటున్నారు.వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు.
సులభపాలనకు చిన్న జిల్లాలు;
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, చిన్న జిల్లాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొనివెళ్ళాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు రాష్ట్రంలోని 315 తాలూకాలను విడగొట్టి, వాటి స్థానంలో 1110 మండలాలను 1985 మే 25న ఏర్పాటు చేశారు. తరువాత కాలంలో హైదరాబాద్ జిల్లాలోని 4 రెవెన్యూ మండలాలను విడగొట్టి 16 మండలాలను చేశారు. నేడు రాష్ట్రంలో 1128 మండలాలున్నాయి.. ఎంపీలకు సమానంగా 42 జిల్లాలు,ఎమ్మెల్యేలకు సమానంగా 294 రెవిన్యూ డివిజన్లు,6 జోన్లకూ ఆరుగురు ల్యాండ్ రెవిన్యూ కమీషనర్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు పాలనా సదుపాయాలు దగ్గరలో చక్కగా అమరుతాయి. మారుమూల గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి బస్సులో వెళ్ళి అదే రోజు ఇంటికి చేరుకోలేనంత పెద్ద జిల్లాలున్నాయి.పెద్ద జిల్లాలలో పనుల వత్తిడి ఎక్కువై జాప్యం జరుగుతోంది.ప్రజలకు దూరం భారం ఎక్కువయ్యాయి.చాలా సమయం ప్రయాణాలకే వెచ్చించాల్సి వస్తోంది.జిల్లాల విభజనకు ఒక ప్రామాణిక సూత్రం గానీ,శాస్త్రబద్దమైన విధానం గానీ,ఒక ప్రాతిపదికగానీనిర్ణయించలేదు.ప్రతి పనికీ హైదరాబాదు పరిగెత్తుకు రావలసిన అవసరమూ తప్పుతుంది. చిన్న జిల్లాల ఏర్పాటు వలన అధికారులందరికీ పని సమానంగా పంచబడుతుంది.తీవ్ర పని భారం తగ్గి ప్రజలకు పనులు త్వరగా జరుగుతాయి.ఏ అధికారీ ఖాళీగా ఉండనక్కరలేదు.స్పెషల్ పోస్టుల అవసరం ఉండదు.
ఆంధ్రపదేశ్
| |||||||||
జిల్లాలు
|
జిల్లా ఏర్పడిన సంవత్సరం
|
జిల్లా వైశాల్యం చ.కి.మీ.లలో
|
జనాభా 2011
|
జన సాంద్రత
|
పార్లమెంటు సభ్యుల సంఖ్య
|
శాసన సభ సభ్యుల సంఖ్య
|
రెవిన్యూ డివిజన్లు
|
తాలూకాలు
| |
1
|
అనంతపురం
|
1881
|
19,130
|
4,083,315
|
213
|
2
|
14
|
3
|
63
|
2
|
చిత్తూరు
|
1911
|
15,152
|
4,170,468
|
275
|
2
|
15
|
3
|
66
|
3
|
కడప
|
1910
|
15,359
|
2,884,524
|
188
|
2
|
11
|
3
|
50
|
4
|
కర్నూలు
|
1949
|
17,658
|
4,046,601
|
229
|
2
|
13
|
3
|
54
|
రాయలసీమ
|
67,299
|
15,184,908
|
226
|
8
|
53
|
12
|
233
| ||
5
|
తూర్పుగోదావరి
|
1802
|
10,807
|
5,151,549
|
477
|
3
|
21
|
5
|
59
|
6
|
గుంటూరు
|
1794
|
11,391
|
4,889,230
|
429
|
4
|
19
|
3
|
57
|
7
|
కృష్ణా
|
1925
|
8,734
|
4,529,009
|
519
|
2
|
17
|
4
|
49
|
8
|
నెల్లూరు
|
1906
|
13,076
|
2,966,082
|
227
|
1
|
11
|
3
|
46
|
9
|
ప్రకాశం
|
1970
|
17,626
|
3,392,764
|
192
|
1
|
13
|
3
|
57
|
10
|
శ్రీకాకుళం
|
1950
|
5,837
|
2,699,471
|
462
|
1
|
12
|
3
|
38
|
11
|
విశాఖపట్నం
|
1950
|
11,161
|
4,288,113
|
384
|
2
|
12
|
2
|
34
|
12
|
విజయనగరం
|
1979
|
6,539
|
2,342,868
|
358
|
2
|
13
|
3
|
43
|
13
|
పశ్చిమగోదావరి
|
1926
|
7,742
|
3,934,782
|
508
|
2
|
16
|
4
|
46
|
కోస్తా ఆంధ్ర
|
92,913
|
34,193,868
|
368
|
18
|
134
|
30
|
429
| ||
14
|
అధిలాబాద్
|
1905
|
16,128
|
2,737,738
|
170
|
1
|
9
|
5
|
52
|
15
|
కరీంనగర్
|
1905
|
11,823
|
3,811,738
|
322
|
2
|
13
|
5
|
56
|
16
|
ఖమ్మం
|
1953
|
16,029
|
2,798,214
|
175
|
2
|
9
|
4
|
46
|
17
|
హైదరాబాద్
|
1978
|
217
|
4010238
|
18480
|
2
|
13
|
2
|
16
|
18
|
మహబూబ్ నగర్
|
1870
|
18,432
|
4,042,191
|
219
|
2
|
13
|
5
|
64
|
19
|
మెదక్
|
1956
|
9,699
|
3,031,877
|
313
|
2
|
10
|
3
|
45
|
20
|
నల్గొండ
|
1953
|
14,240
|
3,483,648
|
245
|
2
|
12
|
4
|
59
|
21
|
నిజామాబాద్
|
1876
|
7,956
|
2,552,073
|
321
|
1
|
9
|
3
|
36
|
22
|
రంగారెడ్డి
|
1978
|
7,493
|
5,296,396
|
707
|
6
|
3
|
37
| |
23
|
వరంగల్
|
1905
|
12,846
|
3,522,644
|
274
|
2
|
13
|
5
|
51
|
తెలంగాణ
|
114,863
|
35,286,757
|
307
|
16
|
107
|
39
|
462
| ||
275,075
|
84,665,533
|
308
|
42
|
294
|
81
|
1124
|
రంగారెడ్డి జిల్లా 53 లక్షల జనాభాతో అవివి మాలిన విధంగా అభివృద్ది చెందింది. అయినా ఒకడే కలక్టర్.రాష్ట్ర జనసాంద్రత చదరపు కి.మీ.కు 308 ఉండగా హైదరాబాదు నగరం లో ఒక కిలో మీటరుకు 18480 మంది కిక్కిరిసి నివసిస్తున్నారు. అక్కడి 40 లక్షల జనాభాకు ఒకే కలక్టరు. 5000 చ.కి.మీ ల వైశాల్యానికి ఒక జిల్లా అనుకుంటే మనకు 55 జిల్లాలుండాలి. అలాకాకుండ ఒక ఎం.పీ.కి ఒక కలక్టర్, ఒక ఎమ్మెల్యే కు ఒక ఆర్.డి.వో. అనే పద్దతి తెస్తే 42 జిల్లాలు,294 రెవిన్యూ డివిజన్లు చేయాల్సి వస్తుంది. ఏర్పాటు చేయాల్సిన పాలనా విభాగాలు ఇలాఉంటాయి.:-
కొత్తగా ఏర్పాటు చేయవలసిన
| ||
జిల్లాలు
|
రెవిన్యూ డివిజన్లు
| |
రాయలసీమ
|
4
|
41
|
కోస్తా
|
9
|
104
|
తెలంగాణ
|
6
|
67
|
మొత్తం రాష్ట్రం
|
19
|
212
|
తెరాస గెలుపుకు కారణాలు (ఈనాడు 11.12.2018
* తెలంగాణలో భౌగోళికంగా కొన్ని జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా 31 కొత్త జిల్లాలు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు, 4380 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి మార్గం సుగమమైంది.ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో సానుకూలంగా పని చేసింది
* తెలంగాణలో భౌగోళికంగా కొన్ని జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా 31 కొత్త జిల్లాలు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు, 4380 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి మార్గం సుగమమైంది.ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో సానుకూలంగా పని చేసింది
కొత్త జిల్లాలు ఏర్పరచాలనే ఆలోచన మంచిదే కానీ దీన్ని కొంత మంది తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చాలనే దురుద్దేశ్యంతో లేవనెత్తుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. కొత్త జిల్లాలు రాష్ట్ర విభజన తరువాతే చేపెట్టాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
రిప్లయితొలగించండిhttp://nrahamthulla3.blogspot.in/2013/08/blog-post.html
రిప్లయితొలగించండి