ఆకురాతి శతకం – 3
వింతలు –
విడ్డూరాలు
1. మొదటి
భాగములను – పదునైన దృష్టితో
చదివి
పంపినట్టి
– స్పందనలకు
బ్రతుకు
ధన్యమయ్యె – శతకోటి వందనాల్
ఆకురాతి
మాట అణు బరాట !!
2. ఒరుల బోడిచేయు – తిరువేంకటాద్రికే
అంట
కత్తిరేసి – రైన వాళ్ళె
దొంగ
కొంపలోన – దొంగలు పడ్డట్టు
ఆకురాతి
మాట అణు బరాట !!
3. వివిధ మతములెన్ని – భువిని వర్ధిల్లినా
మౌఢ్యమంటనట్టి
– మతము లేదు
కోతులన్నిటికిని
– మూతులు వంకరే
ఆకురాతి
మాట అణు బరాట !!
4. గుడికి ప్రక్క నుండు – గోదారిలో మున్గి
పంది
చేసె
నంట
– ప్రదక్షిణలు
పాడు
మూఢ భక్తి – పందికీ సోకెనా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
5. కప్ప శోభనాలు – గాడ్దెల పెళ్లిళ్లు
జనులు
చేయు పల్లె – జాతరలకు
సంతు
పుట్టు
గాని – జడివాన పట్టునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
6. మళ్ళి మళ్ళి వచ్చు – మహి సూర్య గ్రహణాలు
గడియ
వేసి యుంచు గుడికి – స్వామి
ఊపిరుంటె
బ్రతుకు – ఉప్పమ్ము కొనియైన
ఆకురాతి
మాట అణు బరాట !!
7. ఎలుక
దున్నపోతు – ఎద్దుపై గద్దపై
ఎక్కి
తిరుగు వేల్పు – డొక్కులంత
నభ
విహారులైన – సరులకు లోకువే
ఆకురాతి
మాట అణు బరాట !!
8. వ్యయముచేసి డబ్బు – యజ్ఞాలు చేస్తిరే
వర్షమేది
యనుచు – వగతురేల
కోపదారి
మగడు – కోరినపు డొచ్చునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
9. ప్రబలకీర్తి గొన్న – ప్రాచీన గుడులన్ని
కాల
గర్భ మందు – కలిసి పోయె
వాటి
వేల్పు లేరి – కాటికి పోయిరా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
10.
కల్తితాళి బొట్లు – కళ్యాణ
మస్తుకా
యేమి
కరువు వచ్చె – స్వామి నీకు ?
పాడి
మీద డబ్బు – పరి గేరు కొన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
11.
అవని దయ్యములకు అల్లాహ్ బెదరేను
సైతానంటె
యేసు – చచ్చి బ్రతుకు
గ్రహణ
మంటె విష్ణు – గజగజ వణకేను
ఆకురాతి
మాట అణు బరాట !!
12.
గుడులు కొల్లలుండ – బడియాట స్థలములా ?
యజ్ఞముల
కటంచు – యాష్టపోకు
చచ్చు
మగడు ఎచ్చట – శయనిస్తె నీకేమి ?
ఆకురాతి
మాట అణు బరాట !!
13.
కొంగ జపము చేయు – దొంగ బాబాకాళ్ళ
వద్ద
మోకరిల్లు – పెద్ద లార ?
గుంట
నక్క కెలుగు బంటి
– దాసోహమా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
14.
వడ్డి కాసు లోని – వజ్రాల నగలన్ని
కుదువ
కట్లకేగి – కుదురు కొనియె
పొంగి
పొంగి పాలు
– పొయ్యి పాలైనట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
15.
అల రికార్డు డాన్సు – అశ్లీలమై దోచు
ఖ్యాతి
గొన్న చిత్ర – బూతు ముందు
పేదవాడి
భార్య – పెద్ద కేటన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
16.
బొంది తోడ స్వర్గ – మందింప గల స్వాము
లెందరో
కలరట
– ఇండియాలో
ఎయిడ్స్
వ్యాది లాగ – ఎప్పుడూ లభ్యమే
ఆకురాతి
మాట అణు బరాట !!
17.
చిత్ర సీమ బాట – చిలిపి కన్నెల వేట
శోభనాల
తీట – జోలపాట
మోజుతీర
నేర్పు – మొగుడు పెళ్లాలాట
ఆకురాతి
మాట అణు బరాట !!
18.
ప్రేమ కిష్టపడని పిల్లపై కసిబూని
దాడి
చేయు వాడె – దగ్ధమగును
నిప్పుజోలికేగి
– నీల్గి చచ్చిన రీతి
ఆకురాతి
మాట అణు బరాట !!
19.
కుక్క తిరుపతేగ – గొప్ప సింహం కాదు
కాశికేగ
పంది
– గజము కాదు
శబరిమలయి
కేగ – సాలభంబు సిలకౌనె
ఆకురాతి
మాట అణు బరాట !!
20.
సమ్మె దాడులందు – సర్కారు సొమ్మందు
రేప్
చేయుటందు – రేసులందు
తలను
దూర్చువాడు – పులివాత పడ్డట్లె
ఆకురాతి
మాట అణు బరాట !!
21.
చంద్రయాన వేళ – శాస్త్రవేత్తలు పోయి
గుడికి
మొక్కుటెంత
– గుడ్డి తనము
గగన
యానమునకు – గాడిద సాయమా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
22.
సిగ్గు విడిచినట్టి – సివిలింజనీయర్లె
తగ్గి
వాస్తువైపు – మొగ్గు చుండ్రు
పంది
బురద నొదిలి
– బ్రతుక లేదన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
23.
ఆస్తికునకు వచ్చు – ఆదాయ మదియేమి ?
నాస్తికునకు
జరుగు – నష్టమేమి ?
భక్తి
భ్రమలలో స్వ – శక్తిని కోల్పోకు
ఆకురాతి
మాట అణు బరాట !!
24.
నవగ్రహాల కేసి – భువి జీవ రాసుల
అంట
కట్టి నారు – ఆది ఋషులు
కోళ్ళ
పట్టి చికెను – కొట్ల కేసిన రీతి
ఆకురాతి
మాట అణు బరాట !!
25.
అగ్రదేశములకు – ఆగ్రహం తెప్పించు
ఉగ్రవాదమునకు
– వూత మేల ?
సానుభూతి
క్రూర – సర్పాల మీదనా
?
ఆకురాతి
మాట అణు బరాట !!
26.
తాము దాల్చిలబ్ది – బాముకోవచ్చుగా
వొరుల
మీద రుద్దు – దురదయేల
రంగురాళ్ళు
బ్రతుకు – రాతలు వ్రాయునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
27.
మూఢనమ్మకాల్లో – మునిగిన స్త్రీ వల్ల
భర్త
చెడును బిడ్డ – భవిత చెడును
తాను
చెడ్డ కోతి
– వనమెల్ల చెరచదా
ఆకురాతి
మాట అణు బరాట !!
28.
నోరు వాయి లేని – భూరి దేవుళ్ళకు
బూతు
పులిమినారు – రోత కవులు
దిక్కులేని
శవము – కుక్కలు తిన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
29.
చక్క గుంటె నడత – సంసార కొంపలకు
ఎట్టులంటు
కొనును – ఎయిడ్స్ వ్యాది ?
దారి
యిడక కుక్క – దూరునా వంటింట
ఆకురాతి
మాట అణు బరాట !!
30.
గడ్డి తినెడు వేళ – కండోము దాల్చని
కాముకులకు
ఎడ్స్ – గాలి సోకు
చాప
క్రింది నీరు – కాపురాలే కూలు
ఆకురాతి
మాట అణు బరాట !!
31.
లేడి కూన మీద – రేసుకుక్కల భంగి
కన్నె
పిల్ల మీద – కాముకేళి
తగిన
దండ నుంటె – తెగియింతురా యిట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
32.
అంటరాని తనము – అన్నింట దూరినా
లంజి
తనము కాడ – రాదు అడ్డు
కుల మతాల దెపుడు – గుడ్డెద్దు పోకడే
ఆకురాతి
మాట అణు బరాట !!
33.
అధిక నల్ల డబ్బు – అఙ్ఞాత భక్తుండు
హుండి
లోన వేసి – ఉడాయించు
పిల్లివోలె
మోక్ష – పీఠాన్ని కాజేయ
ఆకురాతి
మాట అణు బరాట !!
34.
మనిషి చచ్చి పోవు – మరుజన్మకందురే
పిండ
మెవరి కోయి – పిచ్చి నాన్న ?
కపట
బాపనయ్య – కాకుల జూపెనా
ఆకురాతి
మాట అణు బరాట !!
35.
మానవత్వమునకు – మచ్చు తునకైనట్టి
కన్నవారి
మీద – కరుణ మరచి
మానవుండు
తిరిగి – వానరుడగు చుండె
ఆకురాతి
మాట అణు బరాట !!
36.
రాజశేఖరుణ్ణి రక్షింపుమని యేడ్చి
కాళ్ళ
వేళ్ళ బడియు – ఖంగుతిన్న
మతము
లన్నియింక – బ్రతుకుట దండుగే
ఆకురాతి
మాట అణు బరాట !!
37.
బొజ్జ గణపతుల – నిమజ్జన వేళల్లో
కొన్ని
ప్రాణులైన – మన్ను కలయు
తోడు
లేక పోదు – దొడ్డ పీన్గన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
38.
పరమ నిష్టలెన్నొ – పాటించు రంజాను
ముగియగానే
నడత – మొదటికొచ్చు
రాయి
గుద్దుకున్న – రబ్బరు బంతిలా
ఆకురాతి
మాట అణు బరాట !!
39. తనువులుండు వరకు తప్పవీ దుః ఖాలు
తనువునే
త్యజింప – మనిరి మునులు
మూషికాలు
కొంప – మూసేయమన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
40.
కాటు వేయు నాగు – కలిమినందించునా ?
నమ్మి
కొలుచు ముద్దు – గుమ్మలార
అద్దమేల
నమ్మ – అరచేతి గాజులకు
ఆకురాతి
మాట అణు బరాట !!
41.
దొడ్డ దేవతలకు – బిడ్డల బలియిచ్చి
నిధుల
కోరుకొనెడి – అధములార
నిధుల మూట,
తల్లి – ఉదర మందున్నదా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
42.
చెట్లు చేమలెపుడు – ఛేదించు మూకకు
వేప
రాగి చెట్లు – వేల్పులయ్యె
బాతుగుడ్లలోన
పసిడి కన్గొన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
43.
ఉల్లి తల్లి కాదు – ఉంచుకున్నది,
భార్య
కాదు,
భక్తి మోక్ష గామి కాదు
నేతి
బీర చూపి – నెయ్యంటె చెల్లునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
44.
అక్రమాలకేగి – ఆస్తి పరుడై నోడు
చిక్క
కుండ పోదు – సి. బి. ఐ కి
దొంగదైన
కుక్క – దొరికి పోకుండునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
45.
జడలు వీడిపోయె – జాకెట్లు మరుగాయె
వంటి
మీది చీర – వలస బోయె
నాతి
సిగ్గు దాగె – ఈత దుస్తుల్లోన
ఆకురాతి
మాట అణు బరాట !!
46.
మళ్ళి పుట్టి నట్టి – “మగధీర” ( సినిమా ) తెల్పు
మళ్ళి
వత్తుమనుచు – వెళ్ళి నట్టి
యేసు
బ్రహ్మగార్ల – కేమాయె రారైరి?
ఆకురాతి
మాట అణు బరాట !!
47.
తాళి యుండు వరకె – తరుణి కాహ్వానాలు
తాళి
తెగిన దాని – దలపరేమి ?
తాళికున్న
విలువ – తరుణికి యివ్వరా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
48.
రేప్ చేయ నేర్పు – దోపిడీలను నేర్పు
గెంత
నేర్పు,
కౌగి లింత నేర్పు
ఇంత
కంటె నేర్వ – నేముంది సినిమాల్లో
ఆకురాతి
మాట అణు బరాట !!
49.
అంధ యుగము నాటి – ఆచారమైనట్టి
బుడుగు
వయసులోన – వడుగు లేమి ?
వడుగు
చేయ కుంటె – వచ్చు కీడేమిటో ?
ఆకురాతి
మాట అణు బరాట !!
50.
సైన్సు యేడ్చు మూఢ – శాస్త్రజ్ఞులను
గాంచి
కోరి
కోరి చేసుకున్న మగడు
సాని
వెంట పడితె – సతులేడ్చు కొన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
51.
ధరణి పడ్డనాడె – దాత రాసిండని
భక్తి
పంచజేరి – బాధపడకు
కట్టివేయబడిన
– గాడిద కైవడిన్
ఆకురాతి
మాట అణు బరాట !!
52.
నాగరీకమైన – నైటీలు బయదిల్లి
చీర
లాగి వైచె – సిగ్గుతీయ
పాత
మొగుడి తోటి – పండుగా యన్నట్లు ?
ఆకురాతి
మాట అణు బరాట !!
53.
వ్రతము చేయగానె – బ్రతుకులు మారవు
క్రతువు
చూచి వర్ష – రుతువు రాదు
మాయ
మంత్రములకు – మానునా గాయాలు ?
ఆకురాతి
మాట అణు బరాట !!
54.
సైన్సు యుగములోన – చాదస్తయుతమైన
యేమిటీ
ప్రచార – మేసుదేవ
పాతకములు
చేసి – ప్రార్ధిస్తె పోవునా
ఆకురాతి
మాట అణు బరాట !!
55.
తనువు మీది నగలు – తాకట్టు కేగినే
సంకటంబదేమి
– వేంకటేశ ?
ఉన్న
పరువు కాస్త – ఊడ్చుకు పోయెనే
ఆకురాతి
మాట అణు బరాట !!
56.
తేనెకార్చు చున్న – తెలిబూది రాల్చినా
విగ్రహాలు
చూపు – వింతలన్ని
కేటుగాళ్ళు
చేయు – కిటుకులే కదస్వామి
ఆకురాతి
మాట అణు బరాట !!
57.
మదిని దైవ బక్త యొదిగి యున్నన్నాళ్ళు
వాస్తవాల
చెవుల – వాలనీదు
దుక్కి
టెడ్ల గాట – కుక్క చేరిన రీతి
ఆకురాతి
మాట అణు బరాట !!
58.
జాతరనుచు రేగి – జగదాంబ గుడి ముందు
త్రాగు
బోతు లెగసి – మూగ ప్రాణి
పీక
కోయగానె – దూకునా వర్షాలు ?
ఆకురాతి
మాట అణు బరాట !!
59.
తనను జేరవస్తు దారి దుర్ఘటనలో
చచ్చినట్టి
బక్త జనుల బ్రోవ
చేతకాని
వాడు – జాతికి దేవుడా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
60.
బోరుబావు లిపుడు – నీరివ్వడం మాని
బాలల
కబళించు – బాట పట్టె
స్కాన్ల
వేట కాడ – కూనల్ బలైనట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
61.
భక్తి పారవశ్య – ముక్తి యాత్రల్లోన
దారి
పోడవు దైవ – దర్శనాలు
కడకు
యాక్సిడెంట్లు – కైలాస టిక్కెట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
62.
త్రాగుడులకు నాన్న – తగలేయ డబ్బంత
వున్న
అడుగు బొడుగు
ఊడ్చి తెచ్చి
అమ్మ
ఆలయాల – కర్పించి కూర్చుండు
ఆకురాతి
మాట అణు బరాట !!
63.
అల స్వమూత్ర పాన – మౌషధం బయి పోయె
ఆవు
పంచితమ్ము – అమృత మాయె
పంది
మూత్రమేల – పనికి రాదయ్యేనో ?
ఆకురాతి
మాట అణు బరాట !!
64.
బోడి గుండు కున్ను – మోకాటి చిప్పలకు
ముడులు
పెట్టినారు – బడుగు మునులు
నభగ్రహాలు
వచ్చి – నరుల వేటాడునా
ఆకురాతి
మాట అణు బరాట !!
65.
రుషుల బోధ లైన – రుగ్వేద పలుకైన
పనికిరాని
చెత్త – పనలు కట్టి
పెంట
కుప్ప కెత్తి – పీడ వదిలించుకో
ఆకురాతి
మాట అణు బరాట !!
66.
సంబరంగ చేయు – సామూహ పెళ్ళిళ్ళు
స్వావలంబనాన్ని
– చంపి వేయు
కుక్కలదుపు
సేయ – ముక్కలు రాల్చేరు
ఆకురాతి
మాట అణు బరాట !!
67.
నన్స్ పెదవి మీద – నాజూకు ముద్దిచ్చి
పలకరింతురంట
– ఫాదరీలు
ముద్దు
పెట్ట కుంటె - ముదరదా పెను భక్తి ?
ఆకురాతి
మాట అణు బరాట !!
68.
మతములన్ని సంకు - చిత ఙ్ఞాన పరిధికే
గిడసబారి
పోయి – ముడుచు కొనియె
మంద
బుద్ది స్త్రీలు – మడి కట్టు కున్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
69.
పూర్వ జన్మ స్మృతులు – పుట్టుకొచ్చా
యిపుడు
“దలైలామ” గారి – తలపులోకి
మృత్యువేళ
చుట్టు – ముట్టు యమభటులల్లె
ఆకురాతి
మాట అణు బరాట !!
70.
కలియుగాంత మనుచు – కడతేరు దినమంచు
కమ్ముకొన్న
ఈ పుకార్ల నెల్ల
సొమ్ము
చేసు కొనెడి సోగ్గాళ్ళ దే హవా
ఆకురాతి
మాట అణు బరాట !!
71.
అంగడోళ్ళ మీది – దొంగాధికారులే
ప్రభుతను
పడకూల్చు – పతిత మహిళ
దగడి పంచ
జేరి – మగని చంపిన రీతి
ఆకురాతి
మాట అణు బరాట !!
72.
హెల్త్ పాడు చేయు – కల్తీల సరుకమ్మి
లాభ
మంద జూచు – లోభులార
సాటి
కొంప కాల్చి – చలికాచు కొందురా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
73.
పేరు మోసినట్టి – పెద్ద ఆఫీసుల్లో
కాసులుండు
వాడె – కాలుమోపు
అట
మొసళ్ళ మేప – అందరి సాధ్యమా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
74.
ముష్టి డబ్బు కొరకు – మూత్ర పిండాలనే
అమ్ము
కొనుచు నుండు – అర్భకులకు
ఓటు
అమ్ముకొనుట – ఒక పెద్ద లెక్కయా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
75.
బెల్ట్ షాపులున్ను – మల్టీ పొగాకున్ను
వేశ్య
కొంపలున్ను – వేల్పులున్ను
నరుల పీక్కు తినెడి – చిరకాల రక్కసుల్
ఆకురాతి
మాట అణు బరాట !!
76.
పదవి దక్కగానె – ప్రజల నొగ్గేసేటి
నేత
లెక్కువైరి
– నేటి యువత
కన్నవారి
బ్రతుకు – గాలి కొదిలిన రీతి
ఆకురాతి
మాట అణు బరాట !!
77.
భీతి లేని పదవి – జీతమా అరలక్ష
విధుల
నెపుడు నిర్వ – హించబోరు
పగలు
రేయి కూడ –పైలాభ చింతయే
ఆకురాతి
మాట అణు బరాట !!
అక్రమాలు –
అవినీతి – దురలవాట్లు
78.
పదవి కొరకు నీవు – పార్టీ ఫిరాయిస్తె
సరసుడైన
శాల్తి – సతుల మార్పు
మగని
మార్పు కోర
– మగువకు తగనిదా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
79.
భర్త పోయిన వేరు – భర్త నందగవచ్చు
భార్య
పోవ తిరిగి – బడయవచ్చు
యుండగానె
భార్య – ముండల వేటేల ?
ఆకురాతి
మాట అణు బరాట !!
80.
శ్రమను దోచుకొనుచు – చచ్చేటి పేదలకు
దానమిచ్చువాడు - దాతకాడు
పెంటమీద
నిలచి – సెంటలము కొన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
81.
ప్రేమ దోమయనెడి – ప్రియునికి కౌగిళ్ళ
విందులీయబోకు
– ముందుగానె
కులికి
యీసడించు – కూర కరివేప లా
ఆకురాతి
మాట అణు బరాట !!
82.
ప్రేమ లొలుక బోయు – పెళ్లి సీమంతాల
సందడల్లె
చేస్తె – సాముహికపు
శోభనాలు
కూడ – చూచి తరించమా
ఆకురాతి
మాట అణు బరాట !!
83.
చెరుప వేశ్య సుబ్బి – శెట్టి
గుగ్గిళ్ళమ్మె
జూదమాడి
ధర్మ – జుండు చెడియె
కామ
వాంఛ తోడ – కడతేరె రావణు
ఆకురాతి
మాట అణు బరాట !!
84.
తేలు బొమ్మచించి – తీసేసి గుట్కాలు
నమలి
మ్రింగుచున్న – నరుల కిపుడు
కుట్టు
వరకు తేళ్ళు – కుమ్మరి పురుగులే
ఆకురాతి
మాట అణు బరాట !!
85.
దళితుడున్నతంది – తనవారి మరచుచో
అగ్రవర్ణ
మెట్ల – నుగ్రహించు ?
తల్లి
కోడి తరుమ – పిల్లి యోదార్చునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
86.
శాఖములను తినుచు – మేకల వదలినా
తరుగు
కూరలందు – పురుగులుండు
మానివేయహింస
– మనిషికి సాద్యమా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
87.
వ్యాధి నయము చేయ – వైద్యాలయములుండ
మాంత్రికులను
చేరు – మౌఢ్యమేల ?
గుడ్డలుతుక
మురికి – గుంటే శరణ్యమా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
88.
బక్క ప్రాణులన్న – మొక్కు దేవుళ్ళన్న
పరుల
ధనములన్న – పడతులన్న
కండ
చక్కెరల్లె – కబళించు గూండాలు
ఆకురాతి
మాట అణు బరాట !!
89.
మందు మాకు లేదు – మరలు ప్రశ్నే లేదు
ఏడ్స్
భూత దాడి – కెదురు లేదు
భార్య
పవిట క్రింద – ప్రాణాలు దాచుకో
ఆకురాతి
మాట అణు బరాట !!
90.
నిండు జీవితాన్ని – గుండాయి జమ్ములో
క్షతియొనర్చు
వాడు – బ్రతక లేడు
కరచుకుక్క
బ్రతుకు – దొరకు నందాకనే
ఆకురాతి
మాట అణు బరాట !!
91.
కల్తిసార మృతులు – కళ్ల పడ్డపుడెల్ల
కావు
కావు నేడ్చు – కాకి ప్రభుత
ఎద్దు
పుండు కాకి – కెంత ముద్దాయెనో ?
ఆకురాతి
మాట అణు బరాట !!
92.
పెట్టు జనములుండ – భిక్షాటనము పోదు
దానములకు
పేద – తన మణగదు
ఆజ్యమందుచుండ
– అగ్గి చల్లారునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
93.
చెట్లు చేమలన్ని – చేధించి చేధించి
పచ్చదనము
నంత – పాడు చేయ
కరగు
మేఘమాల కన్నెర్ర చేయదా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
94.
రేపులున్ను ఫైట్లు – లేటెష్టు సీన్లతో
చిత్ర
సీమ కీర్తి – శిఖర మాయె
ఆడదాని పరువు –
అంగళ్ళ పాలాయె
ఆకురాతి
మాట అణు బరాట !!
95.
కడుపు నిండ పశువు – గడ్డి తెమ్మని కోరు
మగువ
యోగ్యుడైన – మగనికోరు
పిసిని
గొట్టు వరుడు – లెసకట్నమడుగురా
ఆకురాతి
మాట అణు బరాట !!
96.
కుల రిజర్వులెట్టి – కుల సంఘములు కట్టి
కులము
పేర పత్రికలను నడపు
కుళ్ళు
రాజకీయ – మొళ్లు మండింపదా
ఆకురాతి
మాట అణు బరాట !!
97.
మనువు గొప్పదియని – ధన పిపాసుల యింట
పేదకన్న
తండ్రి – బిడ్డ నిస్తె
అల
కసాయి చేత –అర కోడి పడ్డట్లె
ఆకురాతి
మాట అణు బరాట !!
98.
బడిని మాన్పియింటి – పనులు చేయంచేటి
తండ్రి
కూల్చి వేయ – తనయ బ్రతుకు
పెల్లు
యాకటి పులి – పిల్లల తిన్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
జాతిరత్నాలు
99.
సత్యన్యాయ ధర్మ – సంచితం బైనట్టి
నీతి
కల్గియుండు – హేతు వాది
హేతు
వాది యెపుడు – జాతికి రత్నమే
ఆకురాతి మాట అణు బరాట !!
100.
అస్తి కత్వ మంత – అంధవిశ్వాసాలు
నాస్తి కత్వమంత
– వాస్తవాలు
కాస్తమనసు నిల్చి – వాస్తవం తెలిసికో
ఆకురాతి
మాట అణు బరాట !!
101.
కావు కావుమనెడి – కాకుల రొదలోన
కోకిలమ్మ తీపి – గొంతు పగిది
హేతువాది పల్కు – ఎటనున్న వజ్రమే
ఆకురాతి
మాట అణు బరాట !!
102.
హేతు వాద దృష్టి – యెదగని మదిలోన
మూఢ నమ్మకాలు – గూడు కట్టు
శుద్ది లేని యింట – బొద్దింక లున్నట్లు
ఆకురాతి
మాట అణు బరాట !!
103.
పుట్టి పుట్టగానె – యిట్టె కబళింపంగ
భక్తి కొలను లోన – బలసి తిరుగు
మత మొసళ్ళ గెలుచు – మనుజులే నాస్తికుల్
ఆకురాతి
మాట అణు బరాట !!
104.
అపర శాంత మూర్తి – ఆధ్యాత్మికుండనకు
నాస్తికునకు హింస – నైజమునకు
ఒరువు వేయకుండ – సరకు ప్రోగేతువా
?
ఆకురాతి
మాట అణు బరాట !!
105.
సైన్సు చేయు మేలు – జగమెరింగిన నాడు
మతములన్ని చచ్చి – చితికి చేరు
నింగి సూర్యుడెగయ – నిలచునా చీకటుల్
?
ఆకురాతి
మాట అణు బరాట !!
సమసమాజం
కావాలా ?
106.
రైతు కూలి శ్రమను – రంజు గాదోచుకొని
ధనికులెదుగుచున్న
– ధరణి మీద
సమ
సమాజ బాట – భ్రమలమూటేనోయి
ఆకురాతి
మాట అణు బరాట !!
107.
తరతరాలనాడు తస్కరించిన భూము
లెంచి శ్రామికులకు – పంచువరకు
ఆకటి మరణాలు – అదుపు కొచ్చుట కల్ల
ఆకురాతి
మాట అణు బరాట !!
108.
వర్గ ఉద్యమాలు – వంచవలనే గాని
బ్రతిమలాట కాస్తి – పంచబోరు
రక్కకుంటె చెరకు – చక్కెర రాల్చునా ?
ఆకురాతి
మాట అణు బరాట !!
109.
ఆకలి పొలికేక – లాప కల్గే కిటుకు
కార్లమార్క్సు లెనిను – గార్ల కెరుక
కొయ్యవంకలన్ని
– పొయ్యికే అవగతం
ఆకురాతి
మాట అణు బరాట !!
110.
కార్లమార్క్సు లెనిను – ఘటికులౌ
ఏంగిల్స్
బుర్రలందు పుట్టి – పుంజుకున్న
సోషలిజమె సకల – దోషాల కౌషదం
ఆకురాతి మాట అణు బరాట !!
111.
ఆకలి పెనుమంట – లార్ప కల్గిననాడె
మూఢ మతములన్ని – ముసుగుతన్ను
సమ సమాజమునకు – సరి బాటలేర్పడున్
ఆకురాతి మాట అణు బరాట !!
112.
వరస విప్లవాలు – వర్ధిల్లినప్పుడే
కలలు కనెడి – మిలకుదిగును
మూఢ నమ్మకాల – పీడయున్ విరగడౌ
ఆకురాతి మాట అణు బరాట !!
అక్రమ సెక్సు
సీ
|| నంద కృష్ణయ్య – మేనత్తకే మగడాయె
హరిశ్చంద్రుడు భార్యను –
అమ్మివైచె
గురుపత్నియగు తార – చెరపట్టె చంద్రుణ్ణి
దక్షుండు సోదరికి – తాళి
కట్టె
సుగ్రీవు వదినెను – శోభన గది కీడ్చె
మరదల్నిగొని వాలి – మలిన పరచె
శత రూప, జాహ్నవి – సారస్వతీ, యిళ
తండ్రికే భార్యలై – తగలపడిరి
తే
||
గీ || అంధ యుగలముల నాటి – దుర్గంధమెల్ల
గ్రంధములకెత్తి భక్తితో – రంగ రించి
మూఢ విశ్వాసముల మూట – మూపు కెత్త
మోక్షమని గార్ధభ శ్రేణి – మోయుచుండె
వేప గింజలు
సీ || మౌని విశ్వా మిత్రు – మేనకన్ చెరపట్టి
బ్రహ్మర్షి పదవినే –
బ్రష్టుపరిచె
రుషి వశిష్టుండు – యరుంధతిన్ ముద్దాడి
రుషి కూటములకెల్ల – రోత పులిమె
మౌని పరాశరు – మత్య గంధింగూడి
ఎలమి చేపల కంపు –
పులుముకొనియె
వేద వ్యాస మహర్షి – విధవల భోగించి
పండిత శ్రేణుల – పరువుతీసె
ఆ || వె || శాపమీయగానె – చచ్చిరట , ఈ మునుల్
వరము లీయ బ్రతికి – వచ్చిరంట
వేపగింజలకును – తీపి తేనియలద్ది
పుట్టి ముంచినారు – పూర్వకవులు
నేతి బీర
సీ
|| అనసూయ ఉడికించె – యినుప
గుగ్గిళ్ళను
సావిత్రి యమునితో – జగడమాడె
సుమతి శాపంబుతో – సూర్యుణ్ణి
నిలవేసె
అగ్గిలో
సీతమ్మ – నిగ్గుతేలె
ద్రౌపదిని కాపాడ – దైవమే దిగివచ్చె
కుంతి
దేవుళ్ళకే – సంతుకనియె
ఆడదే లేకుండ – అయ్యప్ప జన్మించె
మగ
పొందు లేకయే – మరియ కనియె
తే
|| గీ || నాటి వనితల మహిమకు –
దీటుకొని
నేటి మహిళను పతితగా – నిలుప వలెనె
అతివలకు లేని గొప్పల – నంటగట్టి
నేతి బీరను చేసిరి – నాతి బ్రతుకు ||
నాటు
కుక్కలు
సీ || ఆటలాడు కొనెడి – అతి చిన్న
వయసునే
చిట్టి గొంతుకు తాళి –
కట్టినారు
పైసల కాసించి – పండు ముదుసలి కిచ్చి
చేసి కన్యల గొంతు – కోసినారు
దుష్టు డైనా మగడు – దుర్మార్గుడైననూ
పడియుండ వలెనంచు – నుడివినారు
కడకు చచ్చిన భర్త – కాయమ్ముతో సతిని
కాష్టమ్ములో వేసి – కాల్చినారు
ఆ
|| వె || విధవ రాళ్ళ చేసి – నుదిటి కుంకుమ దీయ
మోము చూపలేని – ముదిత నిపుడు
కాటు వేయ జూచు – నాటు కుక్కలు తప్ప
మనువు కొప్పు కొనెడి – ఘనులు కలరె ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి