19, ఆగస్టు 2011, శుక్రవారం

తెలుగు నిఘంటువులు

క్రీ.శ.1900 సంవత్సరానికి పూర్వపు తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులు

సంవత్సరం, నిఘంటు నిర్మాత, నిఘంటువు పేరు, ప్రచురించ బడిన ప్రదేశం.

  • 1818: డబ్ల్యు. బ్రవున్‌, A Vocabulary of Gentoo and English, మద్రాస్‌.
  • 1821: ఎ.డి. కేంప్‌బెల్‌, A Dictionary of the Teloogoo Language, మద్రాస్‌.
  • 1835: జె.సి.మోరిస్‌, A Dictionary, English and Teloogoo, మద్రాస్‌.
  • 1839: డబ్ల్యు. కార్పెంటర్‌, A Dictionary of English synonyms, లండన్‌.
  • 1841: సి. రామకృష్ణ శాస్త్రులు, A Vocabulary, in English and Teloogoo, మద్రాస్‌.
  • 1841: జె. నికోలాస్‌, A Vocabulary of English and Teloogoo, మద్రాస్‌.
  • 1844: ఇ. బాల్పోర్‌, Vocabularies Telagoo, కలకత్తా .
  • 1847: డబ్ల్యు. ఇల్లియట్‌, Language of the Goands with terms in Telugu, కలకత్తా .
  • 1849: బి.హెచ్‌. హాడ్జ్‌సన్‌, Vocabularies of Southern India, కలకత్తా .
  • 1852: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ , A DICTIONARY, Telugu and Eng1ish, మద్రాస్‌.
  • 1854:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ , A Dictionary of the Mixed Dialects మద్రాస్‌.
  • 1862: రెవరండ్‌ పెర్సివల్‌, Telugu - Eng1ish DICTIONARY, మద్రాస్‌.
  • 1868: సర్‌.ఏ.జె. ల్యాల్‌, A Vocabulary in Hindustani, English, Telugu, నాగపూర్‌.
  • 1886: రెవరండ్‌ పెర్సివల్‌, Anglo-Telugu Dictionary, మద్రాస్‌.
  • 1889: వీరస్వామి మొదలియార్‌, Vocabulary in English and Telugu, మద్రాస్‌.
  • 1891: మద్రాస్‌.పి.శంకరనారాయణ, English - Telugu Dictionary,
  • 1895: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ , A DICTIONARY, English and Telugu, మద్రాస్‌.
  • 1898: జి.డబ్ల్యు. టేలర్‌, An English-Telugu Vocabulary, మద్రాస్‌.
  • 1900:పి.శంకరనారాయణ,Telugu - English Dictionary, మద్రాస్‌.
  • 1900: పి. హోలర్‌, Telugu Nighantuvulu, రాజమండ్రి.

తెలుగు-తెలుగు నిఘంటువులుః

లకంసాని చక్రధరరావు,ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం" పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.
అ-ఔ (1978) 412 పేజీలు,పొట్టి శ్రీరాములు కిఅంకితం.ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు.12219 పదాలు.
క-ఘ(1981) 455 పేజీలు, కట్టమంచి రామలింగారెడ్డి కి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట.19670 పదాలు
చ-ణ (1981) 277 పేజీలు, ఆవుల సాంబశివరావు ముందుమాట.11000 పదాలు
త-న (1985) 440పేజీలు,వాసిరెడ్డి శ్రీకృష్ణ కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.16000 పదాలు.
ప-భ (1987) 498 పేజీలు,లంకపల్లి బుల్లయ్య కి అంకితం.కోనేరు రామకృష్ణారావుమున్నుడి.19000 పదాలు.
మ (1987) 268 పేజీలు,ఎమ్.ఆర్.అప్పారావు కి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట.9754 పదాలు
య-వ (1989) 272 పేజీలు,ఆవుల సాంబశివరావు కి అంకితం కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు.10132 పదాలు
శ-హ (1995) 315 పేజీలు, కోనేరు రామకృష్ణారావు కి అంకితం మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. 6651పదాలు. 3904(అ-హ) అనుబంధం.
ఈ సంపుటాలను ఆన్ లైన్ లో పెడితే బాగుంటుంది.
తెలుగు-ఉర్దూ నిఘంటువులుః
మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి. ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కువగా దొరకడం లేదు.ముద్రించాల్సిన అవసరం ఉంది.
  • 1938-మొదటి ఉర్దూ-తెలుగు నిఘంటువు 1938 లో వరంగల్ ఉస్మానియా కాలేజీలో అరబిక్ ప్రొఫెసర్ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది అలీఫ్ నుండి లామ్ వరకు ఆహ్మదియా ప్రెస్ కర్నూలు లో మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీల పుస్తకం.
  • పురాతన ప్రతిని స్కాన్ చేయించి పునర్ముద్రణ చేయాటానికి అంగీకరించిన తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్ ఏబికెప్రసాద్ గారికి 6.10.2008 అందజేశాను.2009 ఏప్రిల్ 25 తేదీన 862 పేజీలతో నిఘంటువును పునర్ముద్రించి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబికెప్రసాద్ గారు విడుదల చేశారు.
  • ఉర్దూ అకాడమీ ముప్పైఆరు వేల పదాలతో శ్రీ పటేల్ అనంతయ్య కమిటీ చేత తెలుగు-ఉర్దూ నిఘంటువు డి.టి.పి. చేయించింది కానీ నిధులలేమి కారణంతో ప్రచురించలేదు.






2 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ చాలా ఉపయొగకరంగా ఉంది. ఎంత విషయ సేకరణ? మీకు,మీ పరిశ్రమకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. పాండురంగ శర్మ గారికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి