డాక్టర్
నాగులపల్లి శ్రీకాంత్ ఐ.ఏ.ఎస్.
రాష్ట్ర
ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ)
శ్రీ నూర్ బాషా
రహంతుల్లా తెలుగు భాషాభిమాని . తెలుగులోనే ప్రభుత్వ పాలన జరగాలని కోరుతూ వివిధ సందర్భాలలో సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. గతంలో నాకూ ఆయన రాసిన “తెలుగు దేవభాషే” పుస్తకాన్ని
ఇచ్చారు. పాలనా రంగంలో
పూర్తి స్థాయిలో తెలుగు వాడకాన్ని అమలు చేసేందుకు కొన్ని కోర్కెలు సూచనలతో అభ్యర్ధన పత్రమూ సమర్పించారు
.ఇప్పుడు “తెలుగులో పాలన “ పేరుతో పుస్తకాన్ని తెస్తున్నారు .
ప్రతి వ్యక్తికీ
తన మాతృభాషలోనే పాలన జరగాలనే కోరిక ఉండటం సహజం. ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య
అనుసంధానంగా మాతృభాష ఉన్నప్పుడే పరిపాలన సులభంగా ఉంటుందనే కారణంతోనే ప్రభుత్వం “తెలుగు భాషాభివృద్ధి
ప్రాధికార సంస్థ”ను ఏర్పాటు చేయబోతోంది. తెలుగు మాధ్యమంలోనే చదువుకున్న
విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి
. మానవ జీవన గమనాన్ని మలుపుతిప్పిన శాస్త్ర సాంకేతిక రంగాలలోని ప్రపంచ ప్రఖ్యాత
వైజ్నానిక గ్రంధాలన్నీ నిర్ణీత సమయాల్లో
సులభమైన తెలుగు వాడుక భాషలోకి అనువాదం చెయ్యాలి .
నేను భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా
ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని దుకాణాలు ,సముదాయాల బోర్డులు
ప్రభుత్వ పధకాల ప్రారంబోత్సవ నామఫలకాలు,శంకుస్థాపన
శిలాఫలకాలు
తెలుగులోనే
రాయించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.(ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 11 (యువజన
& సాంస్కృతిక
అధికార భాష శాఖ) తేదీ. 14.9.2016). 15 రాష్ట్ర చట్టాలను తెలుగులోకి అనువదించి గజెట్ లో ప్రచురించాలని న్యాయ శాఖ
ఉత్తర్వులు కూడా ఇచ్చింది. క్రమేణా మనభాషలోకి అన్ని చట్టాలనూ మార్చుకుందాం.ప్రజల
భాషలో పాలన జరగాలని నేను కోరుకుంటున్నాను.మాతృభాషలో
పాలన అవసరమే.అది సమంజసమైన కోరిక. అయితే దానికి కలుగుతున్న అవరోధాలను ఎప్పటికప్పుడు
అధిగమిస్తూ ముందుకు పోదాం.మన కార్యాలయాలలో తెలుగు దస్త్రాల శాతం పెరగాలి.తెలుగులో పాలన సిద్ధించటానికి నావంతు
సహకారం నేను తప్పనిసరిగా అందిస్తాను.ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి అందరి సహకారం
లభించాలని ఆశిస్తున్నాను.
https://www.facebook.com/nrahamthulla/posts/1922964624402185
రిప్లయితొలగించండిhttps://www.facebook.com/nrahamthulla/posts/2050634124968567?__xts__[0]=68.ARC-1yNbb3l0SX15PdpAOZnhAK-RvjHnOuoBJxGAA5uRCeCZ7z3hzga8eQudFcqY6qIT-TTFUZfQBydI4QOijZQsF2hU4qg6-mGa8H5cfpYo5cjua33vJrBTUtD72MAuSklHNtk&__tn__=-R
రిప్లయితొలగించండి