3, ఏప్రిల్ 2018, మంగళవారం

తెలుగులో పాలన చేయలేమా? (ఆంధ్రప్రభ 3.4.2018)

తెలుగులో పాలన చేయలేమా? (ఆంధ్రప్రభ 3.4.2018) 
https://www.facebook.com/williams32143/posts/1846847422013906
జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాల్సిందేనంటూ పట్టుపట్టిన ఎన్టీఆర్‌, దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తానన్నాడు.ఫైలు తెలుగులో తెస్తేనే సంతకం పెట్టాడు.యదారాజా తధా ప్రజా అన్నట్లు అధికారులు తెలుగులో ఫైళ్ళను పరుగులెత్తించారు.తెలుగులోనే తీర్పులు వచ్చేలా గ్రామ న్యాయాలయాలను నెలకొల్పుతానన్నారు.ప్రజలు ఎంతగానో సంతోషించారు. ఆయన 1983 నుండి 1989 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మండలాల స్థాపన తరువాత కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయమని నేను కోరగా ఆయన ప్రభుత్వంలో నాకు తెలుగులో సమాధానం ఎంత శ్రద్ధగా ఇచ్చారో చూడండి. 21.9.1988 న సచివాలయం నుండి నాకు జవాబు చేతిరాతతో ఇచ్చారు.ఇంటర్నెట్టూ, కంప్యూటర్లు అప్పటికి లేవు. తెలుగు టైపు మిషన్లు కూడా పూర్తిగా వాడుకలోకి రాలేదు. అయినా సరే సచివాలయస్థాయిలో కార్బన్ పేపర్ పెట్టి చేతితోనే తెలుగులో రాసి నాకు జవాబు ఎలా పంపారో చూడండి. అది చాలు నాకు. ఒక సామాన్య పౌరుడినైన నాకు కూడా సచివాలయం నుండి సమాచారం తెలుగులోనే పంపారని ఎంతగా ఆనందించానో! 1988 లో ముప్పై ఏళ్ళక్రితమే ఇంత చక్కగా తెలుగులో సచివాలయ దస్త్రాలు నడపగా ఎంతో సాంకేతిక ప్రగతి సాధించిన ఈనాడు తెలుగులో ప్రభుత్వ కార్యకలాపాలు నడపలేమా? ఎన్టీ రామారావు లాంటి తెలుగు భాషాభిమానులైన పాలకులు రావాలి. పాలకులు తెలుగు భాషలో మాత్రమే దస్త్రాలు నడపమని ఎన్టీ రామారావు లాగా అధికారులను ఆదేశించాలి.తెలుగు అమలుకోసం వెంటపడాలి. 2018 ని తెలుగు భాషా సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణాలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.రెండు రాష్ట్రాలలో కొన్ని మంచి నిర్ణయాలు చేస్తూ ఆంధ్ర,తెలంగాణా ముఖ్యమంత్రులు ఇద్దరూ తెలుగులో పాలనకు మద్ధతు ప్రకటించారు. కాబట్టి మళ్ళీ ఎన్టీ రామారావు గారి తెలుగు పాలనాపద్ధతులను ప్రభుత్వాధికారులు,నాయకులు పునరుద్ధరించాలి. మన భాషకు మేలు చేసే వనరులన్నీ సమకూర్చాలి . ఆధునిక అవసరాలకు పనికొచ్చేలా తెలుగు భాషను సంస్కరించాలి.ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ స్పీకర్ గా మన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు గారు తెలుగును ఉద్యోగాలకు అర్హతగా పెట్టాలని చెబుతూ ఉన్నారు.జాతీయభాష హోదా కూడా సాధిస్తే తెలుగులో పాలన కూడా సులభం అవుతుంది. తెలుగు భాషా పరిరక్షణకు అనేక వనరులు,శక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిసివస్తాయి.
అసలు తెలుగులో ఓనమాలు మొదలు పెట్టకుండానే అదీలేదు ఇదిలేదు అని సాకులు చెప్పే ఉద్యోగులను అలా వదలకూడదు.తెలుగులో రాయటానికి ప్రయత్నం చెయ్యమని ఒత్తిడి చెయ్యాలి.ఈ ఒత్తిడి సచివాలయంలోనే మొదలవ్వాలి.ఈ విషయంపై తెలుగు భాషాభిమానులైన ,అనుభవజ్నులైన ఐ.ఏ.ఎస్. అధికారులను సూచనలు సలహాలు అడిగి మరింత పట్టుదలతో కార్యాచరణలోకి దిగాలి. తెలుగులో పాలన సజావుగా సాగటానికి ఇంకా ఏమేమి చెయ్యాలో మీ సూచనలు సలహాలు కామెంట్ చెయ్యండి.ఎందుకంటే నా రాబోయే పుస్తకం 'తెలుగులో పాలన" ద్వారా మీ సూచనలు సలహాలనే ప్రభుత్వానికి నివేదిస్తాను :-
వచ్చిన సలహాలు,సూచనలు : .

HanumanthaRao Karlapalem కర్లపాలెం హనుమతరావు,ప్రముఖ రచయిత  :- ఎన్టీ రామారావుగారు తమను తాము శ్రీకృష్ణ దేవరాయలుగా భావించుకునేవారని వినేవాళ్ళం. ఆయనపాలనా కాలంలో తెలుగుకిదక్కిన మన్ననను ఇలాంటి ఎన్నో కథలద్వారావింటున్నప్పుడు మనం నిజంగా తెలుగురాష్ట్రం లోనే ఉన్నామా అని చెయ్యిగిల్లుకొని ఖాయం చేసుకోవాలనిపిస్త్తుంది.  ప్రజాస్వామ్యంలోప్రజలఓట్లకుమాత్రమేనా ప్రజల మాటలకు విలువఇవ్వరా? ఇప్పుడూ పది, పన్నెండు తరగతుల వరకు తెలుగు అంటున్నారు కానీ..తెలుగు చెప్పని పాఠశాలలమీద ఏలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో గట్టిగాచెప్పరు! ఎందుకంటే తెలుగు భాషకు పాలనా సామర్థ్యం కావాలని కన్నీళ్లు కార్చేమెకాలే మానస పుత్రులు మన ప్రభుత్వ అధికార పదవుల్లో నే ఉన్నారు. మా శ్రీమతిఎం.ఏ .. తెలుగులో. బి ఇడి చేసి హైదరాబాద్ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోతెలుగు ఉపాధ్యాయినిగా చేశారు. తాను సీనియర్ మోస్ట్ గా సర్వీసులోఉన్నప్పటికీ కేవలం ఆంగ్లభాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసే పాటిసామర్థ్యంలేదన్న మిష కల్పించి తనకన్నా జూనియర్ కిప్రధానోపాధ్యాయినిగాపదోన్నతి కల్పించారు. ఆ విధమైన ప్రభుత్వ ఆదేశాలు లేకపోయినా విద్యాధికారులుసైతం మా శ్రీమతి గారి అర్జీలను బుట్జ్త దాఖలు చేసారు.రామారావుగారి వంటి పాలకులు , మీ వంటి నిక్కచ్చి అధికారులు లేనిలోపంకొట్టొచ్చినట్లుకనిపించింది మాకు! ఆతర్జాల యుగం వేగం పుంజుకొంటున్న ఈసంధి దశలో అయినా తగిన వనరులు. పరికరాలు, పారిభాషికా పదాలు గట్రాలేవన్నకుంటి సాకులు చూపకుండా ప్రజల వాడుక భాష తెలుగుకు పాలనాస్థాయి నిక్కచ్చిగాకల్పించాలి. అన్నగారి పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకొనే ప్రభువులు అన్నగారిఆలోచనా విధాలను కూడా ఆచరణలోకి తేవాలి. మాటలూ- మార్పులూ- డా॥ బూదరాజు రాధాకృష్ణ
పుస్తక పరిచయం -1

తెలుగులోరెండు మూడు నిఘంటువులు ఉన్నాయి. శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్రం, ఆంధ్రవాచస్పత్యం.. వగైరా. ఇంకా ఏమైనా ఉంటే ఉండవచ్చు, వేటి దారిది వాటిదిగాసాగింది పదనిఘంటువుల నిర్మాణం. తక్కిన ద్రవిడ భాషలకు మహానిఘంటువులునిర్మితమయ్యాయి.. కానీ తెలుగువాడికి ఆ అదృష్టం లేదు. వేదం వెంకటరాయశాస్త్రి, గిడుగు రామ్మూర్తి పంతులుగారు వంటి ఉద్దండులు నిఘంటువలనిర్మాణానికి కొంత ప్రయత్నం చేసారు. వాటిని వేటినీ కాదని ఆంధ్రసాహిత్యపరిషత్తువారు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణం తలపెట్టారు! ఆ నిఘంటునిర్మాణ పోషణకు పూనుకున్న పిఠాపురం రాజావారు చివరకు బికారి దశకుచేరుకున్నారంటారు. తెలుగు అకాడమీ ప్రారంభమయిన తరువాత శబ్దసాగరం పేరుతో ఒకనిఘంటువు నిర్మించాలన్న తలంపు పెట్టుకున్నది. కానీ అఖండ భాషాభిమానులయినపాలకులు ఆ క్రతువు పూర్తి కాకుండా ఉండేందుకు శక్తి వంచన లేకుండాపాటుపడ్డారని బూదరాజు రాధాకృష్ణగారు ఒక సందర్భంలో వ్యంగ్యాస్త్రాలుసంధించారు. ఒక వ్యక్తి తన జీవితకాలమంతా శ్రమించినా ఒక మహానిఘంటువు నిర్మాణంసాధ్య పడదు. అలా పడదని ప్రపంచ దేశాల నానా భాషాచరిత్రలు నిరూపిస్తున్నాయికూడా. అయినా కాలం, ఖర్మం కలసి వచ్చి భవిష్యత్తులో అలాంటి మహానిఘంటువునిర్మాణంతలంపు మొదలయితే.. ఉపకరణంగా ఉంటుందన్న మంచి ఉద్దేశంతో బూదరాజురాధాకృష్ణగారు ఈనాడు ఆదివారం అనుబంధంలోసుమారు నాలుగేళ్ళపాటు ( 1997, జూన్ 8 - 2001, ఫిబ్రవరి 2) 'మాటలూ-మార్పులూ' శీర్షిక నిర్వహించారు.మహానిఘంటువు నిర్మాణం కానీ చేపట్టదలిస్తే గమనించవలసిన అంశాలు బోలెడున్నాయి.వాటినన్నింటినీ ఏకరువు పెట్టడం ఆరంభంలోనే బెదరగొట్టినట్లవుతుందనిరాధాకృష్ణగారి అభిప్రాయం. అయినా కాలక్రమంలో శబ్దాల్లో, అర్థాల్లో వచ్చేస్వాభావికమైన మార్పులను కొంతలో కొంతైనా సూచిస్తే బుద్ధిమంతులకు, శక్తిమంతులకు మహానిఘంటువు లేదన్న కొరత స్వల్పంగా అయినా తీరుతుందన్నఉద్దేశంతో బూదరాజుగారు నిర్వహించినమంచి ధారావాహిక శీర్షిక ఇది. దీనిద్వారా తెలుగువారిలో ఎవరికయినా మళ్ళీ భాషాభిమానం రేకెత్తి.. మహానిఘంటువునిర్మాణ సంకల్పం మొలకెత్తితే తాను పడ్డ శ్రమ కొంత సార్థకమవుతుందనిరాధాకృష్ణగారి భావన.
600 మాటలకు సంబంధించిన కొంత సమాచారం ఈశీర్షిక ద్వారా అందిచారు. పదానికి ఉన్న అర్థాల్లో కాలక్రమంలో వచ్చినమార్పుల వివరణ ఉంది. సందర్భాన్ని బట్టి ఆధునిక శాస్త్ర రచన అవసరాలనూదృష్టిలో ఉంచుకొని పాతమాటలకే కొత్తపదబంధాలు కల్పించి వాటినే సాంకేతికశబ్దాలుగా ప్రయోగిస్తున్న వైనాన్నీ పరిశీలించారు ఇందులో. ఇలాంటి ప్రయత్నం ఈశీర్షిక ముందు.. తరువాత కూడా మళ్లీ ఎవరు తలపెట్టక పోవడం విచారించదగ్గవిషయం.
అంతర్జాల యుగంలో తెలుగు పద సంపదకు మరింత పుష్టికలిగించాలన్న దృష్టి కల భాషాభిమానులు, భాషోద్ధరణకు కృషి చేసే సంస్థలు, సమాచార పత్రికలు ఈ తరహా కృషిని మరింత ముందుకు కొనసాగిస్తారన్న ఆశతో ఇక్కడ ఈచిరు పరిచయాన్ని ఇవ్వడం జరిగింది!
ఈనాడు విశ్రాంత ఉద్యోగులు శ్రిధర మూర్తిగారుఅందించిన అదనపు అత్యంత విలువైన సమాచారాన్ని కూడా ఇక్కడ జత చేస్తున్నాను :
"జయంతిరామయ్య పంతులు గారిచే రచింపబడిన "శ్రి సూర్యరాయంధ్ర నిఘంటువు " కాకినాడఅంధ్రసాహిత్య పరిషత్ వారు 1936 లొ ప్రచురించారు.దానిని అంధ్ర ప్రదేశ్సాహిత్య అకాడెమి వారు 1979 లొ పునర్ముద్రించారు, 6 సంపుటాలు గావెలువడింది. దీని గొప్ప దనం ఏమిటంటే, అలుక అని ఒక మాటకు ఎన్ని అర్ధాలున్నయోతెలుపుతూ, ఆ మాట వాడబడిన పద్యం గాని, వాక్యం గాని ఉదాహరణలు ఇచ్చారు.తరువాతి కాలం లొ వచ్చిన పుర్ముద్రణలో ఈ పద్యాలు ఉదాహరణలు లెకుండా ఒకెసంపుటం గా ముద్రించారు.ఇక తెలుగు అకాడెమీ వారు ఇంగ్లీష్ తెలుగునిఘంటువును A4 size లొ 3 కాలంస్ తో 1300 పేజీ ల నిఘంటువు ప్రచురించారు.అప్పట్లోడిప్యుటీడైరెక్టర్స్ గా పనిచేసిన, ముకురాల రామారెడ్డి, పొరంకిదక్షిణామూర్తి ఈ నిఘంటువు ను తయారు చేసారు. ఇప్పుడు ఇది దొరకటం లేదు. నాదగ్గర మాత్రం ఒక కొపీ వుంది.ఇక, బూదరాజు గారు ఈనాడు జర్నలిస్ట్ ల కొసంవ్యవహార పదకొశం తయారు చేసారు.ఈనాడు దీనిని ముద్రించింధి.సచివాలయం లొన్యాయ శాఖ లో అనువాద విభాగం లో మేము తయారు చేసిన నిఘంటువు నుముద్రించటానికి మాకు నిధులు లేనందున తెలుగు అకాడెమి వారికి ఇచ్చాము.వారుదానిని న్యాయ పద కోశము పేరుతొ ముద్రింఛారు.నాకు తెలిసిన సమచారం ఇది.
Nalini Mohan Kumar Kalva  కాల్వ నళినీ మోహనకుమార్ ,ఉపకార్య దర్శి,ఆర్ధికశాఖ ,సచివాలయం ,అమరావతి :-  నిజంమాట్లాడితే ఇప్పుడు చాలా సులువు తెలుగు ను అధికార భాష గా అమలు చేయడానికి .ఎందుకంటే అన్ని ప్రభుత్వ కార్య కలాపాలన్నీ రేపు ఏప్రిల్ 1 వతేదీ నుండి "పేపర్ లెస్ - ఈ ఫైలింగ్ "విధానం గ్రామస్థాయి నుండి సచివాలయ స్థాయి వరకుఅన్నీ కంప్యూటర్ల పైనే జరగాలని ప్రభుత్వసాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు జారీచేసేఉన్నారు. ప్రస్తుతం మనం ఎట్లాగైతే "గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ - తెలుగు "పరికరం ను ఉపయోగించి ఈ విధంగా అవలీలగా మనలాటి వాళ్ళం అసలు తెలుగు గాని ఇంగ్లీష్ గాని టైపు చేయడమే నేర్చుకోనట్టివాళ్ళం సైతం చేయగలుగుతున్నామంటే , అది కంప్యూటర్ లో వుండే ఇంగ్లీష్ కీ బోర్డ్ తోనే ఆ ఇంగ్లీష్ అక్షరాలతోనే నొక్కుతూ తెలుగును చూడగలుగుతున్నాము .కాబట్టి ప్రతి ఉద్యోగి కూడా ఇదేతరహాలో వాళ్ళ ఆఫీస్ వ్యవహారాలు వాళ్ళ కంప్యూటర్ల ద్వారా తేలికగాచేసుకోవచ్చు. ఇక్కడ కావలసింది ఉద్యోగులకు తెలుగులో వ్రాయాలనే శ్రద్ధ, ఇష్టం, మాత్రమే! . ఎన్నో సంవత్సరాల క్రితమే తెలుగును అమలుచేయమని ఎన్నోఆదేశాలు జారీచేసినా , మన ఉద్యోగులు వాటిని సీరియస్ గా తీసుకోవడం లేదు .ఏంచేస్తాం!. వీళ్ళకు భాషాస్వాతంత్రం వచ్చిన స్పృహ లేదు. ప్రభుత్వఉద్యోగం అంటే ఇంకా “ఇంగ్లీష్ భాష”లోనే చేయాలనే బానిస మనస్తత్వం నుండి విముక్తులు కాలేని “వెదవాయిలు” గానే మిగిలిపోయారు.! మనం ఎవరికోసం ఏ ప్రజలకోసం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం అనే కనీస జ్ఞానం లేకుండా సంవత్సరాలు గడిపేస్తూ , రిటైర్ అయిపోతున్నారే గాని, మన జీతభత్యాలు “తెలుగు ప్రజలు” కట్టే పన్నులు, ధనంతో అనే భావన ఎవరికి వారికి కలిగితేనే గాని అధికార భాష గా ఈరాష్ట్రంలో “తెలుగు అమలు” కాదు!. అందుకే సచివాలయంలో "బ్రౌన్" నిలువెత్తు విగ్రహాన్ని పెడితే, రోజు వస్తూ, పోతూ ,కనీసం, ఆ” ఇంగ్లీష్ వ్యక్తి “ తెలుగుభాష కోసం ఎంత కృషిచేశాడో! అని , కనీసం “మనం ఉద్యోగులం, తెలుగు వాళ్ళుగా పుట్టి “ప్రజల భాష అయిన తెలుగు” ను ఎందుకు “పరిపాలన భాష” గా అమలు చేయలేము!?. అని ఎవరికివారు సిగ్గుపడి తెలుగు ను ఆఫీస్ వ్యవహారాల్లో అమలు చేయగలమనే పట్టుదల, సంకల్పం కలుగుతుందని నేనుభవిస్తున్నాను!. ప్రభుత్వం లోని మంత్రులంతా వాళ్ళకు పంపబడే ఫైళ్ళు అన్నీ ఖచ్చితంగా “తెలుగులోనే” ఉండాలనే నిబంధన పాటించాలి!. అదే విధంగానే “సెక్రటేరియట్ మాన్యువల్”, బిజినెస్ రూల్స్” లో గూడా ఆ నిబంధనను చేర్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారు గుర్తించాలి,! ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలి!.
Madhusudhanarao Kotapati  కోటపాటి మధుసూదనరావు : రాజుతలచుకొంటే దెబ్బలకు కొదువా అనె సామెత ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్దివుంటే ఇప్పుడు కూడా అమలవుతుంది. ముఖ్యంగా IAS అధికారులు కున్న ఆంగ్లంపైమోజు తెలుగును పరిపాలనలో అమలు కావాడానికి ఒక ఆటంకంగా భావించవచ్చు.తెలుగు లోరాయడం వలన పై అధికారులు ఏమనుకొంటారో ,అంగీకరిస్తారోలేదోభావన క్రింది వారిలో ఉంది.తెలుగు లోనే రాయాలని ఏ అధికారి అనడంలేదు. ముఖ్యంగా ఇంగ్లీషు లో రాయడం గొప్పగా భావిస్తూ అలా రాయని వారినినిరాక్చరాశ్యులు లాగా చూస్తూ ఉన్నారు మనకు పై ఆఫీసుల నుండి తెలుగు లో వస్తేతెలుగులోనే రాయవచ్చు కానీ అలా జరగడం లేదు అంతే కాదు మీ లాగా ప్రతిజిల్లాలో ఒకరిద్దరు తెలుగు అమలుకు నిస్వార్థంగా కృషి చేస్తే కొంత ప్రయోజనంఉంటుంది.
G Sathi Raju G Sathi Rajuఎనభయోదశకంలో తెలుగు బాష వైభవం ఇనుమడిస్తుంది పాలనలో విరివిగా వాడబడి నిజమయినఅధికారభాష అవుతుందని ఆశించాం . అది జరగాల్సినంత జరగలేదు . ప్రపంచం చుట్టిచూస్తూ ఈ మధ్య కొరియా వెళ్ళిన చంద్రబాబు అక్కడ మాతృబాషవల్ల ఎదుగుదలనుగ్రహించాల్సింది. తెలుగు లో పాలనా, విద్య అన్నీ జరిగితేనే జాతి మొత్తంఅభివృద్ధి సాధిస్తుంది . వారి స్థాయికీనివేదన చేరి చర్యలు తీసుకునేలాకృషిచేయాలి.నేనుచిన్నపటినుండి మాతృభాష తల్లిలాంటిది గౌరవించింద పూజించు లాంటి పాఠాలుచెప్పే టీచర్లు ఈ రోజులలో ఎదగాలంటే ఇది అనవసరమని చప్పరించడమూ చూస్తూ వచ్చా.చాలా మందిలో ఆ తప్పుడు భావాలు ఊరిపోయాయి. (ఆంగ్ల విద్య ద్వారా ) ప్రగతిసాధించిన కొద్ది జనాభాకే ఇప్పటి శాస్త్రసాంకేతిక వైద్య రంగాలు అధికంగా పరిమితమవడం వల్ల మనకు ఆవిష్కరణల సంఖ్యపురోగతి తక్కువుగా ఉంది. యూరోపు , చైనా, జపాన్ , కొరియాల మాతృభాషలో భోధనలుపాలనలవల్ల ప్రజలలో పెక్కుమందికి పాలుపంచుకుని పురోగతికి తోడ్పడే అవకాశంలభించడం వల్ల ఆ సమాజాలు దూసుకెళ్ళాయి అనేది మన పాలకులు, విద్యావేత్తలు , అధికారులు గ్రహించాలి. అలాగే విద్యను రాష్ట్రాల జాబితా లో చేర్చాలి.ప్రపంచానికి సేవలందించే వారికి అనుసంధాన భాషలుగ ఆంగ్లాది భాషలు నేర్పవచ్చు.
Nagendra Vara Prasad Vajjhala Nagendra Vara Prasad Vajjhalaతెలుగులోమాట్లాడితేనే తప్పు అనుకునే పరిస్థితి నుంచి తెలుగులో మాట్లాడుతూ తెలుగులోరాయకపోతే తప్పు అనే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాం
Wahed Abd Wahed Abdగొప్ప సమాచారం అందించారు. నిజానికి ఇప్పుడు తెలుగును అమలు చేయడం చాలా సులభం. కావలసింది చిత్తశుద్ధి. సంకల్పం.
Venkata Butchi Raju Bojja Venkata Butchi Raju Bojjaతెలుగు రాష్ట్రాల్లో తెలుగును పాలనా భాషగా చేయాల్సిందే... తెలుగులోనే ఫైళ్లు నడవాలి. 
Fazlur RahmanFazlur Rahman తెలుగు భాషాభిమానం ఎక్కువ మక్కువ ఉన్న గుప్పెడు మంది కలిస్తే ఇంటింటా తెలుగు పంటలు ఊరూ వాడా తెలుగు వెలుగులే!మీకృషిని అల్లాహ్ స్వీకరించుగాక! ఇన్ షా అల్లాహ్
Saye Kumar Anisetty Saye Kumar Anisettyచాలాబాగుంది. ఇది ప్రభుత్వ అనువాద శాఖ వారు చేస్తే ఇంట మంచిగా ఉండేదికాదు.ఇంగ్లీషు పదబంధాల్ని, వాక్య నిర్మాణ పద్ధతినీ గురించి ఆలోచిస్తూ తెలుగులోరాయడం ఎక్కువమంది చేస్తున్నారు. తెలుగులో స్వేచ్ఛగా రాస్తే ఇంకాబాగుంటుంది.
Archana Rampalli Archana Rampalliతెలుగువారికి తమ సంస్కృతి ,భాష పైన గౌరవం ,అభిమానం తక్కువ.ప్రజల వైపు నుండివత్తిడి ఉంటె ప్రభుత్వమూ తగ్గ చర్యలు తీసుకుంటుంది.కిందటి సంవత్సరం ఆర్ టి ఐదరఖాస్తును తెలుగులో ఇచ్చాను.వారు మాత్రం ఇంగ్లీష్ లో జవాబిచ్చారు.సంబంధిత అధికారి తెలుగువాడై ఉండి కూడా దరఖాస్తులోని వాక్యాలను చదవటానికి ఇబ్బంది పడ్డారు.ఇంత తెలుగు రాస్తే ఎలాగమ్మాఅన్నారు.ప్రజలు కూడా ప్రభుత్వం తో ఉత్తరప్రత్యుత్తరాలను ,ఫిర్యాదులనుతెలుగులోనే చెయ్యాలి, ప్రభుత్వమూ తెలుగు లోనే జవాబివ్వాలని ఒత్తిడిచెయ్యాలి . వెంకయ్యగారన్నట్లు రెండురాష్ట్రాల్లో ఉద్యోగాలకు తెలుగు వచ్చిఉండటం ఒక అర్హత కావాలి, కోర్టుల్లో కూడా వాదోపవాదాలు ,తీర్పులు తెలుగులోనేఅమలయ్యేలా చూడాలి.
Nasreen Khan Nasreen Khan1988లోనూజిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి చర్చ జరిగిందని తెలుసు కానీ ఈ లేఖద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. చక్కగా తెలుగులో రాయడం వలన ఇంగ్లీష్ రానివారు తేలికగా. అర్థం చేసుకునే వీలుంది. అప్పుడు ఇంత బాధ్యతగా సామాన్యులకుజవాబులు రాసి పంపే వారంటే అప్పటి పాలకులు ఎంత జవాబుదారీగా ఉండేవారో అర్థమవుతున్నది.
తెలుగుభాషను క్షీణ దశ నుంచి బయటకు తీసురావాలంటే ప్రభుత్వం పూనుకుంటేనేసామాన్యులు అనుసరిస్తారు. ఇప్పటికే అందమైన భాష ఉర్దూను ఆ స్థితికిచేర్చాము. ఇప్పుడు తెలుగును కూడా అలా చేసుకుంటే ఆత్మాభిమానం లేని వాళ్ళమేఅవుతాం. ప్రభుత్వం తెలుగును స్కూల్స్ లో ఒక సబ్జెక్టుగా పెట్టిప్రోత్సహిస్తామని చెబుతున్నది కానీ ఆఫీసులలో మటుకు ఇంగ్లీష్ ఫైల్స్చక్కర్లు కొడుతున్నాయి.ఇక తెలుగు మాధ్యమంలో చదివిన వారికిఏ పోటీ పరీక్షలలోనైనా ఇంగ్లీష్ మీడియం వారికన్నా తక్కువమార్కులొస్తున్నాయి. ఏ ధైర్యంతో తల్లి తండ్రులు తెలుగు మాధ్యమంలోచదివించగలరు?అందుకే ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ తెలుగును ఒక భాషగా ప్రోత్సహించడంలో తప్పు లేదు.ఇక స్కూల్స్ లో పిల్లలందరూ తెలుగులో మాట్లాడేలా ప్రోత్సహించాలి. తెలుగు మీడియం లో చదివిన వారికి ఉద్యోగాలు కల్పించాలి.అప్పుడే తెలుగు భాష మృత భాషగా మారదు.
Lakshmi Vasanta Lakshmi Vasantaతెలుగుమన మాతృ భాష అని కూడా మరిచిపోతామేమో కొంత కాలానికి.ప్రభుత్వం లో అధికారభాష ఇంగ్లీష్.ఫైల్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే నడుస్తాయి.న్యాయ స్థానాలు లో మరీదారుణం..కక్షిదారులు కి తెలుగు తప్ప ఏ భాషా రాదు.అయినా సరే వాదాలు అన్నీఇంగ్లీష్ లో రాస్తారు.ఎందుకో అలా..అసలుతెలుగు అధికార భాష అని ప్రకటించారా లేదా.. ప్రకటించి ఉంటే ఇప్పటివరకుఎంతవరకు ప్రయత్నిచారు..అంతా అయోమయం.ప్రజలు కూడా ఒక పక్క మా పిల్లలకి ఉద్యోగభాష కావాలి అంటూ ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు చూపుతున్నారు..మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష అధికార భాష అని ప్రకటించి ఇప్పటికైనా అధికారయుతప్రకటనలు తెలుగు లో రాయాలి.
Siva Racharla Siva Racharlaమీప్రతిపాదన ఫలించి కొత్త జిల్లాలు ఏర్పడి ఉంటే బాగుండేది సార్.P.V. నంద్యాలనుంచి పొటి చేసినప్పుడు నంద్యాలను జిల్లా చేస్తానని ప్రకటించారు.పాలనా వ్యవహారాలు తెలుగులో జరగటం మంచిది.
Suresh Kumar ప్రతి రాష్ట్రం లో మాతృభాష లో పాలన సాగుతోంది... మనకు మాత్రం తెగులు.
Pudota Showreelu Pudota Showreeluబ్యాంక్ లావాదేవీలు గూడా తెలుగులోనే జరగాలి.మాతృభాషనుచక్కగా నేర్చుకున్నవారికి పరాయి భాషలు నేర్చుకోవటం సులువు...మన అమ్మభాషనుదయచేసి చదవండి,,నేర్చుకోండి ,అని బతిమిలాడాల్సిన దౌర్భాగ్యం పట్టిందిమనకు..ప్రభుత్వాలకు చిత్తశుద్ది వుంటే కానిదిలేదు.....తెలుగు తప్పకుండా ఒకసబ్జెక్టు గా చదివిన వారికే ప్రభుత్వ వుద్యోగం అంటే తప్పకుండాచదువుతారు.అమ్మఒడి,బడి,ఏలుబడి''......ఈ మూడింటిలోతెలుగును సంపూర్ణంగా అమలుచేసినపుడే ''మాతృభాష మనగలుగుతుంది.....లేదంటే మృతభాషగా మారిపోతుంది.
Ponnada Lakshmi Ponnada Lakshmiమనతెలుగుభాష ఉద్దరింపబడాలంటే పాలకులు శ్రధ్ధ అత్యవసరం. పాఠశాలలో తెలుగుకిప్రాముఖ్యత ఇవాలి. తెలుగులో పాలన వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు, కేవలం పరభాషావ్యామోహం మనల్ని తినేస్తోంది.పాలకులు పూనుకోకపోతే మన భాషకి గౌరవం విలువఅన్నీ తగ్గిపోతాయి.
భాగవత గణనాధ్యాయి భాగవత గణనాధ్యాయిఅవునండితెలుగు పూర్తి వ్యవహారిక భాషగా 1990వ దశకంలోనే వచ్చేయాల్సింది. ఇప్పటికేబాగా ఆలస్యం అయింది ఇప్పటికేనా శీఘ్రమే చేయాలి. దీనికి భాషాపరంగా సాంకేతికతవిషయంలో కాని, భాషా సంపత్తిలో కాని ఎట్టి లోటూ లేదండి.తెలుగునువాడుకలోకి తీసురావడానికి ఎటువంటి సాంకేతిక ఇబ్బంది కాని. భాషలో పటుత్వంవిషయంలో గాని ఎట్టి లోపం లేదండి. దానికి నిలువెత్తు ఉదాహరణలుమీవంటి వారే... దీనివలన సామాన్య జనానికి వ్యవహారాలలో ఏమి జరుగుతోందోతెలియటంలేదు. వారి నిబ్బరాలు దెబ్బతింటున్నాయి. ఇంది మంచిది కాదు. \nఇంకసాంకేతికత అంటే గణని, చరవాణి వంటి పరికరాలలో తెలుగును ఆంగ్లంతో సమానంగాఅన్ని విధాలా వాడుకోవచ్చు. దానికి రుజువు ఇంటర్నెట్టులో తెలుగు వాడికచూడండి... ఇప్పుడు గూగులు మైక్రోసాఫ్టు వారు తెలుగుకి అన్నీఅనుకూలిస్తున్నారు మనం అవి బాగుండకపోయినా వాడుతుంటే అవే మెరుగు పడతాయి.తరువాత, ప్రభుత్వ ప్రయివేటు కార్యక్రమాలకు ఆధునిక పరికరాల వాడుక తప్పనిసరివాటిలో తెలుగు అనుకూలం కనుక, తెలుగును ప్రభుత్వం కాని, న్యాయవిభాగం కాని, ప్రజలు కాని వ్యవహారికి భాషగా వాడటానికి ఏ ఇబ్బంది లేదండి. \nపైగా చాలాకాలం క్రితమే సమగ్ర ఆంధ్రప్రదేశ్ లో సచివాలయంతో సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగిఅంటే తెలుగు చదువుకుని ఉండాలి. లేదంటే ప్రభుత్వం పెట్టే తెలుగు పరీక్షరాయాలి లేకపోతే రిగ్యులైజేషను కాదు అనే వారు.. మరి ఆ రూలు ఏమైందో తెలియదు.ఇట్టి పరిస్థితికి కారణం రాజాదరణ లేకనా? \nఅంతేకాకుండా మన ప్రక్కరాష్ట్రాలు సోదర భాష కన్నడను మన భాషలాగానే చదవడానికి మాట్లాడడానికిఉంటుంది. వారిని చూడండి ఎంత బాగా వృద్ధి చేసుకుంటున్నారో. వారిన చూసైవా మనంమేలుకోవాలి. లేకపోతే జాతి మునుగడే దెబ్బతినవచ్చు.
Raj Kumar Raj KumarDeni bhadhyatha yevariki appaginchalo varike appaginchali sir. Barrelu kaachukunevadu leader ayii Mla ga gelisthe, vadiki Badulu, Gudulaku sambhandinchi minister ga isthunnaru. Vadiki education gurinchi, schools infrastructure gurinchi, entho viluvaina, pavithramaina matha grandala gurinchi, Temples gurinchi yemi telusthundandi. Mundu e vidhanam marithe, Telugu bhasha viluva telusthundi. Desha bhashalakella lessa Telugu bhasha annadi marachipokoodadu, daani viluvanu kapadukovali sir. Mundu mana politics vidhanam marali. Kevalam dabbukoraku deninaina nashanam chesesthunnaru. Tharuvatha education vidhanam marali. Okka NTR education society lone antha goppa vidhya vidhaanaanni amalu chesthe saripodu, alanti service state motthaniki ivvagalagali sir. Ilanti vishayamlo Brahmini Lokesh garu mundukuvachhi state education department tho kalasi panichesi, mana education vidhanamlo, standards lo improvement theesukuravali sir.

Vijaya Kumar Batchu Vijaya Kumar Batchu మంచి ఆలోచన. రామారావు గారికి నా పాదాభివందనం..
తెలుగుని బ్రతికించటానికి ఊపిరిపోస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక పాదాభివందనం

Vimala Chigurupati Vimala Chigurupatiమన బాష మన కుండగా , పొరిగింటి పుల్లకూర మనకెందుకు?
Mangalagiri Jilani Mangalagiri Jilani   Noorbasha Rahamthulla Sab మీరు మొదటి నుండి తెలుగు భాషాబిమాని. Hyd లో మొదటి నుండి ఉర్దూ భాషమాట్లాడే వారు, అన్న ఎన్టీరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగువాడకంపై ప్రత్యేక శ్రద్ధ కారణం గా తెలుగుకు మంచిరోజులు వచ్చాయనిఅనుకున్నాము కాని ఆయన తరువాతవచ్చిన వారుతెలుగుకు అంతగా ప్రాధాన్యత నివ్వని కారణంగా నేటి (దు)స్థితి. తెలుగులోపరిపాలన చక్కగా చేయవచ్చు. అప్పటి కంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిననేటికాలం తెలుగులో పరిపాలనకు అనుకూలం. ప్రభుత్వ కార్యాలయాలు ముందుగాతెలుగులో పరిపాలన కు అవసరమైన దస్త్రాలను తయారుచేయాలి. దాని అమలుకు గట్టిగాకృషి చేయాలి. తెలంగాణలో కెసిఆర్ గారు 2018-19 విద్యా సం నుండి 10వ తరగతివరకు తెలుగు తప్పనిసరి అని చట్టం చేయటం తెలిసిందే. మరి అమలు చేయడం ఎలాజరుగుతుందో వేచిచూడాలి. ఆంధ్ర లో కూడా తెలుగు తప్పనిసరి చేయాలి.
Syamala Betha    Anni works name thone start aithai name thone end aithai law loni kotha marupu kavali Telugu vallu Telugu lo santakalu cheyali , Anni application Loni Telugu loni Telugu lo ne name vrayali vere language chelladu.
Raghavendra Rao Nutakki Raghavendra Rao Nutakki 
గౌరవనీయులుNoorbasha Rahamthullaగారికి నమ్రతతో.మీ వేదన అర్ధం చేసుకోగలను .
రాజకీయాన్ని వంట పట్టించుకోని రామారావు గారి పాలనా సమయం లోతానుగా చేసిన వాగ్దానాలు
చిత్త శుద్ధితో అమలు చేయగాలిగిన ఆయన చేతికందినఅధికారం పై తానుఎంతకాలం ఉండగలనో
అన్న మీమాంస తోఆయన ఎన్నడూలేరు.తన పాలనలో ప్రాధమ్యాలనుతాను నిర్దారించుకొని
ముక్కు సూటిగా పాలన కొనసాగిన్చగలిగినఆయనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయన్నది నిర్వివాదాంశం
అయినా తాననుకున్నది అనుకున్నట్లు ఆచరించగలిగిన ధీశాలి.మాతృ భాష విషయం లో ఆయన చేపట్టిన విధి విధానాలు ఇతర పాలకులూప్రామాణికంగా పాటించ వచ్చు.పట్వారీ వ్యవస్థ రద్దు ,తహసీల్ల స్థానే మండలాలు ,
మద్యపాన నిషేధంఇలా ఎన్నో కార్యక్రమాలకు చిట్టా శుద్ధితో పాటు ఆత్మస్థైర్యం చాలా అవసరం .

కానినేడున్న రాజకీయ పరిస్థితులలో ఆంద్ర రాష్రపాలనా వ్యవహారాలలో ప్రాధమ్యాలలో పెను సవాళ్లు ఎదురు నిలిచాయి ,అందులో మొదటిది ఆర్ధికం ,రెండవది , పోలవరం ,మూడవది రాజధాని నిర్మాణం ,నాలుగవది, వాగ్దానం చేసినసంక్షేమ కార్యక్రమాలు అయిదవది నిధుల కొరత.
ఇలా ఎన్నో పెను సవాళ్లుప్రభుత్వం ఎదుట.మరో ప్రక్కతోన్తికాల్లు అడ్డం పెట్టి అభివృద్ధికి సహకరించనిప్రతిపక్షాలు. కేంద్రం కుంటి సాకులు .ఇలాఅనేక స్థితిగతులు ప్రస్తుత పాలకులకుఅడ్డంకులు గా నిలిచాయన్నది వాస్తవమే
అయినా పాలనా వ్యవహారాలలోవిద్యాలయాలలో ప్రాధమిక మాధ్యమికవిద్యా స్థాయిలలో మాతృభాష వినియోగం
ఆచరణలోఅసాధ్యమేమీ కాదు.ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే.ప్రభుత్వం యిందుపై ప్రాధామ్యం ఇవ్వడం
అసాధ్యమేమీ కాదు.ప్రభుత్వం యిందుపైశ్రద్ధ వహించక పోవడం విచారకరం .
Narasimhraju Kvsl Narasimhraju KvslTelugu Leni samskurti Manam chdalemu Matru bashanu kapadukovali, gowrinchali, acharinchali
Elchuri Muralidhara Rao Elchuri Muralidhara Rao 
మాన్యమిత్రులు శ్రీNoorbasha Rahamthullaగారికి అభివాదనం! అధికార భాషగా తెలుగుకు ప్రయోగవ్యాప్తిని కల్పించేందుకుమీరు చేసిన కృషి, కంప్యూటర్ల ప్రవేశం తర్వాత మీరు కొనసాగించిన కృషి ఎంతోవిలువైనవి. ఇప్పుడు తెలుగు భాష రాజకీయజ్ఞుల చేతిలో ప్రచారసాధనంగా మారింది.ఇప్పుడు ప్రజలే పూనుకొని ఉద్యమాన్ని తీసికొనివస్తే తప్ప - పరిస్థితి ఏమీఆశాజనకంగా లేదు. ఆ ఉద్యమకారుల్లో సైతం కొంతమందికి తమ ఉనికినినిలబెట్టుకోవటం కోసం లేనిపోని సరిక్రొత్త వాడుకను కల్పించాలన్న వ్యామోహమేకాని, ఉన్న వ్యవస్థను కాపాడుకోవాలన్న ప్రయత్నం అగుపింపదు. మొత్తానికి గడ్డుసమస్యే. తెలుగు భాష రాజకీయవాదుల కబంధహస్తాల నుంచి బైటపడి విద్యారంగంద్వారా ఆంధ్ర రాష్ట్రపు ప్రజావ్యవహారంలో నిలదొక్కుకోవటం అంత సులభమనిఅనిపించటం లేదు!
Gopireddy Srinivas Reddy Gopireddy Srinivas Reddyపిల్లిఅంటే మార్జాలం అన్నట్లు కాకుండా వాడుకభాషలో చక్కగా అందరికీ అర్ధమయ్యేట్లుతెలుగులోనే పాలన జరగాలి.ప్రస్తుత సోషల్ మీడియాలో ఎంత చక్కని తెలుగు లోసామాన్యులూ తమ భావాలు వ్యక్తపరుస్తున్నది చూస్తూనే ఉన్నాము.
పద్మా కుమారి  పద్మా కుమారి ఇది యధారాజా తధా ప్రజా  కానేరదు...ప్రజాభీష్టాన్ని గౌరవించే ప్రభుత ఉంటే...యధా ప్రజా తధా రాజానే....
Sireesha Sribhashyam 
తప్పకుండా చేయొచ్చు....మన భాష లో ఉన్న పట్టు పరాయి భాషలో ఉండదు...కృషి చేస్తే తప్పకుండా సాధించ గలుగుతాం..కష్టతరమైన పదాలు కాకుండా..సులువు గా అర్ధమయ్యే రీతిలో ఉండాలి..మాతృభాషపై మమకారం..కొందరికే కాదు ప్రతి ఒక్కరికీ ఉండాలి..వ్యవస్థ మారాలి ముందుగా..వేరే భాషలపై మోజు తగ్గి మన భాషపై ప్రేమ పెంచుకోవాలి..ఆ బాధ్యత పాఠశాల స్థాయి నుండే కాదు...మన ఇంట్లో నుంచి కూడా రావాలి
ఇప్పటిపిల్లలు తెలుగు మాట్లాడితే చిన్నతనంగా భావిస్తున్నారు..దానికి తగ్గట్టుప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టింది..మన గొయ్యి మనమేతవ్వుకుంటున్నాం..ఇప్పటికయినా అందరి హృదయాల్లోంచి ఈ భావన స్వచ్చంగా రావాలి..అప్పుడే..తెలుగు భాషని బ్రతికించుకోగలుగుతాం..తెలుగు భాషలో పాలనా చేయగలుగుతాం...
మీ కృషికిఅభినందనలు

Divi KumarDivi Kumarనూర్బాషా రహంతుల్లాగారి అలుపెరుగని కృషికి ధన్యవాదాలు.హిందీతో సహా తెలుగుమరో 20 భాషలు జాతీయ భాష లే. ఇదే తరహాలో భారత రాష్ట్రపతి శ్రీ కోవింద్ హిందీజాతీయ భాష అనీ, మిగిలినవన్నీ ప్రాంతీయ భాషలనీ  ప్రకటీంచటం తప్పు.  రాజ్యాంగ నిర్ణాయక సభలో (1949లో) తెలుగు, హిందీతో సహా మొత్తం 14 భాషలనుజాతీయ భాషలుగా గుర్తించారు. అధికార భాషగా ఏది ఉండాలి అన్న విషయంలో వివాదంఏర్పడింది. హిందీని అధికార భాషగా గుర్తించటానికి హిందీయేతర ప్రాంతాలనుండివ్యతిరేకత వచ్చింది. దానిపై రాజ్యాంగ నిర్ణాయక సభ వోటింగును కోరింది.ఆశ్చర్యకరంగా అనుకూల వ్యతిరేక ఓట్లు సమానంగా వచ్చాయి. రాజ్యాంగ నిర్ణాయకసభకు అధ్యక్షుడయిన బాబూ రాజేంద్ర ప్రసాద్ హిందీకి అనుకూలంగా ఓటు చేయటంతోహిందీ అధికార భాష అయింది కానీ, హిందీ ఒక్కటే జాతీయ భాష అనీ, మిగిలినభాషలన్నీ ప్రాంతీయ భాషలనే అవగాహన పూర్తిగా తప్పు. ప్రస్తుతం 22 భారతీయభాషలు జాతీయ భాషలుగా గుర్తింపుతో వున్నాయి. ఇటీవల రాజస్థానీ, భోజ్‌పురీనిజాతీయ భాషలుగా గుర్తించాలనే డిమాండు వస్తే, అలా హిందీ ప్రాంత స్థానికభాషలన్నిటినీ జాతీయ భాషలుగా గుర్తిస్తూ పొతే హిందీ భాష భవిష్యత్తుప్రమాదంలో పడుతుందని కొందరు హిందీ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Raghu Babu YarlagaddaRaghubabu YarlagaDDa  
చేయగలం నూటికి నూరుపాళ్ళూ.ప్రజల భాషలో కాకుండా ఇతర భాషలో ప్రభుత్వం నడపటం ప్రజాస్వామ్యానికే అవమానం
Venkata Subbaiah Somepalli Venkata Subbaiah Somepalliరహంతుల్లా గారి కృషి అభినందనీయం. ఎన్.టి. రామారావు గారి తెలుగు భాషాభిమానం అందరికి స్పూర్తిదాయకం.
తెలుగులో పరిపాలన జరగటానికి...ముందుగా బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి.పాలకపక్ష నేత, ప్రభుత్వాధినేత చిత్తశుద్దితో తలచుకుంటే తెలుగులో పరిపాలనతప్పక జరుగుతుంది. ముఖ్యమంత్రిగారు తెలుగులో పరిపాలన  పిలుపునిచ్చిదానికి కట్టుబడి ఉంటే కాదనే వారెవరు? కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయన వెంటేఉంటారు.
తెలుగులో పరిపాలన అనేది దిగువస్దాయినుంచి కాకుండా పై స్దాయినుంచి అమలు కావాలి. సచివాలయం, కలెక్టరుకార్యాలయం నుంచి అమలైతే మిగివిన వాళ్ళందరూ తూ.చ తప్పకుండా పాటిస్తారు.
కొందరు ఉద్యోగులకు తెలుగంటే చిన్నచూపు, దానికి కారణం ఆత్మవంచన తప్ప మరేమి కాదు. అధికారులందరూ తెలుగు భాషను ప్రేమించాలి.
దాదాపు పదేళ్ళ క్రిందట పోలీసుల ఉద్యోగ సంఘం ఓ పిలుపునిచ్చింది, తమఉద్యోగులంతా తెలుగులో కార్యకలాపాలు సాగించాలని కోరింది. అది ఎంతవరకు అమలుజరిగిందో తెలియదు కాని మంచి ఆలోచన. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలుకలసికట్టుగా తెలుగును పాలనలో అమలు చేయాలనుకుంటే అది మంచి ప్రయత్నంఅవుతుంది. ఎట్లాగు ఉత్తర్వులున్నాయి కదా! ఆ దిశగా ప్రయత్నం జరగాలి.
తెలుగులో విద్యార్హత పొందిన వారికి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉండేలాచర్యలు తీసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు ఉంటే కనీసం తెలుగు భాష పాటవ పరీక్షఒక పేపరుగా పెట్టి మెరిట్ లో కలపాలి. అపుడు తెలుగు ఊసే తెలియకుండాడిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుఏషన్లు చదివినవారికంటే తెలుగులో చదివినవారికిప్రాధాన్యత లభించినట్లవుతుంది.
Swechchaa Manavathanath Roy Swechchaa Manavathanath Royతెలుగును అన్ని కార్యాలయాల లో , న్యాయ స్థానాల లో ప్రతి రంగం లో తప్పని సరిగావాడాలి అన్న ఉత్తర్వులు జారీ చెయ్యాలి . అంతకు ముందు తెలుగు అధికార భాషాసంఘాలు కొంత మేరకు సఫలీ కృతం అయ్యాయి తెలుగు భాష ను అధికార కార్యాలయాల లోఉత్తర్వులు జారీ చెయ్యటం, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు లో నే ఉండాలి అని మంచి సూచనలు ఇచ్చాయి .
తెలుగు రాని అధికారులు, తప్పని సరిగా తెలుగు నేర్చు కుని చక్కగా తెలుగు లో మాట్లాడు తున్నారు . ,
తెలుగుభాష కి ఉన్న గొప్ప తనము ఏమిటి అంటే, ద్రవిడ , కిరాతక, ప్రాకృతి , పాలీ , పోర్చుగీస్ , పారశీ , అరబ్బు , ఆంగ్లము, సం సుకృతం అన్ని భాష లను తనలోలీనము చేసుకుని పరిపుష్టి చెందినది .
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉర్దూ భాష ను అమలు చేసింది . అటువంటప్పుడు తెలుగు లో అమలు చెయ్యటం కష్టం కాదు

అన్ని ప్రాంతాల యాసలలోని పదాలు అర్థం కావాలి అంటే ఒక సమగ్ర నిఘంటువు రావాలి .
పారిభాషికపదాలు ను ఇతర భాష ల నుంచి అనువదించే టప్పుడు యాంత్రికంగా కాకుండా అందరికీఅర్థం అయ్యేలా చెయ్యాలి . తమిళులు ఏ భాషా పదాన్ని అయినా వెంటనే తమిళ్ లో కిఅనువదిస్తారు.న్యాయస్థానాల లో గూడాతెలుగు లో నే వాదప్రతివాదాలు ను న్యాయవాదులు, చెయ్యాలి .అప్పుడేవాదీప్రతి వాదులకు, తమ తరఫున న్యాయవాదులు సక్ర మముగావాదిస్తున్నారో లేదో తెలుస్తుంది . చట్టాలు ను అందరికీ తేలిగ్గా అర్థంఅయ్యేలా తెలుగు లో అనువదించే ప్రయత్నాలు చెయ్యాలి . ఇప్పుడు ఉన్న చట్టాలు లో ఏమి ఉన్నదోచాలా మందికిఅర్థం కావటం లేదు .అన్నిసామాజిక మాధ్యమిక వేదికలు లోతెలుగు నేఉపయోగిద్దాము .తెలుగు భాషఔన్నత్యాన్ని గుర్తించి సుబ్రహ్మణ్య భారతి చాలా బాగాప్రశంసించారు .
అచ్చతెలుగు లో రాయబడిన కధలు, కావ్యాలు, నవలలును చదివితేఇంకా మంచిది .మీకృషి అభినందనీయం .వేరేభాషలు లో ని సాహిత్యాన్ని తెలుగు లో కి అనువదించాలి . ఆ అనువాదం సరళం గా ఉండాలి .తెలుగు శాస్త్రీయ సంగీతం నుతమిళులుఎంతోచక్కగాఆదరిస్తున్నారు .కానీ దురదృష్ట వశాత్తు, మన రాష్ట్రాలు లోతగినంత ఆదరణ లభించ లేదు . అలానే, తంజావురు లో ఉన్న తెలుగుపాత తాళ పత్రగ్రంధాలు నుతెలుగు వారికి చేరువ అయ్యేలా కృషి చెయ్యాలి ప్రభుత్వాలు, తెలుగు భాషాభిమానులు. కత్తిపద్మా రావుగారు చెప్పినట్లు టిబెట్లో, చైనాలో, శ్రీలంకలో నిక్షిప్తంచేయ బడిన బౌద్ధ వాగ్మయాన్ని అంతా తెలుగు చేసే ఒక పీఠాన్నినిర్మించుకోవాల్సిన చారిత్రిక బాధ్యత తెలుగు వారి మీద ఉన్నది . దానికిముందు తెలుగు భాషను రక్షించు కోవాలి.
Pratapa Pullaiah Pratapa Pullaiahప్రపంచము, ఇతర రాష్ట్రాలు వారి వారి బాషలకే ప్రాధాన్యం ఇస్తున్నాయు పరిపాలనలో. ఒక్కతెలుగువారు తప్ప.బాష పేరుతొ పార్టీని పెట్టుకొని, పరిపాలనలో ఉండికుడా..నేతి బీరకాయలో నేతిలాగా అయిపొయింది.
Peter Paul Chimata Peter Paul Chimata Dear Sir, Kindly bear with me for my belated reply herein. I had gone through your posting herein. Also, kindly bear with me for I am writing in English since I do not know Telugu typing. NTR was not only a good human being, but also the finest CM of Telugu people hitherto. He toiled relentlessly for eradicating public grievance; for this, he appointed Rustomji Committee and I think the aforesaid Committee's report is gathering dust. He was a spotless CM. You know, people used to say that it was almost a regular practice that he used to conduct discussions in his house with the poets like Samudrala Sr., Malladi Ramakrishna Sastry, Pingali Nagendram etc in the early morning hours. That was his love for Telugu literature. I strongly support your wish that AP Government's administration should be conducted in Telugu medium; but, this dream can be fulfilled only, when there is political will. Let us hope there will be positive beginnings in this regard; I can tell you only this much at this moment please.

Abhilasha Mallipeddi Abhilasha Mallipeddi దేశభాషలందు తెలుగు లెస్స!! అని తెగ గొప్పలు చెప్పుకుంటాం, మన భాష మన సంస్కృతిఅని బోలెడు సభలు ఏర్పాటు చేసి ఉపన్యాసాలు దంచి పారేస్తాం, తెలుగు వారంతాతెలుగులోనే మాట్లాడుదాం అని హిత బోధలు చేస్తాం!!

కానీఆచరణలో ఇవన్నీ శూన్యం, శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రిఅని తెలుగులో చెప్పుకుంటే  సరిపోదు, పక్క రాష్ట్రం తమిళనాడులో వాళ్ళమాతృభాషకి ఇచ్చుకున్న ప్రాధాన్యం మనం మన భాషకి ఇవ్వడం లేదు, వాళ్ళ రాష్ట్రంవెళ్తే ఒక్క బోర్డ్ కూడా పరాయి భాషలో కనపడదు, అన్నీ తమిళంలోనే వుంటాయి, ఒకవేళ ఇంగ్లీష్ లో రాసినా కూడా మొదటగా వాళ్ళ మాతృభాషలో రాసి ఆ తర్వాతఆంగ్లము వాడరు, అది వాళ్ళు వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవ స్థానం, మర్యాద!!

కానీమనం, తేనేలూరు తెలుగు అని ప్రపంచం మొత్తం పొగుడుతూ వున్నా, మనకి మాత్రం మనభాష అంటే చిన్న చూపే, తెలుగులో మాట్లాడితే ఎక్కడ తేలికగా చూస్తారో అనిబోడి ఇంగ్లీష్ లో స్టైల్ గా మాట్లాడాలి అని చూస్తారు, ఇక కొంతమంది అమెరికాలేదా ఇతర దేశాలు వెళ్ళి అక్కడ స్థిర పడితే, ఇక అంతే.... వాళ్ళు ఇక్కడకివచ్చినా గానీ తెలుగు భాష వాడడం నామోషీగా భావిస్తారు, అలాంటి వాళ్ళని చూస్తేనాకు అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది, నేను మోహానే అడుగుతా, తెలుగుమర్చిపోయారా లేక మాట్లాడాలి అంటే నామోషీనా అని....

పరాయిభాష కేవలం అవసరం మాత్రమే, అదే మన ఆస్తి కాదు, అవసరానికి మించి ఏది వాడినాఅది ప్రమాదమే, ఆ ప్రమాదమే ఇక్కడ అణువణువునా వ్యాపించేసి వుంది....

తెలుగుభాషకి గౌరవం ఇచ్చి, తన స్థాయిని పెంచాలి అని మనస్పూర్తిగా కృషి చేసేవారిలో నా దృష్టిలో ప్రధమ స్థానం నూర్ భాషా రహంతుల్లా గారిదే, నాకుతెలిసినంత వరకూ నేను చూసినంత వరకూ రహంతుల్లా గారు తెలుగు కోసం తపించేంతగాఎవ్వరూ అంతగా కృషి చేయడం నేను చూడలేదు, ఎప్పుడు మాట్లాడినా గానీ ఆయనమాటల్లో తెలుగు యొక్క ప్రాధాన్యం మహా దర్జాగా రారాణిలా వెలుగుతూ వుంటుంది, ఆయన మాట, మమత, గౌరవం, మర్యాద, మందలింపూ అన్నీ తెలుగే....

ఇకపోతే అన్నీ కార్యాలయాల్లో లావాదేవీలుతెలుగులో కొనసాగాలనే ఆయన అభిలాషచాలా చాలా గొప్ప సంకల్పం, ఈ విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అనేదినా భావన, ఈ విషయం గురించి చర్చలు జరగాలి, ప్రతి పార్టీలో ఈ విషయం గురించిఅవగాహన కలిగించే ఒక కమిటీ వుండాలి, ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రతిరాజకీయ పార్టీ ఈ విషయం గురించి మాట్లాడాలి, మార్పు తీసుకుని రావాలి....

మొదటమన భాషా మన రాష్ట్రం అనేది ప్రతి వారి నరనరానా రుధిరాన విప్లవ ఘోషలాప్రసరించాలి, ముందు నాయకులలో ఈ మార్పు, ఈ ఆలోచన మొదలయ్యి ఈ తెలుగు నాటప్రతి ఇంటా తెలుగు వెలుగులా నాట్యమాడి మన కంట తెలుగు తల్లి చిత్ర పటంసగర్వంగా రెపరెపలాడే రోజు అతి త్వరలో రావాలని మనస్పూర్తిగా ఆశిస్తూ....

నేను గౌరవంగా sir అని పిలిచే అతి కొద్ది మందిలో ఒక్కరైన శ్రీ నూర్ భాషా రహంతుల్లా గారికి సగౌరవంగాఅభినందనలుతెలియచేస్తూ....

Sir మీ యొక్క కోరిక కల్మషం లేనిది, స్వార్దం లేనిది, తెలుగు వలే కమ్మనైనది, తెలుగు వెలగాలనే మీ కోరిక అతి త్వరలో తీరాలి అని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను....

మీ
అభిలాష

Narasimha Reddy Nijanga mee krishini ye vidhanga abhinandinchalo theliyadam ledu. Na chethilo adhikaram vunte mimmalni Telugu bhasha amaluku sarvamsahadhikari ga niyaminche vanni .

https://www.facebook.com/williams32143/posts/1846847422013906

Image may contain: text

1 కామెంట్‌: