1, మే 2018, మంగళవారం

నందివెలుగు ముక్తేశ్వరరావు గారి సందేశం



N. MUKTESWARA RAO
I.A.S. (Retd.,)
SPECIAL OFFICER (PROJECTS)
T.T. DEVASTHANAMS
& Office : 0877-2264143
      e-mail : soprojectsttd@gmail.com
   TTD. SVETA Buildings
Opp. to SVU Main Building
Tirupati - 517 502. (A.P.)



Date..... 1-5-2018

చిరకాలంగా భాషోధ్యమంలో  'నేను సైతం'  అంటూ కార్యకర్తగా పనిచేస్తున్న రహంతుల్లా గారిని గురించి భాషానుబంధం ఉన్న మిత్రులందరికీ తెలుసు.

పనిచేసిన ప్రతిచోటా అందరికీ అర్ధం అయ్యేటట్టు తన పరిపాలనారంగాన్ని తెలుగించిన అపురూపమైన వ్యక్తిత్వం ఆయనది.

వారు వివిధ సందర్భాలలో అనేక పత్రికలలో వ్యాసాల రూపంగా వెలువరించిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఆసక్తి ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు చదివినా, వాటిలో శ్రేష్టమైనవాటిని తారామణిహారంగా తీర్చిదిద్దితెలుగులో పాలన' అనే ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నారు. రహంతుల్లా గారు పేరుకు ఉద్యోగి అయినా చేసేదిమాత్రం ఉద్యమమే. డిప్యూటీ కలెక్టర్ లాంటి కీలకస్థానంలో ఉండి తనని, తన చుట్టూ ఉన్న యంత్రాంగాన్ని ఉద్యమ స్పూర్తితో నడిపిస్తున్న ఆయన మన అందరికీ ఆదర్శం.

పూర్వకాలంలో అధ్యాపకుడు ఏదైనా ఒక అంశాన్ని చాలా చక్కగా, గుండ్రంగా వ్రాసియిచ్చి దాన్ని అనుకరిస్తూ పిల్లల్ని గుండ్రంగా దస్తూరిగా వ్రాయడం నేర్చుకోమనేవారు. దీనినిఒజ్జబంతిఅంటారు. ఆదర్శవంతమైన ఏదైనా పనినిచేస్తే దానిని కూడా ఒజ్జబంతి అంటారు. అలాంటివారిలో రహ్మతుల్లాగారు ఒకరు అని నమ్ముతున్నాను. వారి చిత్తశుద్ది అక్షరాలా తేటతెల్లం చేస్తూన్న ఈ వ్యాసాలు అపురూపంగా భావిస్తున్నాను.

భాషా విధానం గురించి మాట్లాడుతున్నపుడు ఈ మధ్య జరిగిన ఒక సంఘటనని మనవి చేస్తాను. ఒరిస్సా రాష్ట్రంలో ఆగి ఉన్న ఒక రైలు (ఇంజిన్ కూడా లేదు) ఏ కారణంగానో దానంతట అదే బయలుదేరి వెళ్లసాగడం మొదలెట్టింది. దీన్ని ఆపేటప్పటికి రైల్వే వాళ్ళకి తలప్రాణం తోకకు వచ్చింది. ఇంజిన్ ఉంటే బ్రేక్, గేర్లు మొదలైన సిస్టమ్స్ అన్నీ పనిచేస్తాయి. ఈ కదలుతున్న రైలుకు అవి ఏమీ లేవు. అందువల్ల దానికి గమనము లేదు గమ్యమూ లేదు. ప్రస్తుతం మన భాషావిధానం కూడా ఇలానే ఉందని సవినయంగా మనవి చేస్తున్నాను.
ఇలాంటి సన్నివేశ నేపధ్యంలో ఇందులో ఉన్న వ్యాసాలన్నీ ఒక క్రొత్త వెలుగుని ప్రసాదిస్తాయని నేను నమ్ముతున్నాను,
అన్ని రంగాలలో విత్తశుద్ది మాత్రమే ఉన్న మనుషులు పెరిగిపోతున్న తరుణంలో చిత్తశుద్ది మాత్రమే ఉన్న అరుదైన వ్యక్తిత్వం ఉన్న రహ్మతుల్లా గారికి అక్షరలక్షనమస్సులు.

భవదీయుడు

నందివెలుగు ముక్తేశ్వర రావు..

1 కామెంట్‌: