16, ఆగస్టు 2013, శుక్రవారం

కొత్త జిల్లాల కోసం ఎదురుచూపులు





కొత్త జిల్లాల కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు
నూర్ బాషా రహంతుల్లా  ఫోన్.9948878833
పెద్ద తాలూకాలను చీల్చి మండలాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలకు దగ్గరగా చేసిన పరిపాలనా సంస్కర్త ఎన్టీ రామారావు.ఆయన స్పూర్తితో 10 జిల్లాల తెలంగాణాలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు కేసీఆర్.
ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్లమెంటు నియోజకవర్గాలన్నిటినీ 25 జిల్లాలుగా మార్చాలని ఎంతోకాలంనుండి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈమధ్య జగన్ కూడా హామీ ఇచ్చారు.చంద్రబాబు నాయుడు,పవన్ కూడా చిన్న జిల్లాల అంశం పై దృష్టి పెట్టాలి.
1985 నుండి దేశవ్యాప్తంగా 237 కొత్త జిల్లాలు ఏర్పడగా మన రాష్ట్రంలో ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పడలేదు.మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌  ఆ రాష్ట్రంలో అగర్‌-మాల్వా అనే 51వ జిల్లా ను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లా ఆగస్టు 16 2013 నుండి ఉనికిలోకి వస్తుంది.2,785 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటయ్యే ఈ జిల్లాలో 4.8 లక్షల జనాభా ఉంటారు. డీడీ అగర్వాల్‌ ఈ జిల్లా తొలి కలెక్టర్‌.(ఈనాడు 14.8.2013).

దేశంలో అతి పెద్దది,ఎడారి రాష్ట్రమైన రాజస్ధాన్ లో కూడ 6 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.2012 లో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా 9 జిల్లాలు ఏర్పాటు చేశారు. సుక్మా, కందగావ్‌, గరియాబంద్‌, బలోదా బజర్‌, ముంగేలి, బలోద్‌, బెమెతరా, సురాజ్‌పూర్‌, బలరామ్‌పూర్‌ జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 18 నుంచి 27కి పెరిగింది. రాయపూర్‌, దుర్గ్‌, సర్గుజా, బస్తర్‌, బిలాస్‌పూర్‌, దంతెవాడ జిల్లాలను విభజించి కొత్తగా 9 జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు పాలన మరింత చేరువై, అభివృద్ధి వేగవంతమయ్యిందని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అన్నారు.
ఇప్పటివరకు దేశంలో22 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు జిల్లాల సంఖ్య పెంచుకున్నాయి.

మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి?

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ గారి వాదన ఇది :
పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరగాల్సిందే.కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న జిల్లాల నిర్వహణ చాలా కష్టంతో కూడుకొని ఉంది.మనకంటే తక్కువ జనాభా ఉన్న కర్నాటకలో కూడా మనకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. తమిళనాడులో మనకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి.కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉన్నా యి. తూర్పుగోదావరి, అనంతపురం, పశ్చిమగోదావరి వంటి కొన్ని జిల్లాలు చాలా పెద్దగా ఉన్నాయి .ఒక్కో జిల్లాలో దాదాపు యాభై లక్షల జనాభా ఉండడమే కాకుండా జిల్లా సరిహద్దులు సుదూరంగా ఉండడం వల్ల మారుమూల గ్రామాలకు జిల్లా అధికార యంత్రాంగం చేరుకునే పరిస్థితి లేకుండా పోతుంది. జనాభా, దూరం దృష్టిలో ఉంచుకోవాలి.వెనుక బడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని పాలనా సౌలభ్యం, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కోసం రాష్ట్రంలో కనీసం 10 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి.ఒక లోక్‌సభ నియోజవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా కొంత మంది కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో 50 లక్షల జనాభా ఉంటే, జిల్లా కేంద్రానికి రేపల్లె సముద్ర తీరం వంద  కిలో మీటర్ల దూరంలో ఉంది.దీనివల్ల పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రేపల్లె నుంచి నాగార్జునసాగర్‌ మధ్య దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది.వినుకొండ, మాచర్ల ప్రాంతాలు చాలా దూరంగా ఉన్నాయి.వినుకొండలో వెంటనే ఏదైనా సమస్య వస్తే అధికారులు వెళ్ళేసరికి ఆలస్యమవుతోంది.గురజాల,మాచర్లలలో ఏదో ఒక పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి.కొత్త జిల్లా ఏర్పాటైతే గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.అధికారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రావడానికి చాలా ఇబ్బంది కలుగుతోంది.అలాగే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కర్నాటకకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉన్నందున అభివృద్ధికి నోచుకోలేదు.చిన్న జిల్లాలైతే శీఘ్రగతిన అభివృద్ధి చెందుతాయి.కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చాలా సూచనలు వచ్చాయి.పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని,ఇతర రాష్ట్రాలకు పక్కనున్న ప్రాంతాలతో జిల్లాలను ప్రారంభించాలని కూడా కోరుతున్నారు.అందుకోసం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారం జిల్లాలను ఏర్పాటుచేసినా మరింత ప్రయోజనకరంగా ఉంటుందిఅని రాష్ట్ర డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ప్రతిపాదించారు.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకూ, కొత్త జిల్లాల ఏర్పాటుకూ సంబంధం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గుంటూరు ఎం.పి రాయపాటి సాంబశివరావు రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు యు.పి.ఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ దృష్టికి తెస్తే ఆమె కొత్త జిల్లాల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారట.
కొత్త జిల్లాల కోసం ఎన్నో డిమాండ్లు :
తెలంగాణాలో
1990 లో మెదక్,భద్రాచలం,శ్రీశైలం మొదలైన 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు.
ఖమ్మం జిల్లాలో కొత్తగా భద్రాచలం జిల్లాను ఏర్పాటు చేయాలని గతంలో గిరిజన నాయకులు డిమాండ్ చేశారు.
నల్లగొండలో మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పాతవే.
ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన, అటవీ ప్రాంతాలను విభజించి గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లున్నాయి.
1998 లో కొంతమంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 10 కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలని నారా చంద్రబాబు నాయుడు ను కోరారు.మంచిర్యాల జిల్లా డిమాండు ఎప్పటినుంచో ఉంది.మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు గతంలో చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది నేతలు హామీలిచ్చారు.
గతంలో రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌ను కేంద్రంగా ప్రకటించాలనే విజ్ఞప్తి ఉండేది. ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఏర్పడిన నేపథ్యంలో వికారాబాద్‌నే కొత్త జిల్లాగా ప్రకటించాలని, పశ్చిమ జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలతో లేదా చేవెళ్ల పార్లమెంటు పరిధితో వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు ముఖ్య మంత్రిని కోరారు. .

నల్లగొండ జిల్లాను చీల్చి కొత్తగా సూర్యాపేట జిల్లా ను ఏర్పాటు చేయాలని, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, నకిరేకల్‌తోపాటు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని  ప్రజలు కోరుతున్నారు.(సాక్షి 11.8.2013)
సిద్దిపేట ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక జిల్లా. జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉండి పాలనా పరంగా ఇబ్బందులతోపాటు, అభివృద్ధికి నోచుకోని మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో సిద్దిపేట కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 1983 నుంచే ఉంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఇప్పుడున్న పది జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం 24 జిల్లాలుగా విభజించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ,తెలంగాణ ఏర్పాటవ్వగానే సిద్దిపేట జిల్లాగా ఎర్పాటు చేసుకుందామంటూ హరీశ్‌రావు ఎప్పట్నుంచో అంటున్నారు
జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉన్న అప్పటి శాసనసభ నియోజకవర్గాలైన సిద్దిపేట, దొమ్మాట, గజ్వేల్, రామాయంపేట, నేరెళ్ల, చేర్యాల, ఇందుర్తి నియోజకవర్గాలను కలుపుతూ సిద్దిపేట కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 1983లో ముందుకు వచ్చింది. ఆయా ప్రాంతాల ప్రజలు ప్రతి అవసరానికి సిద్దిపేటకు వచ్చేవారు. అత్యవసర పనుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే దూరాబారం చేత తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. సిద్దిపేట నుంచి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి దాదాపు 140 కీ.మీ. దూరం ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పట్లోనే సిద్దిపేట ప్రాంత నేతలంతా పార్టీలకతీతంగా ఏకమై సిద్దిపేట కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ 1983లో ముఖ్యమంత్రి, ఎన్.టీ.రామారావు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌టీఆర్, జిల్లాల పునర్వవస్థీకరణ చేపడితే సిద్దిపేట కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటును తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అలాగే 2001లో ఎన్నికల సందర్భంగా అప్పటి  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,2004లో వైఎస్ రాజశేఖరడ్డి కూడా  హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో రామాయంపేట, ఇందుర్తి, చేర్యాల నియోజకవర్గాలు గల్లంతయ్యాయి. మారిన పరిస్థితుల అనుగుణంగా మెదక్ జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ శాసనసభ నియోకవర్గాలతో పాటు కరీంనగర్ జిల్లా సిరిసిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లా ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు.(నమస్తే తెలంగాణ 13.8.2013)
నల్లగొండ జిల్లా కేంద్రానికి ఆలేరు నియోజకవర్గం వంద కిలోమీటర్లకు పైనే దూరంగా ఉంది. సిద్ధిపేట జిల్లా ఏర్పాటైతే బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, ఆత్మకూరు మండలాలతో ఉన్న ఆలేరు నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. (టీన్యూస్ 8.3.2013)
కోస్తాలో
1982 ప్రాంతంలో భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరసరావుపేట, మార్కాపురం, తెలంగాణ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లను కలిపి నాగార్జున జిల్లా గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గిరిజనులు నివసించే ప్రాంతాలను ఏకం చేసి నల్లమల జిల్లాగా ప్రకటించాలని అక్కడి గిరిజనులు కోరుతున్నారు.
ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మన్యం ప్రాంతాలను విడదీసి అల్లురి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

విజయవాడ జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో కొంతకాలం ఉద్యమం జరిగింది. విజయవాడను ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా చేయాలని ఎన్ జీ రంగా గారు  అప్పట్లో కోరారు.ఇప్పుడు వసంత నాగేశ్వరరావు ,కత్తి పద్మారావు లాంటివారి కోరికా పోరాటమూ అదే.ఇంతవరకు జిల్లా కేంద్రమే కాలేని అతిపెద్ద రైల్వే జంక్షన్,పార్లమెంటు నియోజకవర్గ కేంద్రస్థానం.

రాయలసీమలో
నంద్యాల కొత్త జిల్లా డిమాండు ఎప్పటినుంచో ఉంది. ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు నంద్యాలకు ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో కూడా దానిని జిల్లా కేంద్రంగా చెయ్యాలని,నందమూరి జిల్లా గా చెయ్యాలని అక్కడి నాయకులు కోరారు.
"తిరుపతి రాజధానిగా బాలాజీ జిల్లా ప్రతిపాదన కొత్తది కాదు.పలు కారణాల వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.ఇప్పటికైనా తిరుపతి జిల్లా ఏర్పాటు చేయాలి.తిరుపతి జిల్లా ఏర్పాటు వల్ల పుణ్యక్షేత్రమైన తిరుపతి, పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది" అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి డి రాంభూపాల్‌ రెడ్డి రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రొద్దుటూరు ,నంద్యాల, గుంతకల్‌, తిరుపతి జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా ఆయా ప్రాంతాల ప్రజలు కూడా కోరుతున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల మావోయిస్టుల ప్రాంతాల్లో కూడా పథకాలను పకడ్భందీగా అమలు చేయవచ్చు.పాలన సౌలభ్యం కూడా కలుగుతుంది.ఒక్కో జిల్లాలో 50 నుండి 60 మండలాలు ఉండటం వల్ల పాలన కష్టమవుతుంది.నంద్యాల, ప్రొద్దుటూరు, హిందుపురం, తిరుపతి జిల్లాలుగా చేయాలి అని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త కోరారు.

రాష్ట్రం 42 జల్లాలు? ఎంపీ సీటుకో జిల్లా?
రాష్ట్రంలో ఉన్న 42 పార్లమెంటు నియోజకవర్గాలను ఒక్కో జిల్లాగా 42 జిల్లాలుగా ఏర్పాటుచేయనున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల జనాభా ఉన్న సమయంలో ఏర్పడిన జిల్లాలే తప్ప ఇంత వరకూ కొత్త జిల్లాలంటూ లేవు.ప్రస్తుత జనాభా 9 కోట్ల మందికి చేరిన నేపథ్యంలో,పరిపాలనా సౌలభ్యం కోసం మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పడాలన్న డిమాండ్‌ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు జెడి శీలం కొత్త జిల్లాల ఏర్పాటుపై చొరవ తీసుకున్నట్లు తెలిసింది. ఆయన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేయడం ద్వారా, పరిపాలన వేగవంతంగా జరుగుతుందని, ప్రతి చిన్న అంశానికి హైదరాబాద్‌కు వెళ్లడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని సోనియాగాంధీకి వివరించారు. దానిపై సోనియా సానుకూలంగా స్పందించడమే కాకుండా, ముఖ్యమంత్రిని ఈ విషయంపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.ప్రతి పార్లమెంటు నియోజ కవర్గానికి ఒక జిల్లా వల్ల జిల్లాలలో వాణిజ్యం పెరగడంతో పాటు, భూముల విలువ పెరుగుతాయి,దానివల్ల ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతుంది. రాజకీయంగా కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది.మంత్రి పదవులతో పాటు, 42 మంది జడ్పీ చైర్మన్లు, 42 మంది డీసీసీబీ చైర్మన్లు, ఇంకా జిల్లా స్థాయిలో నామినేటెడ్‌ పదవులు వస్తాయి. ఇది ఒకరకంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు,అనిశ్చితికి కొంతమేరకు పరిష్కారమార్గంగా కూడా ఉపయోగపడతుందన్న అంచనా కాంగ్రెస్‌ నాయకత్వంలో వ్యక్తమవుతోంది.(సూర్య 30.1.2013)

దేశంలోజిల్లాల పరిస్థితి :-
15.8.2013 నాటికి దేశంలోని జిల్లాల వివరాలు
క్రమ సంఖ్య
రాష్ట్రం
పార్లమెంటు సభ్యుల సంఖ్య
శాసన సభ సభ్యుల సంఖ్య
రాష్ట్రం అవతరించిన సంవత్సరం
వైశాల్యం చ.కి.మీ.
జనాబా
1985 లో జిల్లాల సంఖ్య
2013లో జిల్లాల సంఖ్య
జిల్లాలు సగటు విస్తీర్ణం చ.కి.మీ
జిల్లాల వారీగా సగటు జనాబా
1
2
3
4
5
6
7
8
9
10
11
1
42
294
1956
275069
84665533
23
23
11960
3681110
2
2
60
1972
83743
1382611
10
17
4926
81330
3
14
126
1950
78438
31169272
16
27
2905
1154417
4
40
243
1950
94163
103804637
38
38
2478
2731701
5
11
90
2000
136034
24540196

27
5038
908896
6
2
40
1987
3702
1457723
1
2
1851
728862
7
26
182
1960
196024
60383628
19
33
5940
1829807
8
10
90
1966
44212
25353081
12
21
2105
1207290
9
4
68
1950
55673
6856509
12
12
4639
571376
10
6
87
1950
222236
12548926
14
22
10102
570406
11
14
81
2000
79714
32966238

24
3321
1373593
12
28
224
1950
191791
61130704
19
30
6393
2037690
13
20
140
1956
38863
33387677
14
14
2776
2384834
14
29
230
1956
308000
72597565
45
51
6039
1423482
15
48
288
1960
307713
112372972
30
35
8792
3210656
16
2
60
1972
22327
2721756
8
9
2481
302417
17
2
60
1972
22429
2964007
5
11
2039
269455
18
1
40
1987
21081
1091014
3
8
2635
136377
19
1
60
1963
16579
1980602
7
11
1507
180055
20
21
147
1950
155707
41947358
13
30
5190
1398245
21
13
117
1950
50362
27704236
12
22
2289
1259283
22
25
200
1956
342239
68621012
27
33
10371
2079425
23
1
32
1975
7096
607688
4
4
1774
151922
24
39
234
1950
130058
72138958
18
32
4064
2254342
25
2
60
1972
10492
3671032
3
8
1312
458879
26
80
403
1950
240928
199581477
56
75
3212
2661086
27
5
70
2000
53484
10116752

17
3146
595103
28
42
294
1950
88752
91347736
16
19
4671
4807776

మొత్తం
530
4020

3276909
1189110900
425
655
5003
1815436

కేoద్రపాలిత ప్రాంతాలు









1
1

1956
8249
379944
2
3
2750
126648
2
1

1966
114
1054686
1
1
114
1054686
3
1

1961
491
342853
1
1
491
342853
4
1

1987
112
242911
2
2
56
121456
5
1

1956
32
64429
1
1
32
64429
6
7
70
1991
1483
16753235
3
9
165
1861471
7
1
30
1963
479
1244464
4
4
120
311116

మొత్తం
13
100

10960
20082522
14
21
522
956311

ఇండియా
543
4120

3287869
1209193422
439
676
4864
1788748


విస్తీర్ణంలో మన కంటే చిన్న రాష్ట్రాలైన ఉత్తరపదేశ్ లో 75  జిల్లాలు, గుజరాత్ లో 33 జిల్లాలు, చత్తీస్ గడ్ లో 27 జిల్లాలు, బీహార్ లో 38 జిల్లాలు, జార్ఖండ్ లో 24 జిల్లాలు, అస్సాం లో 27 జిల్లాలు తమిళనాడులో 32 జిల్లాలు, కర్ణాటకలో 28 జిల్లాలు, ఒరిస్సాలో 30 జిల్లాలు ఉన్నాయి.
అలాగే జనాభా ప్రకారం చూసినా మనకంటే తక్కువ జనాభా కలిగిన మధ్యప్రదేశ్ లో 51 , తమిళనాడులో 32, రాజస్ధాన్ లో 33, కర్ణాటక లో 30, గుజరాత్ లో 33 , ఒడిషా లో 30, అస్సాం లో 27, చత్తీస్ గడ్ లో 27 జిల్లాలున్నాయి.
మొట్టమొదట 1990 లో దేశంలోని జిల్లాల సంఖ్య లోక్ సభ స్థానాల సంఖ్యను దాటింది.
పార్లమెంటు స్థానాల కంటే జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు(21),కేంద్ర పాలిత ప్రాంతాలు(4) :
అరుణాచల్ ప్రదేశ్,అసోం,చత్తీస్ గఢ్,గోవా,గుజరాత్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్,జమ్ముకాశ్మీర్,ఝార్ఖండ్,కర్నాటక,మధ్యప్రదేశ్,మణిపూర్,మేఘాలయ,మిజోరం,నాగాలాండ్,ఒరిస్సా,పంజాబ్,రాజస్తాన్,సిక్కిం,త్రిపుర,ఉత్తరాఖండ్,అండమాన్ నికోబార్ దీవులు,డామన్ డయ్యు,పుదుచ్చేరి,ఢిల్లీ.
జిల్లాల సంఖ్య అసలు పెరగని రాష్ట్రాలు (5):
ఆంధ్రప్రదేశ్,బీహార్,హిమాచల్ ప్రదేశ్,కేరళ,సిక్కిం,
మన రాష్ట్రం లోజిల్లాల పరిస్థితి:-
15.8.2013 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల వివరాలు
క్రమసంఖ్య
జిల్లా
ఏర్పడిన సంవత్సరం
వైశాల్యం చ.కి.మీ.
జనాభా 2011
మండలాలు
రెవిన్యూ డివిజన్లు
1
అనంతపురం
1881
19,130
4,083,315
63
5
అనంతపురం , పెనుగొండ , ధర్మవరం, కళ్యాణదుర్గం , కదిరి
2
చిత్తూరు
1911
15,152
4,170,468
66
4
చిత్తూరు , తిరుపతి , మదనపల్లి , చంద్రగిరి
3
కడప
1910
15,359
2,884,524
51
3
కడప , రాజంపేట , జమ్మలమడుగు
4
కర్నూలు
1949
17,658
4,046,601
54
3
కర్నూలు , ఆదోని , నంద్యాల

రాయలసీమ

67,299
15,184,908
234
15

5
తూర్పుగోదావరి
1802
10,807
5,151,549
59
6
కాకినాడ , పెద్దాపురం , రంపచోడవరం , రాజమండ్రి , అమలాపురం , రామచంద్రాపురం
6
గుంటూరు
1794
11,391
4,889,230
57
4
గుంటూరు , తెనాలి , నరసరావుపేట , గురజాల
7
కృష్ణా
1925
8,734
4,529,009
50
4
మచిలీపట్నం , గుడివాడ , విజయవాడ , నూజివీడు
8
నెల్లూరు
1906
13,076
2,966,082
46
5
నెల్లూరు , గూడూరు , కావలి ,నాయుడుపేట , ఆత్మకూరు
9
ప్రకాశం
1970
17,626
3,392,764
56
3
ఒంగోలు , మార్కాపురం , కందుకూరు
10
శ్రీకాకుళం
1950
5,837
2,699,471
38
3
శ్రీకాకుళం , పాలకొండ , టెక్కలి
11
విశాఖపట్నం
1950
11,161
4,288,113
43
4
విశాఖపట్నం , పాడేరు , నర్సీపట్నం , అనకాపల్లి
12
విజయనగరం
1979
6,539
2,342,868
34
2
విజయనగరం , పార్వతీపురం
13
పశ్చిమ గోదావరి
1926
7,742
3,934,782
46
4
ఏలూరు , నర్సాపురం , కొవ్వూరు , జంగారెడ్డిగూడెం

కోస్తాంధ్ర

92,913
34,193,868
429
35

14
ఆదిలాబాద్
1905
16,128
2,737,738
53
5
ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ , ఉట్నూర్ , నిర్మల్ , మంచిర్యాల
15
కరీంనగర్
1905
11,823
3,811,738
56
5
కరీంనగర్ , పెద్దపల్లి , జగిత్యాల , సిరిసిల్ల , మంథని
16
ఖమ్మం
1953
16,029
2,798,214
46
4
ఖమ్మం , పాల్వంచ , కొత్తగూడెం , భద్రాచలం
17
హైదరాబాదు
1978
217
4,010,238
16
2
సికింద్రాబాదు , హైదరాబాదు
18
మహబూబ్ నగర్
1870
18,432
4,042,191
64
5
మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్‌కర్నూల్ , నారాయణపేట , గద్వాల
19
మెదక్
1956
9,699
3,031,877
45
3
సంగారెడ్డి , మెదక్ , సిద్దిపేట
20
నల్గొండ
1953
14,240
3,483,648
59
5
నల్గొండ , మిర్యాలగూడ , భువనగిరి , సూర్యాపేట , దేవరకొండ
21
నిజామాబాద్
1876
7,956
2,552,073
36
3
నిజామాబాద్ , బోధన్ , కామారెడ్డి
22
రంగారెడ్డి
1978
7,493
5,296,396
37
5
వికారాబాదు , చేవెళ్ళ , రంగారెడ్డిఈస్ట్ ,రాజేంద్రనగర్ , మల్కాజ్ గిరి
23
వరంగల్
1905
12,846
3,522,644
51
5
వరంగల్ , మహబూబాబాద్ , పరకాల , జనగాం , నర్సంపేట

తెలంగాణా

114,863
35,286,757
463
42




275,075
84,665,533
1,126
92




1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 56 ఏళ్ళ కాలం లో కేవలం మూడే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), రంగారెడ్డి (1978), విజయనగరం (1979) జిల్లాలు.కొత్త జిల్లాల ఏర్పాటు సమస్య మన రాష్ట్రం లో అలా నానుతూనే ఉంది.ప్రజల చేరువకు ప్రభుత్వం అంటూ కబుర్లు తప్ప కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువచేయలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదు. జాతీయ స్ధాయిలో జిల్లాల సగటు వైశాల్యం ఈనాడు 4864  చ.కి.మీ.లకు తగ్గిపోగా ఆంధ్ర ప్రదేశ్  11,960 చ.కి.మీ. తో దేశంలోనే మొదటి స్ధానంలో ఉంది.
కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసే పనే.దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర కేబినెట్‌ మాత్రమే.రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ వేర్వేరు ప్రాంతాల ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం పట్టుబడుతున్నప్పటికీ ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు కాలేదు . ''రాష్ట్రంలో కొన్ని జిల్లాలను చూసినప్పుడు అవి దేశంలో కొన్ని రాష్ట్రాల కన్నా పెద్దవిగా ఉన్నాయి. ఇది పాలనాపరమైన అనేక సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ప్రభుత్వ సేవా యంత్రాంగం వైఫల్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిటీష్ పాలకులు కొన్ని జిల్లా కేంద్రాలను సముద్ర తీరంలో ఒక అంచున ఏర్పాటు చేశారు.వాటిని ఇంతవరకు ఆయా జిల్లాల నడిమధ్యకు కూడా తేలేదు.కలక్టర్ ను కలిసి రావటానికి ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని ఆ జిల్లాల ప్రజలు బాధపడుతున్నారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన పక్షంలో పాలనా భవనాలు లాంటి మౌలిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్కసారి చేసే పెట్టుబడి మాత్రమే. కానీ దీనివల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పొందే శాశ్వత ప్రయోజనాలు చాలా ఉంటాయి. చిన్న జిల్లాలు పరిపాలనను సులభ సాధ్యం చేస్తాయి.ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినా కొత్త జిల్లాల కోసం జనం అడుగుతారు. తెలంగాణా ఏర్పడితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కే.సి.ఆర్.కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అన్ని ప్రాంతాలలోని ప్రజల దీర్ఘకాల కామన్ డిమాండ్.
విస్తీర్ణం లో మనది 4వ అతి పెద్ద రాష్ట్రం. జిల్లా కేoద్రాలు గ్రామాలకు దూరంగా ఏదో ఒక మూలన ఉండటం వల్ల ప్రజలు చాలా యాతన పడుతున్నారు. తరచుగా తుఫాను తాకిడికి, వరదలకు గురయ్యే కోస్తా ప్రాంతం లో చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల సహాయ కార్యక్రమాలు చురుకుగా అమలు జరుగుతాయి. నదులు, కాలువలు, వాగులు దాటి జిల్లా కేoద్రాలకు చేరుకోవలసిన పల్లె ప్రజలకు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల దూరం భారం తగ్గుతాయి. మనరాష్ట్రంలో ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు సగటున 20 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ 37 లక్షల మంది అవసరాలను ఆలకిస్తున్నాడు.దేశంలో సగటున 18 లక్షల జనాభాకు ఒక ఉంది. అరుణాచలప్రదేశ్ లో అయితే 86 వేల మంది జనాభాకే ఒక జిల్లా ఉంది. మన రాష్ట్రం లో మాత్రం 37 లక్షల మందికొక జిల్లా ఉంది. అలాగే నాగాలాండ్ లో 1500 చ.కి.మీ.లకు ఒక జిల్లా కలక్టర్ ఉంటే మన రాష్ట్రం లో 11960 చ.కి.మీ ల భూబాగానికి ఒక కలక్టర్ ఉన్నాడు.పనులకోసం వచ్చే ప్రజలకు అత్యంత దూరం భారం కలిగించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్ధానంలో ఉంది.
మన అనంతపురం జిల్లా వైశాల్యం 19130 చ.కి.మీ. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకంటే మన అనంతపురం జిల్లా పెద్దది. అంతేకాదు మన అనంతపురం జిల్లా కంటే మాల్ధీవులు, మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రెయిన్, బ్రూనే, కేప్ వర్ధీ, స్రై ప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్, పోర్టోరికో, కటార్, సీషెల్స్, సింగపూర్, స్వాజీలాండ్, టోoగో, ట్రినిడాడ్ మరియు టుబాగో, వనౌటూ లాంటి దేశాలకంటే పెద్దది.
చిన్న జిల్లాల ఏర్పాటు తప్పనిసరి అవసరం. ప్రభుత్వం ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు కానీ రేపైనా వాటిని ఏర్పాటు చేయక తప్పదు! అధికార వికేoద్రీకరణ అనేది ఒక అందమైన నినాదంగా మిగిలిపోయింది. అధికారం అంతా హైదరాబాద్ లో కేoద్రీకృతమై ఉంది. కొరవా సరవా ఉంటే కలెక్టరేట్ల లో ఉంది. భూమి శిస్తు కమిషనర్ కు కలెక్టర్లకు మధ్య ప్రాంతీయ అధికారులు లేరు.సబ్ కలెక్టర్లకు తగిన అధికారాలు లేవు. ప్రతిజోన్ లోను ల్యాండ్ రెవిన్యూ జోనల్ కమీషనర్లు లేరు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జిల్లాలు,రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలి. ప్రజలకు అధికారుల్ని చేరువచేయాలి.
గ్రామ సర్పంచ్ లకు మండలాద్యక్షులకూ ఆఫీసు భవనాలు ఉన్నాయి గానీ కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ హోదా కలిగిన ఎంపీలకూ,కలక్టర్ స్థాయి జీతంవచ్చే ఎమ్మెల్యేలకు సొంత ఆఫీసు భవనాలు లేవు.
తాలూకాలను మండలాలుగా విడగొట్టినందువలన ప్రజలకు పాలనా యంత్రాంగం దగ్గరయ్యింది.అలాగే ప్రతి ఎంపీకి ఒక కలెక్టరు,ప్రతి ఎమ్మెల్యేకి ఒక సబ్ కలెక్టర్ ను అనుసంధానం చేసి ఆయా భవనాలలో కూర్చోబెడితే మన రాష్ట్రంలోజిల్లాలు 23 నుండి 42 కు,డివిజన్లు82 నుండి 294 కు పెరిగి ప్రజలకు పాలన మరింత దగ్గరౌతుంది.ఆమేరకు శాశ్వతభవనాలూ,మౌలికఆస్తులూ,సౌకర్యాలు ఎక్కువ ప్రాంతాలకు వికేంద్రీకరించబడతాయి.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలోనూ ఒక భారీ పరిశ్రమ ఏర్పడి స్థానికులకు ఉపాధి దొరుకుతుంది.రాష్ట్రంలో ఇప్పుడు 338 మంది డిప్యూటీ కలక్టర్లు,171 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్లు మొత్తం 509 మంది ఉన్నారు.అయితే ఇంతమందిలో 82 ఆర్.డి.వో.లు,23 డి.ఆర్.వో.లు,23 అడిషనల్ జాయింట్ కలక్టర్లు (మొత్తం 128 మంది) తప్ప మిగిలిన 381 మంది స్పెషల్ పోస్టుల్లో ఉంటున్నారు.వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు.
సులభపాలనకు చిన్న జిల్లాలు;
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, చిన్న జిల్లాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొనివెళ్ళాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు రాష్ట్రంలోని 315 తాలూకాలను విడగొట్టి, వాటి స్థానంలో 1110 మండలాలను 1985 మే 25న ఏర్పాటు చేశారు. తరువాత కాలంలో హైదరాబాద్‌ జిల్లాలోని 4 రెవెన్యూ మండలాలను విడగొట్టి 16 మండలాలను చేశారు. నేడు రాష్ట్రంలో 1126 మండలాలున్నాయి.ఎంపీలతో సమానంగా 42 జిల్లాలు,ఎమ్మెల్యేలతో సమానంగా 294 రెవిన్యూ డివిజన్లు,6 జోన్లకూ ఆరుగురు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు పాలనా సదుపాయాలు దగ్గరలో చక్కగా అమరుతాయి. మారుమూల గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి బస్సులో వెళ్ళి అదే రోజు ఇంటికి చేరుకోలేనంత పెద్ద జిల్లాలున్నాయి.పెద్ద జిల్లాలలో పనుల వత్తిడి ఎక్కువై జాప్యం జరుగుతోంది.ప్రజలకు దూరం భారం ఎక్కువయ్యాయి.చాలా సమయం ప్రయాణాలకే వెచ్చించాల్సి వస్తోంది.జిల్లాల విభజనకు ఒక ప్రామాణిక సూత్రం గానీ,శాస్త్రబద్దమైన విధానం గానీ,ఒక ప్రాతిపదికగానీనిర్ణయించలేదు.ప్రతి పనికీ హైదరాబాదు పరిగెత్తుకు రావలసిన అవసరమూ తప్పుతుంది. చిన్న జిల్లాల ఏర్పాటు వలన అధికారులందరికీ పని సమానంగా పంచబడుతుంది.తీవ్ర పని భారం తగ్గి ప్రజలకు పనులు త్వరగా జరుగుతాయి.ఏ అధికారీ ఖాళీగా ఉండనక్కరలేదు.స్పెషల్ పోస్టుల అవసరం ఉండదు.

          రంగారెడ్డి జిల్లా 53 లక్షల జనాభాతో అవివి మాలిన విధంగా అభివృద్ది చెందింది. అయినా ఒకడే కలక్టర్.రాష్ట్ర జనసాంద్రత చదరపు కి.మీ.కు 308 ఉండగా హైదరాబాదు నగరం లో ఒక కిలో మీటరుకు 18480 మంది కిక్కిరిసి నివసిస్తున్నారు. అక్కడి 40 లక్షల జనాభాకు ఒకే కలక్టరు. 5000 చ.కి.మీ ల వైశాల్యానికి ఒక జిల్లా అనుకుంటే మనకు 55 జిల్లాలుండాలి. అలాకాకుండ ఒక ఎం.పీ.కి ఒక కలక్టర్, ఒక ఎమ్మెల్యే కు ఒక ఆర్.డి.వో. అనే పద్దతి తెస్తే 42 జిల్లాలు,294 రెవిన్యూ డివిజన్లు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఏర్పాటు చేయాల్సిన పాలనా విభాగాలు ఇలాఉంటాయి.:-

ప్రాంతం
ఇప్పుడున్న
కొత్తగా ఏర్పాటు చేయవలసిన
 ఎంపీలు
జిల్లాలు
ఎమ్మెల్యేలు
రెవిన్యూడివిజన్లు
జిల్లాలు
రెవిన్యూడివిజన్లు
రాయలసీమ
8
4
52
15
4
37
కోస్తా
17
9
123
35
8
88
తెలంగాణ
17
10
119
42
7
77
మొత్తం రాష్ట్రం
42
23
294
92
19
202


డివిజన్లు, జిల్లాలను విభజించినా, ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉంటారు. ఇవన్నీ కేవలం పరిపాలనా యూనిట్లు, కేవలం పరిపాలనా విభాగాలు! మనది వైశాల్యంలో, జనాభాలో నాలుగవ అతిపెద్ద రాష్ట్రం. శ్రీకాకుళం, అదిలాబాద్‌, చిత్తూరు జిల్లా ప్రజలు రాజధాని హైదరాబాద్‌కు రావాలంటే ఎంతఖర్చు, ఎంతఇబ్బందో ఆలోచించాలి.కొత్తగా 19 జిల్లాలు, 6 జోనల్ ఆఫీసులు ఏర్పడితే పాలకుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఎక్కడికక్కడే అభివృద్ధి చేసుకోవచ్చు. పరిపాలన కూడా సులభతరమవుతుంది. తెలుగులో పాలనకు కూడా చిన్న జిల్లాలు బాగా దోహద పడతాయి.ఎందుకంటే స్థానికులు ఎక్కడికక్కడ తమ భాషలోనే పాలన జరగాలని నిలదీస్తారు.కలక్టర్లందరూ తెలుగు నేర్చుకొని జవాబులివ్వాల్సి వస్తుంది. జిల్లాల విభజన శాస్త్రీయంగా ఎంపీ నియోజకవర్గాలతో సమానంగా జరిగితే వాటి మధ్య అసమానతలు అంతమౌతాయి.రెంటికీ ఏకరూపత,సారూప్యత,అధికారపరిధుల్లో స్పష్టత సిద్దిస్తుంది.అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సమంగా జరుగుతుంది.పెద్ద తాలూకాలు చిన్న మండలాలుగా మారినట్లే పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలుగా మారడం ఒక చారిత్రక ప్రజా అవసరం.




( Inews TV 27.8.2013 ) 
http://www.suryaa.com/opinion/edit-page/article.asp?contentId=150717
(గీటురాయి 6,13.9.2013)
https://www.facebook.com/photo.php?fbid=629266833771977&set=p.629266833771977&type=1&theater
 https://www.facebook.com/photo.php?fbid=306664456032218&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater













సాక్షి 2.9.2015
(ఈనాడు 17.9.2015)



(ఈనాడు 11.102016)
(ఈనాడు 11.102016)

9 కామెంట్‌లు:

  1. http://www.namasthetelangaana.com/Editorials/story.asp?category=1&subCategory=7&ContentId=135434

    రిప్లయితొలగించండి
  2. https://www.facebook.com/photo.php?fbid=306664456032218&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

    రిప్లయితొలగించండి
  3. https://www.facebook.com/photo.php?fbid=787499137948745&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

    రిప్లయితొలగించండి
  4. అస్సాం రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ప్రకటించారు. 2015 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ జిల్లాల పేర్లను వెల్లడించారు. కొత్తగా బిశ్వనాథ్‌, చార్లెడియో, హోజామ్‌, దక్షిణ సల్మర-మాంకచర్‌, పశ్చిమ కర్చి అంగ్‌లాంగ్‌ జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. వీటితో కలిపి ఇప్పుడు రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 32కు చేరింది.

    రిప్లయితొలగించండి
  5. https://www.facebook.com/photo.php?fbid=905142646184393&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

    రిప్లయితొలగించండి
  6. https://www.facebook.com/photo.php?fbid=1175083979190257&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

    రిప్లయితొలగించండి
  7. https://www.facebook.com/photo.php?fbid=306664456032218&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

    రిప్లయితొలగించండి
  8. నవ్యాంధ్ర లో జిల్లా కేంద్రాలుగా ఉన్న13 పార్లమెంటు నియోజకవర్గాలు
    1 అనంతపురం
    2 చిత్తూరు
    3 కడప
    4 ఏలూరు
    5 గుంటూరు
    6 కాకినాడ
    7 కర్నూలు
    8 మచిలీపట్నం
    9 నెల్లూరు
    10 ఒంగోలు
    11 శ్రీకాకుళం
    12 విశాఖపట్నం
    13 విజయనగరం

    కొత్త జిల్లా కేంద్రాలుగా మారవలసిన 12 పార్లమెంటు నియోజకవర్గాలు
    1 అరకు
    2 బాపట్ల
    3 అనకాపల్లి
    4 అమలాపురం
    5 హిందూపురం
    6 నంద్యాల
    7 నరసాపురం
    8 నరసరావుపేట
    9 రాజమండ్రి
    10 రాజంపేట
    11 తిరుపతి
    12 విజయవాడ

    రిప్లయితొలగించండి
  9. https://www.facebook.com/photo.php?fbid=571562789542382&set=a.233025936729404&type=3&theater

    రిప్లయితొలగించండి