29, జనవరి 2021, శుక్రవారం

మ‌ద‌న‌ప‌ల్లి నుంచి మండ‌పేట వ‌ర‌కూ..!రాజ్య‌మేలుతున్న మూఢ న‌మ్మ‌కాలు

 


మూఢనమ్మకాల నిర్మూలనపై చట్టం రావాలి

 https://vyus.in/?p=10006

మదనపల్లెలో క్షుద్రపూజలు చేసే విద్యావంతులైన తల్లిదండ్రులు తాము కని పెంచిన ఇద్దరు ఆడపిల్లలను దారుణంగా, క్రూరంగా చంపారు.చంపిన వారిలో పశ్చాత్తాపం లేకపోగా మానసిక రోగుల్లాగా పిల్లలు మళ్లీ బతికొస్తారంటున్నారు. వారం రోజులుగా ఇంట్లో మంత్రగాడితో క్షుద్రపూజలు చేయించారు. ముగ్గురూ నగ్నంగా ఇంట్లో పూజలు చేశారు.ముగ్గు తొక్కినప్పటి నుంచి కూతురిలో మనోదుర్భలం వచ్చిందన్నారు. దయ్యం వీడుతుందంటూ కూతురిని తల్లి డంబెల్‌తో కొట్టి చంపింది . చెల్లి ఆత్మను తెస్తాను నన్నూ చంపమ్మా అన్నదట పెద్దమ్మాయి. నేనే పార్వతిని.. కాళికను. బిడ్డలిద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారు.వారిని బయటకు తీసుకొస్తానంటూ అరిచిందట తల్లి. ఆధ్యాత్మిక మూఢత్వమే వారి ప్రాణాలు తీసింది! అన్నీ మతాలలో మూఢనమ్మకాలు చదుకున్నవాళ్లలో కూడా తీవ్రంగా వ్యాపించాయి.నూనెలు తావీజుల స్థాయి దాటిపోయింది.


 

ప్రక్కరాష్ట్రం కర్ణాటక మూఢనమ్మకాలు,‘అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి నివారణ, నిర్మూలన బిల్లును 2017 లోనే తెచ్చ్గింది. జాతీయ మహిళా కమిషన్‌ సూచనతో ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బిహార్‌, అసోం, మహారాష్ట్రలు మూఢనమ్మకాల్ని నిరోధించే చట్టాల్ని ప్రవేశపెట్టాయి. భారత రాజ్యాంగంలోని 51-A (h) పౌరుల ప్రాథమిక విధుల ప్రకారం ‘‘ప్రతి పౌరుడు ఇతరులలో శాస్త్రీయ దృష్టినీ, మానవతా వాదాన్నీ, పరిశోధనాసక్తినీ, సంస్కరణాభిలాషను పెంపొందించేందుకు కృషిచేయాలి.’’ మూఢ, అనాగరిక విశ్వాసాలకు వ్యతిరేకంగా పౌరులందరూ ప్రచారం చేయాలి. నిష్కారణంగా నరేంద్ర ధబోల్కర్‌, కల్బుర్గీ, పన్సారే, గౌరీ లంకేశ్‌ లాంటి మేధావులను మూఢనమాకాల దుండగులు హతమార్చారు. జయలలిత,బీజేపీ మీద విపక్షాలు చేతబడి చేయించారని ఎంపీ ప్రజ్నాసింఘ్ లాంటివారు వాపోతే దమ్ముంటే నాపైన చేతబడి చేయండని మంత్రి కామినేని శ్రీనివాస్ సవాలు విసిరారు. నేటికీ కొందరు మోసగాళ్ళు మంత్రాలతోనే రోగాలు నయంచేస్తామనీ, ఎలాంటి పరికరాలూ లేకుండా ఒట్టి చేతులతోనే శస్త్ర చికిత్సలు చేసి శరీరంలోని కణుతులను తీసేస్తామని మోసంచేస్తున్నారు. దెయ్యం విడిపిస్తామంటూ జనాన్ని చిత్రహింసలకు గురిచేయడం, గుప్త నిధులకోసం నరబలులూ, క్షుద్రపూజలు చేయడం, నగ్న పూజలు, గర్భంలోని శిశువు ఆడపిల్ల అయితే మగపిల్లవాడిగా మార్చేస్తామనే పేరుతో మోసాలు చేస్తున్నారు , అగ్నిగుండాలలో నడుస్తున్నారు. కొన్ని దేవాలయాలలో తమ దుష్కర్మలు నశిస్తాయనీ, రుగ్మతలు తొలగిపోతాయని చెప్పేమడె స్నాన’ ‘పులివిస్తర’ (ఎంగిలాకు), దురాచారాన్ని నిషేధించినా బాణామతి చేతబడి పేరిట చాలా దౌర్జన్యాలు, మోసాలు జరుగుతున్నాయి.తమకు లొంగని కుటుంబాన్ని సాధించదలచిన గ్రామ పెత్తందార్లు ఆ అమాయకుల ఇండ్ల ముందు తమ మనుషులతో రాత్రికి రాత్రే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేయించి, వారికి మంత్రగాళ్లనే ముద్రవేసి, వారి జుట్టు గొరిగించి, పళ్ళు ఊడగొట్టించి వీధుల్లో నగ్నంగా ఊరేగించి కసి తీర్చుకుంటున్నారు.చేతబడి చేస్తామని కొందరు , ఇతరులు చేసిన చేతబడిని తిరగగొడతామనీ ఇంకొందరు సొమ్ముచేసుకుంటున్నారు.


 పక్షవాతం కారణంగా కోమాలో ఉన్నవారిని ఎవరో చేతబడి చేసిన కారణంగానే వారలా అయ్యారని చెబుతున్నారు. కొందరు అమ్మలూ, అవధూతలూ, బాబాలూ, స్వాములూ, రాజకీయ దళారులు,డేరా బాబాలు అత్యాచారాలు చేస్తున్నా ,స్వామిజీలను ఆధ్యాత్మిక గురువులను, బాబాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అత్యాచారి నిత్యానందస్వామి పోలీసులకు చిక్క కుండా విదేశాలకు వెళ్లి ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి అక్కడ స్వతంత్రంగా కైలాస రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.మరికొందరు స్వామిజీలు, బాబాలు జైళ్లల్లో కాలం గడుపుతున్నారు. కొందరు చేసే వికృతచేష్టలు అమాయకుల ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. మంత్రాల పేరుతో రోగాలను నయం చేస్తామంటూ కిందపడేసి తొక్కుతున్నారు , వాతలు పెడుతున్నారు , ఇష్టానుసారంగా కొడుతున్నారు. కోరికలు లేని మనిషి లేడు. కోరికలు పెరుగుతూనే ఉంటాయి. రకరకాల కోరికలతో మనశ్శాంతి కోసం ఇంగ్లీషు మాట్లాడే స్వామీజీలను బాబాలను ఆశ్రయిస్తున్నారు.భైరవకోనలో గుప్తనిధులకోసం అమావాస్య నాడు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు.ఆలయఅధికారిని సస్పెండ్‌ చేశారు. కదిరి కొర్తికోటలో క్షుద్రపూజలు చేస్తూ ముగ్గురిని బలి ఇచ్చారు. చేతబడులు క్షుద్రపూజలతో దేశంలో వేల హత్యలు జరిగాయి.పుత్రసంతానం కోసం చిన్నారులను బలి ఇవ్వాలన్న భూతవైద్యుడి సలహాతో పసికందులను పొట్టనపెట్టుకున్నారు.భార్య ఆరోగ్యంకోసం, పక్షవాతం నయమౌతుందని, కొడుకు పుట్టాలనే ఆశతో యాగంచేసిమరీ పసిపాపలను బలి ఇచ్చారు.కొత్త పొక్లైయినర్‌కు నరబలి , గంగాలమ్మ తల్లికి ఒక మహిళను బలిచ్చారు.అత్యాచారం చేసినతరువాత మహిళలను తగలబెడుతున్నారు.క్షుద్రపూజలు బలుల నివారణ పై జాతీయ స్థాయిలో చట్టం కోసం కేంద్రమూ సన్నాహాలు చేసింది . అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. క్షుద్రపూజలు చేస్తామంటూ వచ్చి ఇంట్లో సొమ్మంతా దోచుకుపోయిన దొంగలను పట్టుకోటానికి కూడా పోలీసులు తటపటాయిస్తున్నారు. దీనిపై ప్రత్యేక చట్టం లేనందున పోలీసులు కూడా దీన్ని నేరం కింద పరిగణిచలేకపోతున్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, క్షుద్రపూజలు చేసినవారిపై కేవలం మోసం కేసు మాత్రమే పెట్టగలుగుతున్నారు. గతంలో కొంతమంది ఎంపీలు మాత్రం ప్రజలు ఇంతలా మోసపోతున్నా, భాదపడుతున్నా ఎందుకు చట్టం తేలేదని ప్రశ్నించారు. ఇంకా బిల్లు రావాలి. దేవుళ్లకు, దెయ్యాలకు బలులిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇప్పటికీ కొంతమంది జనం నేరమనస్తత్వంతో నమ్ముతున్నారు. జంతువులు కన్నా నరబలి ఇస్తే తమ కోరికలు నెరవేరుతాయనే మూఢత్వంతో ఉన్నారు. మనిషిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి. ఇలాంటి బలుల మూఢత్వాన్ని తిప్పికొట్టాలి.మూఢ విశ్వాసాలు తాము చేస్తున్నది ఏమిటో కూడా తెలియనంతగా మనిషిని లొంగదీసుకుంటాయి. ఇలాంటి అమానుష చర్యలు తప్పుకావని, ఫలానా గ్రంథంలో ఉంది , ఫలానా శాస్త్రంలో ఉంది అంటూ సమర్ధించుకునే మానసిక స్థితి వారిలో ఉంటుంది. శాస్త్రవేత్తలు శ్రీహరికోట చంద్రయాన్‌ గురించి తిరుపతి, శ్రీరంగం వెళ్లి గొప్పగా చెబుతున్నారు. కొందరు ఈనాటికీ గోమూత్రం, రంగు రాళ్లు, వాస్తు, కొండదొరల జోస్యాలు సినిమాలు, టివి సీరియళ్లలో  మానవాతీత  పరలోక పరకాయ ప్రవేశాలు , మూఢత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు.సత్యలోకం వచ్చిందనీ,శవాలు గంతులేస్తాయనీ బాబాలు చెబితే నమ్ముతున్నారు.పహాడీ షరీఫ్ లో ఆవు కూడా చెలరేగి కొందరిపై దాడి చేసిందట.మానసికంగా చెలరేగితే దివ్య పశువులూ మనిషికి హానిచేస్తాయని గ్రహించాలి.పిల్లలకు దిష్టితీసి వెంట్రుకలతాళ్లు తాయెత్తులు కట్టి పసివయసునుండే మూఢనమ్మకాలకు అలవాటు చేస్తున్నారు. మంత్రగత్తెలను , మంత్రగాళ్ళను కొట్టిచంపుతున్నారు. మదనపల్లి సంఘటన చూశాకనైనా జంతుబలి, నరబలి, మూఢత్వ నిర్మూలనకు చట్టం తేవాలి.విజ్నానులతో నిండిన దేశాభివృద్ధికోసం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చదువులు రావాలి .

---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266


   

 

27, జనవరి 2021, బుధవారం

గోదావ‌రిపై ప‌ది బ్యారేజీలు క‌ట్టాలి


పోలవరం డ్యాము ఎత్తు తగ్గించాలి

(వ్యూస్ 27.1.2021) https://vyus.in/?p=9965 (నూర్ బాషా రహంతుల్లా, 6301493266)
ఆనకట్టాలను ఎంత పటిష్టంగా నిర్మించినప్పటికీ వాటికీ జీవిత కాలం ఉంటుందనీ, భారత్ లోని అనేక డ్యాములకు కాలం చెల్లిందని 50 ఏళ్ళు దాటాక కాంక్రీటు డ్యాముల్లో సమస్యలు మొదలై వాటి దిగువన ఉన్న లక్షలాది ప్రజలకు ప్రమాదం ముంచుకొస్తుందని ఐక్య రాజ్యసమితి హెచ్చరించింది. అలాంటి డ్యాములు ఇప్పటికే 1115 ఉన్నాయట. 2050 నాటికి 4250 డ్యాముల జీవితకాలం ముగుస్తుందట. ముళ్ళపెరియార్ ఆనకట్ట నిర్మించి 100 ఏళ్ళు దాటిందని అది బద్దలైతే కేరళ తమిళనాడు ప్రజల ప్రాణాలు పోతాయని హెచ్చరించింది. వరదలకు పెద్ద డ్యాములు కూడా కారణం అవుతున్నాయా? భారీ డ్యాములు వద్దు. నదులు సముద్రంలో కలిసే వరకు ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లు, బ్యారేజీలూ కట్టాలి. నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి. నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు అని కే ఎల్ రావుగారు ఆనాడే చెప్పారు. విపత్తులపై జాతీయ వ్యూహం లేదు. నా చిన్నప్పుడు నందికొండ నాగార్జున సాగరమోస్తుందీ అని బిక్షగాళ్ళు పాటలు పాడుతూ అడుక్కునేవాళ్ళు. దాని గేట్లు మూయటం చేతగాక అప్పుడు వరదలొచ్చాయని జనం చెప్పుకున్నారు. ఇండియాలో నూటపాతికకు పైగా వాతావరణ జోన్లు ఉన్నాయి. ఒకపక్క వరదలు, మరోవంక కరవు కాటకాలు. నేటికీ ముంపు ముప్పు జాబితాలో పంజాబ్‌, పశ్చిమ్‌ బంగ, బిహార్‌, యూపీ, ఏపీ, హరియాణాల కేరళ ఉన్నాయి. రిజర్వాయర్ల నిర్వహణ వ్యవస్థ శాస్త్రీయంగా లేదు. డ్యాములు పగలటం ద్వారా కలిగే విపత్తు మనకు మనమే కల్పించుకుంటున్నాం. డ్యాములకు బదులు బ్యారేజీలు పెద్దపెద్ద చెరువులు రిజర్వాయర్లు ఎక్కువ సంఖ్యలో నిర్మించుకోవాలి. బిహార్‌ కోరుతున్నట్లు విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలి.దేశంలోని 351 కలుషిత నదుల్లో గోదావరి,కృష్ణా,నాగావళి,తుంగభద్ర,కుందు, అనే 5 నదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.తెలంగాణాలో మూసీ,మంజీరా,మానేరు, కిన్నెరసాని నదులు ఉన్నాయి.నదులకు కూడా మానవహక్కులు ఉంటాయని కోర్టులు చెప్పాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి డిల్లీ వెళ్ళి పోలవరం ప్రాజెక్టుకు 55 656 కోట్ల నిధులు అడిగారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 300 గ్రామాల ప్రజలు ఆదివాసీలకు నిర్వాసితులకు నేటికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అందలేదు. పునరావాసం బాధ్యత తనకు లేదని కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచి కూడా తగ్గించమని జగన్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు ఎత్తు నిర్ణీత ప్రకారం నిర్మించ వచ్చుగాని ప్రాజెక్టులో నీళ్లు నిలపడం మాత్రం సాధ్యం కాదు. 45.72 (150 అడుగులు) మీటర్ల మేర ప్రాజెక్టు నిర్మించితే 85 వేల కుటుంబాలను తరలించ వలసి వుంటుంది. అదే 41.15 (135 అడుగులు) మీటర్ల ఎత్తు అయితే తరలించవలసిన పునరావాస కుటుంబాల సంఖ్య ఖర్చు బాగా తగ్గుతుంది. పోలవరం నిర్మాణం వల్ల లక్ష ఎకరాల పైన భూమి, 373 హెక్టార్ల అటవీ భూమి మునిగిపోతాయి. దాదాపు 1.6 లక్షల జనం నిరాశ్రయులవుతారు. డ్యాములకు బదులు బరాజుల నిర్మాణం జరిగితే ఈ నష్టాలను తగ్గించవచ్చు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు రాజమహేంద్రవరం కూడా మునిగిపోకుండా కాపాడవచ్చు. గోదావరి నదిలో నౌకాయాన సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కాకినాడ వరకు వరదలను అరికట్టి నావలు నడపవచ్చు.700 టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి. మహారాష్ట్రలో బాబ్లీ కట్టారు కాబట్టి పూర్వం లాగా నీళ్ళు మనకు రావు. కాబట్టి భారీ కాంక్రీట్ డ్యాము కాకుండా ఆదిలాబాదు- వరంగల్- కరీంనగర్-ఖమ్మం జిల్లాల్లో గుర్తించిన పెద్ద బెల్లాల-ఎల్లంపల్లి -చిన్నూరు -సూరారం-కాంతనపల్లి -ఇచ్చంపల్లి -ఈదర- దుమ్మగూడెం -భద్రాచలం -కూనవరం -శబరి, పోలవరం లాంటి ప్రదేశాలలో గోదావరి పైన చిన్న చిన్న బరాజ్‌లను, రిజర్వాయర్లను డ్యాములను, జలాశయాలను నిర్మించి డ్యాములకు లాకులను ఏర్పాటుచేస్తే సముద్రం నుంచి 600 కిలోమీటర్ల వరకు జలరవాణా మార్గం ఏర్పడుతుంది. హిమాచలప్రదేశ్ బియాస్ నదిపై నిర్మించిన మనాలీ డ్యామ్ కూలిపోయి ఎంత నష్టం జరిగిందో చూశాము. భారీడ్యాములు కూలితే జరిగే ప్రమాదం ఎక్కువ. పోలవరం 150 అడుగుల ఎత్తులో నిర్మాణం జరిగితే నిత్యం గోదావరిలో 50 అడుగుల లోతు 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది. కాబట్టి నదులపై ప్రతి వంద కిలోమీటర్లకొకటి చొప్పున చిన్న చిన్న బ్యారేజీలు, మినీ హైడల్ ప్రాజెక్టులు కట్టి ఎక్కడికక్కడే నీటి అవసరాలు తీర్చాలని,నదుల రెండు గట్లనూ రహదారులుగా మార్చాలి. నదులు జీవనప్రదాతలు.దేశంలో జీవజల నదులన్నీ నిర్లక్ష్యానికి గురై, విషకలుషితం అయ్యాయి. నర్మద ఒక్కటే కాదు- బెట్వా, పెంచ్‌, చంబల్‌ తదితర వందలాది నదుల్లో తగినంత నీరు లేదు. నదులపట్ల కనీస బాధ్యతను గాలికొదిలేసి, వాటిని స్వార్థ ప్రయోజనాలకు బలిపెడుతున్నారు. పెనుమూడి వంతెన దగ్గర బ్యారేజీ కడితే ప్రకాశం బ్యారేజీ నుండి అవనిగడ్డ అక్విడక్టు వరకూ కృష్ణానదిలోనే ఎన్నో నీళ్ళు నిలవ చేయవచ్చు.వాగులపై స్లూయిజ్ లు కూడా బాగుచెయ్యాలి . భద్రాచలం డివిజన్ 1959 దాకా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వుండింది. కోయదొరలు, కొండరెడ్లు, గొత్తికోయలు, శబరులు, గోండులు, వాల్మీకులు, దొమ్మరులు, కాటికాపరులు,చెంచులు, పరికముగ్గులవాళ్ళు, పిచ్చుకగుంట్లు, బుడబుక్కలు, ప్రధానులు, పెద్దమ్మల వాళ్ళు, తోటీలు, పలు గిరిజన తెగల వారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. భద్రాచలం నుండి వాజేడు ,చితూరుల మీదుగా ఖమ్మం అనేక ప్రయాసలకోర్చి వెళ్ళవలసి వుంటుంది. భద్రాచలం రోడ్ గా పిలువబడే రైల్వే స్టేషన్ ఇక్కడికి 40 కి.మీ.దూరంలోనున్న కొత్తగూడెం లో ఉంది. కీ.శే.పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం(1946)లో కొవ్వూరు-భద్రాచలం అనే కొత్త రైలు మార్గాన్ని కోరారు. అది నేటికీ నెరవేరలేదు. భద్రాచలం ఏజెన్సీ వాసులు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల మీదుగా వయా మారేడిమిల్లి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెడతారు. పోలవరం నిర్మాణం జరిగితే ఈ మండలాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. శబరి నదిపై ఉన్న బ్రిడ్జిలు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటాయి. ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కుంట వరకు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచెత్తుతుంది. జాతీయ రహదారి, భద్రాచలం నుంచి మారేడుమిల్లి రహదారి పూర్తిగా నీటమునుగుతుంది. దీంతో భద్రాచలం వాసులు ఆంధ్ర ప్రాంతంలోని రాజమండ్రికి వెళ్లాలంటే తెలంగాణ ప్రాంతంలోని పాల్వంచ, సత్తుపల్లి మీదుగా రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 230 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలి. అటు కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లాలన్నా బంజర మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. 

పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించారు.‘మహానది-గోదావరి’, గోదావరి-కృష్ణా- కావేరి నదుల అనుసంధానం కావాలంటున్న కేంద్రం గంగా-కావేరీ నదుల అనుసంధానం జరిపి వందలాది బ్యారేజీలు కట్టి ఉత్తరాది వరదల ప్రాంతాల నీళ్ళను దక్షిణాది కరువు ప్రాంతాలకు తరలించే పని కేంద్రం చేపడితే బాగుండేది. డాక్టర్‌ కె.యల్‌.రావు కేంద్రమంత్రిగా 2,640 కిలోమీటర్ల ‘గంగ-కావేరి అనుసంధాన పథకం ప్రతిపాదించారు. ఉత్తర భారతంలోని బ్రహ్మపుత్ర, గంగ వంటి జీవనదుల నీటిని దక్షిణ భారతానికి మళ్లించాలి. అందువల్ల ఉత్తరాదిన వరదల బెడదను నివారించి దక్షిణాదిన నీటి కొరతను తీర్చటానికి గంగా కావేరీ నదులను అనుసంధానం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం 2002 అక్టోబరు 31న కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రప్రభుత్వం కూడా సరే అని ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఒకే దేశం- ఒకే ప్రజ- నినాద స్పూర్తితో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఐక్యమవ్వాలంటే అన్నిరాష్ట్రాలకూ సదుపాయాలు సమంగా అందాలి.దేశంలో వరదలతో కొన్ని రాష్ట్రాలు అల్లాడుతుంటే తాగు, సాగు నీటి కొరతతో కొన్నిరాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదంటే వందలాది బ్యారేజీలు కట్టాలి.అన్ని రాష్ట్రాల దాహార్తిని తీర్చాలి. అన్ని రాష్ట్రాల భూములకు వరదలను అరికట్టి సాగునీటిని కల్పింఛాలి.ఇతర రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునే రాష్ట్రాలు, తమ నీటిని పొరుగు రాష్ట్రాలకు ఇవ్వటంలేదు. బిహార్‌, కేరళ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలు నదుల అనుసంధానానికి ఒప్పుకోలేదు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ ,గుజరాత్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, హరియాణా, మహారాష్ట్రలు అనుసంధానానికి అంగీకరించాయి.గోదావరికి పైనుంచి నీళ్లు తీసుకువస్తే తప్ప, ఇక్కడి నీటిని బయటకు తరలించే అవకాశం లేదన్నది తెలంగాణ అభిప్రాయం.పెన్నకు, కావేరికి తరలించడానికి చాలినంత నీరు గోదావరిలో ఉండదని , మహానది నుంచి నీటిని గోదావరికి మళ్లించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరిక. దేశంలో 450 నదులు ప్రవహిస్తున్నా 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. 84 శాతం జనానికి కుళాయి నీళ్లు అందుబాటులో లేవు. పోలవరం ప్రాజెక్టు వద్దని,వరదలఒండ్రు వల్లనే తమ భూమి సారవంతమవుతుందని కోనసీమ కొబ్బరి రైతులు,తమ కొబ్బరిచెట్లకోసం కోనసీమకు రైలుమార్గం కూడావద్దన్నారని ఒక పుకారు. భారీ వ్యయంతో పోలవరం లాంటి భారీ డ్యాములు కట్టే కంటే నదులు సముద్రంలో కలిసే దాకా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లు,బ్యారేజీలూ కట్టాలి.ఎక్కడికక్కడే చిన్న బ్యారేజీలు,రిజర్వాయర్లు స్థానిక అవసరాలకు ఉపయోగపడతాయి.నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.వేరే భూమి కొననక్కరలేదు.అలా చేస్తే నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు. (వ్యాస ర‌చ‌యిత ఏపీ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్)


26, జనవరి 2021, మంగళవారం

పేదవాళ్లకూ స‌త్వ‌ర న్యాయం! న్యాయం త్వరగా జరగాలి

 


పేదవాళ్లకూ స‌త్వ‌ర న్యాయం! న్యాయం త్వరగా జరగాలి
https://vyus.in/?p=9773 (వ్యూస్ 21.1.2021)
అప్పుడే స‌మ‌స‌మాజ స్థాప‌న‌
ప్రభుత్వాలు వున్నది పేదల సంక్షేమం కోసం. రాజ పోషకులైన కార్పొరేట్ల క్షేమంతోపాటు పేదల సంక్షేమం కూడా ముఖ్యం.సకాలంలో న్యాయం అందకపోతే ప్రజల్లో అసంతప్తి, తిరుగుబాటు తలెత్తుతాయి. నూతన పార్లమెంటు భవనంగానీ తెలంగాణ అసెంబ్లీ భవనం కానీ, చంద్రబాబు అమరావతి నిర్మాణం కానీ ప్రజల ఆలోచనలు అటు మళ్ళించాయి. కట్టబోయే పార్లమెంటు భవనం సుఖ సంతోషాల స్వగృహమే అన్నారు ముఖేష్‌ అంబానీ. ఆ నవీన భారత దేవాలయంలో ప్రజల సమస్యలు చర్చిస్తారు. ఇక్కడ తేలని విషయాలు మాత్రమే న్యాయస్థానానికి వెళతాయి. నాగార్జున సాగర్‌, భాక్రానంగల్‌ , బిహెచ్‌ఇఎల్‌, స్టీల్‌ ప్లాంట్‌ వంటి నవీన దేవాలయాల ద్వారా లక్షలాదిమంది ప్రజలు ఉపాధి పొందారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పటేల్‌ విగ్రహం గానీ, రామమందిర నిర్మాణం వలన గానీ అద్భుత భవనాలతో ప్రజల ఆకలి తీరదు. ప్రజలకు ఉపాధి కల్పించాలి. ప్రజల అవసరాలు తీర్చాలి. న్యాయవ్యవస్థలో మహిళ లకు అతి తక్కువ ప్రాతినిధ్యం వున్నదని ఈ పరిస్థితిని మార్చాలని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టులో సూచించారు. సుప్రీం కోర్టులోనూ, వివిధ హైకోర్టుల్లోనూ మొత్తం న్యాయమూర్తుల పదవులు 1,113 వుంటే అందులో కేవలం 80 మంది మాత్రమే మహిళలు. సుప్రీంకోర్టులో 34 న్యాయమూర్తుల పదవులుంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా దేశంలో మహిళా న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేరని చెప్పారు. జస్టిస్‌ ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ భానుమతి , జస్టిస్‌ ఇందిరా బెనర్జీ మాత్రమే వున్నారు. ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు లేనేలేరు. సమాజంలో నిత్యం ఏవో సమ స్యలు, సంక్షోభాలూ తప్పవు. వాటికి ఎప్పటికప్పుడు మెరుగైన పరిష్కారాలు సాధించాలి. సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అందరిలోనూ నమ్మకం కలగాలి.
వివ‌క్ష‌కు వ్య‌వ‌స్థ అతీతం కావాలి
కులం, మతం, ప్రాంతం, జెండర్‌ వంటి వివక్షలు ఏ వ్యవస్థలోనూ కొనసాగకూడదు. సైన్యంలో పురుషులతో సమానంగా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని, లైన్‌మన్‌ పోస్టులకు మహిళలనూ పరిగణించాలనీ న్యాయవ్యవస్థ మంచి తీర్పులు వెలువరించింది. న్యాయ వ్యవస్థలోనే వేళ్లూనుకున్న లింగ వివక్షను నిర్లక్ష్యం చేయకూడదు. ఒక సమాజం సాధించిన ప్రగతి మహిళలు సాధించిన ప్రగతినిబట్టే అంచనా వేస్తానని డాక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. న్యాయస్థానాల్లో వ్యాజ్యాల పరిష్కరణ ప్రక్రియ ఏళ్లూపూళ్లూ పట్టి కక్షిదారుల్ని కుంగదీస్తోంది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వృద్ధుల పరిస్థితి మరింత దుర్భరమవుతోంది. వ్యాజ్యాలు ఏళ్లపాటు పెండింగులో పడి ఉంటున్నాయి. వృద్ధుల కేసుల్ని త్వరగా పరిష్కరిస్తేనే సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుంది. ఎనభై ఆరేళ్ల విశాఖ వాసి తప్పుడు ఆరోపణలతో భర్తను విధులనుంచి తప్పించిన కళాశాల యాజమాన్యంపై మూడున్నర దశాబ్దాల న్యాయపోరాటం చేసి గెలిచింది. జమునాలాల్‌ పటేల్‌, మోతీలాల్‌ పర్మార్‌ లాంటి ఎందరో సీనియర్‌ పౌరుల దురవస్థ చూడాలి. వయసు మీదపడే కొద్దీ అనారోగ్యం, నిస్సహాయత, కుటుంబ క్లేశాలు, సంతానం దగ్గర లేరన్న బాధ, ఉన్నానిరాదరణకు గురైన అశక్త భావన, తగిన జీవనాధార లేమి అన్నీ వృద్ధాప్యంలో చుట్టుముట్టే సమస్యలే. ఆ దశలో వ్యాజ్యాలు తక్షణ పరిష్కరణకు నోచుకోనట్లయితే, వారికి కోర్టులూ అన్యాయం చేసినట్లే!
వృద్ధుల‌కు భ‌ద్ర‌త అవ‌స‌రం
అరవై ఏళ్ల వయసుకు పైబడినవారి సంఖ్య దేశ జనాభాలో 20 శాతం.వృద్ధులకు ఆహార, ఆరోగ్య, ఆర్థిక, న్యాయ భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు నిర్దేశాల అనుసారం 60 ఏళ్లకు పైబడినవారి కేసుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. వ్యాజ్యాలు అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయి! దేశంలో సివిల్‌ కేసులు నిర్ణాయక దశకు చేరడానికి పదిహేనేళ్లు పడుతుండగా, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికీ ఏడేళ్ల వరకు నిరీక్షణ తప్పడంలేదు. దేశవ్యాప్తంగా అపరిష్కృత వ్యాజ్యాలు 3.20కోట్ల మేర ఉండగా, అందులో 83వేలకుపైగా 30 సంవత్సరాలకు పైబడినవే. అన్నేళ్లు న్యాయ పోరాటంలో మగ్గిపోయినవారు జీవిత చరమాంకంలోనైనా నిరీక్షణ ఫలాలు పొందుతారా? కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల కోసమే మంచి ఉద్దేశంతో చేసినా’ కోర్టులు చట్టపరంగా రక్షణ కల్పించలేవు.ఎవరికి వారే న్యాయవాదులు , న్యాయమూర్తులుగా, న్యాయాన్ని అమలు చేసే అధికారులుగా మారతారు. ఆంధ్రప్రదేశ్‌ రూ. 3.73 లక్షల కోట్ల అప్పులో ఉన్నా అమరావతి శంకుస్థాపనకు మట్టి, నీరు తెచ్చిఓదార్చిన పద్ధతిలోనే ప్రధాని మోడీ ‘దేశమంటే మట్టి కాదోయ్ ‘ అని గురజాడ పద్యం పాడి తెలుగువారిని మెప్పించారు.
అరాచ‌కాలు అనేకం
ఉత్తరకొరియాలో సరిగా కూర్చోలేదని ఒక మంత్రిని కాల్చి చంపారు. థాయ్ లాండ్‌లో రాచరికాన్ని దిక్కరించిందని అక్కడి ఒక మహిళా ఉద్యోగినికి 43 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మనదేశంలో ఇంకా ఖాఫ్ పంచాయతీలు ,గ్రామపెద్దల మొరటు తీర్పులు కొనసాగుతున్నాయి.చెట్టుకో స్తంభానికో కట్టేసి నేరగాళ్లని అనుమానించి కొట్టిచంపిన సంఘటనలు చాలా చోట్లజరిగాయి.
దుష్టుడు తిన్నగా ఉండడు. మంచివాళ్ళను బాధిస్తాడు. తనపాటికి తాను మర్యాదగా మంచిగా బ్రతికేవాడిపై దుష్టుడు దౌర్జన్యం చేసి దోచుకుంటాడు.అదేమని అడిగితే తగాదా పెట్టుకొని దూషించి హింసిస్తాడు. హానికితోడు అవమానం జరిగిందని మంచివాడే బాధపడుతున్నాడు. బుద్ధుడు మరొకరిని హింసించి ఆనందించడం పాశవికమైన చర్య కాబట్టే దుష్టుడికి దూరంగా ఉండమన్నాడు. క్రూరజంతువులకు దూరంగా తప్పుకొని సాధుజంతువులు బ్రతుకుతున్నట్లు, క్రూరుడి బలానికి దుర్మార్గానికీ భయపడి సజ్జనులు దాక్కుని బ్రతుకుతున్నారు. సజ్జనులు తప్పుకొని తిరగటం తమరక్షణ కోసమే తప్ప దుష్టుల అన్యాయాన్ని ఆమోదించి కాదు. ఎన్నికలు లేని రోజుల్లో యుద్ధాలే జరిగేవి. ఇప్పుడు నామినేషన్ల దశలోనే రౌడీల యుద్ధకాండ మొదలౌతున్నది. తింటానికి లేకపోయినా ఉగ్రవాదానికి యుద్ధాలకు ఎగబడిపోతున్నారు. 2014 లో మెహదీపట్నం మిలిటరీ గ్రౌండ్ లో ఆడుకోటానికి వెళ్ళిన 12 ఏళ్ల బాలుడిని తగలబెట్టి చంపిన సైనికుల దుర్మార్గం చాలా తీవ్రమైనది. పాడేరులో అప్పుతీర్చలేదని రత్నం అనే విధవరాలి తలను మరుగుతున్ననూనెలో ముంచి హింసించాడు పెంటారావు అనే డైలీ ఫైనాన్స్ వ్యాపారి. కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిని తగలబెట్టిన దుర్మార్గులున్నారు. రైల్వే గేటు తెరవలేదని గేట్ మ్యాన్ చేతులు నరికిన దుష్టులున్నారు. పోలీసు కానిస్టేబుళ్లను కొట్టిన ఎమ్మెల్యేలున్నారు. చెప్పినమాట వినలేదని పని పిల్లవాడిని కొట్టిన, పాలేరు పనికి ఆలస్యంగా వచ్చాడని షాకు ఇచ్చి చంపిన యజమానులున్నారు. అందరిలో దౌర్జన్యం, నేర తత్వమే కనిపిస్తోంది. దుష్ట స్వభావం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. నెల్లూరులో ఒక టూరిస్టు అధికారి తనను మాస్కు వేసుకొమ్మని సలహా ఇచ్చిందని ఒక వికలాంగురాలిని రాడ్డు తీసుకొని విచక్షణా రహితంగా ఆఫీసులోనే కొట్టి వార్తలకెక్కి సస్పెండ్ అయ్యాడు. కేరళలో కోడలిని అత్తింటివారే కడుపుమాడ్చి చంపారట. పెడనలో పిల్లల బాణాసంచా శబ్దాలను భరించలేక భార్య భర్తలపై కత్తితో దాడిచేసి ఒకడు భర్తను చంపేశాడు. భూమి తగాదాలో ఒక మహిళను కత్తితో నరికి చంపాడు మరొకడు. నిర్భయ దోషులు నలుగురికీ మరణదండన అమలు చేశారు. మన దేశంలో న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనది. తమ కుమార్తెపై అత్యాచారం జరిపి హతమార్చిన దుండగులకు శిక్ష విధించడంలో ఎంతో జాప్యం జరిగిందని నిర్భయ తల్లి, ఆయెషా తల్లి అనేకసార్లు కన్నీరుమున్నీరయ్యారు. నేరగాళ్ళు అందరూ ఉరికంబం ఎక్కినరోజునే తమ కుమార్తెల ఆత్మ శాంతిస్తుందని ఆ తల్లులు ఆవేదన చెందారు. ఎనిమిదేళ్ళ తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని చాలామంది పెద్దలు సంతోషించారు. ఆయెషా బేగం తల్లి ఇంకా ఆక్రందిస్తూనే ఉన్నారు. సత్కార్యాల పేరుతో పబ్బులమీద పడి అమ్మాయిలను తంతున్నారు, పార్కుల్లో ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, గ్యాంగ్ వారుల్లో మునిగితేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి వీలుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు దిశ యాప్‌ను రూపొందించి విడుదల చేసింది. న్యాయం త్వరగా జరుగుతుంటేనే ప్రజలు శాంతిగా ఉంటారు. (వ్యాస ర‌చ‌యిత ఏపీ రిటైర్డ్ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌)
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి !

పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి ! (సకలం 26.1.2021)


ఆనకట్టలను ఎంత పటిష్టంగా నిర్మించినప్పటికీ వాటికీ జీవిత కాలం ఉంటుందనీ, భారత్ లోని అనేక డ్యాములకు కాలంచెల్లిందనీ 50 ఏళ్ళు దాటాక కాంక్రీటు డ్యాముల్లో సమస్యలు మొదలై వాటిదిగువన ఉన్న లక్షలాది ప్రజలకు ప్రమాదం ముంచుకొస్తుందని ఐక్య రాజ్యసమితి హెచ్చరించింది. అలాంటి డ్యాములు ఇప్పటికే 1115 ఉన్నాయట. 2050 నాటికి 4250 డ్యాములజీవితకాలం ముగుస్తుందట. ముళ్ళపెరియార్ ఆనకట్ట నిర్మించి 100 ఏళ్ళు దాటిందని అది బద్దలైతే కేరళ తమిళనాడు ప్రజలప్రాణాలు పోతాయని హెచ్చరించింది.
పెద్ద డ్యామ్ ల వల్ల వరదలు వస్తాయా?
వరదలకు పెద్ద డ్యాములు కూడా కారణం అవుతున్నాయా? భారీ డ్యాములు వద్దు. నదులు సముద్రంలో కలిసే వరకు ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లూ, బ్యారేజీలూ కట్టాలి. నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి. నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు అని కే ఎల్ రావుగారు ఆనాడే చెప్పారు. విపత్తులపై జాతీయ వ్యూహం లేదు. నా చిన్నప్పుడు నందికొండ నాగార్జున సాగరమోస్తుందీ అని బిక్షగాళ్ళు పాటలు పాడుతూ అడుక్కునేవాళ్ళు. దాన్ని మూయటం చేతగాక అప్పుడు వరదలోచ్చాయని జనం చెప్పుకున్నారు. ఇండియాలో నూటపాతికకు పైగా వాతావరణ జోన్లు ఉన్నాయి. ఒకపక్క వరదలు, మరోవంక కరవు కాటకాలు.
ముంపు ముప్పు జాబితా
నేటికీ ముంపు ముప్పు జాబితాలో పంజాబ్‌, పశ్చిమ్‌ బెంగాల్, బిహార్‌, యూపీ, ఏపీ, హరియాణా, కేరళ ఉన్నాయి. రిజర్వాయర్ల నిర్వహణ వ్యవస్థ శాస్త్రీయంగా లేదు. డ్యాములు పగలటంద్వారా కలిగే విపత్తు మనకు మనమే కల్పించుకుంటున్నాము. డ్యాములకు బదులు బ్యారేజీలు పెద్దపెద్ద చెరువులు రిజర్వాయర్లు ఎక్కువ సంఖ్యలో నిర్మించుకోవాలి. బిహార్‌ కోరుతున్నట్లు విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలి.
కలుషిత నదులు
దేశంలోని 351 కలుషిత నదుల్లో గోదావరి,కృష్ణా, నాగావళి, తుంగభద్ర, కుందు అనే 5 నదులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. తెలంగాణాలో మూసీ, మంజీరా, మానేరు, కిన్నెరసాని నదులు ఉన్నాయి. నదులకు కూడా మానవహక్కులు ఉంటాయని కోర్టులు చెప్పాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి డిల్లీ వెళ్ళి పోలవరం ప్రాజెక్టుకు 55 656 కోట్ల నిధులు అడిగారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 300 గ్రామాల ప్రజలు ఆదివాసీలకు నిర్వాసితులకు నేటికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అందలేదు. పునరావాసం బాధ్యత తనకు లేదని కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటోంది.
డ్యామ్ ల బదులు బరాజులు నిర్మించాలి
పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచి కూడా తగ్గించబోమని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు నిర్ణీత ప్రకారం నిర్మించ వచ్చుగాని ప్రాజెక్టులో నీళ్లు నిలపడం మాత్రం సాధ్యం కాదు. 45.72 (150 అడుగులు) మీటర్ల మేర ప్రాజెక్టు నిర్మించితే 85 వేల కుటుంబాలను తరలించ వలసి వుంటుంది. అదే 41.15 (135 అడుగులు) మీటర్ల ఎత్తు అయితే తరలించవలసిన పునరావాస కుటుంబాల సంఖ్య ఖర్చు బాగా తగ్గుతుంది. పోలవరం నిర్మాణం వల్ల లక్ష ఎకరాల పైన భూమి, 373 హెక్టార్ల అటవీ భూమి మునిగిపోతాయి. దాదాపు 1.6 లక్షల జనం నిరాశ్రయులవుతారు. డ్యాములకు బదులు బరాజుల నిర్మాణం జరిగితే ఈ నష్టాలను తగ్గించవచ్చు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు రాజమహేంద్రవరం కూడా మునిగిపోకుండా కాపాడవచ్చు. గోదావరి నదిలో నౌకాయాన సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కాకినాడ వరకు వరదలను అరికట్టి నావలు నడపవచ్చు.700 టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి.
జలరవాణా మార్గాలు
మహారాష్ట్రలో బాబ్లీ కట్టారు కాబట్టి పూర్వం లాగా నీళ్ళు మనకు రావు. కాబట్టి భారీ కాంక్రీట్ డ్యాము కాకుండా ఆదిలాబాదు- వరంగల్- కరీంనగర్-ఖమ్మం జిల్లాల్లో గుర్తించిన పెద్ద బెల్లాల-ఎల్లంపల్లి -చిన్నూరు -సూరారం-కాంతనపల్లి -ఇచ్చంపల్లి -ఈదర- దుమ్మగూడెం -భద్రాచలం -కూనవరం -శబరి, పోలవరం లాంటి ప్రదేశాలలో గోదావరి పైన చిన్న చిన్న బరాజ్‌లను, రిజర్వాయర్లను డ్యాములను, జలాశయాలను నిర్మించి డ్యాములకు లాకులను ఏర్పాటుచేస్తే సముద్రం నుంచి 600 కిలోమీటర్ల వరకు జలరవాణా మార్గం ఏర్పడుతుంది. హిమాచలప్రదేశ్ బియాస్ నదిపై నిర్మించిన మనాలీ డ్యామ్ కూలిపోయి ఎంత నష్టం జరిగిందో చూశాము. భారీడ్యాములు కూలితే జరిగే ప్రమాదం ఎక్కువ. పోలవరం 150 అడుగుల ఎత్తులో నిర్మాణం జరిగితే నిత్యం గోదావరిలో 50 అడుగుల లోతు 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది.
నదులపై ప్రతి వంద కిలోమీటర్లకూ ఒక బ్యారేజి
కాబట్టి నదులపై ప్రతి వంద కిలోమీటర్లకొకటి చొప్పున చిన్న చిన్న బ్యారేజీలు, మినీ హైడల్ ప్రాజెక్టులు కట్టి ఎక్కడికక్కడే నీటి అవసరాలు తీర్చాలని,నదుల రెండు గట్లనూ రహదారులుగా మార్చాలి. నదులు జీవనప్రదాతలు. దేశంలో జీవజల నదులన్నీ నిర్లక్ష్యానికి గురై, విషకలుషితం అయ్యాయి. నర్మద ఒక్కటే కాదు- బెట్వా, పెంచ్‌, చంబల్‌ తదితర వందలాది నదుల్లో తగినంత నీరు లేదు. నదులపట్ల కనీస బాధ్యతను గాలికొదిలేసి, వాటిని స్వార్థ ప్రయోజనాలకు బలిపెడుతున్నారు. పెనుమూడి వంతెన దగ్గర బ్యారేజీ కడితే ప్రకాశం బ్యారేజీ నుండి అవనిగడ్డ అక్విడక్టు వరకూ కృష్ణానదిలోనే ఎన్నో నీళ్ళు నిలవ చేయవచ్చు.వాగులపై స్లూయిజ్ లు కూడా బాగుచెయ్యాలి .
భద్రాచలం డివిజన్ 1959 దాకా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వుండింది. కోయదొరలు, కొండరెడ్లు, గొత్తికోయలు, శబరులు, గోండులు, వాల్మీకులు, దొమ్మరులు, కాటికాపరులు, చెంచులు, పరికముగ్గులవాళ్ళు, పిచ్చుకగుంట్లు, బుడబుక్కలు, ప్రధానులు, పెద్దమ్మల వాళ్ళు, తోటీలు, పలు గిరిజన తెగల వారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. భద్రాచలం నుండి వాజేడు ,చింతూరుల మీదుగా ఖమ్మం అనేక ప్రయాసలకోర్చి వెళ్ళవలసి వుంటుంది. భద్రాచలం రోడ్ గా పిలువబడే రైల్వే స్టేషన్ ఇక్కడికి 40 కి.మీ.దూరంలోనున్న కొత్తగూడెం లో ఉంది.
సుందరయ్య స్వప్నం
కీ.శే.పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం (1946) లో కొవ్వూరు-భద్రాచలం అనే కొత్త రైలు మార్గాన్ని కోరారు. అది నేటికీ నెరవేరలేదు. భద్రాచలం ఏజెన్సీ వాసులు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల మీదుగా వయా మారేడిమిల్లి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెడతారు. పోలవరం నిర్మాణం జరిగితే ఈ మండలాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. శబరి నదిపై ఉన్న బ్రిడ్జిలు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటాయి. ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కుంట వరకు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచెత్తుతుంది. జాతీయ రహదారి, భద్రాచలం నుంచి మారేడుమిల్లి రహదారి పూర్తిగా నీటమునుగుతుంది. దీంతో భద్రాచలం వాసులు ఆంధ్ర ప్రాంతంలోని రాజమండ్రికి వెళ్లాలంటే తెలంగాణ ప్రాంతంలోని పాల్వంచ, సత్తుపల్లి మీదుగా రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 230 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలి. అటు కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లాలన్నా బంజర మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు.
కె.ఎల్ రావు ప్రతిపాదించిన గంగా–కావేరి అనుసంధానం
పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించారు.‘మహానది-గోదావరి’, గోదావరి-కృష్ణా- కావేరి నదుల అనుసంధానం కావాలంటున్న కేంద్రం గంగా-కావేరీ నదుల అనుసంధానం జరిపి వందలాది బ్యారేజీలు కట్టి ఉత్తరాది వరదల ప్రాంతాల నీళ్ళను దక్షిణాది కరువు ప్రాంతాలకు తరలించే పని కేంద్రం చేపడితే బాగుండేది. డాక్టర్‌ కె.యల్‌.రావు కేంద్రమంత్రిగా 2,640 కిలోమీటర్ల ‘గంగ-కావేరి అనుసంధాన పథకం ప్రతిపాదించారు. ఉత్తర భారతంలోని బ్రహ్మపుత్ర, గంగ వంటి జీవనదుల నీటిని దక్షిణ భారతానికి మళ్లించాలి.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం
అందువల్ల ఉత్తరాదిన వరదల బెడదను నివారించి దక్షిణాదిన నీటి కొరతను తీర్చటానికి గంగా కావేరీ నదులను అనుసంధానం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం 2002 అక్టోబరు 31న కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రప్రభుత్వం కూడా సరే అని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఒకే దేశం- ఒకే ప్రజ- నినాద స్పూర్తితో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఐక్యమవ్వాలంటే అన్నిరాష్ట్రాలకూ సదుపాయాలు సమంగా అందాలి. దేశంలో వరదలతో కొన్ని రాష్ట్రాలు అల్లాడుతుంటే తాగు, సాగు నీటి కొరతతో కొన్నిరాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదంటే వందలాది బ్యారేజీలు కట్టాలి.అన్ని రాష్ట్రాల దాహార్తిని తీర్చాలి. అన్ని రాష్ట్రాల భూములకు వరదలను అరికట్టి సాగునీటిని కల్పింఛాలి.ఇతర రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునే రాష్ట్రాలు, తమ నీటిని పొరుగు రాష్ట్రాలకు ఇవ్వటంలేదు.
నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించిన రాష్ట్రాలు
బిహార్‌, కేరళ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలు నదుల అనుసంధానానికి ఒప్పుకోలేదు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ ,గుజరాత్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, హరియాణా, మహారాష్ట్రలు అనుసంధానానికి అంగీకరించాయి. గోదావరికి పైనుంచి నీళ్లు తీసుకువస్తే తప్ప, ఇక్కడి నీటిని బయటకు తరలించే అవకాశం లేదన్నది తెలంగాణ అభిప్రాయం. పెన్నకు, కావేరికి తరలించడానికి చాలినంత నీరు గోదావరిలో ఉండదనీ, మహానది నుంచి నీటిని గోదావరికి మళ్లించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరిక.
నదులు అనేకం, నీటి ఎద్దడి అనివార్యం
దేశంలో 450 నదులు ప్రవహిస్తున్నా 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. 84 శాతం జనానికి కుళాయి నీళ్లు అందుబాటులో లేవు. పోలవరం ప్రాజెక్టు వద్దనీ, వరదల ఒండ్రు వల్లనే తమ భూమి సారవంతమవుతుందనీ కోనసీమ కొబ్బరి రైతులు, తమ కొబ్బరి చెట్లకోసం కోనసీమకు రైలుమార్గం కూడావద్దన్నారని ఒక పుకారు. భారీ వ్యయంతో పోలవరం లాంటి భారీ డ్యాములు కట్టే కంటే నదులు సముద్రంలో కలిసే దాకా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లూ,బ్యారేజీలూ కట్టాలి. ఎక్కడికక్కడే చిన్న బ్యారేజీలూ, రిజర్వాయర్లూ స్థానిక అవసరాలకు ఉపయోగపడతాయి. నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి. వేరే భూమి కొననక్కరలేదు.అలా చేస్తే నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు.
(రచయిత విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్)
-- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266
పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి ! - Sakalam