6, జులై 2012, శుక్రవారం

1. చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు


1. చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు
                గత పది సంవత్సరాలలో 516 భాషలు దాదాపుగా అంతరించి పోయాయట. చాలా కొద్దిమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆ భాషలు మాట్లాడుతున్నారట. ప్రస్తుతం 7299 భాషలు ప్రపంచంలో వాడకంలో   ఉన్నట్లు గుర్తించిన సంస్థలు, వాటిలో సగానికి సగం రాబోయే తరానికి అందకుండా అంతరించిపోయే దశలో ఉన్నాయని చెబుతున్నాయి. అంతరించిపోయే దశలో ఒక భాష ఉంది అనటానికి ప్రాతిపదికలు ఏంటంటే `1. ఆ భాషను పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పరు. 2. రోజువారీ వ్యవహారాల్లో వాడరు. 3. ఆ భాష మాట్లాడే జనం సంఖ్య తగ్గిపోతుంటుంది. 4.  ప్రభుత్వం, దేవాలయం కూడా ఆ భాషను ఉపయోగించవు. 5. ఆ భాషను కాపాడుకోవాలని ప్రజలు సంఘటితంగా ఉద్యమించరు. 6. ఆ భాష పట్ల గౌరవ భావం ప్రజల్లో ఉండదు. 7. ఆ భాష అక్షరాలను గానీ, సాహిత్యాన్ని గానీ ఆ ప్రజలు విరివిగా వాడరు.            
                Ethnologue.com లో ఈ అంతరించిపోతున్న భాషల చిట్టా ఉంది. ఆఫ్రికాలో 46, అమెరికాలో 170, ఆసియాలో 78, ఐరోపాలో 12 పసిఫిక్‌లో 210 భాషలు ఈ చిట్టాలో ఉన్నట్టు తెలిపారు. ఇక ఇండియా విషయానికి వస్తే 17 భాషలు అంతరించాయట. అవి :
1. పుచిక్‌వార్‌: అండమాన్‌దీవుల్లో 2000 సంవత్సరంలో కేవలం 24 మంది షెడ్యూలు తెగల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ భాషను హిందీ మింగేసింది.
2. కామ్యాంగ్‌: 2003 నాటికి అస్సాంలో 50 మంది ఈ భాషను మాట్లాడేవాళ్ళు మిగిలారు. కాస్త ముసలివాళ్ళు మాత్రం తాయ్‌లిపిలో ఈ భాష రాసేవాళ్ళట. ఇదీ గిరిజన భాషే. అస్సామీ భాష దీన్ని మింగింది.
3. పరెంగా : 2002 నాటికి ఒరిస్సా, కోరాపుట్‌జిల్లాల్లో 767 మంది మిగిలారు. ఈ భాష మీద మన తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా పరిశోధన చేశారు. ఈ భాష మాట్లాడే ‘గడబ’ అనే గిరిజన తెగ క్రమేణా ఆదివాసీ ఒరియా భాషలోకి మారిపోయారు.
4. రూగా : మేఘాలయలోని ఈ భాష నామరూపాల్లేకుండా అంతరించి పోయింది. మిగిలిన కొద్దిమంది గారో భాషలోకి మళ్ళారు.
5. అహాం : అస్సాం ప్రాంతంలో పూర్వం 80 లక్షల మంది మాట్లాడే ఈ భాషను మాట్లాడే వాళ్ళే లేరు. కేవలం మంత్ర తంత్రాల్లో మాత్రమే ఈ భాషను వాడుతున్నారు.
6. అకాబియా : అండమాన్‌దీవుల్లోని ఈ భాషలు అంతరించిపోయాయి.  అవి : 7. అకాబో, 8. అకాకరి, 9. అకాజెరు, 10. అకాకెడి, 11. అకాకోల్‌, 12. అకాకోరా, 13. అకర్‌బాలె, 14. ఒకొజువోయ్‌.
15. పాలి : బౌద్ధమత సాహిత్యం ఈ భాషలో ఓనాడు వికసించింది. 1835లో బైబిల్‌లోని కొత్త నిబంధన కూడా ప్రచురించారీ భాషలో. ఇండియాలో నాశనమైపోయింది. శ్రీలంక, బర్మా, టిబెట్‌లలో ఇంకా కొంతమంది ఈ భాష మాట్లాడే వాళ్ళున్నారంటారు.
16. రంగకస్‌: ఉత్తరాంచల్‌ప్రాంతాల్లో జొహరి అని కూడా పిలిచే ఈ భాషస్తులు ఓ వెయ్యి మంది ఉండొచ్చట. ఈ భాషాపోయింది.
17. తురుంగ్‌: అస్సాం గొలాగట్‌జిల్లాలోని ఈ గిరిజన జనం మెల్లగా సింగ్‌పో భాషలోకి మళ్ళారట.
                ప్రతి రెండు వారాలకు ఒక భాష చచ్చిపోతోందని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని 6800 భాషలలో 90 శాతం భాషలు ఈ శతాబ్దంలోగా అంతరించిపోతాయట. ఎందుకంటే వాటిలో సగం భాషలు మాట్లాడేవారు 2500 మంది కంటే తక్కువగా      ఉన్నారట. వరల్డ్‌వాచ్‌సంస్థ హెచ్చరిక ఇది. యుద్ధాలు, హత్యాకాండలు, ప్రకృతి బీభత్సాలు పెద్ద భాషల్ని ఆశ్రయించటం లాంటివన్నీ ఇందుకు కారణాలట. ఒక తరం నుండి మరో తరానికి భాషను తరలించటానికి కనీసం లక్ష మందైనా ఆ భాష మాట్లాడే వాళ్ళుండాలని లేకపోతే ఆ భాష అంతరిస్తుందని యునెస్కో ప్రకటించింది.
                ఏ మతం వాళ్ళు ఎంత మంది పెరిగారు. ఎంతమంది తరిగారు లాంటి లెక్కల్ని తప్పుల తడకలతో హడావుడిగా పార్లమెంటుకు అందజేసి, తరువాత నాలుక కరచుకున్న కేంద్ర గణాంక శాఖ 2001 నాటి భాషల వారీ జనాభా లెక్కల్ని ఇంతవరకూ మన ప్రజల ముందు ఉంచలేదు. భాషల అభివృద్ధికి, పంచవర్ష ప్రణాళికల్ని ఆపుచేసి దశ వర్ష ప్రణాళికగా మార్చుకోవాల్సిందేనా? భాషల జనాభా వివరాలు చెప్పటానికి ఆరేళ్ళు సరిపోలేదా? 90 లక్షల మంది గుడ్డివాళ్ళు, కోటీనలభై లక్షల మంది చెవిటి వాళ్ళకు లేని బాధ మీకెందుకంటున్నారు సెన్సస్‌వాళ్ళు. ఇప్పుడు 2001 జనాభా లెక్కల్లో 428 భాషలు నమోదయితే వాటిలో 415 వాడకంలో ఉంటే 13 భాషలు నశించిపోయాయట. ఎనిమిదవ షెడ్యూలు లోకి మరో నాలుగు భాషలు కలిపినందున, షెడ్యూలు భాషల సంఖ్య 22కు పెరిగింది. వాటి వివరాలు పట్టికలో చూడండి.
భారతీయ షెడ్యూల్డు భాషల పరిస్థితి :
                క్రమ     భాష     2001                                       తొలి భగవద్గీత    తొలి బైబిల్‌        తొలి ఖురాన్‌      అధికార
                సంఖ్య   పేరు     జనాభా  %        లిపి      అచ్చువేసిన      అచ్చువేసిన      ముద్రించిన       భాషగా
                                                లక్షల్లో                      సంవత్సరం        సంవత్సరం        సంవత్సరం        ూన్న రాష్ట్రాలు
                1.            హిందీ   4220       41.03     దేవనాగరి                   1818       1915       అరుణాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌
                                                                                                                                                నికోబార్‌, బీహార్‌, చంఢీఘర్‌,
                                                                                                                                                ఛత్తీస్‌ఘర్‌, ఢిల్లీ, హర్యానా,
                                                                                                                                                హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌,
                                                                                                                                                మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,
                                                                                                                                                ఉ.ప్రదేశ్‌, ఉత్తరాంచల్‌
                2.            బెంగాలీ  834         8.11        బెంగాలీ           1809       1886       త్రిపుర, ప.బెంగాల్‌
                3.            తెలుగు  740         7.19        తెలుగు           1854       1930       ఆంధ్రప్రదేశ్‌
                4.            మరాఠి  719         6.99        దేవనాగరి         1821       1973       మహారాష్ట్ర
                5.            తమిళం 608         5.91        తమిళ్‌            1727       1879       తమిళనాడు, పాండిచ్చేరి
                6.            ూర్దూ  515         5.01        అరబిక్‌            1848       1731       జమ్ము కాశ్మీర్‌, (ఢిల్లీ,ఉ .ప్రదేశ్‌
                                                                                                                                                ఆంధ్రప్రదేశ్‌2వ)
                7.            గుజరాతీ          461         4.48        గుజరాతీ                   1823       1879       గురజాత్‌, డయ్యూబ్‌, డామన్‌,
                                                                                                                                                నాగర్‌హవేలి
                8.            కన్నడ  379         3.69        కన్నడ            1831       1978       కర్నాటక
                9.            మళయాళం      331         3.21        మళయాళం                1841       1970       కేరళ, లక్షద్వీప్‌
                10.          ఒరియా 330         3.21        ఒరియా           1815                       ఒరిస్సా
                11.          పంజాబీ 291         2.83        గురుముఖి, దేవనాగరి     1959       1870       పంజాబ్‌(ఢిల్లీ,2వ)
                12.          ఇంగ్లీషు 179         2.10        రోమన్‌  1783       1382       1649       ఇండియా 2వ అధికార భాష
                13.          అస్సామీ          132         1.28        బెంగాలీ           1833       1970       అస్సోమ్‌
                14.          మైథిలీ   122         1.18        నేపాలీ, దేవనాగరి           1914       బీహార్‌
                15.          సంతాలి  65           0.63        ఒరియా, రోమన్‌            1914       బీహార్‌, చత్తీస్‌ఘర్‌, జార్ఖండ్‌
                                                                                                                                                ఒరిస్సా
                16.          కశ్మీరీ    55           0.54        ూర్దూ            1899       1887       జమ్ము & కశ్మీర్‌
                17.          సింథీ    25           0.25        అరబిక్‌, గురుముఖి1954   1867       ...........
                18.          నేపాలి   29           0.28        నేపాలి            1914       2008       సిక్కిం
                19.          కొంకణి   25           0.24        కొంకణి            1970                       గోవా
                20.          మణిపురి 15         0.14        బెంగాలీ           1984       మణిపూర్‌ (మైథీ)
                21.          బోడో     14           0.13        రోమన్‌, దేవనాగరి, బెంగాలీ           1981       అస్సాం
                22           డోగ్రి      23           0.24        ఉర్దు, హిందీ, నాప్తాలిక               1826       జమ్ము, కాశ్మీర్‌
                23.  సంస్కృతం  0.14        0.01        దేవనాగరి                   1822       1897       ......
                                                10112.1 98.68
                                                                                       28.4.2006, గీటురాయి వారపత్రిక

తెలుగు దేవ భాషే -- ముందుమాట


‘‘భాషలందు పుణ్య భాషలు వేరయా’’ అన్నట్లు కొందరు పండితులు కొన్ని భాషలు గొప్పవి, కొన్ని భాషలు హీనమైనవి అంటూ శతాబ్దాల తరబడి చేసిన విష ప్రచార బాధితురాలు మన తెలుగు భాషామతల్లి. డబ్బు సంపాదించి పెట్టగల భాషలే ఎప్పుడూ దేవభాషలుగా ఘనకీర్తిని పొందాయి. డబ్బు రాని విద్య దరిద్రానికే అన్నట్లు ఇప్పుడు మన తెలుగు తృణీకారానికి గురి అవుతోంది. వ్యాపారం కోసం, పరిపాలన కోసం, మతం కోసం దేవ భాషలుగా భావించిన వాటిని అధికారులూ, వ్యాపారులూ,మత పెద్దలూ తలా ఓ చెయ్యి వేసి కాపాడుతున్నారు. మేపీ పోషిస్తున్నారు. పనికిరాదనుకుంటే మాతృభాషను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. మాతృభాషను కూడా మార్చుకుంటున్నారు.
                దేవభాష అన్నది మనం కలిపించుకున్న పదమే. దేవుళ్ళూ, దేవతలూ, దయ్యాలూ మనుషులను ఆవహించినప్పుడు పూనకంలో వెలువడే మాటలే దేవభాష అయ్యేటట్లయితే మాతృభాషలన్నీ దేవభాషలే అవుతాయి. ఎందుకో గానీ కొంతమందికి ఈ వాదన రుచించదు. నీ ఇష్టమొచ్చిన భాషలో, నీకు వచ్చిన భాషలో పూనకం కుదరదు అంటారు. దైవావేశితులైన స్వాముల పూనకం వేరు, ప్రవక్తల పూనకం వేరు, మామూలు మనుషుల పూనకం వేరు అంటారు.
                అరబీ, సంస్కృతం, ఇంగ్లీషు లాంటి దేవభాషల వల్ల అనేక భాషలున్న రాజ్యాలలో సమైఖ్యత సిద్ధించింది. మతపరమైన కర్మకాండలన్నీ అందరూ ఏకరీతిన జరుపుకోగలిగారు. నిజమే. అలాగని అమ్మను అవతలపడేసి అమ్మమ్మను ఎత్తుకో అంటే ఎలా? మనం అమ్మనూ గౌరవిస్తాము అమ్మమ్మను, నాయనమ్మను కూడా గౌరవిస్తాము. పాస్‌పోర్టు జాతీయతను బట్టి మాత్రమే ఇస్తారు కానీ భాషను బట్టి కాదు. కాబట్టి నేను తెలుగువాడిని అని ఇక ఎక్కడా చెప్పుకోవద్దు అంటే ఎలా?
                ఎవరి మాతృభాషపై వారికి అభిమానం ఉండడం సహజం. ఎవరి మాతృభాష కోసం వారు పాటుపడటం ధర్మం. ఆ క్రమంలో ఏదైనా భాష వాళ్ళు ‘‘మాదీ దేవ భాషే’’ అంటే మిగతా దేవ భాషలవాళ్ళు ూదార బుద్ధితో హర్షించాలి. సరసన చేర్చుకోవాలి గానీ ఇలా అడగటం తమ దేవ భాషను దిగజార్చాలనే ప్రయత్నం అని ఆక్రోశించవచ్చా? భాషల రంగంలోని గొంతుకోత పోటీలో ఓడిపోయిన భాష తన శక్తిని కూడ దీసుకొని తిరిగి లేవటానికి ప్రయత్నిస్తే చేయూతనివ్వాలిగానీ ఇంకా చంపవచ్చా? పతనమైపోయిన ఒక భాష తన పూర్వ వైభవం కోసం పరితపిస్తే నిజమైన దేవ భాష దాని పీఠాన్ని దానికిచ్చి ఆదుకోవాలిగానీ ఇంకా కిందకు పడదోయవచ్చా? నీ రాజ్యంలో నీవుండు. నా రాజ్యంలో నేనుంటాను. నా జోలికి నీవు రాకు. నీ జోలికి నేను రాను అనటం తప్పెలా అవుతుంది? నీ పప్పులూ నా పొట్లూ కలిపి ఊదుకు తిందాం రా అంటే ఎవరైనా ఎంతకాలం వస్తారు? కాలం గడిచేకొద్దీ తమకు జరుగుతున్న నష్టం తెలిసి నోరు విప్పి అడగరా?
                మాతృభాషాభిమానుల్ని అవమానించటం, దేవభాషల పేరుతో అజమాయిషీ చెయ్యటం ఎందుకు? ఎవరి భాషతో వారిని బ్రతకనివ్వండి. ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టవద్దు. తమను తాము దిద్దుకోక తప్పని పరిస్తితి వచ్చినప్పుడు అటు నుంచి నరుక్కు రమ్మంటారు. మీకు నిజంగా మీ భాష పైన మమకారం ూంటే మా సంగతి తరువాత చూద్దురుగానీ అవతలి మతం వాళ్ళతో మీ భాషా సంస్కరణ మొదలు పెట్టుకు రండి అంటారు. చివరికి అన్ని భాషలూ తమ మీదకు వలస వచ్చిన పెద్ద భాషల పాలన నుండి స్వాతంత్య్రం అయినా పొందాలి లేదా తమ ూనికినైనా కోల్పోవాలి. పాలిత భాషలు చేసేది తమ బ్రతుకు పోరాటమే గానీ మరో భాష మీద దాడి కాదు కాబట్టి చిన్న భాషలని దయచేసి కించపరచవద్దు.
                ఒక మతం వాళ్ళ భాషపై మరో మతం వాళ్ళు చేసే అధ్యయనాలు జనం ప్రామాణికంగా తీసుకోరు. ఒక భాష పైకి రాకపోవడానికి ఇంకొక భాష కారణం అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇంకో భాష నేర్చుకుంటే తప్ప బ్రతుకు తెరువు దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు. మాతృభాష బ్రతకటం కోసం, దాని కనీస హక్కుల కోసం చేసే పోరాటాన్ని భాషా దురభిమానం అనటం బలిసిన భాషల అహంకారమే. ఏమీ లేని పేదవాడు తన భాషలోని మల్లెపూలు కోసి ఉంచుకోవడానికి తన దగ్గర ఉన్న మురికి గోచీ బట్టలైనా వాడతాడు. అది నేరమేమీ కాదు. అన్నీ ఉన్న వాడు పేదవాడికి సహాయం చెయ్యకపోగా ఛీఛీ అనటం అహంకరించడం అన్యాయం.
                తెలుగు దేవభాష అనగానే తెలుగు కూడా దేవభాషా? అని ఆవేశపడవద్దు. ఎగతాళి చేయొద్దు. నిదానంగా స్థిమితంగా ఆలోచించండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంత చర్చ జరిగితే అంత మేలు. ఏదో జరగరానిది జరగబోతున్నట్లు కొంతమంది ఆందోళన చెందుతారు. మతపరమైన అంశాలు మాతృభాషలలోనే సాగాలంటే ఇప్పటికప్పుడే ఏమీ జరుగదు. జనానికి నచ్చితే క్రమేణా దైవ ప్రార్థనలు, పూజలూ, పునస్కారాలూ, కర్మకాండలూ స్వచ్ఛందంగానే మాతృభాషలలోకి మరలుతాయి. ఎందుకు మరలాలి? ఏమిటీ ప్రయోజనం? ఇవి మాతృభాషలలో ఎవరికి వారే చేసుకుంటారు కాబట్టి దైవారాధనలో మనసు తృప్తి చెందుతుంది. ఆనందం కలుగుతుంది. అంతా చక్కగా అందరికీ అర్థమౌతుంది. భాషల వాడకంలో నిర్బంధం పనికిరాదు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే సౌమ్యవాదులు తెలుగు ప్రజల పట్ల కూడా అదే రకం ఉదారతను ప్రదర్శించాలి. ‘తెలుగే దేవభాష’, ‘తెలుగు దేవ భాషే’, ‘తెలుగూ దేవభాషే’ అనే మాటల్లో ఒకదానికీ మరొక దానికీ అర్ధంలో ఎంత తేడా వుందో చూడండి. తెలుగుకు మరొక భాషను ఆదేశించే స్థాయి లేదు కానీ నేనూ బతికే ఉన్నాను, నన్ను ఉపయోగించుకోండి అని అభ్యర్థించుకునే అర్హత ఇంకా ఉంది.
                భాషలన్నీ మనిషే తయారు చేసుకున్నాడు. కానీ మతస్తుల నమ్మకం ప్రకారం ‘‘అన్ని భాషలూ దేవుడు పుట్టించినవే’’ అయినప్పటికీ మాంత్రిక భాషలూ, తాంత్రిక భాషలూ, యాంత్రిక భాషలూ సాంకేతిక భాషలూ అని మనిషి వాటిని చీల్చాడు. కుల వివక్ష, మత వివక్ష లాగానే భాషా వివక్ష కూడా పుట్టించాడు. ఈ నేరాన్నీ దేవుడికే అంటగట్టాడు. అసలు దేవుడికి కొన్ని ‘‘దరిద్రపు భాషలు’’ రావు పొమ్మన్నాడు. తెలుగు తల్లి అంటే ఒక ‘దరిద్రదేవత’ అనీ, ఆమె భాషను దేవుడే నశించిపోయే భాషల జాబితాలోకి నెడుతున్నాడు అనీ వాదిస్తున్నారు. రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్లు లేనిదే కొన్ని జాతులు ఎలా ఎక్కిరాలేవో అలాగే దేవుడి రక్షణ లేకపోతే కొన్ని భాషలు కూడా అభివృద్ధి చెందలేవు. అందుకే ఈ భాషల సమరంలో ఇలా ‘తెలుగూ దేవభాషే’ అనాల్సి వచ్చింది.
                తెలుగు తల్లి భాష కూడా దేవ భాషే అని నమ్మి ‘‘తెలుగు దేవ భాషే’’ అనే పేరు ఈ పుస్తకానికి పెట్టాను. భాషలన్నీ దేవుడివే అయినప్పుడు నా తల్లి బాషకూడా దేవ భాషే అవ్వాలి గదా అని అతి సాధారణంగానే అనుకున్నాను.
                ఏదైనా ఒక భాష దేవ భాష లేదా దేవతా భాష అనే అభిప్రాయం కలిగితే ఆ భాషను ఎంతో గౌరవిస్తారు. పూజ్య భావంతో మొక్కుతారు, సాగిల పడతారు. అందుకే తెలుగు భాషామతల్లిని మన పెద్దలు తెలుగుతల్లి అనే దేవతగా భావించి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ ` మా కన్న తల్లికీ మంగళారతులు’’ అంటూ అడపాదడపా పూజలూ జరిపిస్తున్నారు. మనిషికి జడవని వారు కొందరు దేవుడికి భయపడతారు. దేవుడి భాష పట్ల శ్రద్ధా భక్తులు కనబరుస్తారు. ఒక సంస్కృత శ్లోకమో, అరబ్బీ లిపిలోని సూరానో కనబడితే కళ్ళకద్దుకొని జేబులో దాచుకున్న వారిని నేను చూశాను. అదే వాటి అర్థాలు వివరించిన తెలుగు లిపిలోని కాగితానికి, సంస్కృత శ్లోకానికో, అరబీ లిపిలోని సూరాకో ఇచ్చినంత విలువ ఇవ్వకపోవటాన్ని గమనించాను. నా భాషకు విలువ లేకపోవటానికి ఏమిటి కారణం? అని పరిపరి విధాలా ఆలోచించాను. తెలుగుకు పూర్వ వైభవం రావాలంటే ఏమేం పనులు చెయ్యాలో అన్నీ చెయ్యాలి.
                తెలుగును దేవభాష అంటేనే ఒప్పుకోలేక కడుపు రగిలిపోయే తెలుగు బిడ్డలు ఒక పక్క, సంస్కృతం, అరబీలతో తెలుగును సమానం చేసి మాట్లాడుతారా? ఎంత ధైర్యం? అని కారాలు మిరియాలు నూరే తెలుగు బిడ్డలు మరోపక్క. ‘‘దేవభాష అంటే మృత భాష’’ ఆ భాష ప్రజల రోజువారీ వాడకంలో వుండదు. దేవుడి కోసం ప్రార్థనల్లో, కర్మకాండలలో మాత్రమే దేవ భాషను వాడుతారు. ఇంకా తెలుగుకు బోలెడంత ఆయుషు ఉంది కదా? అప్పుడే తొందరపడి తెలుగును దేవభాషల జాబితాలో చేరుస్తారా? అని వాదించే తెలుగు బిడ్డలు ఇంకో పక్క. అడుక్కు తినే వాడి దగ్గరకు గీరుకుతినే వాడొచ్చినట్లు, కూర్చొని తన్నేవాడి దగ్గరకు కూలబడితన్నే వాడు వచ్చినట్లు తెలుగును కూడా మరో దేవ భాషగా మార్చి మా పొట్టకొట్టొద్దు అని ఆక్రోశించే తెలుగు బిడ్డలు మరో వైపు. ఇలా రకరకాల శాపనార్థాలతో ‘‘తెలుగు కూలిందాకా ఒకటే పోరు’’ అన్నట్లుగా ఉంది. ఇవన్నీ తీరుబడిగా ఆలోచిస్తే అర్థమయ్యే వాస్తవం ఏంటంటే ` జనం దైవారాధనల కోసమైనా అలాంటి భాషలకు చావు లేకుండా చేస్తున్నారు. ప్రపంచ భాష దెబ్బకు కాలక్రమేణా వేలాది భాషలు చనిపోతాయి. అంటే మృత భాషలు అవుతాయి. మృత భాషలన్నీ దేవ భాషలు కాలేవు. దేవుడిని చేరిన భాషలను దేవ బాషలు అనటంలో తప్పులేదు. మనిషే వాటిని దేవ భాషలుగా సమాజంలో నిలబెట్టాలి. ఎలాగా? బతికున్న రోజుల్లో తల్లికి కూడు పెట్టని కొందరు ఘనంగా వర్ధంతులు చేస్తూ అమ్మను స్మరించుకుంటారే? అలాగన్నమాట. శవాన్ని మేళతాళాలతో ఆనందంగా ఊరేగిస్తూ స్మశానానికి తీసుకెళ్ళే జాతులనెప్పుడైనా చూచారా? మృతుడు దుఃఖ విముక్తుడయ్యాడని వాళ్ళు సంతోషపడతారట. ఆ దేవుడే ఇన్ని భాషలను పుట్టిస్తూ చంపేస్తూ వుంటే మానవమాత్రులం మనమేం చేయగలం? మనకెందుకు బాధ? ఆ మహా మహా రాజ భాషలకే చావు తప్పలేదు. అవన్నీ దేవుడి దగ్గరకు చేరి దేవ భాషలైపోలా? మనం ఈనాటికీ వాటిని గౌరవించటం లేదా? తెలుగు చనిపోయి నామరూపాలు లేకుండా నాశనమై, కనుమరుగు కావటం కంటే దేవ భాషగానైనా మన కళ్ళముందు శాశ్వతంగా కొనసాగటం మహా భాగ్యం కదా? చేజేతులా మన భాషను మనమే చంపుకొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో చచ్చీ సాధించే గొప్ప భాషల సరసన తెలుగును చేర్చటమే మన భాషకు మనం చేసే కనీస మేలు. ప్రయత్నాలు ఇప్పటి నుండి మొదలు పెడితే ఇంకో వందేళ్ళకైనా తెలుగూ దేవ భాషల సరసన చేరవచ్చు.
                ఈ పుస్తకంలోనే చెప్పాలనుకున్నవన్నీ చెప్పలేకపోయాను. కాలం మార్పుల మాయం కదా. భవిష్యత్తులో చెప్పాల్సి వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాను. మన మాటలోని మాధుర్యం మనమెందుకు వదులుకోవాలి ?  ఒకనాడు పరమ దేవభాష ఇంగ్లీషుకున్న సౌలభ్యాలన్నీ తెలుగుకు కూడా ఉంటే బాగుండునే అనుకునేవాడిని. ఇప్పుడీ పుస్తకానికి ముందుమాట తెలుగులో నా చేతులతో నేనే కంప్యూటర్లో టైపు చేసుకునే స్థాయికి తెలుగును మన సాంకేతిక నిపుణులు చేర్చారు. ఆనందంగా ఉంది. మన భాషకు సాంకేతిక ఊపిరులూదుతున్న వాళ్ళందరికీ నమస్కారం. అలాగే రాజభాష కావలసిన తెలుగుకు ఇప్పుడున్న ఆటంకాలన్నీ తొలిగేలా అధికారులు, రాజకీయ నాయకులు, మతపెద్దలు, పురోహితులు, ముల్లాలు, కళాకారులు, అధ్యాపకులు, ఆచార్యులు అంతా ఎవరి పరిధిలో వాళ్ళు సహకరించాలి అని మనవి చేస్తున్నాను.
                తెలుగులో పాలన జరగాలనీ, విద్యాబుద్ధులు తెలుగులోనే ఉండాలనీ 1980 నుండీ నేను పత్రికలకెక్కటం మొదలుపెట్టాను. తెలుగు కూడా చనిపోయే భాషల జాబితాలో చేరింది అన్న వార్తలు వినబడ్డ తరువాత నా తల్లి భాషకు ఎందుకింత దుస్థితి కలిగింది అనే ఆవేదన పెరిగింది. నా అమ్మ భాష బతకాలి, ప్రజారంజకంగా నా భాషలో కూడా పాలన జరగాలి అని నాకు చిన్న ఆశ పుట్టింది. అది దురాశ అని కొందరూ అత్యాశ అని కొందరు విమర్శించారు, విమర్శిస్తూనే వున్నారు. 
                నేను అత్యాశపరుణ్ణీ, దురాశావాదినీ, నిరాశావాదినీ కాదు. కేవలం సమంజసమైన, సహజ న్యాయం కోరే, ఆశావాదిని. అమ్మకు న్యాయం చెయ్యని కొడుకూ ఒక కొడుకేనా? అనే సామెత గుర్తొచ్చింది. తెలుగుకు సరైన న్యాయం జరిగే వరకు, తెలుగుకు పట్టం కట్టేదాకా నా ప్రయత్నం నేను చేస్తూనే వుండాలి అనుకున్నాను. అప్పటివరకూ పత్రికల్లో వచ్చిన నా వ్యాసాలతో ‘‘తెలుగు అధికార భాష కావాలంటే...’’ పుస్తకం 19 అధ్యాయాలతో 2004లో ఒకసారీ, 28 అధ్యాయాలతో 2006లో మరొకసారీ తెచ్చాను. 2006 నుండి పత్రికలలో వచ్చిన 22 వ్యాసాలతో ఈ పుస్తకం తెస్తున్నాను.
                ముందుమాటలు రాసిచ్చిన గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్‌గారికీ, డాక్టర్‌జి.వి. పూర్ణచందు గారికీ,  అన్నయ్య ప్రొఫెసర్‌నూర్‌బాషా అబ్దుల్‌గారికీ, డానీ గారికీ, నిసార్‌అహ్మద్‌గారికీ, ముఖపత్రం అందంగా తీర్చి ఇచ్చిన అబ్దుల్లా గారికీ, పుస్తకం ముద్రించిన శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు.

27, మార్చి 2012, మంగళవారం

తెలుగు భాషకు సత్యసాయి అండ

తెలుగు భాషకు సత్యసాయి అండ తెలుగు భాషకు సత్యసాయి అండ “దైవారాధనలో వాడే భాషను దేవ భాష అంటారు.తెలుగును దైవారాధనలో వాడరు కాబట్టి అది దేవ భాష కాదు.అసలు తెలుగు దేవ భాష అనటానికి ఆధారాలేంటి? దానికా హోదా ఎవరిచ్చారు?” లాంటి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేక చాలా సార్లు నాకు తలకొట్టేసినట్లయ్యింది. ఎవరి దేవుడి భాషకు వాళ్ళు స్తోత్రగీతాలు పాడుతున్నారు.ముక్కోటి దేవతల్లో తెలుగు మాట్లాడే దేవుడే లేడంటే నాకు అవమానంగానూ అనుమానంగానూ ఉంది. పైగా తెలుగును ఇంత దిక్కు మాలిన భాషగా చేసి 18 కోట్ల ప్రజలను పర భాషా దాసులుగా పడి ఉండండి అని మన తల రాత ఇలా రాసిన దేవుళ్ళ రాజకీయం కూడా నాకు నచ్చకుండా పోయింది. పోనూ పోనూ నాకూ ఇందులో మానవ కుట్రే ఏదో దాగి ఉందనీ అనిపించింది.దేవుడు సమవర్తి కదా మనిషికి లాగా ఆయనకు ఇంత భాషా పక్షపాతం ఎందుకుంటుంది?ఇదేదో భక్తి రంగంలోనే తేల్చుకోవాలి అనిపించింది. రాయిని విగ్రహంగా చేసి మొక్కితే దేవుడిలా పూజలందుతుంది.మొక్కటమే ఇక్కడ ముఖ్యం.18 కోట్ల ప్రజలు మాట్లాడుతున్న సజీవ భాషకు ఆపాటి గౌరవం కట్టబెట్టలేమా?మన జనమే మన భాష ను అవహేళన చేస్తుంటే పరాయి వాళ్ళు పొగుడుతారా?ప్రజల విస్తృత వాడకంలోకి తేకపోతే ఈ భాష కొడిగట్టడం చచ్చి పోవటం ఖాయం అని ఐఖ్య రాజ్య సమితి తేల్చింది. ప్రజలు తెలుగును విస్తృతంగా వాడాలంటే తెలుగు దేవ భాషే అని మనమంతా గట్టిగా నమ్మి,మరింత సమర్ధవంతమైన వాదనలతో ఋజువు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రవాహంలో పడి కొట్టుకేళ్ళేవాడు ప్రాణ రక్షణ కోసం ఏ గడ్డిపరకనైనా పట్టుకుంటాడు.అలాంటి ప్రమాద బాధితుడి ఆర్తనాదమే ఈ వ్యాసం.మరణశయ్య మీద ఉన్న వాడు ఏ మతస్థుడి సహాయమైనా సరే ఇష్టంగానే తీసుకుంటాడు.తెలుగు భాష ప్రాణం నిలవటానికి అండగా నిలిచిన వారు ,ఆ భాష గొంతులో కాసిని నీళ్ళు పోసిన వారు ఏ రంగం లోని వారైనా సరే ఆశ్రయించాను,అవసరంకొద్దీ తప్పలేదు. బాబాలపై నాకు వ్యక్తిగత విశ్వాసాలు ఏమీ లేకపోయినా సరే నా భాషకు కూడా దైవ భాష హోదా ఉంది అనే వాదనలో కొన్ని మెట్లు ఎక్కటానికి వారి సాహిత్యం ఉపయోగపడింది. విమర్శలు ఎన్నో వైపుల నుండి వస్తాయని తెలుసు.ఇది అవకాశవాదం కాదు ప్రాణం మీదకొచ్చిన ఒక భాషకు అవసరమైన వాదం. తెలుగు భాషలో రచనలు చేసిన వాగ్గేయకారులు ,భక్తి వేదాంత జ్నానులపై దృష్టి నిలిపాను.గతించిన మహానుభావులు గతించిపోగా మన సమకాలికుల్లో సత్యసాయిబాబా కూడా నాకు ఒక తెలుగు పరిరక్షకుడిగా కనబడ్డారు.కారణాలు వరసగా వివరిస్తాను.ఆయన మహిమాలూ గట్రా పక్కన పెట్టి తెలుగు భాషకే జీవితాంతం ఎలా కట్టుబడిపోయాడో మిగతా ప్రపంచాన్ని తన తెలుగు భాషతో ఎలా ప్రభావితం చేశాడో అన్న అంశం వరకే పరిమితమై పరిశోధించాను. సాయి భక్తుల నమ్మకం “బాబా దేవుడు.ఆయనకు అన్నీ భాషలూ వచ్చు.ఆయన ఒక భాషకు పరిమితం కాలేదు.ఆయన భాషా పక్షపాతి కాడు.అన్ని భాషలూ ఆయనవే.సంస్కృతం దేవ భాష అనీ ఆయన చెప్పాడు కానీ తెలుగు భాష గొప్పదనీ ,అందులోనే పరిపాలన జరగాలనీ ,ఆయన ఎప్పుడూ చెప్పలేదు.కాకపోతే ఆయన వాళ్ళ అమ్మకు ఇచ్చిన మాట నిలుపుకునేందుకు పుట్టపర్తిలో నిలిచిపోయాడు.తెలుగు నేలపై ఒక తెలుగు తల్లికి పుట్టాడు గనుక తెలుగులోనే మాట్లాడాడు.అంతకంటే ఆయన దృష్టిలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు గౌరవం ఏమీలేవు” అని పలువురు బాబా భక్తులు అన్నారు. హేతువాదుల వాదన బాబాకు తెలుగు తప్ప మరే భాషా రాదు.అన్ని భాషలూ వస్తే అనువాదకులను ఎందుకు పెట్టుకుంటాడు? అని భాషోద్యమకారుల్లోని హేతువాదులు కొందరు వాదించారు.అయితే సాయి తెలుగువాడు కావటాన భక్తి గొడవ వదిలేసి భాషాపరంగా ఆయనపై తెలుగు ప్రేమ చూపించారు. బాబా గురించిన ఇలాంటి నమ్మకాలూ అద్భుతాల వాదనలూ విమర్శలూ వినీ వినీ తెలుగు భాషకు పనికొచ్చే నాలుగు ముక్కలు ఏమన్నా దొరక్కపోతాయా అన్న ఆశతో 2012 మార్చి 13 ,14 తేదీలలో పుట్టపర్తి వెళ్ళాను.మిత్రులు బొడ్డు రామయ్య గారు ( ఫోన్.9948471264,9393283099 ) ఆతిధ్యమిచ్చారు.80 ఏళ్ళ వయసులో కాళ్ళు ఈడ్చుకుంటూ కూడా నాకు వండి వడ్డించి నేను తిన్నాకనే తాను తిన్నారు.అదేంటంటే బాబా మాకు నేర్పిన పద్ధతి అన్నారు. తెలుగు భాషతో సంబంధం ఉన్న అందరి దగ్గరకూ తీసికెళ్ళారు. వాళ్ళందరినీ ఒకటే అడిగాను.తెలుగు భాష గురించి బాబా ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో ఆ వాక్యాలు కావాలన్నాను.తెల్లారేలోగా లైబ్రరీలో నరసింగరావు గారూ,వెంకట మునియప్ప గారూ ఆయా పుస్తకాలను వెతికి పట్టుకొని టేబుల్ మీద పెట్టారు.నాకు చాలా సమయం కలిసి వచ్చింది.ఇక అక్కడ తెలుగు విభాగంలో పనిచేస్తున్న గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు “ఇప్పటి దాకా బాబా సందేశాలను భక్తి కోణం నుంచి మాత్రమే పరిశోధించాను. ఇక మీదట భాషాకోణం నుంచి కూడా పరిశీలిస్తాను , తెలుసుకున్న విషయాలు మీదృష్టికి తెస్తాను “ అన్నారు . బాబా అనువాదకులు కామరాజు అనిల్ కుమార్ గారు “ ఈ విషయంలో శ్రీనివాసులు దిట్ట.అతను ఎంత చెబితే నేనూ అంతే “ అన్నారు.శ్రీనివాసులు గారు “ఇక నేను కూడా తెలుగు భాష గురించి బాబా గారు సెలవిచ్చిన ముత్యాలు ఏరి మీకు పంపిస్తాను”అన్నారు.బాబా తన జీవితాంతం చేసిన అసంఖ్యాక ప్రసంగాల్లో తన తల్లి భాష గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదా?అన్న నా ప్రశ్నతో వాళ్ళూ పునరాలోచనలో పడ్డారు.”వెతికి తీస్తాం సార్” అన్నారు. ఆధారాలు,ఋజువులూ,సాక్ష్యాలూ లేకుండా న్యాయవాది వాదిస్తే న్యాయమూర్తి ఒప్పుకోడు.తెలుగు దేవ భాషే అని నిరూపించటానికి ఎక్కడెక్కడ ఎన్ని ఆధారాలు దొరికితే అన్నీ తీసుకోవాలి. భవిష్యత్తులోనన్నా మన జనానికి కనువిప్పు కలగొచ్చు. తెలుగుకింత దివ్య శక్తి ఉందా అని తెలుసుకొని తప్పిపోయిన కుమారుల్లాగా తిరిగి రావచ్చు.తల్లి భాషకు పట్టం గట్టి పూజించనూ వచ్చు.చరిత్ర తిరగబడానూ వచ్చు. బాబా మహత్యాల గురించిన చర్చలోకి నేను వెళ్ళను. ఆయన తెలుగు భాషకు ఏ మాత్రం సాయపడ్డాడో ఆలోచిద్దాం .తెలుగు భాషకు బాబా సమకూర్చిపెట్టిన అండా దండా ఏమైనా ఉందా? అని పరిశీలిద్దాం. 125 దేశాల్లో ఉన్న బాబా భక్తులు ఆయన తెలుగులో చేసిన ప్రసంగాలు కలకాలం నిలిచే నిత్య సత్యాలు అని నమ్ముతున్నారు. ప్రపంచంలోని ఏ భాషస్తులైనా సరే తన సందేశాలను తెలుగు భాషలో విని,చదివి,అనువదించుకొని పోవాల్సిన గొప్ప స్థాయిని , గత్యంతరం లేని స్థితిని బాబా తెలుగుకు కలుగజేశారు. ఇంతకీ భాషల గురించి బాబా ఏమన్నారు?: “గంగా యమునల్లాగా ఈ సభలో తమిళులు,తెలుగులు ఇద్దరున్నారు. నేను ఎప్పుడూ ఒకే భాష లో మాట్లాడుతాను. శ్రోతల కోసం నా భాష నేను మార్చుకోను.తెలుగు రాని వారు కూడా నా సందేశ సారాంశం తెలుసుకుంటారు.నాతో వ్యవహరించటానికి భాష ఒక అడ్డంగా ఉంది.మానవ జీవన యాత్రలో ఆన్ని భాషలకూ గొప్ప పాత్ర ఉంది.వారి భావాలను వ్యక్తం చేయటానికీ,వారి బలహీనతలను దాయటానికీ,వారి ఆలోచనలు రూపుదిద్దుకోటానికీ వగైరా..కానీ నేను హృదయ భాషలో మాట్లాడుతాను,వింటాను.మనుషులు నాలుకలతో మాట్లాడే భాషలు అయోమయంలో పడేస్తాయి.వాటివలన తెగలు,విభేదాలు,అడ్డుగోడలు పుడతాయి.ఈ ప్రపంచమే నా ఇల్లు.అందులో ఎన్నో గదులున్నాయి.నీ భాషకు ప్రాముఖ్యత ఇవ్వక భావానికి ఇవ్వు.దయా దాక్షిణ్యాలతో నిండిన హృదయ భాషే అసలైన భాష.అది అందరికీ అర్ధమయ్యే భాష.మూగవాడు కూడా మాట్లాడే భాష .చెవిటి వాడు కూడా వినగలిగే భాష.ఒక భాష కంటే మరో భాష గొప్పదని గర్వ పడకండి,తగాదాలు పెట్టుకోకండి.అనేక భాషలలోని బలహీనతలను అదిగమించటానికి సులభంగా అర్ధమయ్యే వాడుక భాషను ,హృదయ భాషను నేర్చుకొని ,ఉపయోగించండి” అన్నారు బాబా.( (18.8.1984) Satya Sayi Speaks vols.II,IV) హృదయ భాష అంటే ? ఎవరి మాతృ భాషే వారి హృదయ భాష. బాబా హృదయ భాష తెలుగు.ఈయన ద్వారా వెలువడిన సాహిత్యమంతా తెలుగులో వచ్చింది.ఆయన తెలుగు సాహిత్యం కావాలనుకున్న వాళ్ళంతా వారి వారి భాషలలోకి దానిని మార్చుకున్నారు. అయితే మూల భాష కు అన్ని మతాలూ దేవ భాష అంటూ పెద్దపీట వేస్తాయి.తమ మూల భాష కోసం ఆయా మతస్తులు ప్రాణమిస్తారు. బైబిల్ కు హెబ్రూ ,గ్రీకు –ఖురాన్ కు అరబీ –గీతకు సంస్కృతం లాగా సత్యసాయి భక్తులకు తెలుగే మూల భాష కాబట్టి దేవ భాషల సరసన తెలుగు కూడా చేరింది. ఆంధ్రుల హృదయ భాషైన తెలుగును మన ప్రభుత్వం మన పాఠశాలల్లో తప్పనిసరి చేయలేక పోయింది.కానీ బాబా విశ్వ వ్యాప్తమైన తన భక్తులందరికీ తెలుగులో మాత్రమే తన సందేశాలను వినిపించారు.తెలుగులో వినక తప్పని పరిస్థితి కల్పించారు. బాబా బోధనలకు తెలుగే మూల భాష కాబట్టి సాయి భక్తులకు తెలుగే దేవ భాష . తెలుగులో ఆశువుగా పద్యాలు ‘అల్లా యంచు మహమ్మదీయులు జహోవా యంచు సత్ క్రైస్తవుల్ పుల్లాజ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవులు సదా ఉల్లాసంబున గొల్వ నెల్లరును నాయుర్భోగ భాగ్యాది సం పల్లాభంబు లొసంగి బ్రోచు పరమాత్ముం డోక్కడే చూడుడీ’ ---అని బాబా సర్వ మత హితంగా సందేశమిచ్చారు ( 27.7.1978) తేట తెలుగులో ఆశువుగా బాబా ఎన్నో పద్యాలు చెప్పారు.పద్యాలే కాదు పాటలు కూడా రచించారు,పాడారు.తెలుగు భాషకు బాబా చేసిన సేవ చాలాగొప్పదే .మహిమలూ మహత్యాలూ సరే గానీ ఆయన భాషను అందులోని చమత్కారాలనూ పదసంపదనూ ఇకనైనా తెలుగు భక్తులు పరిశోధించాలి. రాజీ పడని తెలుగు బోధకుడు తెలుగు దేశంలో తెలుగు శ్రోతల ముందు తెలుగులో మాట్లాడటానికి బెదిరిపోతున్న బ్రహ్మానంద పాండా అనే ఒరియా పండితుడిని తెలుగులో మాట్లాడు అంటాడు బాబా.నేను తెలుగులో మాట్లాడుతాను,నీవు ఆంగ్లం లోకి అనువదించు” అంటాడు బాబా.(సనాతన సారధి,ఏప్రిల్ 2009). రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు లాగా ఆధ్యాత్మిక రంగంలో సత్య సాయి తెలుగు భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠ లు తెచ్చి పెట్టారు.తెలుగు మామూలు భాష కాదు ,అది విలువైన భాష , మాహా గొప్ప భాష అని అందరూ తెలుసుకునేలా చేశారు.వీళ్ళీద్దరూ తెలుగుకు వారి వారి రంగాలలో ఒక అధికార హోదా తెచ్చి పెట్టారు. గొప్పల కోసం మాతృ భాషను వదలలేదు.మరో భాష కోసం పరుగులు తీయలేదు.అవసరాలకోసం రాజీ పడి తల్లి భాషను వదులుకోలేదు. తెలుగు పుటక పుట్టిన అనేక మంది ప్రముఖ బోధకులు వారికి తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడుతూ తెలుగు అనువాదకుల్ని పెట్టుకోవటం చూస్తున్నాము.సత్యసాయి ఈ కృత్రిమ స్వభావం చూపకుండా యావజ్జీవితం నిక్కమైన తెలుగు వాడిగా నిలిచాడు. తెలుగు భాషకు పట్టిన మహద్భాగ్యం “జగద్గురువుగా నిర్గుణ పరబ్రహ్మము తన సకల శక్తులతో మానవరూపంలో మన మధ్య అవతరించడం,అందునా తెలుగు దేశంలో అవతరించడం,సర్వప్రపంచ భాషలలో మాట్లాడగలిగిన్నీ వారు మన తెలుగులోనే మాట్లాడటం,ఈ పత్రికలో వారు మాట్లాడిన తెలుగు సందేశాలను ముద్రించడం ఇవన్నీ సామాన్య అదృష్టాలు కావు.ఇవన్నీ సాయి భగవానుని అపార అనుగ్రహానికి సంకేతాలు” --- ముదిగొండ వీర భద్రయ్య సంపాదకుడు సనాతన సారధి,ఏప్రిల్ 2009). సాక్షాత్తూ భగవంతుని నోట వెలువడిన ఈ తెలుగు పద్యాలను ఆంగ్లం లోకి అనువదించాను --ఎస్.బి.సీతారాం (సత్యసారం-పద్యరూపం) “భగవాన్ బాబా తెలుగు దేశంలో పుట్టటం,తెలుగులో రచించటం,తెలుగు పాటలు పద్యాలూ పాడటం,తెలుగు దేశానికీ తెలుగు భాషకూ పట్టిన మహద్భాగ్యం .తెలుగు జాతికి తరగని ధనం శ్రీ సత్య సాయి నాధ సుధ” -- బి.రామరాజు (23.11.2005) తెలుగుకు బాబా బంగారం లాంటి అవకాశం మాతృభాషను విడనాడకుండా బాబా అన్యాయమై పోతున్న తెలుగుకు రక్షకుడుగా నిలిచాడు.నీవొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్లు నేను భాషా కోణంలో నుంచి బాబాను చూశాను.బాబా కూడా ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య, ఒక రామదాసు , ఒక ఉమర్ అలీషా లాగా తెలుగు లో విస్తారమైన భక్తి వేదాంత సాహిత్యాన్ని రచించారు,ప్రసంగించారు, పాడారు.ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి,ఆయన భక్తిలో మునిగిపోతున్న భక్తులు ఆయన భాషపై తగినంత శ్రద్ద పెడితే భాషకు పెద్ద లాభం కలుగుతుంది.తెలుగు దేవ భాషే అనే నమ్మకం ఒకసారి రుజువై బలపడితే అన్ని భాషల భక్తులూ తెలుగు భజనలు చేస్తారు.తెలుగులో పాడక తప్పని పరిస్థితి వస్తే ఆ భాష నేరుస్తారు.ఆయా మతాల వాళ్ళు నానా కష్టాలూ పడి సంస్కృతం,అరబీ,హెబ్రీ నేర్చుకుంటున్నట్లే విశ్వ వ్యాప్తం గా ఉన్న బాబా భక్తులు తెలుగు భాష వల్లె వేస్తారు.బాబా ఇచ్చిన బంగారం లాంటి అవకాశం బాబా భక్తుల్లోని తెలుగు భాషోధ్యమ కారులు,భాషాభిమానులు వాడుకోవాలి.ఎందుకంటే ఇలాంటి పని ఇతర భాషల వాళ్ళు చెయ్యరు .ఆయన సాహిత్యమంతా వారి సొంతం అయ్యాక బాబా మా ఆంగ్లేయుడు ,మా తమిళుడు అంటే మాత్రం ఏం చేస్తాం? అసలే శక్తి చాలక సాధుత్వం వహించే తెలుగు వాళ్ళం కదా? బాబా చేతిరాత “బలమే జీవం.బలహీనతే మరణం” అన్నాడు వివేకానందుడు.భాషలకు కూడా ఈ సూక్తి వర్తిస్తుంది.నిజాం నవాబుల చేతి రాతలను కూడా హైదరాబాదు మ్యూజియం లో భద్ర పరచుకొని మురిసిపోతున్నారు వారి వారసులు.బాబా చేతిరాత సాహిత్యం యావత్తూ తెలుగు లోనే ఉంది .దానిని స్కానింగ్ తీయించి తెలుగు భక్తులు ‘ప్రేమ ధార’,’దివ్య జ్నాన దీపికలు’ లాంటి పుస్తకాలు ప్రచురించారు.14.10.1946 న బాబా రాసిన పద్యం ఆయన చేతివ్రాతలో ఎలా ఉందో చూడండి: ఇండియా టుడే 2012 జనవరిలో Divine Grace satya saibaba అనే 120 పేజీల ప్రత్యేక సంచిక విడుదల చేసింది.అందులో బాబా ఇంగ్లీషులో రాసిన 4 ఉత్తరాలను స్కాన్ చేసి ముద్రించింది.ఆయన తెలుగు లిపిలో రాసిన లేఖలు గానీ,ఆంగ్లలిపిలో రాసిన తెలుగు లేఖలు గానీ,ముద్రించలేదు.తెలుగు దేవ భాష అంటే తప్ప బాబా రాసినవైనా సరే ఒక్క తెలుగు లేఖను కూడా ఇతర భాషల వాళ్ళు ముట్టరు. తమిళులు త్యాగయ్య రచించిన తెలుగు కీర్తనలను అనువాదం చెయ్యకుండా యదాతదంగా తమిళంలో రాసి పాడుకొంటున్నారు.దానికి కారణం సంగీతం.త్యాగయ్య తెలుగు సంగీత బాణీలు తమిళంలో ఇమడవు.సంగీత జ్నానము భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనసా ?అన్న త్యాగరాజు తమిళ దేశంలో ఉండి కూడా తెలుగు పాటలు పాడాడు.మూల భాష తప్పనిసరి అనే షరతు పెడితే సరి- తెలుగు వాళ్ళు తమిళ పాశురాలు పాడినట్లు, తమిళ భక్తులు త్యాగయ్య కీర్తనలను తెలుగులోనే పాడినట్లూ , బాబా కీర్తనలను కూడా ప్రపంచమంతా తెలుగులోనే పాడుతారు. బాబా తెలుగులో చేసిన ప్రసంగాలన్నింటినీ ,మన తెలుగు భక్తులు ఆంగ్లంలోకి ,తమిళంలోకి అనువదించిపెట్టాక ఇక తెలుగు అవసరం ఏముంటుంది? అవసరంతీరాక తెలుగును తీసి అవతల పారేస్తే ఎలా? మిగతా మతాల లేఖనాల మూల బాష దేవ భాషలు ఎలా అయ్యాయో అలాగే సాయి లేఖనాల మూల భాష కూడా దేవ భాషే అవ్వాలి కదా? బాబా మూల భాష తెలుగు సాయి ప్రసంగాల మూల భాషే తెలుగు అయినప్పుడు తెలుగులో ఆయన సాహిత్య ముద్రణ పరాయి భాషలకంటే సులభం . అనువాదమే అక్కరలేని తెలుగు వాళ్ళు ఇంకా ఆపని పూర్తి చేయలేదు.తెలుగు భక్తులు ఆయన సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి,అరవం లోకి అనువాదం చేసిపెట్టారు గానీ తమ సొంత భాషలోకి Satya Sayi Speaks తరహా లో 42 సంపుటాలు తేలేకపోయారు. బలవంతుడు తోసుకొని ముందుకెళుతుంటే పోనీలే అని ముచ్చటపడి వెనక్కి తగ్గే సహనశీలత, పక్కకు జరిగి ప్రోత్సహించే ఉదారత తెలుగు వాడిది.అదే తెలుగుతనం ఇక్కడా గోచరిస్తోంది. “పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియు ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీ శక్తి చూపిన దివ్య భూమి ఔర ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగదో అట్టులైనారు మన భారతీయులు నేడు “ అని బాబా ఆవేదన చెందారు. మిగతా భాషల సంగతేమో గానీ తెలుగు వారికి ఈ పద్యం చక్కగా సరిపోతుంది. చేతిలోని ముద్దను చెరువులో విసిరేసి చెయ్యి నాకినట్లుగా ఉంది మన పరిస్థితి . దివ్యాత్ముని మాతృ భాష తెలుగు బాబా తెలుగు ప్రసంగాలను ఇంగ్లీషులోకి అనువదించే అనిల్ కుమార్ గారు బాబా సమాధి ని ఇలా వర్ణించారు: ‘బంగారూ’ అని తెలుగులో పిలిచే సాయి శయన మందిరం ఇది.ఈ మహా సమాధి దర్శన అనుభవం సరస్వతీ దేవాలయం,మక్కాలోని కాబా లాగా,బెత్లేహేమూ,ఎరూషలేముల్లోని క్రీస్తు జ్నాపకాల్లాగా,సిక్కుల గురుద్వారా,బుద్ధగయ,అరుణాచల క్షేత్రం,శ్రీశైలకాశీ క్షేత్రం,షిర్డీ సమాధి,మసీదు దర్గాల సందర్శన అనుభవం లాగా ఉంటుంది. (సనాతన సారధి సెప్టెంబర్ 2011) సమాధి దర్శనమే ఇంత భాగ్యదాయకంగా ఉంటే ఆ సమాధి లో శయనించిన దివ్యాత్ముని సందేశ శ్రవణం కూడా భాగ్యదాయమే. అదీ ఆయన మాతృ భాష (దేవ భాష) లో ఆయన చెప్పింది చెప్పినట్లు వినే భాగ్యం తెలుగు వాడిదే. తనను తాను తగ్గించుకోవటం తనను తాను ఉపేక్షించుకోవటం తెలుగు వాడి సహజ లక్షణం . బాబాతో ఆడి పాడిన బాల్య మిత్రుడు కరీం సాహెబ్ “ఆ స్వామి హజ్రత్ మహమ్మదు,హజ్రత్ ఇబ్రాహీము,ఏసు క్రీస్తు లాంటి వాడు “ అన్నాడు (సనాతన సారధి మార్చి 2008) మరి అలాంటి స్వామి సొంత భాషను దేవ భాషే అని ఎందుకు అనుకోరు ? సాయి భక్తులు సాయి భాష ను కూడా గొప్పగా పొగడాలి.దేవుళ్ళను చాలా గొప్పగా చెప్పి , వాళ్ళ భాషను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ కోసమే నేను ఇలా కావాలని అడుగుతున్నాను. తెలుగు కీర్తనలకు దేవుళ్ళు దిగి వచ్చారు బమ్మెర పోతన, కంచర్ల గోపన్న (రామదాసు),త్యాగయ్య,అన్నమయ్య,లాంటి ఆద్యాత్మిక వేత్తలు ,సంగీత కారులు,మహా భక్త గాయకులు,భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లు గా రచించిన కీర్తనలన్నీ తెలుగులోనే ఉన్నాయి .ఆ తెలుగు కీర్తనలు విని దేవుళ్ళు దిగి వచ్చారని బడాయి పోతుంటాము. వారి భాషను మాత్రం దైవ భావన లేకుండా అగౌరవ పరుస్తాము.ఇదేం నీతి? “పలికెడిది భాగవతమట,పలికించెడువాడు రామభద్రుండట” అని పోతన అంతటోడే అన్నప్పుడు తెలుగును దేవ భాష అనటానికి మనకెందుకు సిగ్గు,సందేహం? సంస్కృత వాసనలేమీ సోకకుండా అచ్చ తెలుగులో లక్ష్మీదేవి హావ భావాలను ఆ రామ భద్రుడే ఎలా పలికించాడో చూడండి: “అడిగెదనని కడు వడి జను నడిగిన దన మగడు నుడువడని నడ యుడుగున్ వెడ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్” --- (శ్రీమదాంధ్ర భాగవతం 8:103) రామ భద్రుడే ఇలా తెలుగులో పలికించాడనీ,పోతన రాయలేక వదిలేసిన పద్యాలను రాముడే వచ్చి స్వయం గా తెలుగులో పూరించి పోయాడనీ , తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించాడనీ . . . ఇంకా ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా తెలుగు దేవ భాషే అనిపించటంలేదా?అలా అనిపించక పోతే వాళ్ళలో ఏదో తేడా ఉన్నట్లే. “ఇదినాదు మాతృదేశము ఇది నా ప్రియ మాతృ భాష ,ఇది నా మతమం చెద గొట్టి నుడువ నేరని బతికిన జీవి యొకండీవసుధను గలడా? “ – సత్య సాయి (25.5.1990) అర్ధం కాకపోయినా కొన్ని భాషలను ఏవేవో కారణాలతో ఏవేవో ప్రయోజనాలు ఆశించి నెత్తిన మోసే వారు తెలుగు దగ్గర కొచ్చేసరికి ఎందుకో విచిత్రంగా బిగుసుకు పోతున్నారు. ఆంగ్ల భాషా మోహ మావరించిన వారికి ఒకటే చెప్పేది : మీరు నెత్తిన పెట్టుకొని మొయ్యాలనుకున్న భాషలను మొయ్యండి.మా భాషను కూడా సమానంగా గౌరవించండి ,మా పిల్లలకు వాతలు పెట్టకండి.మా పిల్లల మెడల్లో పలకలు కట్టకండి.మా భాష ఉసురు తీయకండి అని కోరుతున్నాం .ఇంగ్లీషు మీడియం లో చదివితేనే మోడల్ స్కూళ్ళలో ఉపాద్యాయ ఉద్యోగాలు దొరికే “ఆదర్శ “ సమాజం గదా మనది?.తెలుగులో చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలిచ్చి ఆదుకోండి అని ప్రాధేయపడుతున్నాం.దిక్కు( లేని) మాలిన మాతృ భాషలో చదివి వెనుకబడిపోయినందుకు జాలిపడి కాసిని మార్కులు ముష్టి పడెయ్యమంటున్నాం.మా పిల్లలు మా భాషలోనే చదివేలా సహాయపడండి అని వేడుకుంటున్నాం . ‘పాశ్చాత్య విద్యల ప్రాభవంబదియేమో సంస్కృతి అడుగంటి సన్నగిల్లే తల్లి భాషను మాట్లాడుట తప్పు ఆయె జన సమ్మతమైనట్టి మార్గంబు దూరమాయే మాతృ భావము కంటే మాన్యమెద్ది? ఆంగ్ల భాషా మోహ మావరించిన నాడే స్వమత విజ్నానంబు సన్నగిల్లే ఆంగ్ల విద్యయె ప్రాముఖ్య మందియుంట ఆత్మ విద్యనుపేక్షింప నారిపోయే –సత్య సాయి (21.5.1992) “తల్లి భాష మాటాడ తప్పు తోచే సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే ధర్మమన్నది బోధింప తప్పిపోయే ఇట్టు లైనది భారత జాతి నేడు” -- సత్య సాయి (4.10.1967) అచ్యుత భాష తెలుగు ఇలాంటి వక్ర స్థితిని నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు అచ్యుతుడు పుట్టపర్తిలో అవతారం దాల్చాడు --- కామరాజు అనిల్ కుమార్ (సనాతన సారధి మే 2009). ఈ అచ్యుతుని తల్లి భాష తెలుగు కాబట్టి తెలుగు దేవ భాషే అయి తీరాలి .మాతృ భాషను విడిచిన తెలుగు ప్రజల వక్రస్థితి ని సరిచేసి వారిని నయ మార్గం (సహజ భాష) లోకి త్రిప్పటానికి బాబా తన వంతు కృషి తాను చేశాడు.మాతృ భాషకు పట్టం గట్టండి అంటూ బాబా ఆవేదన పడ్డాడు . సత్య శాయి –తెలుగు వాయి భక్తుల అభిప్రాయం ప్రకారం సాయికి అన్ని భాషలు వచ్చనుకుందాం. ఏదో భాష ను కాకుండా తన మాతృ భాష తెలుగును మాత్రమే ఎంచుకున్నందుకు ఆజన్మాంతం తెలుగులోనే ప్రసంగించినందుకు తెలుగు భక్తులు ఆయన్ను అభినందించాలి. హేతువాదుల లెక్కప్రకారం బాబా కు తెలుగు తప్ప మరే భాషా రాదనుకుంటే అదికూడా తెలుగు జనానికి మహా భాగ్యమే అయి కూర్చుంది.ఆ నోరే తెలుగు నోరు.ఓ తెలుగు వాడిగా సాయి తెలుగు భాష ను తన భక్త ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితిని , తెలుగును ఆశ్రయించక తప్పని పరిస్థితిని తెచ్చినందుకు తెలుగు భాషా ప్రేమికులు ఆయన్ని అభినందించాలి. తెలుగు భాష వర్ధిల్లటానికి సాయి మార్గం భారతీయ భాషలు చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో సత్య సాయి చెప్పాడు. “కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008) మాతృభాషను ప్రేమించటమే నిజమైన దేశభక్తి ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు. నోరెత్తి అడుగరా తెలుగోడా చుక్కాని బట్టరా తెలుగోడా ‘మాతృభాషను ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘అనే సూక్తికి లోబడి విదేశాలలో తెలుగు ఘన కీర్తులు చాటుతున్న తెలుగు వీరులారా లేవండి.పల్లవి మార్చండి.ఆంధ్రదేశమే మాకు అమర దైవతము అనండి.ఆంధ్రత్వము లేని బ్రతుకును ఆశించకండి.తెలుగు గడ్డమీదకు తరలి రండి.తెలుగు ప్రజలకే సేవ చెయ్యండి. చనిపోయే వ్యక్తికి సాయపడాలని మానవత్వం ఉన్న ఏ వ్యక్తికైనా అనిపిస్తుందికదా?అలాంటి ఉదారబుద్ధితోనే తెలుగు భాషకు సహాయపడండి అని మనవి చేస్తున్నాను. (నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012)