4, మార్చి 2013, సోమవారం

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 114)





తెలుగు అధికార  భాష కావాలంటే..,తెలుగుదేవభాషే పుస్తకాలలో నూర్ బాషా రహంతుల్లా ( ఫోన్.9948878833) అభిప్రాయాలకు ఆకురాతి గోపాలకృష్ణ గారు(ఫోన్.9493513850) ఇచ్చిన పద్యరూపమే ఈ శతకంః
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 


1. పాలనాధికార పగ్గాలతో, ప్రజా
బ్రతుకు తెరవొసంగు బాటలన్ని
ఒరులకిచ్చి వారికూడిగం సేతువా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

2.
ప్రాచ్యభాష యెదిగి ప్రాంతీయ భాషకు
ఊపిరంద నీక యుసురు తీసె
మ్రింగి వేయదా తిమింగ్ల రూపు దాల్చి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

3.
ప్రాణ వాయు వాంగ్ల భాషకే అందిస్తె
మాతృభాష కింక మనుగడేది ?
గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

4.
కొంప పెత్తనమ్ము ఉంపుడు గత్తెకా ?
ఎంత ధారుణమ్ము ? ఎంత తెగవు ?
తల్లి సవతి యైన పిల్లల భవితేమి ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

5.
పసి వయస్సులోనే పరభాష చొప్పించి
లేత మెదడు మీద వాత లిడకు
పులుల స్వారీ పగటి కలలు గావింపదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

6.
అమ్మవడిని మాన్పి  అతిచిన్న బిడ్డల
సవతి కప్పగించి సాకమనిన
గొప్ప సవతి ప్రేమ చెప్పు నాకింపదా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

7.
మమత పుంజుకొన్న మమ్మీలు, డాడీలు
కుమ్ముచుండే తల్లి రొమ్ము మీద
ముద్దు లాడ దివ్వె మూతిని  కాల్చదా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

8.
తమిళము మలయాళ తల్లులకీనాడు
బిడ్డలిచ్చుచున్న పెంపు చూడు
తల్లిభాష నీకు తగనిదై పోయెనా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

9.
పరుల భాష కెంత పాండిత్యమున్ననూ
భావ వ్యక్తీకరణ భ్రష్టు గుండు
అలవిగాని బండ తలకెత్తుకున్నట్లు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

10.
అట్టహాసమైన ఆంగ్ల వక్తల మధ్య
తెల్లబోయి మిగులు తెలుగు వక్త
సానిడాబుగాంచి జంకేటి భార్యలా
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

11.
యెల్ల వనరులున్న తల్లి భాషీనాడు
బ్రతుకు చూపలెని బడుగు దయ్యె
మేపులేనిగోవు చేపి పాలిచ్చునా
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

12.
దేశభాషలందు తెలుగు లెస్సన్నట్టి
కృష్ణదేవరాయ కీర్తి శిఖలు
అన్ని దిశల చాటి వన్నె కెక్కిన భాష
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

13.
చరితయున్ను తగిన సాహిత్య ప్రాచీన
ప్రతిభ కల్గినట్టి ప్రముఖ భాష!
కన్న తెలుగు తల్లి ఉన్నతిని కాపాడు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

14.
ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు
అచ్చరాల బెడద ఖచ్చితముగ
అలవికానిదంటు అన్వేషణకు లేదు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

15.
ఉన్నలోపములను తిన్నగా సవరించి
తల్లిభాష నున్నతముగ తీర్చి
అప్పగింపవోయి అధికార పీఠాన్ని
తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ

16.
దేశ భాషలందు తేజరిల్లిన తెలుగు
వాసి తగ్గి ఆంగ్ల దాసి యయ్యె
కుక్క వాత పడ్డ బక్క సింహం భంగి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

17.
ఆంగ్ల సంస్కృతాల నాలింగనం గొనీ
సరకుగొనని తెలుగు సన్నగిల్లె
కూరుచున్న కొమ్మ కూలిపోబోతోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

18.
అచ్చ తెలుగు వదలి ఆసంస్కృతంబునే
మంత్రములకు వాడు తంత్రమేమి ?
శ్రేష్టమైన వృత్తి చేజారుననికదా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

19.
తెలుగు దేశ బిడ్డ తెలుగు పండిత పోష్టు
ఆంగ్ల భాషలోన ఆర్డరేసి
అచ్చ తెనుగు వాణ్ణి బిచ్చమెత్తింతురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

20.
అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ
మాత్రు భాష దాచి మసులు కొండ్రు
మాటు దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

21.
ఆంధ్రభాష మనకు అధికారి యైయింత
అన్నమిచ్చుననెడి ఆశయుండె
ఆంగ్లమిచట జేరి అడియాశ జేసెరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

22.
అర్ధమవని భాష కధికార మందిస్తె
బడుగు మూకనెల్ల పారద్రోలి
కనక పీఠమందు శునకమై వర్ధిల్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

23.
రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు
యేమి యివని దాని నేర్వరెవరు
పాలు యివని పశు కబేళాల కర్పితం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

24.
మిసిమి కల్గు కవుల పసిడి పల్కుల తల్లి
సిరుల రాజసమ్ము తరిగిపోయె
తిరుమలేశు నగలు అరువు కేగిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

25.
పేద తెలుగు వారు పిరియాదు లందిస్తె
ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు
కోతి కందినట్టి  కొబ్బరి కాయల్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

26.
స్వంత భాషతోని సౌలభ్య మేనాడు
అన్యభాషలందు అందబోదు
తల్లిప్రేమ, మారు తల్లిలో దొరకునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

27.
ఆంగ్ల భాష సుంత అలవడినంతనే
తెలుగు నీసడించు ధీరులార
యేరు దాటి తెప్ప నేల తగలేతురు ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

28.
వెర్రి తెలుగు కవికి యెర్ర పైసా కూడ
రాల్చు దిక్కు లేదు రాష్ట్ర మందు
తనదు కలమె తనకు తల కొర్వి యైపోయె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

29.
ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా
పదునెనిమిది కోట్ల ప్రబలమైన
సంతు యుండు తల్లి కింత అన్యాయమా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

30.
అష్ట దిగ్గజాల హావభావాలతో
కృష్ణ దేవరాయ కొలువులోని
తెలుగు వైభవమ్ము తిరిగి మళ్ళొచ్చునా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

31.
పొరుగు భాషతనకు భుక్తి కల్పించినా
తనదు మాతృభాష దైన్య స్థితికి
కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

32.
తెలుగు ఉద్యమాన్ని ధీరతన్ చేపట్టి
లౌక్యమౌ పధాన రహంతుల్లా
గారు,బండి ముందు కరదీపికై నిలిచే
(
బండి ముందు నడుచు బంటు తానై నిలిచే)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

33.
అంటు వ్యాధి వోలె వ్యాపించి దేశాన
ఆంగ్ల మోజు ప్రజల కంట గట్టి
కులుకుచుండె స్వార్ధ బలుపుతో కాన్వెట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

34.
తెలుగు నేల మీద తెలుగు బిడ్డే తెలుగు
ఉచ్ఛరింప, పట్టి శిక్షవేయు
బంటు పెత్తనమ్ము ఇంటి కెగ బ్రాకింది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

35.
మిసిమి కోలు పోయి పసిడి బాల్యంలోనె
బండబారు తోంది భరత జాతి
కానివెంట్లు జైళ్ళు, ఖైదీలె పిల్లలై
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

36.
అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిదే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

37.
పదవి నున్న వారు పలుకరు స్కూళ్ళలో
నెట్టబడియెతెలుగు కట్ట కడకు
దిక్కు లేని శిశువు కుక్క పాలైనట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

38.
మొదటి తరగతందె ముదనష్ట పింగ్లీషు
తెలుగు భాష గొంతు నులుముచుండె
పోతపాలుబిడ్డవాత కొట్టిరి కదా||
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

39.
చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెలుగు
అమ్మ రొమ్ము మార్చి ఆంగ్లమనెడి
ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టించిరి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

40.
ప్రధమ విద్య మాతృ భాషా సిమెంటుతో
దిట్ట పరచు బేసు మట్టమెపుడు
అన్యబూడిదేది అంటరాదిచ్చోట
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

41.
తెలుగు మీడియమ్ము తెలుగు విద్యార్ధులకు
చదువు కొనుట కెంతో సౌఖ్యప్రదము
ఇంపిత మగుదారి కంప కొట్టించారు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

42.
గుండెలోని బాధ దండిగా వివరింప
మాతృభాష యొకటె మహిని చెల్లు
మనసు దోచు పండు మామిడి ఒక్కటే||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

43.
తెలుగు నేల మీద తిన్నగా జన్మించి
తెలుగు పాలు త్రాగి తెలుగు ప్రగతి
విస్మరించినారు భస్మాసురుల భంగి||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

44.
పెద్ద భాష వచ్చి గద్దెపై కూర్చుంటె
మాతృభాష నోట మన్ను పడును
పక్షి గూటి లోకి పాము జొర పడ్డట్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

45.
వొరుల కిచ్చి పొలము వారి వద్దే కూలి
చేయబోవు టెంత హేయ కరము
ఆంగ్ల ఆదిపత్యమటువంటిదే గురూ
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

46.
ఇరుగు పొరుగు భాష కిచ్చేరు గౌరవం
స్వంత భాష నెవరు సరకుగొనరు
ఎదటి వాడి భార్య యెల్లరకుతీపియే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

47.
విధినెరింగి నేటి అధికార గణమంత
ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి
తెలుగు నాదరిస్తె తిరిగి రాదా గతము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

48.
అమెరికాకు బోవు ఆ నల్గురి కొరకు
ఆంగ్ల కుంపటెత్తిరందరికిని
పేరిగాడి బండి పీరు సాహెబ్ యెడ్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

49.
పరుగు లెత్తి యచట పాలు ద్రావే కంటె
నిలబడింట త్రాగు నీరు మేలు
అబ్బురమనుకోకు అమెరికా బెగ్గింగు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

50.
చదువు చక్కనైన సంస్కార లావణ్య
అందమైన తెలుగు ఆడపిల్ల
కన్ని యుండె, యిప్పు డయిదవ తన మివ్వు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

51.
సర్వమతము లందు సామూహ ప్రార్ధనల్
స్వీయ భాషలందు చేయరేల
దేవుడితరభాష తెలియని మూర్ఖుడా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

52.
ఆంధ్రముస్లిములను అరబి ఆకర్షించె
సంస్కృతమ్ము తెలుగు జాతి నొంచె
బల్లి యొడిసి పట్టు బలహీన జీవులన్
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

53.
రక్తి చూపకుంటె ముక్తి సున్నాయంచు
భక్త తతికి త్రొక్కి పట్టి యెపుడు
మౌఢ్యమతపు నేర్పు మతస్తుగా తమభాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

54.
శాస్త్ర యుక్తమైన  సంస్కృతమేనాడో
తెలుగు భాష మీద తిష్ట వేసి
కొలువు తీరినట్టి గోముఖ వ్యాఘ్రహం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

55.
వేల యేండ్ల నుండి విలువైన గ్రామీణ
పారిభాషికాల పట్టరైరి
ఎక్కడున్న గొంగళక్కడే నన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

56.
మాతృభాష తోనె మహనీయుడైనట్టి
సత్య సాయి గొప్ప చరిత చూడు
నేల విడిచి సాము మేలు కాదెన్నటికి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

57.
లోటు పాటులుంటె నీటుగా సవరించి
పాటు చేసి తెలుగు మీట నొక్కు
ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

58. A,B
లు C,D లు, యే శివాజీకొచ్చు?
ఆంధ్ర భోజుకేమి ఆంగ్లమొచ్చు?
ఆంగ్ల కోడిలేక  అవని తెల్లారదా?
కోడికూయకుంటె కొంప తెల్లారదా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

59.
జన్మమిచ్చినట్టి జననిగా వేనోళ్ళ
పొగడగానె తల్లి దిగులు పోదు
పూజసేయ గోవు పుష్టికి నోచునా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

60.
భక్తి మహిమ పెంచు భారతం రామాయ
ణాది కావ్యధారలందు తడిసి
తెలుగు నేలలందు వెలుగు లీనిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

61.
బడుగు భాష యనుచు బాణాలు సంధించి
తెనుగు తల్లి యుసురు తీయబోకు
నిందమోపి సతిని బొందపెట్టిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

62.
చిన్న చూపదేల చీదరింపదియేల?
తెలుగు తల్లి మీద ద్వేషమేల?
ఆంగ్లకోటు దాల్చి అధికుడ ననుకోకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

63.
మాతృభాష నొదిలి మరియొక భాషపై
కాలుమోపు వాడు కూలిపోవు
నాటు పడవ నొదిలి ఓటి పడవెక్కకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

64.
చిన్నతనము నందె కన్నతల్లిని వీడి
అన్యదేశవాస ఆంధ్రులంత
తెలుగు దైన్యస్ధితికి దిగ్బ్రాంతి చెందేరు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

65.
అర్ధమవని భాష అధికార మందుంటె
అనువదించి తెల్పు అల్పులైన
మాయ మోసగాళ్ళు మనకొంప ముంచరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

66.
పాలనాధికార పగ్గాలు చేపట్టి
సాటిభాష లన్ని సాగు చుండ
దాస్యమందు తెలుగు ధంసమైపోతొంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

67.
సకలమైన యితర జాతి పదాలతో
సంకరించె నన్న శంక పడకు
యెట్టిదైన పిల్లి యెలుకను పట్టదా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

68.
రాజపీఠమందు రంజిల్లు భాషకు
మతపు భాషలకును క్షతియులేదు
ప్రాణ హానియెపుడు ప్రాంతీయభాషకే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

69.
వట్టిమాట లంటు కొట్టిపారేయక
పట్టుతోడ బుద్ది పదును చూపి
ఇంటిపెత్తనమ్ము యిల్లాలిదేనని||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

70.
వచ్చి రాని ఆంగ్ల భాషతో కుస్తీలు
పట్టు లెక్చరర్ల బాధచూడు
కుక్కతోక పట్టి గోదావరీదేరు||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

71.
మాతృభాష నెపుడు మరువకు మరువకు
మాతృభాష మీది  మబ్బువీడి
వెల్లివిరిసి నపుడె యిల్లు స్వర్గంబగున్
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

72.
దేశమేమొ తెలుగు దేశీయులు తెలుగు
అమలు చేయు వారలంత తెలుగు
ఆంగ్ల భాషకేల అధికార పీఠమ్ము?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

73.
ప్రజల నోళ్ల నుండు భాషోన్నతిన్ పొందు
ప్రజకు దూరమైన భాష చచ్చు
తైలమిడని దివ్వె తిన్నగా కొండెక్కు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

74.
ఒరుల గొప్ప చూచి పరవశించుట మాని
స్వంత జాతి ప్రతిభ చాటనెంచు
కుంటి యైన కూడ యింటి బిడ్డే మేలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

75.
ఆంగ్ల భాషయేమొ అసలు నేర్వను రాదు
తెలుగు చదవ బ్రతుకు తెరవు లేదు
సొంత కూడు పాయె బంతి కూడూ పాయె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

76.
ఆలయాల పూజ కర్హత లేదని
తెలుగు మంత్రములకు విలువ నివరు
తెలుగు రాని వాడు దేవుడెట్లాయెనో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

77.
కామధేను వంటి కమ్మని తెలుగుండ
ఇంగిలీషు కోతినెత్తుకోకు
గంగి గోవు నొదిలి గాడిద కొలువట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

78.
బానిసత్వమందు బ్రతికిన జాతికి
తగ్గదాయె మోజు దాస్యమందు
పోదు బిడ్డతోనె, పురిటి కంపన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

79.
ఆంగ్ల భాష మీద అభిమానమున్ బెంచి
తెలుగును విడనాడు తెగువ యేల ?
ఆలి చిక్కగానె అమ్మను విడుతురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

80.
తేనె లొలుకు నట్టి తెలుగును విడనాడి
గొంతు దిగని ఆంగ్ల చింతయేల?
అక్షయమ్మునొదలి భిక్షెత్తు కొన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

81.
లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా
తీర్చి దిద్ది చూడు తెలుగు భాష
రాజ పీఠమునకె తేజస్సు నింపదా?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

82.
ఇళ్ళలో యింగ్లీషు బళ్ళలో యింగ్లీషు
తల్లి భాష విలువ తరుగుతోంది
చుప్పనాతి ప్రభుత చోద్యం చూస్తోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

83.
కంటిపాప వోలె కాపాడగల బిడ్డ
ఎరరుగనట్లు తల్లి నే మరిస్తే 
 మాతృ మూర్తి కింక మరణమే శరణమ్ము
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

84.
స్వంత తల్లి నగలు, సవతికి అందించి
బాధపెట్టు సుతులు బ్రతుకనేల
మాతృభాష ద్రోహ మదియెంతచెడ్డదో||  
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

85.
బలసినట్టి భాష, బలహీనమగు దాని
యిట్టె మింగి వేసి గుట్ట గూల్చు
మేక నెక్కడైన సాకునా తోడేలు||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

86.
ఆంధ్ర ప్రభుత తెలుగు కంగీకరించినా
తెలుగు ఆఫీసర్లె తెమలనీరు
పారునీళ్ళ  పాచి తెగులయేట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

87.
తెగులుపట్టినట్టి తెలుగు బిడ్డల్లోని
అంతరించినపుడె ఆంగ్లతిక్క
మాతృభాష కొచ్చు మంచి రోజానాడు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

88.
ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో
కోర్టులందు ప్రజల హార్టులందు
చోటు గొన్న భాష సుస్థిరమై నిలుచు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

89.
ఆంగ్లముండు వారి కన్ని ఉద్యోగాలు
తెలుగు భాష కింక విలువ యేది
అద్దె వాడికిల్లు అసలు వాడికి నిల్లు
(
బంటుకు విలువిస్తే బాసును మ్రింగడా?)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

90.
లోకమార్పు తోడ పోకడలు మారాలి
మారనట్టి దెల్ల మరణ మందు
తెలుగు తల్లి కట్టి స్ధితిని పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

91.
కొన్ని కోట్ల ప్రజలు ఎన్నో తరంబులు
కూర్చుకున్న భాష కూలెనంటె
భాషతోడ జాతి భవిత మరణింపదా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

92.
ఆంద్ర భాషకంటె ఆంగ్లమే మేలైతే
చదివి నీవె అందు చతురు డగుము
ఆంగ్ల గజ్జి తెచ్చి అందరికి పుల్మకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

93.
తెలుగు వేషధరణ తెలుగు వేదికలందె
వేదికలను దాటి వెలికిరాదు
ఆంగ్లమైక మందె ఆఫీసు గణముండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

94.
అసలు చిత్త శుద్ది ఆఫీసరందుంటే
తెలుగు కూడ మంచి స్ధితి గడించు
మెగడు చచ్చుగుంటె ధగడిదే రాజ్యమ్ము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

95.
విలువ తరిగినట్టి తెలుగు మీడియాన్ని
యెంచుకున్నవాడు కించవడును
గొడ్డుటావు నెవరు కొనుగోలుసేతురు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

96.
అరచి పిలుచుచుండిరక్బరు ననుకొంటి
అల్లాహో అకబరు అని వచింప
అర్ధమవని భాష తర్జుమా యిట్లుండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

97.
పట్టి మతములన్ని పల్కించు ప్రార్ధనల్
వేదభాషలందె విన్నవించు
అర్ధమవని ఘోష వ్యర్ధ ప్రయాసరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

98.
సకల మతములందు సమభావ దృష్టితో
తెనుగు భాష యున్నతికి తపించు
రహంతుల్లా గారి తహతహను గుర్తించి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

99.
బడుగు తెలుగు భాష పాలింప యోగ్యమా
సాద్యమెట్టులనకు చవట వోలె
 నూర్ బాషా గారి పరిశీలించి||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

100.
అరయ యూనికోడు కందరూ క్రమముగా
మారి మాతృభాష మనుగడకును
సహకరించినపుడె సమకూడు సమృద్ది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

101.
కన్నతల్లి కింత గంజి పోయుట మాని
సానికొంప మరిగి చంపజూచు
బిడ్డలుండు పురిటి గడ్డ కాదీ భూమి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

102.
పూర్వరాజసాన పుట్టి పెరిగిన భాష
ప్రజలు రేబవళ్ళు పలుకు భాష
కవుల గంటమందు కదం త్రొక్కిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

103.
ఆంద్రదేశ రాజ అధికార పీఠాన
తెలుగు తల్లి పఠిమ తీర్చి దిద్ది
నిలుపకల్గు వరకు నిద్రపోరాదని
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

104.
పరుల పాలనమ్ము పనికి రాదంటి మే
వారి తోక (భాష) పట్టి వదల రేమి?
ఊడిగమ్ము కింత ఉబలాటమెందుకో ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

105.ఐక్యరాజ్యసమితి అల్పాయు భాషల్లో
తెలుగు చేరెనంచు తేల్చి చెప్పె 
కళ్ళు తెరవకుంటె ఇల్లు కొల్లేరగున్
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

106. అటపాటలందు హాయిగా నేర్చేటి
అరటి పండువంటి అమ్మభాష
ఆంగ్లకోతి జేరి ఆరగింకేసింది||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

107. కాలుమోపగానె కానెవెంటులో బిడ్డ
అమెరికా డాలత్లు అందినట్లు
పగతి కలలి కంటు నగువాటు పాలవకు||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

108. ఆంగ్ల భాష మీద అత్త్యాశ మానుకో
అందలేవు యెన్ని చిందివిడిన
నక్కలకు ద్రాక్ష నిక్కితేఅందునా||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

109. మాన్యచరితులైన మన తెల్గుపెద్దలే
ఆంగ్ల భాష పెట్టి రన్ని దిశల
తమను గట్టి తాళ్ళుతా తెచ్చుకొన్నట్లు||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

110. ఆంగ్లభాష నేమో అందలమెక్కించి
చచ్చు సంస్కృతాన్ని చంకపెడితె
స్వంతతెల్గు కింక స్వర్గప్రాప్తే కదా||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

111. తెలుగు కీర్తి దేశాల బ్రాకినా
తమజనాల గుండె తట్టదాయె
మణులకుండు మెరుపు ఫణి యెరుగదన్నట్లు||
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

112. ఇండియా లెవెల్లొ రెండవ స్థానాన్ని
పుణికి పుచ్చుకున్న తెనుగు తల్లి
దుష్టసుతుల నడుమ కష్టాలు పడుతొంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

113.ఉట్టికెక్కనమ్మ ఉరుకునా స్వర్గాని 
కనుప్రచార దోరణనుసరించి
కన్నతల్లి పరువు గంగలో కలుపకు 
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

114.దేశ భాషలందు దేదీప్యమానమై 
వెలుగునిచ్చినట్టి  తెలుగు దివ్వె 
ఆంగ్లహోరులోన ఆరిపోబోతోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||



--
ఆకురాతి గోపాలకృష్ణ A .S. పేట ,నెల్లూరు జిల్లా -524304 ఫోను.9493513850.















31, జనవరి 2013, గురువారం

ఉపయోగపడే 100 తెలుగు వీడియోలు

ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే అద్భుతమైన 100 తెలుగు హై క్వాలిటీ వీడియోలు ఇవి.

తెలుగు వారందరికీ పనికొచ్చే ఈ కలెక్షన్‌ని మీ friendsకీ షేర్ చెయ్యగలరు.
మీకు టైమ్ ఉన్నప్పుడు తీరిగ్గా చూసుకోవడం కోసం ఈ Top 100 తెలుగు వీడియోల్ని ఈ క్రింది లింక్ నుండి కూడా PDF ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.http://computerera.co.in/Top100TeluguVideos.pdf

1. మొబైల్ నుండే ఫ్రీగా SMSలు ఇలా పంపండి.. http://bit.ly/srifreesms
2. విండోస్ 8 ఆరు సెకండ్లలోనే వస్తుంది ఇలా.. http://bit.ly/sriwinboot8
3. ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్లు ఇతరులు రన్ చేయొద్దా? http://bit.ly/sriapps
4. Facebook Profile Vists స్కామ్ ఇంత ప్రమాదకరం http://bit.ly/sriprofilevisits
5. అన్ని భారతీయ బ్యాంకుల సమాచారం మీ చేతుల్లోనే ఇలా http://bit.ly/sribanks
6. Gmail అటాచ్‌మెంట్లలోనూ మీకు కావలసింది వెదకొచ్చు http://bit.ly/srisearch
7. సైబర్ నేరాల గురించి ఎలా కంప్లయింట్ చేయాలి? http://bit.ly/sricyber
8. సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ తీయాలా ఇది చూడండి http://bit.ly/sriscreenplay
9. ఫొటోషాప్‌లో ఇమేజ్ సైజ్ చాలా ముఖ్యం ఇలా.. http://bit.ly/photoshopclass1
10. విండోస్ 8 అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఇవి.. http://bit.ly/sriwin8class5
11. పెన్‌డ్రైవ్ వైరస్‌ల వల్ల సమస్యలా? ఇది చాలా బెస్ట్ http://bit.ly/srivirusfree
12. తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, 8లలో ఇలా వాడొచ్చు http://bit.ly/srianu7
13. విండోస్ 8లో Ribbon Interface ఎంత బాగుందో http://bit.ly/sriwin8class4
14. ఫొటోషాప్ ఇకపై XPలో పనిచేయదు.. ఎందుకంటే.. http://bit.ly/sriadobe
15. రిమూవబుల్ డ్రైవ్‌లను మళ్లీ మళ్లీ ఎందకు గుచ్చాలి? http://bit.ly/sriusbfact
16. Google Drive, SkyDrive నుండే నేరుగా అటాచ్‌మెంట్లు http://bit.ly/sritips1
17. విండోస్ 8లో మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి? http://bit.ly/sriwin8class3
18. ప్రోగ్రాములు సెట్టింగులు విండోస్ 8లో ఎక్కడ? http://bit.ly/sriwin8class2
19. విండోస్ 8లో కొత్తగా వచ్చిన మార్పులేమిటి? http://bit.ly/sriwin8class1
20. డేటాబేస్ అంటే ఏమిటి? డేటా ఎలా సేవ్ అవుతుంది? http://bit.ly/sridatabase
21. Task Managerలో అదనపు ఆప్షన్లు వాడడం ఇలా.. http://bit.ly/sriwin8task
22. అనూ ఒరిజినల్ ఫాంట్లు చూడకపోతే ఇక్కడ చూడండి http://bit.ly/srianuoriginal
23. జాబ్ కోసం రంగురంగుల రెజ్యూమ్‌లు చేయడం ఇలా http://bit.ly/sriresume
24. విండోస్ Safe Modeలో ఏం జరుగుతుంది? http://bit.ly/srimode
25. Airtel, Aircelలలో 3G ఏది స్పీడ్‌గా ఉంది? http://bit.ly/sriera3G
26. టాబ్లెట్ కొనబోతున్నారా? ఇది ప్రయత్నించండి http://bit.ly/srisamsung
27. ఫోన్ సైలెంట్ మోడ్ వేరేచోటి నుండి ఇలా ఆన్ చేయండి http://bit.ly/srisilent
28. విండోస్ 8లో కొత్త డ్యూయల్ బూటింగ్ చూశారా? http://bit.ly/sriboot
29. లాప్‌టాప్‌లో చిన్న హార్డ్ డిస్క్ ఇలాగుంటుంది.. http://bit.ly/srilaphdd
30. నిద్ర సరిపోవట్లేదా? ఇది చాలా యూజ్‌ఫుల్.. http://bit.ly/srisleep
31. లాప్‌టాప్ keypadని దుమ్ము నుండి ఇలా కాపాడండి http://bit.ly/srilap
32. ఫొటోల్లో అవసరం లేని భాగాలు ఇలా తొలగించొచ్చు http://bit.ly/sriphocs6
33. విండోస్ 8 రిలీజ్ ప్రివ్యూని ఇన్‌స్టాల్ చేయడం తెలీదా? http://bit.ly/sriwin8
34. నెట్ లేకుండా Windows అప్‌డేట్ చేయడం ఇలా http://bit.ly/sriupdatewin
35. మీ మాటలే పాటలుగా మార్చుకోవాలా? http://bit.ly/srisongvoice
36. మీ మొహంతో ఫోన్‌ని unlock చేయొచ్చు తెలుసా? http://bit.ly/srifaceunlock
37. Samsung Galaxy Note అప్‌డేట్ ఇలా.. http://bit.ly/srinoteupdate
38. లాప్‌టాప్‌తో వచ్చే Free OSని పోగొట్టుకుంటారా? http://bit.ly/srifreeos
39. ఫేస్‌బుక్ application invitationలు విసిగిస్తున్నాయా? http://bit.ly/fbsri
40. వెబ్‌సైట్లు ఎలా వేగంగా లోడ్ అవుతాయి? http://bit.ly/srisites
41. చీటికీ మాటికీ Facebook ఇ-మెయిల్స్ వస్తున్నాయా? http://bit.ly/srifbalerts
42. iPhone 4Sలో బ్యాటరీ ఎక్కువ రావాలంటే.. http://bit.ly/sriapplebattery
43. ఆన్‌లైన్‌లో బిల్లులు కట్టడం సేఫేనా? http://bit.ly/onlinepayments
44. ఆడియో సిడిలు నేరుగా ఎందుకు కాపీ అవ్వవు? http://bit.ly/sricdcopy
45. మీ కంప్యూటర్ గురించి A to Z సమస్త సమాచారం ఇలా http://bit.ly/sripcdetails
46. 50 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ ఇలా పొందండి http://bit.ly/50GBStorage
47. ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి? http://bit.ly/paypowerbill
48. ఒక కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయినవి వేరోచోటికి ఇలా http://bit.ly/moveapps
49. మీ పిసి వేగంగా పనిచేసేలా ఇలా ఏర్పాటు చేయండి http://bit.ly/srifinetune
50. భవిష్యత్‌లో ఫోన్లు ఎలాంటివి రాబోతున్నాయి? http://bit.ly/sriphones
51. ప్రింటింగ్ జరగకుండా ప్రింటర్లు ఎందుకు ఫెయిలవుతాయి? http://bit.ly/sriprinter
52. ఒకేసారి 40+ ఏంటీవైరస్‌లతో ఇలా స్కాన్ చేయండి http://bit.ly/sriantivirus
53. కంప్యూటర్ ఓవర్‌హీట్ అయి కాలిపోకుండా ఇలా.. http://bit.ly/sricpu
54. మీరు కొన్న ప్రోడక్టులకు manuals పోయాయా? http://bit.ly/sriguide
55. ఏపిల్ Mac కంప్యూటర్లు ఎలా ఉంటాయో చూస్తారా? http://bit.ly/sridharapple
56. మీ పిసి తక్కువ పవర్ వాడుకునేలా ఇలా చేయండి http://bit.ly/sripower
57. విండోస్‌లోని అన్ని సదుపాయాలూ ఒకేచోట లభ్యం http://bit.ly/sriwinopt
58. విండోస్ 7, 8లలో C, C++ ప్రోగ్రాములు ఇలా రాయండి http://bit.ly/sriCLang
59. మీ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ వస్తోందా? కారణాలివి.. http://bit.ly/sriblue
60. Facebook, Twitterలో అడ్వాన్స్‌డ్‌గా మెసేజ్‌లు పెట్టడం http://bit.ly/sriFBupdates
61. ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లని ఇలా జాగ్రత్త చేసుకోండి http://bit.ly/srisafe
62. ఇక మీ కంప్యూటర్ స్పీడే స్పీడ్ ఇలా చేస్తే http://bit.ly/srispeedup
63. డబుల్ లేయర్ డివిడిల కెపాసిటీ తక్కువెందుకు? http://bit.ly/dvdfact
64. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ http://bit.ly/sridharsecret
65. మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా? రీజన్స్ ఇవి.. http://bit.ly/sricera
66. మీ హార్డ్‌డిస్క్ ఎప్పుడైనా డెడ్ అయిపోవచ్చు.. http://bit.ly/sridatasafe
67. వచ్చే తరం మొబైల్ Galaxy Note చూడండి.. http://bit.ly/srinotereview
68. ఏపిల్ iPhone 4S ఎలాగుంటుందో నేరుగా చూస్తారా? http://bit.ly/sri4siphone
69. HPనుండి 5 వేలలో చవకైన నాణ్యమైన టాబ్లెట్ http://bit.ly/srihptouch
70. ఫొటోషాప్‌లో text effects సృష్టించడం ఇలా.. http://bit.ly/sriphototext
71. మీరు మొబైల్‌లో ఏం చేస్తుందీ తెలుస్తుందా? http://bit.ly/srimobilesafe
72. టైపింగ్ జెట్ స్పీడ్‌తో చేసేయండి ఇక.. http://bit.ly/srijetspeed
73. Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు కావాలా? http://bit.ly/srimactelugu
74. ఇప్పటివరకూ విండోస్ ఇన్‌స్టలేషన్ తెలీదా? ఇలా.. http://bit.ly/sriwinsetup
75. మీ Facebook అప్‌డేట్లు SMS ద్వారా పొందాలా? http://bit.ly/fbsmssri
76. ఫేస్‌బుక్‌లో టైమ్‌లైన్ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం ఇలా.. http://bit.ly/srifbtimeline
77. మీరు వాడుతున్న మందులు కరెక్టేనా? http://bit.ly/srimedicine
78. ఫోన్ పోయిందా? ఇలా వెదికి పట్టుకోండి.. http://bit.ly/sristolenphone
79. రూటర్ ద్వారా మీ నెట్‌ని ఫోన్‌కీ, పిసికి షేరింగ్ ఇలా.. http://bit.ly/srirouter
80. కొత్త డిజిటల్ కెమెరా కొనబోతున్నారా? ఇది చూడాల్సిందే http://bit.ly/sricamera
81. మీ స్వంతంగా వెబ్‌సైట్ సృష్టించుకోవాలంటే ఇలా చేయండి http://bit.ly/sriwebsite
82. కంప్యూటర్‌ని స్పీడ్ చేసే కొన్ని టిప్స్ ఇవి.. http://bit.ly/srispeedup1
83. వైరస్‌ల కన్నా రూట్‌కిట్‌లు చాలా ప్రమాదకరం తెలుసా? http://bit.ly/srirootkit
84. విండోస్‌కి ప్రతీసారీ పాస్‌వర్డ్ టైప్ చేసే పనిలేకుండా http://bit.ly/sriautologon
85. పొరబాటున డిలీట్ అయిన మేటర్ వెనక్కి వచ్చేలా http://bit.ly/sritextrecover
86. C లాంగ్వేజ్ ఎందుకు వాడతారు? ఏం సాధిస్తారు? http://bit.ly/sriwhyc
87. మీ pen drive ఎంత స్పీడ్‌దో టెస్ట్ చేసుకుంటారా? http://bit.ly/sritestpen
88. పాటలు కూడా వినగలిగే బ్లూటూత్ హెడ్‌సెట్ ఇలా http://bit.ly/sribluetooth
89. పిసి లోపల దుమ్ము ఇలా జాగ్రత్తగా దులపాలి http://bit.ly/sripcclean
90. కంప్యూటర్లోని BIOS సెట్టింగులు ఎంత యూజ్‌ఫుల్లో.. http://bit.ly/sribios
91. వద్దనుకున్న వెబ్‌సైట్లని బ్లాక్ చేయడం ఇలా.. http://bit.ly/sriwebblock
92. ఫొటోషాప్ వాడుతున్నారా? ఇవి మీకు తెలుసా? http://bit.ly/sriphototips
93. మీ పెన్‌డ్రైవ్‌తో పిసిని స్పీడ్ చేయొచ్చని గ్రహించండి.. http://bit.ly/sripenspeed
94. విండోస్‌లో ఫైల్ పేర్లు బ్లూ కలర్‌లో ఎందుకు కన్పిస్తాయి http://bit.ly/sribluecolor
95. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఇలా రక్షించుకోండి http://bit.ly/fbsafeguard
96. మీ సెల్‌ఫోన్‌లోనూ తెలుగు టైప్ చేయొచ్చు ఇలా.. http://bit.ly/sricelltelugu
97. ఇలా చేస్తే ఇక మీకు వైరస్‌ల బాధే ఉండదు http://bit.ly/srigoodbyevirus
98. Gmail ఐడిలు హ్యాక్ అవకుండా ఇలా జాగ్రత్త పడండి.. http://bit.ly/gmailcare
99. Wordలో Format Painter వల్ల ఎంత ఉపయోగమో.. http://bit.ly/sriwordtips
100. మొండి వైరస్‌లను బూటింగ్‌లో తీసేయడం ఇలా http://bit.ly/sribootvirus
http://computerera.co.in/Top100TeluguVideos.pdf