4, జనవరి 2021, సోమవారం

బానిసత్వ నిర్మూలన సాధ్య‌మేనా?

 బానిసత్వ నిర్మూలన సాధ్య‌మేనా?

 

డిసెంబ‌ర్ 2న మొక్కుబ‌డిగా నిర్వ‌హ‌ణ‌
అన్ని దినోత్స‌వాల‌దీ అదే తంతు
ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసలను వెట్టి చాకిరీ నుండి బయట పడేసే ఉద్దేశం తో 1949లో ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించింది. బానిసత్వ నిర్మూలన జరగలేదు కానీ ఏటా డిసెంబర్‌ రెండో తేదీన ఇది దినోత్సవం లాగా జరుగుతుంది. ఎవరికీ ఏమీ అందకుండానే ప్రాణాంతక పురుగుమందులతోనే ‘ప్రపంచ నేల దినోత్సవం’,అంతర్జాతీయ మానవ హక్కుల దినం’ జరిపేశారు. బానిసత్వం ఎన్నో రకాలుగా ఉంటుంది. శారీరక మానసిక ఆర్థిక బానిసత్వాలు నిరంతరం చూస్తూనే ఉన్నాం.కులాలు మతాలు బలహీనుల్ని ఏలాయి. బానిసలు నేటికీ కొనసాగుతూనే ఉన్నారు.
రైతుల్ని ఉగ్ర‌వాదులంటున్నారు
ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతులు వ్యవసాయ బిల్లుల రద్దుకోసం పోరాడారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులన్నారు, రైతులకు ఉత్పత్తి వ్యయానికి రెండు రెట్లు అధిక ఆదాయాన్ని అందిస్తామని వాగ్దానం చేసిన కేంద్రం ఈ చట్టాల పట్ల రైతుల అభ్యంతరాలేమిటో తెలుసుకోవాలి. భారత ఆహార మార్కెట్‌ ను కార్పొరేట్ల పరం చేస్తారేమోననే రైతుల భయాన్ని పోగొట్టాలి. ఆర్థిక అసమానతలు పెరిగి ఉపాధి పడిపోయింది. ఉద్దీపనల వల్ల సామాన్యులకు లాభం చేకూరాలి. ఉపాధి కల్పనే మాంద్యానికి మందు. విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు చివరికి వ్యవసాయాన్నికూడా కార్పొరేట్లకు అప్పగిస్తే కార్పొరేట్ల ఆస్తితో పాటు పేదలూ పెరుగుతారు. ఆఫ్రికాలోని నీగ్రోలను అమెరికాకు తరలించి బానిసలుగా మార్చి అమ్మారు. బానిసత్వం నేటికీ వెట్టిచాకిరీగా కొనసాగుతోంది.
క‌రోనా బ‌తుకులు కుదేలు
కరోనాతో ఉపాధి పోయి కొన్ని కోట్లమంది వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. ప్రపంచంలో కరోనాతో 17.27 లక్షలమంది ఇండియాలో1.46 లక్షలమంది చనిపోయారు. మంచి నీళ్ళు త్రాగి ఏలూరులో వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. బిహార్‌లో మోనోక్రొటోఫాస్‌ అవశేషాలున్నమధ్యాహ్నభోజనాన్ని తిని పిల్లలు చనిపోయారు. దేశంలో సగం మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేమని మూడేళ్లు పడుతుందని భారత్ బయోటెక్ వాళ్ళు అంటున్నారు. జనం చేతిలో కాసులు గలగలలాడేలా ఉపాధి కల్పించాలి. కొనుగోలు సామర్థ్యం పెరిగితే గిరాకీ ఊపందుకొని మాంద్యం తగ్గుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. రైతులను నష్టపరిచే ఎటువంటి చట్టాలనూ తమ రాష్ట్రంలో అమలుచేసేది లేదని కెసిఆర్‌ ప్రకటించారు. లాభాల కోసం మాత్రమే పనిచేసే కార్పొరేట్ వ్యాపారులు దళారులుగా చేరకపోతే దేశంలో ఎక్కడ మంచి ధర దొరికితే అక్కడికెళ్లి రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చుననే చట్టం మంచిదే.
కార్పొరేట్ల సంప‌ద‌తో పాటు పెరుగుతున్న పేద‌రికం
కార్పొరేట్ల సంపదతో పాటే దేశంలో పేదరికమూ పెరుగుతోంది. అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలే. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంత పురోగమించినా అన్నం పెట్టే రైతులు లేకుండా పూట గడవదు. వ్యవసాయం లేకుండా మానవాళికి బతుకు లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటంలేదు. రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క అమెజాన్లు, వాల్‌మార్టులు చిన్నచిల్లర దుకాణాలను ఛిద్రం చేసి మరీ ఎదుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలను దెబ్బ తీస్తుంది. ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకులను ఏర్పాటు చేసిన పెద్ద సంస్థలకు తక్కువ వడ్డీలకు రుణాలిస్తాయి. ప్రైవేటు బ్యాంకులు తిరిగిరాని రుణాలతో దివాళా తీస్తాయి. ప్రజల డిపాజిట్లకు గ్యారంటీ ఉండదు. ముప్పైలక్షలకోట్ల కరోనా ఆత్మనిర్భర ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చినా ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు.
ప‌నికొచ్చే చ‌దువులు ఎక్క‌డా?
పనికొచ్చే చదువులు లేవు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కళాసీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే రెండు కోట్లమంది నిరుద్యోగులు పోటీపడ్డారు. రైల్వే గేట్‌మెన్‌, అసిస్టెంట్, గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు 82 లక్షల మంది పట్టభద్రులు బారులు తీరారు. పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు, పనే దొరకట్లేదని పట్టభద్రులూ బాధపడుతున్నారు. ఉపాధికల్పించలేని చదువుల కోసం విద్యారుణాలు మాత్రం ఇస్తున్నారు. మానవాభివృద్ధి సూచీల్లో చైనా 85 వ స్థానంలో ఉంటే ఇండియా 131 వ స్థానంలో ఉంది. ప్రపంచ భూమిలో ఇండియాకు 2.4శాతం ఉంటే జనాభా 16శాతం ఉంది. సంతానోత్పత్తి పెరుగుతూ జనసంఖ్య చైనాను దాటేలా ఉంది. మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుఉంటే బంగ్లాదేశ్‌(72.6), నేపాల్‌(70.8), భూటాన్‌(71.8) . పదివేల జనాభాకు మన దేశంలో వైద్యులు 9 మంది మాత్రమే. వైద్య కళాశాలల్లో సీట్లు చాలక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు వలసపోతున్నారు. వైద్య విద్య ఖర్చు భరించలేని ప్రజలతో వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి. గిరిజన జనాభా ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 3 శాతమే. జనాభాకు తగినట్లు మొత్తం 1500 విశ్వవిద్యాలయాలు కావాల్సి ఉండగా 993 మాత్రమే ఉన్నాయి. దాదాపు కోటి మంది ఏటా వృత్తి ఉపాధి నైపుణ్యం లేని డిగ్రీలు, రెండు లక్షల మంది ఎంఫిల్‌ , పిహెచ్‌డిలు పొందుతున్నారు. విద్య మీద పెట్టుబడిలో ప్రపంచంలో అమెరికా 27, చైనా 44 , సూడాన్‌ 157, ఇండియా 158, నమీబియా 159వ స్ధానాల్లో ఉన్నాయి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో శ్రీలంక 66, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్తాన్‌ 94,ఇండియా 102, ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్థానాలు.
అక్క‌ర‌కు రాని ఆయుష్మాన్ భార‌త్‌
ఆయుష్మాన్‌ భారత్‌ ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో భరించలేని ఆరోగ్య ఖర్చుతో ప్రజలు అప్పులపాలౌతున్నారు. మన దేశ జిడిపి పెరుగుతున్నా సామాన్య జనం చేతుల్లోకి ఆదాయం రావటంలేదు. ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. డిల్లీలో కుక్కలకు కూడా దహనవాటిక ఏర్పాటుచేశారట. మనిషి ఎంత ధనికుడై బ్రతికినా చివరికి సమాధికి చేరాల్సిందే. కొన్ని చోట్ల సంపన్నులు తమ శ్మశానాలను స్వర్గ పురాలుగా శుభ్రంగా అందంగా మార్చుకుంటున్నారు. పేద కులాలకు చాలా చోట్ల శ్మశానాలే లేవు. శ్మశానాలు ఉన్నా సరైన దారిలేక శవాలను మోస్తూ మరుభూమికి చేరవేయటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దారి పక్క రోడ్డు, డొంక, కాల్వ పోరంబోకు స్థలాలలోనే అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు. శ్మశానాల ఏర్పాటూ సంక్షేమ కార్యక్రమమే కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
ప్ర‌బ‌లుతున్న అంట‌రానిత‌నం
అంటరానితనం నిషేధమైనా ఇప్పటికీ అనేక రూపాల్లో ప్రబలిపోతోంది. ఆడవారిని హింస, బలవంతం, మోసాలు చేసి శ్రమదోపిడి చేస్తున్నారు. అప్పులిచ్చి బానిసలుగా మార్చి లైంగిక దోపిడి చేస్తున్నారు. పిల్లలను చదివించకుండా జీతానికి పనుల్లో పెడుతున్నారు. బలవంతపు పెళ్ళిళ్లు, బాల్య వివాహాలు చేస్తున్నారు. ఈ తప్పుడు పనులన్నీ బానిసత్వమే. అక్రమంగా రవాణా చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకులు పరువు హత్యలు చేస్తున్నారు. బాల్య వివాహాలు ఆపటానికి మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లు , పురుషులకు 21 ఏళ్లుగా పెంచారు. ప్రపంచంలో బాలికా వధువులు భారత్‌ లోనే ఎక్కువ. సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, పేరు చెప్పి కుమార్తె రజస్వల అయితే చాలు పెళ్ళి చేస్తున్నారు.15–19 ఏళ్ల ప్రాయంలోనే బాలికా వధువులు తల్లులవుతున్నారు. 18 ఏళ్లకు ముందే వివాహమాడుతున్న బాలికల సంఖ్య 36 శాతం దాకా ఉంది. మహిళలపై లైంగిక హింస జరుగుతోంది. మహిళలు మగవారిపై ఆధారపడి, వారికి బానిసలుగా ఉంటున్నారు. చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించి మైనర్‌ బాలికలు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురౌతున్నారు. మహిళలకు సమాన చదువు ఆస్తి హక్కు కావాలని జ్యోతిబా ఫూలే, గురజాడ,కందుకూరి,పెరియార్‌ రామస్వామి, అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి వారు చేసిన పోరాటాల ఫలితంగా మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయి. ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు అనే పాత వాగ్ధానం ప్రకారం ఎన్టీఆర్ పక్కా ఇల్లుదగ్గర నుంచి రాజీవ్ స్వగృహ, టిడ్కో ఆత్మనిర్భర్‌ భారత్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన లాంటి ఎన్నో పధకాల కింద కోట్ల ఇళ్ళు మంజూరౌతున్నాయి. ఇల్లులేని వారి సంఖ్య ప్రతి జనాభా లెక్కల్లో పెరుగుతూనే ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో 1.12 కోట్ల ఇళ్లకు గిరాకీ ఉందట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసిచూడు అన్నారు. ఇల్లు లేకపోయినా పెళ్లి చేసుకున్నవారి ఆవేదన తగ్గాలి. ఇళ్ళు అందుబాటు ధరల్లో లేవు. పేదల ఇళ్లకోసం సరైనచోట భూమి దొరకక ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు పంచుతున్నారు. వాటిని మెరక చేసి ఇళ్ళు కట్టాలి. లేదా అపార్ట్ మెంట్లు కట్టి ప్లాటు ఇవ్వాలి. ఇళ్ల పథకాలు జాప్యం లేకుండా పూర్తి చేయాలి. భూమి ధర రోజురోజుకూ పెరిగి ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయాలు పెరుగుతాయి.
జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం హ‌ర్ష‌దాయ‌కం
జగన్ ప్రభుత్వం మహిళల పేరుతో 30.76 లక్షల కుటుంబాలకు ఇంటి పట్టాలు 2.62 లక్షల టిడ్కో ఇళ్ళు ఇవ్వటం హర్షదాయకం. తెలంగాణాలో డబల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లు కట్టించి పేదకుటుంబాలకు ఇవ్వటం పేదల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్ధిక భద్రత నిస్తుంది. కుటుంబాల ఆర్ధిక భద్రత పెరిగినప్పుడు అప్పులు తగ్గి రక్షణ పెరుగుతుంది. వివక్ష అణచివేత హింస బానిసత్వం తగ్గుతాయి.
--(నూర్ బాషా రహంతుల్లా, ఏపీ రిటైర్ట్ స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ 6301493266))



 



3, జనవరి 2021, ఆదివారం

హైకోర్టుల్లోకి హిందీని రానివ్వలేదు

 


హైకోర్టుల్లోకి హిందీని రానివ్వలేదు (వ్యూస్ 3.1.2021)
దేశంలో భాష‌లు 1625
60శాతం మందిది హిందీయేత‌ర భాషే
హిందీ మాట్లాడేది 40శాతమే
(నూర్ బాషా రహంతుల్లా, 6301493266)
దేశంలో హిందీ ధగధగలాడాలని, అది రాజభాషగా వెలుగులీనాలని ‘హిందీ దివస్‌’ పేరుతో ఉత్సవాలు నిర్వ‌హిస్తున్నారు. దేశానికి ఉమ్మడి భాష హిందీ అంటున్నారు. అప్పుడే మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ కన్న కలలు నెరవేరతాయట. తెలుగు గురించి మన రాయలవారు, గురజాడ, కందుకూరి, గిడుగు కూడా కలలు కన్నారు. దేశంలోని 1,625 భాషలకు దినాలు దివసాలు ఎవరు నిర్వ‌హిస్తారు? దేశంలో 60 శాతంమంది హిందీయేతర భాషలు మాట్లాడుతుంటే 40 శాతంమంది మాట్లాడే హిందూస్థానీ (హిందీ) కి అగ్రాసనం వేశారు. హిందీ రాష్ట్రాల్లో కూడా బ్రజ్‌భాషా, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వి ఉరుదూ లాంటి 49 మాండలికాలు పలుకుబడులు ఉన్నాయి. 22 జాతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌ కూడా అధికార భాషే. హిందీని మిగతా భాషలపై రుద్ద వద్దని అన్ని రాష్ట్ర భాషలనూ బ్రతకనివ్వాలని హిందీయేతర భాషల నేతలు కోరితే ఆంగ్లం నుంచి హిందీకి మారే ప్రసక్తే లేదని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నారు. అంబేడ్కర్‌ కూడా దేశీయ భాషల్ని రక్షించి అభివృద్ధి చేయమన్నారు. హిందీని ప్రజలందరి మీదా రుద్దమని ఇంగ్లీషే అనుసంధాన భాష అని రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు అన్నారు. దేశ ప్రజలుకూడా మంచి ఉద్యోగాల కోసం అంతర్జాతీయ భాష ఇంగ్లీషును ఆశ్రయిస్తున్నారు. రాజభాషగా హిందీని కూడా అందరికీ నేర్పాలని పురుషోత్తందాస్‌ టాండన్‌, గుల్జారీలాల్‌ నందా, అమిత్‌ షా వరకు కోరుతూనే ఉన్నారు. అసలు హిందీ వాళ్ళు ఎప్పుడైనా మరో భారతీయ భాష నేర్చుకున్నారా? పరభాషా సహనం తెలుగువారికి ఎప్పుడూ ఎక్కువే.
ఐరాస‌లో పీవీ హిందీ ప్ర‌సంగం
ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడిన మొదటి తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు. ప్రణబ్ ముఖర్జీ తనకు హిందీ రాదు కాబట్టే ప్రదాని కాలేకపోయానని బాధపడ్డారు. ప్రభుత్వ సమాచారమంతా ఇంగ్లీషు హిందీలలోనే ఉంటుంది. అధికార కార్యకలాపాలన్నీ హిందీలో నడిపే సిబ్బందికి నగదు పారితోషికాలిస్తున్నారు. హిందీయేతర రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉత్తరప్రత్యుత్త రాలు నిర్వ‌హించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలనే నియమాన్ని ఆనాడే రాజశేఖరరెడ్డి తోసిపుచ్చారు. హిందీ దేశ ఉమ్మడి భాష కాదని ఎన్ జి రంగా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కరుణానిధి లాంటి దక్షిణాది నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో వాడే హిందీ సంస్కృత పదాలతో జటిలంగా, కృత్రిమంగా ఉంటున్నదని హిందీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. ముందు సామాన్యులకు అర్ధమయ్యేలా వాడుక పదాలు వాడమంటున్నారు.
ప్రాంతీయ భాష‌ల‌ను విస్మ‌రించి హిందీయా?
తెలుగు లాంటి ప్రాంతీయ భాషలు మరుగున పడిపోతున్నా సరే స్కూళ్ళలో హిందీని కచ్చితంగా బోధించాలని కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సు. ఏమిటీ హిందీపెత్తనం? మొండిగా హిందీ తప్పదు అనటం ఉద్యమాలు తలెత్తితే అనలేదనటం కేంద్రానికి అలవాటుగామారింది. ప్రజలు దేశంలో కాదు భాషలో నివసిస్తారని పెద్దలు అంటారు. తనపై మరో భాష పెత్తనాన్ని మనిషి సహించలేడు. ఇంగ్లీషు, హిందీవాళ్లు కూడా అంతే. వారిపై మరో భాష అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ ఒప్పుకోరు. తమ భాషపై ప్రజలకుండే మక్కువ అలాంటిది. తెలుగు ఇప్పటికే సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబీ, ఇంగ్లీషు భాషల కాళ్ళ కింద నలిగినాశనమై పోయింది. ఆర్యులకు పూర్వమే సవర, కోయ భాషల్లో ఎన్నో తెలుగు పదాలు వున్నట్టు గిడుగు శ్రీరామమూర్తి చెప్పారు. మన తెలుగు పదాలే మనకే తెలియకుండా పోయాయి. ఒక పక్క ఏ భాషనూ ప్రభుత్వం ప్రజలపై రుద్దకూడదు అంటూనే హిందీని ద్వితీయ భాషగానైనా నేర్చుకోవాలని చెబుతున్నారు. తెలుగు నేర్చుకోమని ఏ హిందీ రాష్ట్రానికైనా ఎప్పుడైనా చెప్పారా? దేశ ప్రజలందరినీ ఒకే దేశం ఒకే పౌరసత్వం కిందకు రాబట్టగలము కానీ 1,625 భారత భాషలను హిందీ క్రిందకు తీసుకురాగలమా? ఒకే భాష అనటం సమంజసమా? సాధ్యమా? ఈ పని ఇంగ్లీషువల్ల కూడా కాలేదు. కాబోదు. ప్రాంతీయ భాషలపై హిందీని ఉన్నత పీఠం ఎక్కించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
ఏ భాష‌కూ జాతీయ హోదా లేదు
ఏ భాషకూ జాతీయ హోదాను రాజ్యాంగం కట్టబెట్టలేదు. హిందీకి లిపికూడా లేదు.దేవనాగరి లిపిని కట్టబెట్టారు. హిందీ పట్ల మిగతా భాషల వాళ్ళకు వ్యతిరేకత పెరిగేలా హిందీ దివాసాలు దినాలు మాత్రం చేస్తున్నారు. 1938లో రాజగోపాలాచారి మద్రాసు లో హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేసి వల్లగాక 1940 లో ఉపసంహరించుకున్నారు. ఈసారి కేంద్ర నాయకులు రంగంలో దిగి చెన్నై లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏర్పాటుచేశారు. మిగతా భాషలకు ఎక్కడా కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. భాషల విషయంలో బ్రిటీష్ పాలకులే నయమనిపించారు. ప్రజల భాషల్లో చదువులు నేర్పారు. పతకాలు, నిఘంటువులు ఇచ్చారు. మూలభాష దేవభాష అనకుండా జనంలోకి చొచ్చుకుపోయి తమ మతగ్రంధాలు, ప్రార్ధనలను కూడా ఎవరిభాషలో వారిని చేసుకోనిచ్చారు. కాబట్టే ఇంగ్లీషుకు కోర్టులు, మతము, సాంకేతికత, వలసలు, వాణిజ్యం, విద్య, వినోదం అన్నీ తోడై సహజ పద్ధతుల్లోనే అంతర్జాతీయ భాషగా విస్తరించింది. హిందీని రాజభాషగా ఊరేగించాలన్న ఉత్సవాల కోరిక తప్ప పరోపకారం లేకపోతే ఎలా? ఏ భాష కైనా ఆదాన ప్రదానాలు ఇచ్చి పుచ్చుకోవటాలు తప్పవు. ప్రజలకు ఈనాడు ఇంగ్లీషు వలన ఒనగూడుతున్న ప్రయోజనాలు హిందీ వలన కూడా కలిగితే ప్రజలు వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా హిందీని కోరుకుంటారు. కోరుకోనివ్వాలి. సంస్కృతాన్నిసామాన్యులకు దాచిపెడితే పాచిపోయింది. లాటిన్, గ్రీకు భాషలు కూడా అంతే.
హిందీ నేర్చుకుంటే లాభాలేమిటి?
రాజభాష హిందీ నేర్చుకున్నవారికి కలిగే లాభాలు ఏమిటి? లాభాలు చెప్పకుండా హిందీ దివసాల పేరుతో కోట్లరూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. మంచిదే. అయితే దేశభాషలందు మా భాష కూడా లెస్సే అనే మిగతా భాషల దివసాలకు కూడా బడ్జెట్లో డబ్బులిచ్చారా? ఇస్తే బాగుండేది. కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో హిందీ ఆఫీసర్లు, రోజుకో హిందీ పదం, హిందీలో పరిభాషా కల్పన, ప్రాచుర్యం, సివిల్స్ పరీక్షలలో హిందీ లాంటి సదుపాయాలు హిందీకే కలిగిస్తున్నారు. తెలుగుకు ఏ సదుపాయమూ కల్పించనప్పుడు కంచి గరుడ సేవలాగా ఈ హిందీ భారమెందుకు? హిందీయేతర ప్రజలు మాతృభాషతోపాటు ఆంగ్లం చాలులే అనుకోరా? ఉపయోగాలులేని ఏక పక్ష హిందీ శాసనాలవల్ల మిగతా భాషస్తుల్లోఅయిష్టత పెరుగుతుంది. ఎంతో కాలం గడిచాక ప్రాంతీయ భాషలలోనూ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఇంగ్లీషు మీడియం వాళ్ళతో హిందీ మీడియం వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. హిందీ భాషకు అనేక రాయితీలు ఇచ్చారు. హిందీ వాళ్లలాగా ఐఐటిలలో తెలుగులో చదువుకొని ఈ రోజుల్లో ఇంజనీర్లు కాగలమా? ఉద్యోగాలు వస్తాయా? ఉపాధి కోసమేకదా ఆంగ్ల మాధ్యమం విస్తరిస్తోంది? రాష్ట్ర భాషలు ఎందుకు క్షీణిస్తున్నాయి? కేంద్రమే హిందీతో ఉద్యోగాలు ఇవ్వలేకపోతే బడుగు ప్రజల బాగుకోసం ఇంగ్లీషునే కోరుకునే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపరిధిలో ప్రాంతీయ భాషలతో ఉద్యోగాలు ఏమిస్తాయి? హిందీ నూతన విద్యావిధానం తో భారీ ఉపాధి సాధ్యమేనా?
80 ఏళ్ళ క్రిత‌మే ఉర్దూ మీడియం
నైజాం ప్రభుత్వం 80 ఏళ్లక్రితమే ఉర్దూ మీడియంలోనే వకీళ్ళు,వైద్యులు,శాస్త్రవేత్తలను తయారు చేసింది. తెలంగాణా విడిపోయాక తెలుగు ఉర్దూ అకాడమీలు రెండూ కనుమరుగయ్యాయి. జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాల్సిందేనంటూ పట్టుపట్టిన ఎన్టీఆర్‌, దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తానన్నాడు. ఫైలు తెలుగులో తెస్తేనే సంతకం పెట్టాడు. యధారాజా తధా ప్రజా అన్నట్లు అధికారులు తెలుగులో ఫైళ్ళను పరుగులెత్తించారు.
భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన అనే సూత్రాన్ని మన దేశం సోవియట్ నుండే స్వీకరించింది. అక్కడ రష్యన్ భాషా రుద్దుడు ఎలాంటి ఫలితాన్ని తెచ్చిందో ఇక్కడ హిందీని బలవంతంగా రుద్దడం కూడా అలాంటి ఫలితాన్నే తెస్తుంది.
బాల‌ల్లో మాతృభాషా బీజాలు నాటాలి
బాలల్లో మాతృభాషలోనే విజ్ఞాన బీజాలు నాటాలి. మన పిల్లలకు తెలుగే సరిగా రాదు, ఆలోచన వికసించేదశలో హిందీ అదనపు బారమా ? తనభాషే తనకు రాని పసి మనసును పరాయి భాషలకు వశం చేయటం కాదా? హిందీ రాష్ట్రాల్లో పిల్లలు ఇంగ్లిషుతోపాటు ఆధునిక భారతీయ భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవాలట. హిందీయేతర రాష్ట్రాల్లోనైతే ఆంగ్లం, స్థానిక భాషతోపాటు హిందీ బోధన కూడా సాగాలట. వాస్తవానికి ఇంగ్లీషే జాతీయ భాష అన్నాయి కోర్టులు. సుప్రీం కోర్టులో చెలామణి అయ్యే ఇంగ్లీషే జాతీయ భాష. హిందీతోపాటు ఏ భారతీయ భాషకూ ఇంగ్లీషు స్థాయి దక్కలేదు.న్యాయస్థానాల్లోకి హిందీని ఈనాటికీ తీసుకు రాలేకపోయారు. నాయకులు సైతం ఇంగ్లీషు వైపే మొగ్గారు.రాజ్యాంగమే ఇంగ్లీషులో రాశారు. హైకోర్టులు,సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు హిందీని న్యాయస్థానాల గడప దగ్గరే ఆపేశారు. ఇంగ్లీషు తప్ప మరేభాషా హైకోర్టుల్లో వద్దన్నారు.అందరూ ఇంగ్లీష్ అభిమానులే. మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా వినియోగించేందుకు అనుమతించాలని కరుణానిధి విన్నవించారు,తమిళనాడు శాసనసభ తీర్మానించింది అయినా కేంద్రం తిరస్కరించింది. హైకోర్టు,సుప్రీంకోర్టుల్లో హిందీ తీర్పులు తేవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అడిగినా లాకమీషన్ ఇంగ్లీషులో తప్ప హిందీ లో గానీ ఇంకా ఏ ఇతర భారతీయ భాషలలో గానీ వాదనలు తీర్పులు కుదరవని తీర్మానించింది.హై కోర్టుల్లో హిందీ ఎందుకు వద్దో లాకమీషన్ చెప్పిన కారణాలు :
“భాష దేశ ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. భాష ప్రజలను ఐక్యపరుస్తుంది. ఎవరిమీదా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదు.ఉన్నతన్యాయస్థానాలలోని వాదనలు తీర్పులు మామూలుగా జరిగేది ఆంగ్ల భాష లోనే.భారతీయ న్యాయ వ్యవస్థ ఇంగ్లీషుకు అమెరికా న్యాయ పుస్తకాలకు అలవాటుపడింది. కాబట్టి ఉన్నత న్యాయమూర్తుల్ని ఇంగ్లీషుకే స్వేచ్ఛగా వదిలేయ్యాలి.ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి మరో ప్రాంతానికి బదిలీపై వెళితే ఆ రాష్ట్ర భాష నేర్చుకొని ఆ భాషలో తీర్పులివ్వాల్సివస్తుంది. అది చాలా కష్టం. జడ్జీలమీద అనేక భాషల భారం మోపకూడదు. వాళ్ళమీద ఏ భాషనూ రుద్దకుండా జడ్జీలను వాళ్ళ భాషకు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయ్యాలి. దేశప్రజలందరూ తప్పక సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చే ఏకైక భాష అయిన ఇంగ్లీషును అర్ధం చేసుకోక తప్పదు. అన్నీ కోర్టుల్లో ఇంగ్లీషే ఉంటే వివిధ భాషా ప్రాంతాలమధ్య న్యాయవాదుల కదలిక సులభం అవుతుంది. కోర్టుల్లో హిందీ అమలు కోసం కావాల్సిన చట్టపరమయిన నియమాలు నిబంధనలు ముందు ఇంగ్లీషులోనే చెయ్యాలి. ఉన్నత న్యాయ స్థానాలను మాత్రం ఆంగ్ల భాషను మార్చుకోమని అడగవద్దు”. జాతీయ భాష హిందీ కాదు ఇంగ్లీషే ,దేశానికి ఆంగ్లమే దిక్కు అంటున్నారు న్యాయమూర్తులు. ఇంగ్లీషు రాని హిందీ వాళ్ళెవరూ హై కోర్టుల్లో పనికిరారు.హిందీగానీ, మరే భారతీయ భాషగానీ హై కోర్టుల దరిదాపుల్లోకి వెళ్లలేదు. జాతీయ అనుసంధాన భాష హిందీ కాదు ఇంగ్లీషే. హిందీ దివస్,‘హిందీవారం’, “రాత కోతలన్నీ హిందీలోనే “ లాంటి కార్యక్రమాలన్నీ కోర్టుబయట మానసిక తృప్తీ ఓదార్పు పొందటం కోసమే. 1990లోనే ఉత్తరప్రదేశ్ లో ములాయంసింగ్‌ ఇంగ్లీషు మీడియాన్ని రద్దుచేశాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీనే వినియోగించాలంటూ ఆదేశించారు. నేటికీ హిందీ రాష్ట్రం లో హిందీ హై కోర్టుల లోకి రాలేకపోయింది. తెలుగులోనే తీర్పులు వచ్చేలా గ్రామ న్యాయాలయాలు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతీర్పులు అడిగే వాళ్ళే లేరు,హై కోర్టుల జోలికి వెళ్లకుండా అధికార భాషా సంఘాలతోనూ, భాషా ప్రాధికార సంస్థలతోనూ,కళాపరిషత్తులు,అకాడమీలు,అవధానాలు,దివసాలతోనూ భారతీయ భాషలు అన్నీ సరిపెట్టుకోక తప్పదు.
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

15, నవంబర్ 2020, ఆదివారం

తెలుగు ప్రాధికార సంస్థ ఏది? తెలుగుకు దిక్కుఎవరు ?


తెలుగు ప్రాధికార సంస్థ  ఏది?
తెలుగుకు దిక్కుఎవరు ? తెలుగులో పాలన జరగాలి.
తెలుగు అధికార భాష కావాలంటే 2004,2006 ,తెలుగు దేవభాషే 2012,తెలుగులో పాలన 2018 పుస్తకాలలోని అన్ని వ్యాసాలు.https://www.blogger.com/blogger.g... లో ఉన్నాయి.
40 ఏళ్ల సర్వీసులో పత్రికలలో పడిన నా వ్యాసాలతో నాలుగు పుస్తకాలు ప్రచురించగలిగాను.అన్నీ తెలుగు పాలనా భాష కోసమే.చివరికి 2018 లో తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటుకు జీవో వచ్చింది.తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడింది కానీ తెలుగులో పాలన జరగటంలేదు.తెలుగులో పాలన జరగాలి.  
 Archive లో నా ఉచిత పుస్తకాల లింకులు :
1. తెలుగు అధికార భాష కావాలంటే 2004,2006
2. తెలుగు దేవభాషే 2012
3. తెలుగులో పాలన 2018
 
 
తెలుగుకు దిక్కుఎవరు ?
(సూర్య 6.10.2019 లో నా సంపాదకీయం )
హోం మంత్రి షా ప్రవచించిన ఒకే దేశం, ఒకే భాష అనేది శుష్క నినాదం.మనది అనేక రాష్ట్రాలు భాషలు కలిసి బ్రతుకుతున్న దేశం.ఒక దేశంగా ఉంటాం గానీ అందరూ ఒకేభాష మాట్లాడాలి అని శాసిస్తే ఎదురు తిరుగుతాం. హిందీ భాషను దేశమంతా నేర్చుకోవాలనే ప్రకటనను అన్నీ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మతం కన్నా భాషనే ప్రజల్ని ఐక్యం చేస్తుంది. భాష విషయంలో రాష్ట్రాలకే అధికారం ఉండాలి. రాష్ట్రాలు కూడా ఆంగ్లం మోజులో పడి స్థానిక భాషల్ని పట్టించుకోకపోతే, రాష్ట్రాల స్థాయిలో కూడా భాషా సమస్యలు తలెత్తి, ఉద్యమ రూపం దాల్చవచ్చు. భాష ఓ సాంస్కృతిక వారధి.భాషను ధ్వంసం చేస్తే ఆ జాతి అంతమై వచ్చే కొత్త తరం పరాయీకరణకు గురవుతుంది.వలస పాలకుల కాలంలోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ కింద దాదాపు 125 పాఠశాలల్లో హిందీని బలవంతంగా ప్రవేశపెట్టారు.పెరియార్‌ నాయకత్వంలో తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని రద్దు చేసుకున్నారు.1960లో డిఎంకె పార్టీ, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నడిపి అధికారాన్ని చేపట్టింది. . కొఠారి,కస్తూరి రంగన్‌ ప్రస్తావించిన త్రిభాషా సూత్రాన్ని ముందుగా నిరసించింది తమిళనాడే!జాతీయ రహదారుల వెంట మైలురాళ్ళ మీద హిందీలో రాసిన ఊళ్ళ పేర్లను తుడిపేయటం తమిళనాడు వెళ్ళినవాళ్ళు చూసేవుంటారు.వాళ్ళు Longlive Classical Divine Tamil అని బోర్డులు పెడతారు. ప్రాచీన దేవభాష తమిళం కలకాలం వర్ధిల్లాలి అని కోరుకుంటారు.అందుకే తమిళం జోలికి వెళితే అసలు ఊరుకోరు.ఆభాషను కాపాడుకోటానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటారు.తమిళ ఉద్యమం జల్లికట్టు ఉద్యమం కంటే పదిరెట్లు ఉంటుందని కమల్ హాసన్ హెచ్చరించారు కూడా.
ప్రజలు మాట్లాడే భాష వివక్షతకు గురైతే దేశాలే విడిపోతాయని బంగ్లాదేశ్‌ ఏర్పాటు తెలిపింది. భారతదేశ విభజన వలన ఏర్పడిన తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లలో కూడా ఉర్దూనే అధికార భాషగా ఉంటుందని 1948లో ఇస్లామాబాద్‌ ప్రకటించింది. 1952లో చెలరేగిన భాషాపరమైన అల్లర్లపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 21, 1952న కాల్పులు జరిపించింది. ఢాకా హైకోర్టు ముందే బంగ్లా విద్యార్థులు, పౌరులు మరణించారు. చివరికి ప్రభుత్వం 1956లో బంగ్లాను జాతీయ భాషగా గుర్తించింది. 1971లో మొత్తంగా తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాక్‌ నుంచి విముక్తి పొంది భాష పేరుతో బంగ్లాదేశ్‌గా ఏర్పడింది ! భాష రక్షణ కోసం జరిగిన ప్రాణ త్యాగాలకు గుర్తుగా యునెస్కో 1999 ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ దినోత్స వంగా గుర్తించింది.
మధురై హైకోర్టు న్యాయమూర్తి రమేశ్ గారు న్యాయ పరీక్షలను తమిళ మాధ్యమం లో రాసిన సెంథిల్ కుమార్ అనే విద్యార్ధిని అభినందించారు.అక్కడ సివిల్ జడ్జి పోస్టుల వరకు కూడా తమిళ మాధ్యమంలో చదివి తమిళ మాధ్యమం లోనే పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేశారు.తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా రిట్ పిటీషన్ నంబర్లు 695 and 7403 of 2011 Dt.3.2.2012 , 23.2.2016 న,మళ్ళీ 28.9.2019 న ఈ చట్టాన్ని సమర్ధించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
ఈ తీర్పుల్ని ఉదహరిస్తూ మన రాష్ట్రంలో కూడా తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 1985 వరకు ఇచ్చిన 5% ప్రోత్సాహక మార్కులను ఆ తరువాత వివిధ సందర్భాలలో ఇస్తామని ప్రకటించిన 20% రిజర్వేషన్లను ఇప్పించవలసిందిగా హైకోర్టును కోరాలి. ఈ మధ్య జరిగిన గ్రామ వాలంటీర్లు,గ్రామ సచివాలయాల అధికారుల ఎంపిక పరీక్షలలోనైనా తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు 5% ప్రోత్సాహక మార్కులు ,20% శాతం రిజర్వేషన్ ఇస్తే తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లవుతుంది.పైగా ఇవి గ్రామస్థాయి ఉద్యోగాలే కాబట్టి తెలుగులో ఆలోచించి రాయటం ఖచ్చితంగా రావాలి.ప్రజాజీవితంలో తమిళం అవసరమైన అన్నీ ఉద్యోగాలనూ తమిళం చదివిన అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేసేలా తమిళ పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.తెలుగునాట రెండు రాష్ట్రాలలో తమిళనాడు తరహా పనులు జరగాలి.రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాధమిక విద్యను ఇంగ్లీషు కాన్వెంట్లలోకి ప్రభుత్వాలు మార్చాయి.తెలుగుమాధ్యమ కళాశాలలను, తెలుగు మాధ్యమ పట్టభద్రులను వెతికి పట్టుకోవలసి వస్తుంది.ప్రభుత్వ అధినేతలే తెలుగుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు అదే సరైన బాట అనుకొని సాగిపోతారు.విచిత్రంగా ఆంధ్ర,తెలంగాణాలలో తెలుగుభాషకు ప్రభుత్వం ఏమిచేస్తుందో పాలకులు చెప్పటంలేదు. తెలుగుకోసం న్యాయస్థానాలకు వెళ్ళి ఓడిపోయిన వాళ్ళ పక్షాన అప్పీలు కూడాచేయటం లేదు.ఇచ్చిన జీవోలు అమలు కాకపోయినా పట్టించుకోవటం లేదు. ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో లేకుండా నిర్మూలించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే తెలుగును పాలనాభాష కాకుండా మొదటి దెబ్బ కొట్టాయి. ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యటం అసాధ్యమే.పునాది లేకుండా భవనాన్ని కట్టలేము.
తెలుగుపత్రికా యజమానులు కొందరైనా ముందుకు రావాలి.కొన్నేళ్ళు పోతే తెలుగు పత్రికలు చదివేవాళ్ళు లేక మూతపడవచ్చు.భాష రక్షణ కేవలం భాషాభిమానుల వల్ల కాకపోవచ్చు.తెలుగు ప్రాధికార సంస్థ కోసం ఇచ్చిన జీవోను అమలు చెయ్యమని అడగాలి.ఒక్కొక్క డిమాండును అమలు చెయ్యమని విడివిడిగా ధరఖాస్తులతో ప్రభుత్వాన్ని కోరాలి. తెలుగు పత్రికాధిపతులు , విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖాధిపతులు,తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు ముందుకు రండి.మనం కోరుతున్న కోర్కెలు ఇవే: ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలోకి మారాలి.తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడాలి.తెలుగులో పాలన జరగాలి.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రోత్సాహక మార్కులు,ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి.
---నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

30, జనవరి 2020, గురువారం

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు



తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు
తెలుగులో ముప్ఫైకి పైగా శతకాలు ముస్లిం కవులు రాశారు :
ముహమ్మద్‌ హుస్సేన్‌
భక్త కల్పద్రుమ శతకం (1949),మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.,హరిహరనాథ శతకము,అనుగుబాల నీతి శతకము,తెనుగుబాట శతకము.
''మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృభాష యొండు మాన్యము గదా
మాతృశబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల''
షేక్‌ దావూద్‌
1963 రసూల్‌ప్రభు శతకము,అల్లామాలిక్‌శతకము
సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌
''సయ్యదయ్యమాట సత్యమయ్య'' సూక్తి శతకము,
ముహమ్మద్‌ యార్ సోదర సూక్తులు
గంగన్నపల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము - ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య
హాజి ముహమ్మద్‌జైనుల్‌అబెదీన్‌
ప్రవక్త సూక్తి శతకము, భయ్యా శతకము
తక్కలపల్లి పాపాసాహెబ్‌
''వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట''
షేక్‌ ఖాసిం
సాధుశీల శతకము :
''కులము మతముగాదు గుణము ప్రధానంబు
దైవచింత లేమి తపముగాదు,
బాలయోగి కులము పంచమ కులమయా,
సాధులోకపాల సత్యశీల''
షేక్‌ అలీ
''గురుని మాట శయము గూర్చుబాట''అనే మకుటంతో 'గురునిమాట' శతకం (1950) మానస ప్రబోధము శతకం
''ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
పాండితీ ప్రకర్ష పట్టుబడదు
పరులభాష గాన బాధను గూర్చును
గురుని మాట యశము గూర్చు బాట''
''దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
వభ్యసించవలయు నర్భకుండ
మాతృభాష నేర్చి మర్యాదలందుమా
గురుని మాట యశము గూర్చు బాట''
షంషీర్‌ అహ్మద్‌ కెంపుగుండె 1999
''ప్రజల భాష తెలుగు,
ప్రజల నేలు ప్రభువుల భాష తెలుగు
ఆలు బిడ్డలతో ఆనందంగా పలకరించి,
పులకించి,ప్రేమ మీర పరవశించు,
ఆంధ్రుల ఇంటింటా మాటాడు భాష తెలుగు
కాసుకు కల మమ్ముకున్నంతలోనే, నీకు నాకు మధ్య
ఇంగిలీషు దొరతనపుదూరమెందుకో!?
మనం మాట్లాడే భాషలోనే, పాలన మర్మాలు
ప్రజలకు విడమరచి చెప్పలేని, దౌర్భాగ్యమెందుకు?
మండు వేసవిలో మృగతృష్ణల వెంట ఈ పరుగులెందుకు?
అమ్మలాంటి కమ్మనైన గంగిగోవు పాలనొదిలి
ఖరము పాల కొరకు
ఇంగిలీషు షోకు వెంట ఈ పరుగులెందుకు?''
షేక్‌ మస్తాన్‌ ''తెలుగు సాహిత్యం - 1984 వరకు ముస్లిముల సేవ'' అనే సిద్ధాంత వ్యాసానికి అలీఘర్‌ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్‌ మస్తాన్‌ గారికి పి.హెచ్‌.డి. వచ్చింది.ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆయన 1991లో ప్రచురించారు.ఆ గ్రంథంలో 1984 వరకు వెలువడిన 42 మంది తెలుగు ముస్లిముల గ్రంథాలను పేర్కొన్నారు :- అబ్దుల్‌గపూర్‌ ముహమ్మద్‌ ఖుర్‌ఆన్‌, ఇస్లాం మత ప్రభువులు, మిష్‌కాతె షరీఫ్‌ అలి ముహమ్మద్‌ ఆణి ముత్యాలు, హృదయమాధురి, వేదనా సౌరభము, మమత. షేక్‌ రసూల్‌ మిత్రబోధామృతము అహమ్మద్‌బాషా సయ్యద్‌ శ్రీ ప్రవక్త ముహమ్మద్‌ రసూల్‌వారి దివ్య చరిత్ర. ఆలీ షేక్‌ గురునిమాట, మానస ప్రబోధము ఇస్మాయిల్‌ చెట్టునా ఆదర్శం, మృతవృక్షం, చిలకలు వాలిన చెట్టు. ఆఁ? ఉమర్‌ఆలీషా అనసూయాదేవి, ఉమర్‌ఖయ్యామ్‌, కళ, ఖండ కావ్యములు, చంద్రుగుప్త, తత్త్వ సందేశము, దానవవధ, బర్హిణిదేవి,బ్రహ్మ విద్యా విలాసము, మహాభారత కౌరవ రంగము, శ్రీ ముహమ్మద్‌వారి చరిత్ర, స్వర్గమాత, సూఫీ వేదాంత దర్శనము. ఖాసింఖాన్‌ ముహమ్మద్‌ ఆవిమారకము, ఆత్మాభిమానము, ఆల్బర్ట్‌ఐన్‌స్టీన్‌, ఉత్తరరామ చరిత్ర, ఖురానెషరీప్‌,దేవుడు, నాదేశము, దేశభక్తులు ప్రతిమ, వాసవదత్త. ఖాసీంఖాన్‌ సాహేబ్‌ షేక్‌ వీరభద్ర విజయము ఖాసీం సాదుశీల శతకము గపూర్‌ బేగ్‌ ముహమ్మద్‌ నిరపరాధులు, గ్రీష్మంలో వసంతం. జలాలుద్దీన్‌ యూసఫ్‌ మొహమ్మద్‌
లోక శాంతికి దైవ సూత్రము, మతము, రాజకీయము యదార్ధమేది, దైవనియమావళి. జైనుల్‌ అబెదీన్‌ ముహమ్మద్‌
ఖుర్‌ఆన్‌సూక్తులు, ఖుర్‌ఆన్‌ప్రవచనములు, ముహమ్మద్‌ప్రవక్త జీవితము - సందేశములు, భయ్యా శతకము (అను) ప్రవక్త సూక్తి శతకము. దరియా హుస్సేన్‌షేక్‌ పురుషోత్తముడు. దస్తగిరి అచ్చుకట్ల మణి మంజూష, అమృతమూర్తి దావూద్‌షేక్‌ చిత్త పరివర్తనము, దాసీపన్నా, రసూల్‌ప్రభుశతకము, సంస్కార ప్రణయము, సూఫీ సూక్తులు. నఫీజుద్దీన్‌ ముహమ్మద్‌ కనకపు సింహాసనమున, దేవుడూ నీకు దిక్కెవరు, ధర్మ సంరక్షణార్థం, విముక్తి, విధి విన్యాసాలు.నూరుల్లా ఖాద్రి సయ్యద్‌ రమజాను మహిమలు, నమాజు బోధిని, సుందరమగు నమూనా, విశ్వాసములు, ఆరుమాటలు, జుబా : పాపాసాహెబ్‌ తక్కల్లపల్లి అంబ, రాణీ సంయుక్త, సత్యాన్వేషణము, పాపసాబు మాట పైడిమూట.పీరాన్‌ నిజామి, హజరత్‌హుస్సేన్‌ సంస్కరణము, సూరాయె ఫాతిహా, హజ్రత్‌ముహమ్మద్‌, సీరత్‌ను గురించి ఉపన్యాసములు.ఫరీదు షేక్‌ వేమన బుడన్‌సాహేబ్‌షేక్‌ ఖుతుబ్‌నామా, జలాల్‌నామా మస్తాన్‌ సయ్యద్‌ మధు మహబూబ్‌ సమత మహబూబ్‌ ఖాన్‌ సూరీడు మహబూబ్‌ సాహేబ్‌ షేక్‌ శ్రీ శైల క్షేత్ర మహాత్యము. ముహమ్మద్‌ అజమ్‌ సయ్యద్‌ సూక్తి శతకము ముహమ్మద్‌ హుస్సేన్‌ షేక్‌ భక్త కల్పధ్రుమ శతకము, హరినాధ శతకము, సుమాంజలి, తెలుగుబాల, అనుగు బాల మిష్కిన్‌సాహేబ్‌ షేక్‌ నానార్ధనవనీతము మీరా జాన్‌షేక్‌ సర్వమత సార సంగ్రహణము మొహియుద్దీన్‌ హుస్సేన్‌ సయ్యద్‌షా తౌహీద్‌ మొహిద్దీన్‌ పీరా పటూరి ఇస్లాం బోధిని, మొహిద్దీన్‌ మల్లిక్‌ సుల్తాన్‌ శ్రేయస్కర మార్గము, మరణానంతర జీవితము, ఇస్లాం జీవిత విధానము, ఆర్థిక సమస్య - ఇస్లాం పరిష్కారము, నిర్మాణము - విచ్చిన్నము, కలిమయె-తయ్యబ-ఆర్ధము, ప్రపంచ మార్గదర్శి, ఇస్లాం శిక్షణ, ఇస్లాం బోధిని, నిర్యాణము, విచ్చిన్నము యార్‌ ముహమ్మద్‌ ఆ వేదన, సోదర సూక్తులు రసూల్‌ షేక్‌ మిత్ర బోధామృతము వజీర్‌ రహమాన్‌ ఎచటికి పోతావీరాత్రి, కవిగా చలం. వలి శ్రీమతి లక్ష్మీఊర్వశి, సలాం అబ్దుల్‌ చలంగారి శ్రీశ్రీ, షంసుద్దీన్‌ముహమ్మద్‌ కళంకిని, విజయ, నల్లబంగారం, ధనవంచిత అమృతపధం హమీదుల్లా షరీఫ్‌ షేక్‌ దైవ ప్రవక్తలు, ఖురానీ గాధలు
మారుపేర్లతో కొందరు
ఖాదర్‌మొహియుద్దీన్‌,(సౌజన్య) (మహమ్మద్‌నఫీజుద్దీన్‌), శాతవాహన (గులాంగౌస్‌), కౌముది (మహమ్మద్‌సంషుద్దీన్‌), శశిశ్రీ (బేపారి రహంతుల్లా), దేవీప్రియ (షేక్‌ఖాజా హుసేన్‌)
ఇంకా వాహెద్,స్కైబాబా, షేక్‌కరీముల్లా, సత్యాగ్ని హుసేన్‌, సుగంబాబు, అఫ్సర్‌, యాకూబ్‌, డానీ, ఖదీర్‌బాబు, బా రహంతుల్లా, వేంపల్లి షరీఫ్‌, అక్కంపేట ఇబ్రహీం, దాదా షయాత్‌, దిలావర్‌, ఖాజా, పద్మశ్రీ నాజర్‌, ఇనగంటి దావూద్‌, షహనాజ్‌బేగం, షాజహానా, మహజబీన్‌, జరీనాబేగం, షహనాజ్‌ఫాతిమా,రహమాన్ లాంటి తెలుగు రచయితలు ఎందరో ఉన్నారు.
తెలుగులో 11 మంది 14 ఖురాన్‌ అనువాదాలు చేశారు :
1925-చిలుకూరి నారాయణరావు
1941-ముహమ్మదు ఖాసిం ఖాన్
1948-ముహమ్మద్ అబ్దుల్ గఫూర్,
1980-షేక్ ఇబ్రాహీం నాసిర్
1985-హమీదుల్లా షరీఫ్
2004-అబుల్ ఇర్ఫాన్
2007-యస్.ఎం.మలిక్
2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్
2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,
2010-అబ్దుల్ జలీల్
2012-డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్, 2012-అజీజుర్రహమాన్
2013 –అజీజుర్రహమాన్
2020-అజీజుర్రహమాన్
స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిములు 5 తెలుగు పత్రికలు నడిపారు :-
1842 ''వర్తమాన తరంగిణి'' వార పత్రిక.
1842 జూన్‌8న సయ్యద్‌రహమతుల్లా
మద్రాసు.
సయ్యద్‌రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం. మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు :
''మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర బాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింప జేయడమునకు కారకులమైతిమి.''
1891 ''విద్యన్మనోహారిణి'' మీర్‌షుజాయత్‌అలీఖాన్‌, నరసాపురం, తరువాత ఈ పత్రిక వీరేశలింగం గారు నడిపిన ''వివేకవర్ధిని'' లో కలిసిపోయింది.
1892 ''సత్యాన్వేషిణి'' బజులుల్లా సాహెబ్‌, రాజమండ్రి
1909 ''ఆరోగ్య ప్రబోధిని'' షేక్‌అహ్మద్‌సాహెబ్‌, రాజమండ్రి.
1944 ''మీజాన్‌'' దినపత్రిక కలకత్తావాలా, హైదరాబాదు అడవి బాపిరాజు సంపాదకుడు.
2010 - సయ్యద్‌ నశీర్‌అహమ్మద్‌ 333 మంది తెలుగు ముస్లిం కవులు,రచయితలు, అనువాదకుల వివరాలతో 257 మంది ఫొటోలు, చిరునామాలతో 'అక్షరశిల్పులు' పుస్తకం 2010 లో ప్రచురించారు.2010 లో ''సయ్యద్ సలీం'' నవల ''కాలుతున్న పూటతోట''కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266

9, జనవరి 2020, గురువారం

తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలి

తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలి (సూర్యలో నా సంపాదకీయం 10.1.2020)
విజయవాడలో4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల తీర్మానాలలో తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది.కోటివిద్యలు కూటికోసమే కదా? మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ,పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. కానీ ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది.మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వేళ్ళాతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమపిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి.తెలుగు బడుల్లో నీటి వసతి,మరుగుదొడ్లు ఉండవు.పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది?ఎలా ఉంటుంది?తెలుగుబడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు.తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు.ఎటు లాభం ఉంటే అటే పోతాడు.ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే.చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు.చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నాతల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే.నిజాన్ని నిజమనే చెబుదాం.ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే.అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు.తెలుగు సభల్లోనేమో అందరి కోరికా.తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళమాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని.ఆంగ్లమాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు.తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి.తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి.ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసుకమీషన్ పరీక్షల్లో తెలుగుమాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి.తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు,తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమవిద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్నతలు.భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాషద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి.తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు.తెలుగుద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచతెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తినివెళ్ళగక్కాడు.ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు.ఆయనమాట ఎవరూ వినలేదు.తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగుపదాలకు బదులు కఠిన సంస్కృతపదాలు కుమ్మరించి,ఆంగ్లపదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు.వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు.ఇక ప్రజల భాష తెలుగు పాలనాభాష అవుతుందా?అలాంటి ఆశలు మనము ఉన్నాయా?అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత.అవసరసమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?
తెలుగు అధికారభాష కావాలంటే,తెలుగు దేవభాషే ,తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాష గా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని,చెన్నై మదురై,బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివి ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు.తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ప్రోత్సాహకాలు,ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

31, డిసెంబర్ 2019, మంగళవారం

తెలుగు చదువులకు ఉద్యోగాలేవి?



తెలుగు చదువులకు ఉద్యోగాలేవి? (సూర్యలో నా సంపాదకీయం 1.1.2020)
విజయవాడలో4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల తీర్మానాలలో తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది.కోటివిద్యలు కూటికోసమే కదా? మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ,పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. కానీ ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది.మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వేళ్ళాతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమపిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి.తెలుగు బడుల్లో నీటి వసతి,మరుగుదొడ్లు ఉండవు.పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది?ఎలా ఉంటుంది?తెలుగుబడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు.తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు.ఎటు లాభం ఉంటే అటే పోతాడు.ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే.చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు.చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నాతల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే.నిజాన్ని నిజమనే చెబుదాం.ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే.అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు.తెలుగు సభల్లోనేమో అందరి కోరికా.తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళమాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని.ఆంగ్లమాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు.తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి.తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి.ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసుకమీషన్ పరీక్షల్లో తెలుగుమాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి.తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు,తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమవిద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్నతలు.భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాషద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి.తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు.తెలుగుద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచతెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తినివెళ్ళగక్కాడు.ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు.ఆయనమాట ఎవరూ వినలేదు.తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగుపదాలకు బదులు కఠిన సంస్కృతపదాలు కుమ్మరించి,ఆంగ్లపదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు.వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు.ఇక ప్రజల భాష తెలుగు పాలనాభాష అవుతుందా?అలాంటి ఆశలు మనము ఉన్నాయా?అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత.అవసరసమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?
తెలుగు అధికారభాష కావాలంటే,తెలుగు దేవభాషే ,తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాష గా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని,చెన్నై మదురై,బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగాలొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటిద్వారా తెలుగును అమలుచేస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు.ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు.తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ప్రోత్సాహకాలు,ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

28, డిసెంబర్ 2019, శనివారం

తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి!


తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి!


4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలు విజయవాడలో జరిగాయి. 11 తీర్మానాలు చేశారు. కానీ తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది.కోటివిద్యలు కూటికోసమే కదా? సంస్కృతి సాహిత్యాల పురోగతి గురించిన చింతన బాగానే జరిగింది. కవిత్వమూ పుస్తకావిష్కరణాలూ తెలుగు భాషను మాధ్యమంగా ఉంచాలన్న ప్రసంగాలూ మారుమోగిపోయాయి. పాపం మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ,పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. కానీ ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది.మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వేళ్ళాతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమపిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి.తెలుగు బడుల్లో నీటి వసతి,మరుగుదొడ్లు ఉండవు.పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది?ఎలా ఉంటుంది?తెలుగుబడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు.తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు.ఎటు లాభం ఉంటే అటే పోతాడు.ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే.చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు.చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నాతల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే.నిజాన్ని నిజమనే చెబుదాం.ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే.అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు.తెలుగు సభల్లోనేమో అందరి కోరికా.తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళమాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని.ఆంగ్లమాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు.తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి.తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి.ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసుకమీషన్ పరీక్షల్లో తెలుగుమాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి.తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు,తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమవిద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్నతలు.భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాషద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి.తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు.తెలుగుద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచతెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తినివెళ్ళగక్కాడు.ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు.ఆయనమాట ఎవరూ వినలేదు.తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగుపదాలకు బదులు కఠిన సంస్కృతపదాలు కుమ్మరించి,ఆంగ్లపదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు.వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు.ఇక ప్రజల భాష తెలుగు పాలనాభాష అవుతుందా?అలాంటి ఆశలు మనము ఉన్నాయా?అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత.అవసరసమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?   
తెలుగు అధికారభాష కావాలంటే,తెలుగు దేవభాషే ,తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాష గా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని,చెన్నై మదురై,బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగాలొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటిద్వారా తెలుగును అమలుచేస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు. ఇంకొందరు పాలనా నిపుణులు లేవనెత్తిన డిమాండ్లు ఏమిటంటే : తెలుగు అనువాదాలు బాగుపడాలి, ఆంగ్ల కీబోర్డు ద్వారా తెలుగు లిపి పొందే దానిలో వస్తున్న సమశ్యలను ఇంకా తొలగించాలి అని. ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు.తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ప్రోత్సాహకాలు,ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266