27, మే 2010, గురువారం

తెలుగు కూడా దేవభాషే

పొట్టి శ్రీరాములు గారు చనిపోయింది మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం.అయితే తరువాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.తరువాత తెలంగాణాను కలుపుకున్నారు.అప్పటికే అక్కడ ఉర్దూ రాజ్యమేలుతూ ఉంది.ఉర్దూను రెండవ అధికారభాష అన్నారు.వాళ్ళ ఉర్దూ పోయింది,మన తెలుగూ పోయింది.ఇంగ్లీషు రాజ్యమేలుతోంది.ఇక మనం ఆంగ్లాన్ని మోయక తప్పదు.తెలుగు రాష్ట్ర పాలనా భాషగా ఇంగ్లీష్ వైభవం వెలిగిపోతోంది.ఎవరి తల్లి వారికిష్టం.ఎవరి మాతృభాష వారికి గొప్ప.సంస్కృతాన్ని కాదని LONG LIVE CLASSICAL DIVINE TAMIL అని తమిళులు వారి భాషాభివృధ్ధి కోసం శ్రమిస్తున్నారు.తమిళుల భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి.తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ఉర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు.మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా LONG LIVE CLASSICAL DIVINE TELUGU అంటూ గౌరవిద్దాం.మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం.వాడని భాష పాడుపడుతుంది.తెలుగుతల్లికి 74 మిలియన్ల బిడ్డలున్నారు.ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళపాటు శ్రమపడ్డ హీబ్రూ ను మించిన పుష్టి తెలుగుతల్లికి ఉంది.సకల విజ్ఞానశాస్త్రాలనూ మనభాషలోకి అనువదించుకొని మన భాషలోనే చదువుకొనే అవకాశాలు కలగాలి.తెలుగులో చదివినా ఉపాధి దొరకాలి.


Track details |
1 కామెంట్‌:

  1. తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
    "భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే.భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును.ముందు 'భాష' పుట్టుతుంది.తర్వాత 'లిపి' పుట్టుతుంది.ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలు.లిపి లేని భాషలు 696.మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు.కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రము శబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు.తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు.నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. చాలా భాషల పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది ,ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును.తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది.సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగు భాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోని లిపి వలన వ్రాయవచ్చును.సంస్కృత భాషకు లిపిలేదు.సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగా వాడబడుచున్నది.అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది.ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు.ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి.తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్ద భాష ఏదీ లేదు.వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా ,చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి.శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప.ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు.''ఆత్మ'' అను పదము తెలుగు భాషలోనే పుట్టినది.వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". --- ఆచార్య ప్రభోదానంద యోగి (లు అంటే ఏమిటి? 2016)https://www.facebook.com/nrahamthulla/posts/1167077539990901

    రిప్లయితొలగించండి