18, నవంబర్ 2012, ఆదివారం

ఆకురాతి శతకం - 1ఆకురాతి శతకం - 1
                                  శకునాలు – సంశయాలు
1.                     రాయి వేల్పుకాదు రక్షించికాపాడ
     తాడుపాము కాదు తరిమికరువ
     వట్టి భ్రమల నమ్మి నట్టేట మునుగకు
     ఆకురాతి మాట అణు బరాట!!

2.                     బల్లి మీద పడిన అల్లాడు ప్రాణాలు
     పిల్లి అడ్డువస్తే గొల్లు మనును
     తుమ్ము తుమ్మిరంటే కుమ్మేసి నట్లుండు
     ఆకురాతి మాట అణు బరాట!!

3.                    వార ఫలపు పిచ్చి పరమ సోంబేరికి
    జాతకాల పిచ్చి నేతలకును
    చపల ఛాందసులకు శకునాల పిచ్చిరా
    ఆకురాతి మాట అణు బరాట!!

4.                     మీన మేషములను – మిగుల లెక్కించుచూ
     జాగు చేస్తివంటే – రోగిచచ్చు
     మూఢనమ్మకాలు ముంచురా కొంపల్ని
     ఆకురాతి మాట అణు బరాట!!

5.                     అంజనములు నిల్పు నరచేత స్వర్గాన్ని
     సేదదీర్చు పస్తి, సోది కెళితె
     చచ్చినోళ్ళ తెచ్చి సన్నిధి నిలబెట్టు
     ఆకురాతి మాట అణు బరాట!!

6.                     ఇళ్ళు కత్తెరందు, పెళ్ళిళ్ళు మూఢా
    వద్దు వద్ద నేటి పెద్దలార
    చెడ్డ తిధులలోన గడ్డి తినవచ్చునా ?
    ఆకురాతి మాట అణు బరాట!!

7.                      అత్త మోము చూచి – ఆషాఢ మాసంలో
     చచ్చినట్టి వారి – జాడలేవి ?
     యేమి కాని దాని – కెందుకో ఆంక్షలు ?
     ఆకురాతి మాట అణు బరాట!!

8.                      చిలక జోస్యమొచ్చె కులుకుచూ బులిపింప
     కుళ్ళు వాస్తు పుట్టే యిళ్ళు కూల్చ
     బ్రతుకు లార్ప చేత బడులుద్భ వించెరా
     ఆకురాతి మాట అణు బరాట!!

9.                     కలల రూపు దాల్చు ఘన కట్టడాలపై
     దిష్టిబొమ్మ లుంచు భ్రష్టతేల
     బొమ్మ పెట్టకుంటె గుమ్మాలు కూలునా
     ఆకురాతి మాట అణు బరాట!!
      
10.                మంచి చెడ్డలన్నీ మనిషియందే యుండ
     వార వర్జ్యమనుచు, వదరనేల
     పళ్ళు రాల నుండ పంచాంగ మాపునా ?
     ఆకురాతి మాట అణు బరాట!!

11.                పండితులు వచించు – పంచాంగ నక్షత్ర
     తిధులు, వార వర్జ్య – దిన ఫలాలు
     వేట పక్షులేగు – బాటపై నూకలే
     ఆకురాతి మాట అణు బరాట!!

12.                మూఢ నమ్మకాల కీడుగా తలపోయు
             పిరికి వాడు పనుల దారికి పోడు
             బొమ్మ తేళ్ళ చూచి దిమ్మరిల్లిన రీతి
              ఆకురాతి మాట అణు బరాట!!

వాస్తు జ్యోతిష్యం
13.                 కాపురాలలోని కష్టాలు వినగానే
     వాస్తు యింటి కప్పు వంక జూచు
      సిద్ద యోగి ప్రాణి చిలకలో నున్నట్లు
      ఆకురాతి మాట అణు బరాట!!

14.                తిరుగుచుండు భువికి దిక్కులు ఉండునా
     వెర్రి వాస్తువునకు బుర్ర కలదె?
                   బుర్రలేని వారి భుక్తిరా గృహవాస్తు
     ఆకురాతి మాట అణు బరాట!!

15.                 వంటి రోగములకు వాస్తుకై పరుగిడ
     యింటి దోషములను అంకట్టు
    గాడిదలకు మందు బూడిదే నన్నట్లు
     ఆకురాతి మాట అణు బరాట!!

16.                గౌరవముగా పిలిచి కట్నం సమర్పించి
     కొంపకూల్చు విధము కోరు కొనకు
     డబ్బులిచ్చి చెప్పు దెబ్బలు తిన్నట్లు
     ఆకురాతి మాట అణు బరాట!!

17.                 వాస్తు శాస్త్రమందు వాస్తవంబాయింటి
     గట్టి తనము, కాంతి, గాలి వరకే
     మిగులు పైత్యమంత మిత్రుల కల్పనే
     ఆకురాతి మాట అణు బరాట!!

18.                చేతి రేఖలెంచి చెప్పు జ్యోతిష్యాలు
     నరుని మరణ ఘడియ లరయలేవు
     పురుగులేరు కప్ప పులుల వేటాడునా
     ఆకురాతి మాట అణు బరాట!!

19.                పెను ప్రమాదములను మును ముందుగా దెల్ప
     కూత పెగిలిరాదు జాతకముకు
     గొడ్డుమోతు జన్మ గడ్డికే అంకితం
     ఆకురాతి మాట అణు బరాట!!

20.                పాఠశాలలోకి – పాత్యాంస ముసుగుతో
     వాస్తు జ్యోతిషాలు – వస్తాయంత
     త్రాగునీటిలోకి – డ్రైనేజి సరుకల్లె
     ఆకురాతి మాట అణు బరాట!!

21.                అస్థిరంబు లైన వాస్తు జ్యోతిష్యాలు
     గణిత శాస్త్రమునకు కావుసాటి
     కుంటి గార్ధభాలు గుర్రాన్ని బోలునా
     ఆకురాతి మాట అణు బరాట!!

బాబాలు – స్వాములు
22.                 భవ్యబోధలుండు నవ్య పోకడ లుండు
      ఫైవ్ స్టారులందు పడక లుండు
     సకల సుఖములుండు, సన్యాసిగా నుండు
     ఆకురాతి మాట అణు బరాట!!

23.                దివ్య మహిమలున్న దీక్షిత బాబాకు
     భర్త పోయినోళ్ళె భక్తురాళ్ళు
     భక్తురాండ్ర కెపుడు భద్రత లోపమే
     ఆకురాతి మాట అణు బరాట!!

24.                భక్తురాండ్రు మోక్ష బ్రాంతిలో లీనమై
     పొంచియుండు ముప్పుగాంచలేరు
     యెరను మ్రింగు చేప లరయునా గాలాన్ని
        ఆకురాతి మాట అణు బరాట!!

25.               గొలుసు లుంగరాలు గుప్త శివలింగాల
    మాయ చేసి నిందమోయనేల ?
    అడిగినట్టి దిస్తె గుడిట్టి కొల్వమా
    ఆకురాతి మాట అణు బరాట!!

26.              ఇలకుబేరు లల్లె బలసి బాబా లుండ
   ఆ ప్రపంచ బ్యాంకు అప్పులేల
   అక్షయమ్ము నొదిలి భిక్షెత్తు కొందురా
   ఆకురాతి మాట అణు బరాట!!

27.               ఙ్ఞానబోధ చేయు సాధు సద్గురులకు
   ధనము ప్రోగు చేయు ధ్యాసపోదు
   కొంగ జపములన్నీ కొరమేను కోసమే
   ఆకురాతి మాట అణు బరాట!!

28.               చదువు రాని శుంఠ స్వామియై కూర్చుండ
    పెక్కు చదివి నోళ్ళు మొక్కు చుండ్రు
    గడ్డి తినెడి పులుల గాడిద లేలవా ?
    ఆకురాతి మాట అణు బరాట!!

29.              సాధుమూఢ బోధ మేధావి వర్గాన్ని
   పట్టే నంటే విచిపెట్ట బోదు
   మడుగు మొసలి నోట మగజం పడ్డట్లే
   ఆకురాతి మాట అణు బరాట!!

30.              స్వర్గలోక సృష్టి స్వాముల వంతైతె
   ఘనత పెంచిపా కవుల వంతు
   పగటి కలలు కనుట భక్తుల వంతయా
   ఆకురాతి మాట అణు బరాట!!

31.              స్వాములుచ్చరించు స్వర్గాన్ని నమ్ముకొని
  గొర్రెలెన్నొ దూకే గోతిలోన
  దూకి బావు కొన్న దాఖలాలున్నవా?
  ఆకురాతి మాట అణు బరాట!!

32.               కూడుగుడ్డ లివని గురుపీఠ మదియేల
    గుడ్డి చదువునేర్పు గురువు లేల
    మూఢ బోధవలన ముష్టయిన పుట్టునా
    ఆకురాతి మాట అణు బరాట!!

33.                       యెరుక యెరుక యండ్రు యెరిగిన వారేరి ?
                పూర్ణున బడేటి పురుషుడేడి ?
                 ఇసుక దంచుకొనిన ఒసగునా తైలంబు
           ఆకురాతి మాట అణు బరాట!!

34.                       భక్తి పరులలోని బలహీనతల, సొమ్ము
     చేసుకొన్న వాడే సిద్దయోగి
     వలను పడ్డ చేప వంటింటికే చెల్లు
ఆకురాతి మాట అణు బరాట!!

35.                       వేషధారి నేడు విలువైన సన్యాశి
     బాసమార్చువాడు పరమయోగి
     గోచిలేనివాడు గొప్ప వేదాంతయా
ఆకురాతి మాట అణు బరాట!!

సారసాంగులు  – సాధికారిత
36.                          పాతివ్రత్య మహిమ పతుల కానాడు
     అంకట్టినపుడె ఆదిమునులు
     నేటి స్త్రీల బ్రతుకు నేతి బీరైపోయె
 ఆకురాతి మాట అణు బరాట!!

37.                          పూరుషాళికిచ్చె పునర్వివాహాలు
     స్త్రీలకివ్వలేదు సిద్ద ఋషులు
     పంచువారే పేద పింఛన్లు తిన్నట్లు
 ఆకురాతి మాట అణు బరాట!!

38.                          ఆడదాని బ్రతుకు అణగార్చి, మగవాడి
     కప్పగించి పోయి రాది మునులు
     కోడి నప్పగించి కోసుకో అన్నట్లు
 ఆకురాతి మాట అణు బరాట!!

39.                          భర్త శవముతోడ భార్యను చిటికీడ్చి
     తగలపెట్టి గొప్ప ధర్మమనుచు
     జబ్బచరచు కొనిన జాతిరా మనదంటే
 ఆకురాతి మాట అణు బరాట!!

40.                          తాళికట్టనేల తాళీతో పాటుగా
     గాజుపూస గొను రివాజదేల
     గాజులోలువ గానే మోజులు మాయునా
 ఆకురాతి మాట అణు బరాట!!

41.                          పురుషులెంతమంది తరుణుల మార్చినా
 తప్పుకానరాదు – ధార్మికులకు
     విధవరాళ్ళగోడు – మధురమై దోచేనా
 ఆకురాతి మాట అణు బరాట!!

42.                          స్త్రీలు తప్పు చేయ రాలతో కొడుదురే
     షేకు తప్పు లెక్క సేయరేమి ?
     ఆడదంటే యెంగిలాకు సమమాయెనా
 ఆకురాతి మాట అణు బరాట!!

43.                          సంతు ఆడదాని జన్మహక్కయి యుండ
     విధవరాలి సంతు చిదమనేల
     పాండవౌలను కుంతి భర్తకే కన్నదా?
 ఆకురాతి మాట అణు బరాట!!

44.                          ఆలిపోయినోడు అన్నింట యోగ్యుడే
     భర్తపోవు చాన భాగ్యహీన
     తెగిన చెప్పులందు తేడాలు యెందుకో
 ఆకురాతి మాట అణు బరాట!!

45.                          గ్రామ దేవతలకు కన్నెపిల్లలు యేల ?
     బసివి, దేవదాసీ,వు లేల
     దొంగకోడెగాళ్ళ బెంగతీర్చేందుకా ?
 ఆకురాతి మాట అణు బరాట!!

46.                          తికి సీతనడత శాసించు మగడు, కో
     దండ రాముడల్లే వుండవలదె
     పాతివ్రత్యమంత పడతికై పుట్టెనా
 ఆకురాతి మాట అణు బరాట!!

47.                          అణచివేత నుండి ఆక్రోశ ముప్పొంగి
     తిరగబడిన నాడు స్త్రీ జనంబు
     పురుష జాతిలోన భూకంప మెగయదా?
 ఆకురాతి మాట అణు బరాట!!

48.                          తారమేని బట్ట తగ్గించి తగ్గించి
     సిగ్గు తీయుచున్న చిత్రములకు
     పసిడి గుడ్లు పెట్టు బాతాయె ఆడది
 ఆకురాతి మాట అణు బరాట!!

49.                          పాతివ్రత్యమనెడి బ్రహ్మస్త్రమే యుంటే
     స్త్రీలవద్ద నాటి సీత పగిది
     నేటి మహిళ కీ కరాఠీలు ఎందుకు ?
 ఆకురాతి మాట అణు బరాట!!

దేవుళ్ళు   – మతాలు
50.                          రాతి వేల్పు ముందు భీతితో మసలేటి
గుణము లంరించె జనము లందు
చెక్కపులుల నడుమ కుక్క బెదురెన్నాళ్ళు
ఆకురాతి మాట అణు బరాట!!

51.                          దైవవూసు లన్ని దండగ యనుచునే
మీడియాలు వంత పాడు చుండు
ఎంత వారలైన కాంతకు దాసులే
ఆకురాతి మాట అణు బరాట!!

52.                          అన్ని నిర్వహించు అర్చకుడే దెల్పు
మందిరాల కుండు మహిమయెంతో
వంటికంపు దేల్ప వస్త్రంబులేసాటి
ఆకురాతి మాట అణు బరాట!!

53.                          ముక్తి మోక్ష మనుచు మూఢులరావించి
     గుండు, సేయ, భక్తి పండె ననుచు
     బస్సు లిచ్చివేయు పైలోక టిక్కెట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

54.                          సరస రాగ తాళ – సంగీత మత్తులో
     ముంచి ప్రజల నాక్రమించే భక్తి
     తేనె పూసి కత్తి – మేన దింపిన రీతి
 ఆకురాతి మాట అణు బరాట!!

55.                          యాత్ర భక్త జనుల యముడు కాజేసినా
     భక్తురాండ్రు రేప్ బారి పడిన
     కరిని బ్రోచ్చినోడు, కంపింపడేమయా
ఆకురాతి మాట అణు బరాట!!

56.                          గణపతోత్సవాలు కనని దుష్పలితాలు
     కలపోరు కలిమి గంగపాలు
     కోరి కోరి చావు  కొని తెచ్చుకొనుయే
ఆకురాతి మాట అణు బరాట!!

57.                          మనిషి కొక్క సారె మనువు దేవుళ్ళకు
     యేట యేట పెళ్లి యెందుకోయి ?
     పెద్ద గుడుల మీది గద్ద మేపనే
ఆకురాతి మాట అణు బరాట!!

58.                          బ్రతుకు తెరువులేక – చితికె జనాలపై
     భక్తి సీరియళ్ళ – బాదుడేమి ?
     పనికిరాని మందు – పడతీసి పోతురా ?
ఆకురాతి మాట అణు బరాట!!

59.                          పుట్ట గొడుడులల్లె ఊరూరా దేవుళ్ళు
     పుట్టుకొచ్చు చుండు గుట్టుయేమి
     గుడ్డిభక్తి పెంచి గడ్డిమేసేందుకే
ఆకురాతి మాట అణు బరాట!!

60.                          జీవనాడి లేని సింహంబు కంటెను
     బక్కదైన యరచు కుక్కమేలు
     మాయవేల్పు కంటే మహిషంబు మేలయా
ఆకురాతి మాట అణు బరాట!!

61.                          నాల్గువంద లేండ్ల – నాడు బ్రహ్మం గారు
     ళ్లి వత్తు ననుచు – మాట జారి
     మదన పడుచునుండె – మరుజన్మ గానక    
 ఆకురాతి మాట అణు బరాట!!


62.                          యేసు ప్రభువు మళ్ళి యేతెంచునని, పాపు
     లేదురు చూచు చుండి రెపటి నుండొ
     ఎండ మావి దాహ మేరీతి తీర్చును
ఆకురాతి మాట అణు బరాట!!

63.                          పార్వతీ సుతుండు పాలు త్రాగింని
     పరమ భక్తులం పరుగు విడిరి
     దున్నపోతు ఈనే దూడ యేన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

64.                          ఒక్క కన్ను తెరచి చక్కగా చూచెనా
     షిరిడిసాయి ఎంత చిత్రమండి ?
     ఏమి వచ్చిపోయేనో స్వామి రెండవ కన్ను
ఆకురాతి మాట అణు బరాట!!

65.                          అమ్మవారి మేని యాభర్ణముల్ పోయి
     వగచు చుండె, యేల వర పడెవు ?
     తనకే దిక్కులేదు, తల్లికాపాడునా
ఆకురాతి మాట అణు బరాట!!

66.                          బాధ తీర్చమని సమాధికి మొక్కేరు
     గోతిలోని శవము గోడు వినునే
     మాడిపోయిన బల్బు యేడిస్తే వెల్గునా
ఆకురాతి మాట అణు బరాట!!

67.                          సత్య నిష్టలందు సాగు అయ్యపదీక్ష
     ముగియగానె నడత మొదటికొచ్చు
     నీతిలేని బ్రతుకు జ్యోతి సవరించునా
ఆకురాతి మాట అణు బరాట!!

68.                          అడుగగానె స్వామి గుడినుండు పోలేరు
     నిప్పుతెచ్చెననకు నిజముగానె
     పోతులూరి వారి పొగ చుట్ట ఘాటిది
ఆకురాతి మాట అణు బరాట!!

69.                          శిలువ నెత్తు కొనిన, శిలలకు మొక్కినా
     భువి సమాధిచెంత బోర్లపడిన
     త్రోవలోని టి తొక్కయిన కదలునా
ఆకురాతి మాట అణు బరాట!!

70.                          మతములెన్ని వే గతుల రోదించినా
     భావ జనిత వేల్పు పట్టుపడడు
     పగటి కలల రంభ పట్టుకు చిక్కునా
ఆకురాతి మాట అణు బరాట!!

71.                          మత ప్రచార బురద మది నిం పుల్ముకొని
 అన్యమత జనాల కంట బోకు
    కాటువేయు తేళ్ళు గూటికి రాలేవు
ఆకురాతి మాట అణు బరాట!!

72.                          మూఢ మతము లిచ్చు మోక్ష హామీలన్నీ
    మాయ బ్యాంకు చెక్కు మాదిరుండు
    రొఃఖ్ఖమేమొరాదు దుఃఖమా ఆగదు
ఆకురాతి మాట అణు బరాట!!

73.                          సైన్సు రాకతోనే స్వర్గ పాతాళాలు
     కాకులెత్తుకెళ్ళె,లు కనెడి
     మేటి భక్తి కిపుడు కాటియే రహదారి
ఆకురాతి మాట అణు బరాట!!

74.                          చావు పిదప మళ్ళి జన్మ వుందనుటకు
     వుండు స్వర్గమోక్ష వూరలకు
     కుళ్ళు మతపు జొల్లు కూతలే సాక్ష్యామా
ఆకురాతి మాట అణు బరాట!!

75.                          మానవాత్మపోయి, లేని పరమాత్మలో
                  లీనమగు ననేటి ఙ్ఞానులారా
     ఎపుడు ఎనెవరు యేరీత గాంచిరి ?
ఆకురాతి మాట అణు బరాట!!

మూఢ నమ్మకాలు అవినీతి మార్గాలు
76.                          వణికి వణికి నేడు వరస ప్రేలుళ్ళతో
 నగర జీవితాలు రాగులు చుండే
 మనిషి కంటే మృగము మంచిదై పోయేనా
ఆకురాతి మాట అణు బరాట!!

77.                          గాంధి కలు కన్న గ్రామ సీమల్లోకి
 బ్రాంది షాపులొచ్చి  బార్లుతీరె
 విందుహాలులోకి పండు లెగపడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

78.                          ఆయువీయబోదు గాయత్రీ రుద్రాక్ష
 మాలవేయగానే మహిమరాదు
 యేల కోడిగ్రుడ్ల కీకలు పెరికేరు ?
ఆకురాతి మాట అణు బరాట!!

79.                          చచ్చి బూడిదైన సాధువే దేవుడై
 బతికినోళ్ళ పీక పట్టుకొనును
 వెర్రిరాములంతా ఇర్రి(జింక)కి లోకువే
ఆకురాతి మాట అణు బరాట!!

80.                          బడిత పూజ పొందు పాముల పుట్టలో
 పాలు పోయు వెర్రి భామలారా
 వేప గింజలందు తీపి కాంక్షింతురా ?
ఆకురాతి మాట అణు బరాట!!

81.                          ప్రేమ పావురాల పెళ్ళిపూసెత్తుచో
 భవ్వు భవ్వు మనుచు పైకి దూకు
 కుల మతాలు పిచ్చి కుక్కలురా నాన్న
ఆకురాతి మాట అణు బరాట!!

82.                          భోగులైనవారి రోగాల కోసమే
 యోగవూడి పదియే నూద్దరింప
 వ్యభిచరించు వారి కెయిడ్సు తోడైనట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

83.                           లైంగికముగ సాటి – లలనల వేదింప
     పడగవిప్పు నెత్తి – పాముకైన
                    చెప్పు చేత గొనుటె – ఒప్పయిన శిక్షరా
 ఆకురాతి మాట అణు బరాట!!

84.                          భూత వైద్యమంత బూటకార్భాటమే
దయ్యమెక్కడుంది తరిమి వేయ
స్థనమూలందు యెముక తడిమితే దొరుకునా
ఆకురాతి మాట అణు బరాట!!

85.                          ఏక దంతు లడ్డు వేలాన పెట్టుచో
పా లక్షలందు పరుగు తీయు
హాలివుడ్డుతార బ్రాకెగ పడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

86.                          నీతిదప్పనేల, నేర్పుతో నిధులన్నీ
 మెక్కి సీ.బి.ఐ కి చిక్కనేల
 బొక్కి పందికొక్కు బోనులో పడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

87.                          మంత్రజలము వలన సంతాన మబ్బుచో
మగడు ఎందుకోయి మానినులకు
నరకయాతనెట్టి ఉరికంబ మెక్కునా
ఆకురాతి మాట అణు బరాట!!

88.                          ఉంగరాలు పొదుగు రంగురాళ్ళల్లోకి
జాతకాలు వచ్చి పాతుకొనియె
నమ్ము గొర్రెలుంటె నమలవా తోడేళ్ళు
ఆకురాతి మాట అణు బరాట!!

89.                          కోరికలను పెంచి కోడళ్ళ హతమార్చు
కాపురాలు చెడును ఖచ్చితముగ
కళ్ళు పొడుచుకొనిన మళ్ళీ చూపొచ్చునా
ఆకురాతి మాట అణు బరాట!!

90.                          బ్రహ్మ చర్యమే భ్రష్టు పట్టింపనా
యతుల వంటి వారే పతనమైరి
వరద నడ్డగిస్తె దారుల ముంచెత్తదా
ఆకురాతి మాట అణు బరాట!!

91.                          బరితెగించి నట్టి వరకట్న భూతాలు
ఆడ శిశుల జన్మకడ్డు పడియె
కొరివి నేమరిస్తే కొంపను కాల్చదా
ఆకురాతి మాట అణు బరాట!!

92.                          అపర ఛాందసులకు ఆధ్యాత్మికంబనే
సాలెగూటి మోజు చస్తె పోదు
ఎందుచేపబోను ఎలుకలు విడుచునా
ఆకురాతి మాట అణు బరాట!!

93.                          ధర్మపరులు నడపు దళిత గోవిందాల
ధాటివేరు నడచు బాట వేరు
దంతి పండ్లు వేరు దంతాలు వేరయా
ఆకురాతి మాట అణు బరాట!!

94.                          అనుభవాలమూటుకపై కెక్కించి
రామకోటి వ్రాయు రసికులార
బొక్కగానే యిసుక చక్కెరకాబోదు
ఆకురాతి మాట అణు బరాట!!

95.                          కంపరంబు గొల్పు యం. పీ ల లంచాలు
 దేశప్రజల కప్రతిష్ట తెచ్చె
 కనకపీఠ మెక్కి శునక విన్యాసమా
ఆకురాతి మాట అణు బరాట!!

96.                          చాటునుండు పులులు మాటేసి కబళించు
 ఫ్యాక్షనిజము వైపు పరుగులిడకు
 చంపుకొనుట క్రూర జంతువునైజమ్ము
ఆకురాతి మాట అణు బరాట!!

97.                           స్వామి సొమ్ము తినుట క్షేమమాయని భక్తు
   డున్న దూడ్చి  వేయు హుండిలోన
   అన్నదాన మంటె అతిధికి గాలమే
   ఆకురాతి మాట అణు బరాట!!

98.                           అంకెలందు యుంటె – అదృష్ట దేవత
     ఇంకనేమి పొంది – యెదిగి పోక
                    ఒరుల బోడిచేయు – దురదేల మిత్రమా ?
  ఆకురాతి మాట అణు బరాట!!

99.                          పాము తేళ్ళ విషము పారాణి తావుల్లో
మంత్రములకు లేని మహిమ వచ్చు
బాసురానివేళ బంటు రాజైనట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

100.                    సకల జీవరాసి సమతుల్యమైనపుడె
 వరుణువని మీద కరుణ జూపు
 వరుణుడరయ కుంటే ధరణి జీవుండునా
ఆకురాతి మాట అణు బరాట!!

101.                    చ్చిబూతె పంచప్రాణాలు సినిమాకు
గుడ్డి భక్తిలోనె గుడుల సోకు
ప్రభుత బహుపరాకు బ్రాందీ షాపుల్లోనె
ఆకురాతి మాట అణు బరాట!!

102.                    మ చేత సీత యెత్తిన ధనసుకు
 భుజము మోపలేక బోర్లపడిన
 దశముఖునకు యెట్లు వసమాయెరా సీత
ఆకురాతి మాట అణు బరాట!!

103.                    ఎంచి పంచుకోదు మంచితో వంచించి
కొంచెమైన దాచి యుంచుకోదు
స్వార్ధపరుని కంటె గార్ధభం మేలోయి
ఆకురాతి మాట అణు బరాట!!

104.                     మభ్యపెట్టి చేయు మైనర్ల పెళ్ళిళ్ళు
పుట్టగానె చంపు పట్టుగూళ్ళు
గ్రామదేవికిచ్చు గావు కోళ్ళంబోలు
ఆకురాతి మాట అణు బరాట!!

105.                    ప్రభుతకున్ను మరియు ప్రతిపక్షనేతకు
పట్టి యిద్దరికిని బ్రహ్మరధము
చిత్తుచేయు ప్రజల చెత్త పంచాంగాలు
ఆకురాతి మాట అణు బరాట!!

106.                    అడుగు బడుగు జనము లల్లాడ, క్రీడకై
కుమ్మరించు చుండె కోట్లు కోట్లు
రాజద్రవ్యమంత రాళ్ళ పాలన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

107.                    రామసేతువెక్కి రంకె లేసే వారు
 జాతి నష్టపోవు రీతికనరు
టాపుమీదియాత్ర టైరు గోడరయునా
ఆకురాతి మాట అణు బరాట!!

108.                    భద్రతాదళాలు నిద్రించినపుడెల్ల
ఉగ్రవాద దాడు లుప్పతిల్లు
పంట చేనుకెపుడు పందిబెడ దున్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!

109.                    ప్రబల రాజసొత్తు కబళింప యజ్ఞాలు
పుట్టె, వాటికిపుడు పూజలేల ?
కాడిదున్నపోతు పాడికి యోగ్యమా
ఆకురాతి మాట అణు బరాట!!

110.                    ఎద్దుటీగ పడిన బొద్దింక పడినను
బల్లి పడిన కాళ్ళ జెర్రి పడిన
తిరుమలాద్రి లడ్డు తీపియే జనులకు
ఆకురాతి మాట అణు బరాట!!

111.                    ఓట్లు కొనెడి నేత, ఒళ్ళమ్ము కొనెడి స్త్రీ
త్రాగుబోతు మగడు, తగని సతుడు
కన్నమేయు దొంగలున్నతి గాంతురా
ఆకురాతి మాట అణు బరాట!!

112.                    చీట్ల ఆటకేగి సీక్వెన్సు కోల్పోకు
డ్రింకు షాపులందు గ్రుంకు లిడకు
చౌకబారు లాడ్జి జాకెట్లు విప్పకు
ఆకురాతి మాట అణు బరాట!!

                                               
             


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి