18, నవంబర్ 2012, ఆదివారం

ఆకురాతి శతకం - 2



ఆకురాతి శతకం - 2
1. నిక్కమైన దాని నొక్కి వక్కాణించు
రంకు బొంకు పళ్ళు రాలగొట్టు
డూపు చేయువారి షేపులే మర్చేయు
ఆకురాతి మాట అణు బరాట !!

2. సత్య యుతము నెల్ల చరితగా నిలబెట్టు
అనృతాల పీక నదిమి పట్టు
కుల మతాల గొంతు నులిమి గోరీ కట్టు
ఆకురాతి మాట అణు బరాట !!

3. గుడ్డి నమ్మకాల నడ్డిపై నర్తించు
ల్ల బొల్లి చెత్త గంపకెత్తు
కూ నీతి పరుల కోటలు బీటలౌ
ఆకురాతి మాట అణు బరాట !!

4. ఆకుఅలుము మేయు మేక యాగాలతో
రాజయోగ భోగ రక్తులైన
రసిక యతుల కుంటి రాతలే వేదాలు
ఆకురాతి మాట అణు బరాట !!

5. ధర్మమనుచునే యధర్మ పురాణాలు
భక్తి భ్రమలలోన ప్రజల ముంచి
ఉబ్బరించి ప్రబల జబ్బుగారూ పొందే
ఆకురాతి మాట అణు బరాట !!

6. విశ్వఙ్ఞానమునకు వేదాలే నెలవని
జబ్బ చరచుకొనెడి జాతి మీద
దొడ్డి దారి నుండి దూకిందిరా సైన్సు
ఆకురాతి మాట అణు బరాట !!

7. సైన్సు కోటలోన జన్మించి మీడియా
జేరి పోయె శత్రు (భక్తి) శిబిర మందు
మాతృ దేశ ద్రోహి మహి విభీషణుడల్లె
ఆకురాతి మాట అణు బరాట !!

పురాణాల్లోని – ఘరానాముళ్ళు

8. పడచు విధవ రాళ్ళు – కడుపులతొ మొదలైన
భారతము కళంక – బాట పట్టె
ఆదిలోనే పుట్టె – హంస పాదన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!

9. ఆది కవిని మ్రింగె – అరణ్య పర్వమని
తెలుగు సేయ జడిసె – తిక్కన కవి
ఎద్దు బెదిరిపోయె – ఎర్ర గుడ్డను చూచి
ఆకురాతి మాట అణు బరాట !!

10.న్ని చోట్ల కలదు – యనిన పోతన్నయే
    కలడొలేడొ యనుచు – పలవరించే
     కథలలోని వేల్పు – విదిలిస్తె రాలునా
 ఆకురాతి మాట అణు బరాట !!

11. పలుకే బంగరనుచు – విలపించెనే గాని
    పలికినట్టు లె – తెలుప లేదు
     రామదాసు దంత – రాగాల యేడుపే
 ఆకురాతి మాట అణు బరాట !!

12.  పనికి రాని దోయి – పాంచాలి చరితమ్ము
     భర్తలైదుగురికి – భార్య ఒకటే
     కుక్కలకును తప్ప – కుదురునా ఈరీతి ?
 ఆకురాతి మాట అణు బరాట !!

13.  అందగాడి పొందు – ఆశించు ఆడది
     సహజమే కదయ్య – సచ్చరిత్ర
     చెవులు ముక్కు కోసి – చేతిలో పెడుదువా ?
       ఆకురాతి మాట అణు బరాట !!

14. తిన్న కుక్క యేదొ – తిని పోయే పెరటిలో
    ఉన్న దాన్ని పట్టి – వూనినట్లు
    పాపి ఇంద్రుడైతె – శాప మహల్యాకా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

15. గాలి కొకరు పుట్టె – నేల కొకరు పుట్టె
     కాలి ధూళి నుండి – కాంత పుట్టె
     వెర్రికలు  పుట్టె – గొర్రెల నలరింప
     ఆకురాతి మాట అణు బరాట !!

16. సీతలోని మహిమ – స్త్రీ జాతి కున్నచో
 ట్ననెడి అగ్గి – కాల్చగలదె ?
 పాతివ్రత్య మంత – పచ్చి బూటక మోయి
     ఆకురాతి మాట అణు బరాట !!

17. భార్యలిం నుండ – పలుభామ కౌగిళ్ళ
    కంట కాగినట్టి  – తుంటరీలు
    పాండవులకు ధర్మ – పట్టాభిషేకమా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

18. సుతుల కొరకు ఎంత – మతిహీనుడైనను
    భార్య నొరుల కడకు – పంపగలడె ?
    పాండవ జననాలు – ప్రజల కాదర్శమా ?
    ఆకురాతి మాట అణు బరాట !!

19.  మగడి పక్కలోన – మగువనూ వలవే
         కాపురాలు వలదె – గోపికలకు ?
         రుల కొంపలార్ప  - మురళి చేపడితివా
         ఆకురాతి మాట అణు బరాట !!

20. నమ్మియున్న సతిని – నడి వీధి నిలబెట్టి
    అమ్మి వైచినపుడె – హరిశ్చంద్రు
    సత్యవ్రతము కాస్త – సాగరం పాలాయె
        ఆకురాతి మాట అణు బరాట !!

21. ఆకసంబులోన – అలరారు సూర్యుడు
    కన్నె పిల్లకేట్లు – కడుపు చేసె ?
    సూత పుత్ర జన్మ – జాతికే తలవంపు
    ఆకురాతి మాట అణు బరాట !!

22.  తనువు కండ కోసి – దానమ్ము చేసేటి
     దా నుండి నేర్చు – నీతి ఏమి ?
     చక్రవర్తి శిబికి – శాశ్వత మరణమే
      ఆకురాతి మాట అణు బరాట !!

23. నదులు యెగసి దాట – నరుల వల్లే కాదు
     జాతిలోన జూడ – కోతి యయ్యు
     ఆంజనేయు డెట్లు – అంబుధి దాటేనో ?
     ఆకురాతి మాట అణు బరాట !!

24. చావు లేని యమర – జీవిగా ఇతడికి
    ముద్రవేసి చనిరి – మూఢ యతులు
    అమరజీవియిపుడు అవనిపైలేడేమీ ?
      ఆకురాతి మాట అణు బరాట !!

25. భర్త గుడ్డి యైతె – భార్యకు గంలా ?
     గుకిట్టి శిక్ష – జగతి గలదె ?
    మహిళ యనిన పురుష – అహముకు బానిసా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

26. జంబుకుని వధించి – జానకీ రాముండు
    మలిన పడియె అడవి – మత్త గజము
    తాన మాడి ధూళి – తలకెత్తు కొన్నట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

27. కుష్టు రోగి మగని – దుష్ట కోరిక దీర్ప
     సానికొంప జేర్చె – సాధ్వి సుమతి
     ఇంతకంటె స్త్రీకి – హీన బ్రతుకున్నదా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

28. తూల నా నేల – దుష్టుడా రావణుడు ?
     అంటకుండ సీత – నింటి కంపె
    రేప్ చేసియుంటె – ఆపువారెవరోయి ?
      ఆకురాతి మాట అణు బరాట !!

29. ఆర్తి మంగపతిని – కీర్తించి కీర్తించి
    అంతరించి పోయె – అన్నమయ్య
    భక్తవరదు డొచ్చి – పల్లకి మోసెనా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

30. కాల ఙ్ఞానమంత – ఘంటా పధమ్ముగా
    పలికినట్టి వీర – బ్రహ్మమునకు
    మళ్ళీ జన్మ శూన్యమని – తెల్వదాయెనే ?
      ఆకురాతి మాట అణు బరాట !!

31. పుట్టి నపుడు లేదు – గిట్టినపుడు లేదు
     నడుమ బట్టయేనియె వేమ ?
    పరమయోగి మాట – పాటింప యోగ్యమా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

అబలలు అఘాయిత్యాలు

32. తాళి కట్టమంటె – దారికి మాత్రం రారు
   క్షితిని శాంతముగను – బ్రతుక నివరు
   విధవరాలికెపుడు – వీధి కుక్కల పోరు
     ఆకురాతి మాట అణు బరాట !!

33. కాపటి త్రాగుబోతు – కారుకూతలు విని
    నిండుచూలు సతిని – నిష్టూరముగా
    అడవి కంపినోడు – ఆరాద్యదేవుడా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

34. మతము లెం మోక్ష – హితబోధ చేసినా
   గత చరిత్రలోని – ఘటన లరయ
   యతుల బుద్ధులెపుడు – రతికేళి మీదనే
     ఆకురాతి మాట అణు బరాట !!

35. పసుపు కుంకుమనెడి – పడతి సౌభాగ్యాన్ని
   తగలకట్టినారు – మగడి మృతికి
   అత్తసొమ్ముదాన – మల్లుడిచ్చిన రీతి
     ఆకురాతి మాట అణు బరాట !!

36. చదువు నం రాదు – స్వాతంత్ర మనరాదు                  
    యొదిగి మగని క్రింద – యుండుమనెడి
             మనువు ధర్మ స్మృతులు – మహిళా కాదర్శమా ?
           ఆకురాతి మాట అణు బరాట !!

37. చిట్టి వయసులోన – కట్టించు మేడతాళి
       చొప్పవామిలోని – నిప్పపగిది
       తెప్పరిలక ముందె – గుప్పున దహియించు
     ఆకురాతి మాట అణు బరాట !!
38. ఇంటి దీపమైన – యింతికే ముసుగైతె
        కాంతి కోలు పోవె – కాపురాలు
        కాంతి లేని యిల్లు – శాంతికి నోచునా ?
           ఆకురాతి మాట అణు బరాట !!

39. మూసి యున్న పిడికి లాతో చూచేరు
        తెరచి యున్న దాని – దెసకు పోరు
        వసుధలోన స్త్రీకి – ముసుగే ప్రధానమా?
        ఆకురాతి మాట అణు బరాట !!

40. కలసి మెలసియుండు – కాలేజి చదువుల్లో
       సెక్సు విద్య వచ్చి – చేరి పోయే
       వెలది చదువు లింక – పులి మీద స్వారీయే
          ఆకురాతి మాట అణు బరాట !!

41. సహజ పాయసాన – సైనేడు గుళికల్లె
       ప్రేమలందు హింస – పెచ్చరిల్లె
       తావి చిలుకలార – తస్మాత్ జాగ్రత్త !
          ఆకురాతి మాట అణు బరాట !!

42. ఆడ హంగుపొంగు  - లారేయ సినిమాలు
        హుక్సు తెంచి దూకె సెక్సు విద్య
        కన్నె పిల్ల బ్రతుకు – కత్తిపై సామాయే
           ఆకురాతి మాట అణు బరాట !!

భక్తి సామ్రాజ్యంలో – భంగపాట్లు
43. రాయలిచ్చినట్టి – రత్నాలు నగలేవి ?
       తెలుపవయ్య స్వామి – పలుకవేమి ?
       సతులకళ్ళు కప్పి – సాని కందిస్తివా
          ఆకురాతి మాట అణు బరాట !!

44. తీర్చి గాట్లు పెట్టు – తిరుమల గుండ్లకు
    ఏడ్స్ సోకు నంటె – ఏలనండి ?
    తింటూ కంబళందు – వెంట్రుకలన్నట్లు
           ఆకురాతి మాట అణు బరాట !!

45. గుడి ప్రదక్షిణల్లొ – కుక్కలు, పందులు
    వచ్చి చేరు చుండె - స్వచ్ఛముగను
    వాటి కిపుడు పుట్టె – వైకుంట రసపిచ్చి
           ఆకురాతి మాట అణు బరాట !!

46. దారి పొడవు నుండు – దైవ గుళ్ళన్నింట
    మోకరిల్ల మనసు – మూఢ భక్తి
    నవ్వు మొగముదెల్ల – నా భార్యె అన్నట్లు
           ఆకురాతి మాట అణు బరాట !!

47. ప్రజల వద్ద కిపుడు – బ్రహ్మోత్సవంబులే
    తరలి వచ్చు చుండె – వరము లీయ
    యిళ్ల వద్దె మనకు – యింపైన క్షవరాలు
           ఆకురాతి మాట అణు బరాట !!

48. దిక్కు మొక్కు లేని – ముక్కోటి దేవతలు
    తిరుమలాద్రి మీద – తిష్టవేసి
   రోపువే కు అడ్డు – చాపిరి మోకాళ్ళు
           ఆకురాతి మాట అణు బరాట !!

49. పేద సా నోళ్ళు – పెద్ద పెట్టున కొట్టి
    సోమరులను మేపు – స్వామి వీవు ?
    కాకులను వధించి – గద్దల కిడినట్లు
           ఆకురాతి మాట అణు బరాట !!

50. కొప్పు లోని పూలు – కోనేటి రాయుండు
    లాగి వైచుకొనియె – రాను రాను
    ఒంటి చీరకూడ – వొలుచుకు పంపడా
      ఆకురాతి మాట అణు బరాట !!

51. గుళ్ళు గోపురాలు – కోకొల్లలుండంగ
    రామ జన్మ భూమి – రగడయేల?
   రాముడిపుడు మందిరమ్ముకై వగచేనా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

52. భక్తి స్తోత్రములకు – బల్బయిన వెల్గదే
    స్వస్థకూమేల – చర్చి లేల ?
   కుంటి ప్రార్ధనలకు – కుదురునా రోగాలు ?
     ఆకురాతి మాట అణు బరాట !!

53. కుక్కిక్యూలనడుమ – త్రొక్కి చంపేసినా
    కొండ దేవి కొలువు – దండగనరు
    వెర్రిగాను నమ్ము – గొర్రె కసాయినే
      ఆకురాతి మాట అణు బరాట !!

54. బ్లేడులుండవచ్చు – పిడిబాకు లుండొచ్చు
    వడ్డీ కాసులోని – వడలయందు
    వెల్లడింప కోయి – కళ్ళు పోతాయట
      ఆకురాతి మాట అణు బరాట !!

55. రామజన్మ భూమి – రాసిత్తు మన్నను
    రాలవాయె ఓట్లు – రామ రామ
    గొడ్డు టావు పితుక – నడ్డిరగ తన్నదా ?
      ఆకురాతి మాట అణు బరాట !!


56. చదువలేని భక్త – చవట విద్యార్ధులకు
   స్లిప్పులం జేయు – సీజనాయే
   మొక్కులంద వేల్పు – లెక్కడున్నారయా?
     ఆకురాతి మాట అణు బరాట !!

57. పండుగొస్తె మూఢ – భక్తితూటాలతో
    మూఢభక్తి నింపు – మూకలందు
    కైపు మహిమ దెల్పి – కల్లుత్రాపినరీతి
      ఆకురాతి మాట అణు బరాట !!

58. ధరణి భక్త తతికి – దైవ నిందనగనే
    చెడ్డి తడిసి వొళ్ళు – చెమట పట్టు
    పాడు పుట్ట చూచి – భయ భ్రాంతులైనట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

59. ఆడ మగయు కానీ – వాడ కొజ్జాలంత
   స్వామి రూప మెత్తి – జనుల బ్రోవ
   ఊళ్ళ మీద పడిరి – వూసర వెల్లులై
     ఆకురాతి మాట అణు బరాట !!

60. ఇహ సుఖాలు దుఃఖ - హేతువను స్వాముల్లొ
    స్వర్గ సుఖపు టాశ – చచ్చెనేమొ !
    రాసలీల లందు – దూసుకెళ్తున్నారు
    ఆకురాతి మాట అణు బరాట !!

61. అష్ట సిద్దులనుచు – కష్టాల కొలిమిలో
    కాగినట్టి పరమ – యోగులంత
    కన్ను మూయ గానె – కాటికే అంకితం
      ఆకురాతి మాట అణు బరాట !!

62. దైవ భక్తులంత – కైవల్యమున్ బొంది
    స్వర్గ ధామ మునకు – చేరు చుండ
    తరుగ వలయు జనులు – పెరుగు చున్నారేమి ?
     ఆకురాతి మాట అణు బరాట !!

63. సైన్సు నెదురలేని – శతకోటి మతముల్లొ
    కాల చక్ర కూడ – కలసి పోయె
    చచ్చి నోణ్ణి మరల – సంకేసు కొత్తురా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

పండుగలు - దండగలు
64. పస్తులెపుడు పేద – నేస్తాలు, రంజాను
    పండుగంచుళ్లి – పస్తులేల ?
        పస్తులుండగానె – వస్తాదు లగుదురా ?
    ఆకురాతి మాట అణు బరాట !!

65. దండి జీతగాళ్ళె – దశరాకు మామూళ్ళు
    రొల్లు చుందురెపుడు – రోతయనక
    కుండ దోచుహక్కు – కుక్కల కున్నట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

66. ధనము వీధులందు – దగ్ధమై పోతుండ
    గుండె చిక్క పట్టి – గుటకలేయు
    పేద గుండె కాల్చు – పెనుము దీపావళీ
      ఆకురాతి మాట అణు బరాట !!

67. పండుగ యుగాదికి  – పంచాంగ శ్రవణాలు
    పరమ ఛాందసులకు – బంధనాలు
    ఠితపండితులకు – పసిడి యాభరణాలు
      ఆకురాతి మాట అణు బరాట !!

68. నల్ల దుస్తులేల – వల్లింపు భజనేల ?
    జ్యోతి దర్శనాల – జాతరేల ?
    నీతి లేని బ్రతుకు – జ్యోతి సవరించునా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

69. నీటి కలుషితాలు – పోటెత్తి జనులపై
    కాటువేయుననెడి – మాట నిజము
    నిజము స్వీకరింప – గజముఖా లొప్పునా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

70. జాతరలకు మేటి – సమ్మక్క సారక్క
    పూనకాలొకింత – పొదుపరిస్తె
    యేటి కొక్కటైన – నీటి ప్రాజెక్టగు
      ఆకురాతి మాట అణు బరాట !!

 మూఢ విశ్వాసాలు
71. బాల బాలికలను – బలిమి టి. వి. చెరచు
    చిత్ర సీమ యువ చరిత్ర చెరచు
    మూఢ భక్తి ముసలి – మూకను చెరచురా
      ఆకురాతి మాట అణు బరాట !!

72. చదువు గిదువు లేల – సంసార దిగులేల
   హనుమ కవచ మొకటి – కొని ధరించు
   కోరుకున్న దొచ్చి – కొంగులో పడునట
     ఆకురాతి మాట అణు బరాట !!

73. కన్నె గర్భమందు – కల్గె యేసయ్యంటె
   శాస్త్ర మెట్టులొప్పు – సాధులార ?
   నాటకుండ విత్తు – నారు మొలకెత్తునా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

74. ఏక ముఖియె కాదు – ఎన్నో ముఖాల రు
   ద్రాక్ష యైన కూడ – లబ్దిసున్న
   యెండు కాయ రసము – పిండితే కారునా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

75. బాధ తెలుప సాధు – బాణామతీ యనును
   తడిమి మాంత్రికుండు – దయ్యమనును
   ఖరము నాశ్రయిస్తె – కాలు ఝాడింపదా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

76. భ్రాంతి గొలిపిచంపు – బాణామతిని నమ్మి
   పామరుండు చెడును – పాము వంటి
   తాడు కాళ్ళకు పడి కోడి చచ్చినరీతి
     ఆకురాతి మాట అణు బరాట !!

77. మూఢ నమ్మకాల – ముప్పేట దాడిలో
    పెక్కు పండితాళి – చిక్కు వడియె
    గుడ్డి పులులు చిక్కె – కుందేళ్ళ కన్నట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

78. దూరదర్శనీకి – చేరువై టి. టి. డి.
    భక్తి సీరియళ్ళ -  పధకమల్లె
    పడగ విప్పె పాము – పుడమి కప్పల బ్రోవ
      ఆకురాతి మాట అణు బరాట !!

79. కష్టజీవి నోటి – కబళాన్ని కాజే
   ముమ్మరించె మూఢ – నమ్మకాలు
   నక్క కాకి నోటి – ముక్క రాల్చినరీతి
     ఆకురాతి మాట అణు బరాట !!

80. మురికి నీటి గుంట – ముసిరేటి దోమల
    పెంపు చేసినట్లు – పేదలందు
    తగని భూతవిద్య – దయ్యాల సృష్టించె
      ఆకురాతి మాట అణు బరాట !!

81. కుంటి నడచునం – గుడ్డి చూచేనంట
    చిలక వోలె మూగ – పలుకునంట
   యేసుప్రార్ధనం – ఆసుపత్రింకేల ?
     ఆకురాతి మాట అణు బరాట !!

82. అన్ని చదివి నోళ్ళె - అంధ విశ్వాసాల
    మునిగె యుందు రెపుడు – మూఢులల్లె
     కొండ యేనుగులకు - తొండాలు లేనట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

83. దైవ భక్తి లోన తరియించు  భక్తులే
    కన్నవారికింత - కవళమిడరు
    నడక నేర్పు బల్లి - కుడితిలో పడ్డట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

84. కోరుకున్న దెల్ల - కొంగులో పడున
    రత్నజ్యోతి వారి - రాళ్ళు కొనుడి
     రాల్చి వేయుపళ్లు – రాయిలేకుండనే
     ఆకురాతి మాట అణు బరాట !!

85. చిత్రసీమబూతు – సిగిరెట్ల లో ఘాటు
    భక్తి పరుని మొక్కు - బ్రాంది కిక్కు
    మచ్చికైన కుక్క - చచ్చినా వదలవు
      ఆకురాతి మాట అణు బరాట !!

86. గంగతీర్ధ మిపుడు - గంటె డైనా చాలు
    బొట్టు త్రాగి చూడు - ఇట్టె తెలియు
    స్వర్గప్రాప్తి యెంత - శర వేగమాయెనో ?
      ఆకురాతి మాట అణు బరాట !!

87. మూఢ భక్త కోటి - ముసిరేటి నదులన్ని
    ఉరక లెత్తుచుండె - మురికి తోడ
    వాటి స్నాన మిపుడు - వైకుంఠ యాత్రయే
      ఆకురాతి మాట అణు బరాట !!

88. పుష్కరాలొసంగు - పుణ్యమే పుణ్యంబు
    మురికినీ తలను – ముంచినపుడె
    మోక్ష ప్రాప్తి మహిమ – సాక్షాత్కరించేను
      ఆకురాతి మాట అణు బరాట !!

89. చేత కాని డ్రైవ్ - చేటు తెచ్చిందనక
    నిదుర లేచి చూస్తి - విధవ ననును
    వెధవ నింద కెల్ల - విధవయే లోకువా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

90. ఆపలను గాయ - ఆదేవు డుండెనని
    కళ్ళు మూయబోకు - వొళ్ళు మరచి
    యెదురు  తగిలె నంటె అదిరి పళ్ళూడేను
      ఆకురాతి మాట అణు బరాట !!
         
91. యోగమని సుఖాన్ని - త్యాగమ్ము గావించి
   దండగనుచు తనువు – నెండగట్టి
   ఒరిటి సచ్చినోళ్ళు - వైకుంఠ, మేగిరా ?
     ఆకురాతి మాట అణు బరాట !!

92. కపట నేత లెం – ఘటికులై పోరినా
    ఓట్ల యుద్దమందు – ఓడిపోవు
    గబ్బు వేపపళ్లు – దిబ్బకేనన్నట్లు
     ఆకురాతి మాట అణు బరాట !!

కన్నె పిల్లలు - కామాంధులు
93. పెళ్ళిముందె టెష్టు – పెట్టించి చేసుకో
    తల్లి నమ్మరాదు – పిల్లగాళ్ల
    చిలిపి జామ ఎయిడ్స్ – చిలకలు కొరికుండు
     ఆకురాతి మాట అణు బరాట !!

94. పెళ్ళి కాక ముందే – పెనగకు సెక్సులో
    పట్టెనంటె ఏడ్స్ – పుట్టి మునుగు
    పూతలోనె పైరు – పురుగంటు కొన్నట్లు
      ఆకురాతి మాట అణు బరాట !!

95. కొట్టు నరుకు చంపు – కోసినా గీసినా
    కాముకులకు పోదు – ప్రేమ జబ్బు
    మాడ్చు గాక మిడత – మంట నంటే తిరుగు
      ఆకురాతి మాట అణు బరాట !!

96. తిరు నిలయములోనె – తిరుమలేశుడె సాక్షి
    చుక్క, ముక్క, మందు – చుంబనాలు
    ఆంక్ష లెవరి మీద – అందరూ భక్తులే
      ఆకురాతి మాట అణు బరాట !!

97. కన్ను మిన్ను కనని – కామాంధునికి పండు
    ముసలి దైన యొకటి – పసిది యొకటె
    ఎగ బడేను పశువు – యే గడ్డి కైనను
      ఆకురాతి మాట అణు బరాట !!

98. కన్న కూతుక – కామాంధులై బిడ్డ
    బ్రతుకు పాడు చేయు – పశువులార
    ఇంట దొరకు నంటె – పెంట భుజింతురా ?
      ఆకురాతి మాట అణు బరాట !!

99. పసుపు కుంకుమకు – పరితపించే స్త్రీలు
    చేయు పూజాలందు – చేవయుంటె
    ముంమోయు ఆడ – దుందునా భూమిపై ?
      ఆకురాతి మాట అణు బరాట !!

100. కన్నె వలపు కంటె – కట్నాలె కడుప్రీతి
     చదువరీల కైన – చవట కైన
     అడ్డ గాడ్డెకెపుడు – గడ్డిపైనే మోజు
       ఆకురాతి మాట అణు బరాట !!

101. వరుల కట్నకాంక్ష – ఉరిత్రాళ్లుగామారి
      అంతరించుచుండె – ఆడ శిశువు
      సంత గిత్తల కొన – సాద్యమా పేదలకు ?
        ఆకురాతి మాట అణు బరాట !!

102. ఆడ దంత రిస్తె – జోడీకి మగవాళ్ళు
      గుంపు కట్టి వీధి – కుక్కలల్లె
      పంచుకొనుట కైన – పాంచాలి దొరకునా
        ఆకురాతి మాట అణు బరాట !!

103. సాటి స్త్రీని బట్టి – సామూహికంబుగా
     రేపు చేయు దుష్ట – పాపులార
     గొప్ప జాతి మీది – కుక్క బుద్దేలరా ?
       ఆకురాతి మాట అణు బరాట !!

104. బాయి ఫ్రెండు ఎన్ని – భ్రమలు కల్పించినా
     లొంగరాదు మాన – భంగమునకు
     కుక్కవాత పడ్డ – కూటి విస్తరి భంగి
       ఆకురాతి మాట అణు బరాట !!

105. మూఢ నమ్మకాలు – ముసిరి యున్నన్నాళ్లు
     ఆకురాతి శతక – మవని నుండు
     గాది కొక్కులుండ – గాలింపు ఆగునా ?
       ఆకురాతి మాట అణు బరాట !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి