15. తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు
''సాయిబులకు తెలుగు సరిగా రాదు'' అంటూ ముస్లిం పాత్రలకు నీకీ నాకీ అనే డైలాగులతో మన తెలుగు నటులూ, దర్శకులూ భలే ఎగతాళి చేస్తుంటారు. కానీ తెలుగు పండితులెవరికీ తీసిపోని విధంగా తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలు ముస్లిం కవులు రాశారు. భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు. తెలుగు ముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు :
ముహమ్మద్‌హుస్సేన్
భక్త కల్పద్రుమ శతకం (1949)
మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.
హరిహరనాథ శతకము
అనుగుబాల నీతి శతకము
తెనుగుబాట శతకము.
''మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృభాష యొండు మాన్యము గదా
మాతృశబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల''
షేక్‌దావూద్
1963 రసూల్‌ప్రభు శతకము
అల్లామాలిక్‌శతకము
సయ్యద్ ముహమ్మద్ అజమ్
''సయ్యదయ్యమాట సత్యమయ్య'' సూక్తి శతకము
ముహమ్మద్ యార్
సోదర సూక్తులు
గంగన్నపల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము - ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌దాసవర్య
హాజి ముహమ్మద్‌జైనుల్‌అబెదీన్
ప్రవక్త సూక్తి శతకము, భయ్యా శతకము
తక్కలపల్లి పాపాసాహెబ్
''వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట''
షేక్‌ఖాసిం
సాధుశీల శతకము :
''కులము మతముగాదు గుణము ప్రధానంబు
దైవచింత లేమి తపముగాదు,
బాలయోగి కులము పంచమ కులమయా,
సాధులోకపాల సత్యశీల''
షేక్ అలీ
''గురుని మాట శయము గూర్చుబాట''
అనే మకుటంతో 'గురునిమాట' శతకం (1950)
మానస ప్రబోధము శతకం
''ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
పాండితీ ప్రకర్ష పట్టుబడదు
పరులభాష గాన బాధను గూర్చును
గురుని మాట యశము గూర్చు బాట''
''దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
వభ్యసించవలయు నర్భకుండ
మాతృభాష నేర్చి మర్యాదలందుమా
గురుని మాట యశము గూర్చు బాట''
షేక్ రసూల్
మిత్రబోధామృతము అనే శతకం
ఉమర్ ఆలీషా
బ్రహ్మ విద్యా విలాసము.
ఉర్దూ మాతృభాషగా గల ముస్లిములు కూడా తెలుగులో వెలువరించిన సాహిత్యం చాలా ఉంది.
షంషీర్ అహ్మద్, అడిషనల్‌జాయింట్‌కలెక్టర్(రి)
కెంపుగుండె 1999
''ప్రజల భాష తెలుగు, ప్రజల నేలు ప్రభువుల భాష తెలుగు
ఆలు బిడ్డలతో ఆనందంగా పలకరించి,
పులకించి,ప్రేమ మీర పరవశించు,
పులకించి,ప్రేమ మీర పరవశించు,
ఆంధ్రుల ఇంటింటా మాటాడు భాష తెలుగు
కాసుకు కల మమ్ముకున్నంతలోనే, నీకు నాకు మధ్య
ఇంగిలీషు దొరతనపుదూరమెందుకో!?
మనం మాట్లాడే భాషలోనే, పాలన మర్మాలు
ప్రజలకు విడమరచి చెప్పలేని, దౌర్భాగ్యమెందుకు?
మండు వేసవిలో మృగతృష్ణల వెంట ఈ పరుగులెందుకు?
అమ్మలాంటి కమ్మనైన గంగిగోవు పాలనొదిలి
ఖరము పాల కొరకు
ఇంగిలీషు షోకు వెంట ఈ పరుగులెందుకు?''
ఇంగిలీషు షోకు వెంట ఈ పరుగులెందుకు?''
''తెలుగు సాహిత్యం - 1984 వరకు ముస్లిముల సేవ'' అనే సిద్ధాంత వ్యాసానికి అలీఘర్‌ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్‌మస్తాన్‌గారికి పి.హెచ్.డి. వచ్చింది. ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆయన 1991లో ప్రచురించారు.
ఆ గ్రంథంలో 1984 వరకు వెలువడిన 42 మంది తెలుగు ముస్లిముల గ్రంథాలను ఇలా పేర్కొన్నారు :-
1. అబ్దుల్‌గపూర్‌ముహమ్మద్ ఖుర్‌ఆన్(అను), ఇస్లాం మత ప్రభువులు, మిష్‌కాతె షరీఫ్(అను) జగత్ప్రవక్త
2. అలి ముహమ్మద్ ఆణి ముత్యాలు, హృదయమాధురి, వేదనా సౌరభము, మమత.
3. అహమ్మద్‌బాషా సయ్యద్ శ్రీ ప్రవక్త ముహమ్మద్‌రసూల్‌వారి దివ్య చరిత్ర.
4. ఆమిరివ మువ్వలున్ విశ్వప్రవక్త
5. ఆలీ షేక్ గురునిమాట, మానస ప్రబోధము
6. ఇస్మాయిల్ చెట్టునా ఆదర్శం, మృతవృక్షం, చిలకలు వాలిన చెట్టు.
7. ఇస్మాయిల్ ఆఁ?
8. ఉమర్‌ఆలీషా అనసూయాదేవి, ఉమర్‌ఖయ్యామ్, కళ, ఖండ కావ్యములు, చంద్రుగుప్త, తత్త్వ సందేశము, దానవవధ, బర్హిణిదేవి,బ్రహ్మ విద్యా విలాసము, మహాభారత కౌరవ రంగము, శ్రీ ముహమ్మద్‌వారి చరిత్ర, స్వర్గమాత, సూఫీ వేదాంత దర్శనము.
9. ఖాసింఖాన్‌ముహమ్మద్ ఆవిమారకము, ఆత్మాభిమానము, ఆల్బర్ట్‌ఐన్‌స్టీన్, ఉత్తరరామ చరిత్ర, ఖురానెషరీప్(అను), దేవుడు, - నాదేశము, దేశభక్తులు ప్రతిమ, వాసవదత్త.
10. ఖాసీంఖాన్‌సాహేబ్‌షేక్ వీరభద్ర విజయము
11. ఖాసీం సాదుశీల శతకము
12. గపూర్‌బేగ్‌ముహమ్మద్ నిరపరాధులు, గ్రీష్మంలో వసంతం.
13. జలాలుద్దీన్ యూసఫ్ మొహమ్మద్
లోక శాంతికి దైవ సూత్రము, మతము, రాజకీయము యదార్ధమేది, దైవనియమావళి.
లోక శాంతికి దైవ సూత్రము, మతము, రాజకీయము యదార్ధమేది, దైవనియమావళి.
14. జైనుల్ అబెదీన్ ముహమ్మద్
ఖుర్‌ఆన్‌సూక్తులు, ఖుర్‌ఆన్‌ప్రవచనములు, ముహమ్మద్‌ప్రవక్త జీవితము - సందేశములు, భయ్యా శతకము (అను) ప్రవక్త సూక్తి శతకము.
ఖుర్‌ఆన్‌సూక్తులు, ఖుర్‌ఆన్‌ప్రవచనములు, ముహమ్మద్‌ప్రవక్త జీవితము - సందేశములు, భయ్యా శతకము (అను) ప్రవక్త సూక్తి శతకము.
15. దరియా హుస్సేన్‌షేక్ పురుషోత్తముడు.
16. దస్తగిరి అచ్చుకట్ల మణి మంజూష, అమృతమూర్తి
17. దావూద్‌షేక్ చిత్త పరివర్తనము, దాసీపన్నా, రసూల్‌ప్రభుశతకము, సంస్కార ప్రణయము, సూఫీ సూక్తులు.
18. నఫీజుద్దీన్‌ముహమ్మద్ కనకపు సింహాసనమున, దేవుడూ నీకు దిక్కెవరు, ధర్మ సంరక్షణార్థం, విముక్తి, విధి విన్యాసాలు.
19. నూరుల్లా : ఖాద్రిసయ్యద్ రమజాను మహిమలు, నమాజు బోధిని, సుందరమగు నమూనా, విశ్వాసములు, ఆరుమాటలు, జుబా :
20. పాపాసాహెబ్‌తక్కల్లపల్లి అంబ, రాణీ సంయుక్త, సత్యాన్వేషణము, పాపసాబు మాట పైడిమూట.
21. పీరాన్‌నిజామి, టి, హెచ్ హజరత్‌హుస్సేన్‌సంస్కరణము, సూరాయె ఫాతిహా, హజ్రత్‌ముహమ్మద్, సీరత్‌ను గురించి ఉపన్యాసములు.
22. ఫరీదు షేక్ వేమన
23. బుడన్‌సాహేబ్‌షేక్ ఖుతుబ్‌నామా, జలాల్‌నామా
24. మస్తాన్‌సయ్యద్ మధు
25. మహబూబ్, ఎస్.ఎమ్. సమత
26. మహబూబ్‌ఖాన్ సూరీడు
27. మహబూబ్‌సాహేబ్‌షేక్ శ్రీ శైల క్షేత్ర మహాత్యము.
28. ముహమ్మద్‌అజమ్ సయ్యద్‌సూక్తి శతకము (అము)
29. ముహమ్మద్‌హుస్సేన్‌షేక్ భక్త కల్పధ్రుమ శతకము, హరినాధ శతకము, సుమాంజలి, తెలుగుబాల, అనుగు బాల
30. మిష్కిన్‌సాహేబ్‌షేక్ నానార్ధనవనీతము (ఆము)
31. మీరాజాన్‌షేక్ సర్వమత సార సంగ్రహణము
2. మొహియుద్దీన్‌హుస్సేన్‌సయ్యద్‌షాహ్ తౌహీద్
33. మొహిద్దీన్‌పీరాన్‌పటూరి ఇస్లాం బోధిని,
34. మొహిద్దీన్‌మల్లిక్‌సుల్తాన్ శ్రేయస్కర మార్గము, మరణానంతర జీవితము, ఇస్లాం జీవిత విధానము, ఆర్థిక సమస్య - ఇస్లాం పరిష్కారము, నిర్మాణము - విచ్చిన్నము, కలిమయె-తయ్యబ-ఆర్ధము, ప్రపంచ మార్గదర్శి, ఇస్లాం శిక్షణ, ఇస్లాం బోధిని, నిర్యాణము, విచ్చిన్నము
35. యార్‌ముహమ్మద్ ఆ వేదన, సోదర సూక్తులు
36. రసూల్‌షేక్ మిత్ర బోధామృతము
37. వజీర్‌రహమాన్ ఎచటికి పోతావీరాత్రి, కవిగా చలం.
38. వలి, ఎన్.కె. శ్రీమతి లక్ష్మీ
39. వలి, ఎస్.ఎమ్. ఊర్వశి
40. సలాం అబ్దుల్ చలంగారి శ్రీశ్రీ
41. షం సుద్దీన్‌ముహమ్మద్ కళంకిని, విజయ, నల్లబంగారం, ధనవంచిత అమృతపధం
42. హమీదుల్లా షరీఫ్‌షేక్ దైవ ప్రవక్తలు, ఖురానీ గాధలు (అను)
తెలుగులో వచ్చిన ఖురాన్‌అనువాదాలు : 11
1. 1925-చిలుకూరి నారాయణరావు ఖురాన్ షరీఫ్ మద్రాసు(754పేజీలు)
2. 1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
3.1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు(1740 పేజీలు)
4.1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్ ( 767పేజీలు)
5. 1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్ (850పేజీలు)
6. 2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం , హైదరాబాద్ (904 పేజీలు)
7. 2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
8.2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
9.2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ ,(మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు[2870 పేజీలు]
10. 2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు.
11. 2012-డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,(ఆల్లాహ్ అంతిమ ఆకాశ పరిశుద్ధ గ్రంధము),విశాఖపట్టణం.1100 పేజీలు
1. 1925-చిలుకూరి నారాయణరావు ఖురాన్ షరీఫ్ మద్రాసు(754పేజీలు)
2. 1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
3.1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు(1740 పేజీలు)
4.1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్ ( 767పేజీలు)
5. 1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్ (850పేజీలు)
6. 2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం , హైదరాబాద్ (904 పేజీలు)
7. 2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
8.2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
9.2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ ,(మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు[2870 పేజీలు]
10. 2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు.
11. 2012-డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,(ఆల్లాహ్ అంతిమ ఆకాశ పరిశుద్ధ గ్రంధము),విశాఖపట్టణం.1100 పేజీలు
స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు :-
1842 ''వర్తమాన తరంగిణి'' వార పత్రిక....1842 జూన్8న సయ్యద్‌రహమతుల్లా
మద్రాసు. సయ్యద్‌రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం. మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు : ''మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర బాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ూదయింప జేయడమునకు కారకులమైతిమి.''
1891 ''విద్యన్మనోహారిణి'' మీర్‌షుజాయత్‌అలీఖాన్, నరసాపురం, తరువాత ఈ పత్రిక వీరేశలింగం గారు నడిపిన ''వివేకవర్ధిని'' లో కలిసిపోయింది.
1892 ''సత్యాన్వేషిణి'' బజులుల్లా సాహెబ్, రాజమండ్రి
1909 ''ఆరోగ్య ప్రబోధిని'' షేక్‌అహ్మ6ద్‌సాహెబ్, రాజమండ్రి.
1944 ''మీజాన్'' దినపత్రిక కలకత్తావాలా, హైదరాబాదు అడవి బాపిరాజు సంపాదకుడు.
2010 - రాష్ట్రంలో తెలుగులో రాసిన రాస్తున్న 333 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకుల వివరాలతో ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, చరిత్రకారుడు సయ్యద్‌నశీర్‌అహమ్మద్'అక్షరశిల్పులు' పుస్తకం 2010లో ప్రచురించారు. ఈ గ్రంథంలో 257 మంది ఫొటోలు, చిరునామా, దూరవాణి, సంచారవాణి నంబర్లతో పాటుగా 'ఈమెయిల్' ఐడిలను కూడా సమకూర్చారు.
ఈ పుస్తకంలో ఖాదర్‌మొహియుద్దీన్, సౌజన్య (మహమ్మద్‌నఫీజుద్దీన్), శాతవాహన (గులాంగౌస్), కౌముది (మహమ్మద్‌సంషుద్దీన్), శశిశ్రీ (బేపారి రహంతుల్లా), దేవీప్రియ (షేక్‌ఖాజా హుసేన్), స్కైబాబా, షేక్‌కరీముల్లా, సత్యాగ్ని హుసేన్, సుగంబాబు, అఫ్సర్, యాకూబ్, డానీ, ఖదీర్‌బాబు, బా రహంతుల్లా, వేంపల్లి షరీఫ్, అక్కంపేట ఇబ్రహీం, దాదా షయాత్, దిలావర్, ఖాజా, పద్మశ్రీ నాజర్, ఇనగంటి దావూద్, షహనాజ్‌బేగం, షాజహానా, మహజబీన్, జరీనాబేగం, షహనాజ్‌ఫాతిమా లాంటి 333 మంది ప్రముఖ ముస్లిం రచయితల వివరాలు ఉన్నాయి. తెలుగుముస్లిం రచయితల వివరాల సేకరణలో ప్రొఫెసర్ షేక్ మస్తాన్,నశీర్‌అహమ్మద్ విశేష కృషి చేశారు. ప్రొఫెసర్ షేక్ మస్తాన్‌గారు "తెలుగు సాహిత్యం-ముస్లిములసేవ" పేరుతో 1984 వరకు రచయితల వివరాలు సేకరిస్తే , నశీర్ అహమద్ 2010 వరకు "అక్షరశిల్పులు" పుస్తకంలో తెలుగు ముస్లిం రచయితల వివరాలు జతపరిచారు. మరిన్ని వివరాల కోసం ఆ పుస్తకాలను సంప్రదించాలి.
2010 ''సలీం'' నవల ''కాలుతున్న పూటతోట''కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
i was very much influenced and attracted by your authority on telugu literature. When i was browsing i suddenly found your blog, i was spell bound on your knowledge and authority in telugu.
రిప్లయితొలగించండిPlease give me your e-mail address.
ధన్యవాదాలు
తొలగించండిhttps://www.facebook.com/nrahamthulla/media_set?set=a.1040333795998610.1073741859.100000659993594&type=1
తొలగించండిhttps://www.facebook.com/williams32143/posts/2969529369745700
రిప్లయితొలగించండి