6, జులై 2012, శుక్రవారం

9. లిపి సంస్కరణ జరగాలి !


9. లిపి సంస్కరణ జరగాలి !
                సంస్కృతం, తమిళంతోపాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలుగా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి. చైనా భాష తమిళంకంటే ప్రాచీనం. వారు లిపి ఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలాసార్లు సంస్కరించుకున్నారు. మనం కుండపెంకుల మీద, బండరాళ్ళమీద  రాసుకుంటున్న  రోజులలో  ఒక లిపి సహితం లేని రష్యావాళ్ళు, జపాన్‌వాళ్ళు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాషను ప్రాచీనహోదాతోపాటు ఆ భాషను ఆదునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవడం. భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవితానికి సంబంధించి పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.
                తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది. ర్దూ హైదరాబాద్‌, అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1966లో జారీ అయింది. ప్రభుత్వం జారీచేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ూత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది. కానీ ర్దూలో కానీ తెలుగులో కానీ అమలు కావటం లేదు. ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది. 1988 నవంబరు 1 నుంచి అన్ని ప్రభుత్వ త్తర్వులూ త్తర ప్రత్యుత్తరాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీషు కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ త్తర్వులు, త్తర ప్రత్యుత్తరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అయింది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పనిమాత్రం చేయటంలేదు. అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటం లేదు. తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థంకాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్‌కేసులు సెషన్స్‌కోర్టు దాకా, 1982 నుండి సివిల్‌కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు. హిందీ రాష్ట్రాలు హైకోర్టులో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి.
                మెజిస్ట్రేట్‌కోర్టులలో కూడా తమిళం ఇంగ్లీషుతో పోటీపడి ఎదుగుతున్నది. వత్తులు, గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్‌లోలాగా ఒక వరుసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది. అరవమయిన డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదే మాదిరి ఫారమునకు ఎనిమిది రూపాయలు ఛార్జి చేయుచున్నారు. ఇలా ధర తక్కువయగుటకు కారణం అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా ూండుట. తెలుగు కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొనవచ్చును. తెలుగు లిపిని గూర్చుట జాలజాగగును. గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కూర్చగలం. అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగ్‌కుదురునా? అని వేటూరి ప్రభాకరశాస్త్రి వాపోయారు. ఇంగ్లీషున అరవమున ూన్నట్లు లిపి సంకేతములు పక్కపక్కనే (ఒక దాని కిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.
                                                                               (ఆంధ్ర లిపి సంస్కారము,‘‘తెనుగు మెరుగులు’’ 1948)
                 ‘‘ప్రపంచంలోని అన్ని భాషల ముద్రణ ఒక ఎత్తు. తెనుగు ముద్రణే ఒక ఎత్తు. ఇదొక గారడీ. తెనుగు అక్షరాలు కూర్చడానికి కంపోజిటరు 700 దిమ్మలు, గళ్ళు జ్ఞాపకం ూంచుకోవాలి. ప్రతి కంపోజిటరు శతావధాని, సహస్రావధాని కావలసి ఉంటుంది. ఈ చిక్కును తొలగించుకోడానికి ఏ రోమన్‌లిపినో అనుసరిస్తే అచ్చు సౌకర్యం కలుగుతుందనుకుంటే అనూచానంగా వచ్చిన ఈ లిపిని వదులుకోడం ఎలా?’’
                                                                (తిరుమల రామచంద్ర, మన లిపి పుట్టు పూర్వోత్తరాలు 1957)
                ‘‘ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్‌లిపిలో ( a,aa,i ,ee.... ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం ప్రపంచ తెలుగు మహాసభవారు ఈ విషయమై ఆలోచించడం మంచిది
                                                                       ( శ్రీశ్రీ అనంతంపేజి 196, ప్రజాతంత్ర 18.4.1976)
రాజీవ్‌గాంధీ హత్య కేసు విచారణ కూడా తమిళంలోనే జరిగిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ూన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొంది. ఇంగ్లీషు వచ్చినవారికే మంచి ద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతున్నారు.
                పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుంటారని వాదిస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధనే పిల్లలకు మంచిదంటే హేళన చేస్తున్నారు. మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పిల్లలందరినీ ఆంగ్లమాధ్యమంలో పడేస్తే నిజంగానే గొప్ప అవకాశాలొస్తాయా? ూద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్‌భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయ విజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్‌వచ్చినవాళ్ళలో కూడా విషయపరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ద్యోగాలు వస్తాయా?
                భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు. పరభాషలో చదువు పిల్లలకు హింసే, పిల్లలందరినీ ఇంగ్లీషు మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్‌పాఠశాలలు కూడా మాతృభాషలో చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి. ఇంగ్లీషు, తమిళభాషలలాగా మన తెలుగులిపి సంకేతములు పక్కపక్కనే కూడా ఉండేలా లిపి సంస్కరణ కోసం ప్రాచీన హోదాద్వారా వచ్చే నిధుల్ని వినియోగించాలి.
                                                                                  (19.12.2008, గీటురాయి వారపత్రిక)

1 కామెంట్‌:

  1. sir meeru telugu bhash vaibhavaanni penchadaaniki chaala krushi chestunnaaru. anduku meeku hats off. Telugu bhaashaki roman/latin lipi vaadatam manchidani naaku kuda abhipraayam. edainaa bhaasha kaalaaniki anugunangaa maarpu chendaale gaani aa bhaashani paata kattubaatlu ane agaadham loniki toseyyadam manchidi kaadannadi naa uddesam. Aithe prastutam inglish lipi lo pada utchaaranaki andulo aksharaalaki sambandham takkuvagaa undi. Aithe konta maarpulu cherpulatho roman/latin lipini teluguki goppagaa upayoginchukovatchu, okka telugu bhaashake kaakundaa bhaaratiya bhaashalannitiki european bhaashallaaga roman/latin lipini upayogiste adi mana desaanni desamloni bhaashalanu daggara cheyagaladu.

    dhanyavaadaalu

    రిప్లయితొలగించండి