18, జులై 2012, బుధవారం

అక్రమ లిపిక్లేశాలు


17.అక్రమ లిపిక్లేశాలు
                వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ''తెలుగు మెరుగులు'' అనే పుస్తకంలో (1945) ఆంధ్ర లిపి సంస్కారము అనే అధ్యాయంలో ఇలా అన్నారు.  నేడు వాడుకలో ఉన్న మన తెలుగు లిపి మనకు మిక్కిలి చిక్కులు కలిగించేదిగా ఉంది. పసిప్లిలలకు లిపి నేర్పటం ఎంతో కష్టంగా ఉంది. టైపు రైటింగు నిర్మాణానికి అసౌకర్యంగా ఉంది. వర్ణోచ్ఛారణ రీతికి గూడా విరోధంగా ఉంది. ఇవన్నీ చిన్న చిక్కులు కావు. ఇ,ఈ లకు పోలికే లేదు. ఇ,ఞ ఒకేలా ఉన్నాయి. ఋ,బుూ లు బు, బూ ల పోలికతో రెండు కొమ్ములు కలిగి పొందికలేక మోటుగా ఉన్నాయి. ఒ,,ఔలు జ తో పోలిక గలిగి ఉన్నాయి. క వర్గ మంతా భిన్న లిపులతో పోలికేలేని అక్షరాలు... చకు ముడ్డి క్రింద ఒత్తిచ్చినచో ఛ అగునని చెప్పుటకు వీలులేదు. క,,,,,థ లు అలా లేవు కాబట్టి సాజాత్యబోధము కుదరదు. ఇంత వరసవావిలేని లిపిరూపాలను భిన్న భిన్నముగా నేర్చుకొనుట కష్టమేకదా?... అక్షరాలు వడిగా రాకపోవటంచేత బాలలెందరో బండబారి చదువులో సన్నగిల్లుతున్నారు. బడంటే భయపడుతున్నారు. ఈ లిపి బాధలు వారి హృదయ ప్రసాదాన్ని చెరుస్తున్నాయి. అక్రమలిపి క్లేశాలకు పిల్లల్ని గురిచేసి బాధించకూడదు.. అచ్చుకు తెలుగు లిపిని కూర్చటం చాలా జాగు అవుతుంది. ఇంగ్లీషులో, అరవంలో ఉన్నట్లుగా లిపి సంకేతాలు పక్కపక్కనే (ఒకదాని క్రింద ఒకటి ఉండకుండా) ఉండాలి. ఈ సంకేతాలు గూడా నలభైకంటే మించకుండా ఉంటేనేగాని టైపురైటింగు సాధ్యంకాదు కాబట్టి ఇప్పటి లిపి రీతికి టైపురైటింగు కుదరనే కుదరదు...
                ఆయన రెండు రకాల లిపులను తానే స్వయంగా తయారుచేసి అమలు చేయండి అన్నారు. అప్పుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు ఆ లిపి  నేర్చుకొని ఆ లిపితోటే ఆయనకు జవాబు ఇచ్చారు. ఆ త్తరం కూడా ఆ పుస్తకంలోనే ప్రచురించారు. అందులో ఆయన చేసింది ఏమీలేదు అ,,,ఈ.... 16 అచ్చులున్నాయి. ఈ శబ్దాలు నేర్పడానికి 16 అచ్చులు అక్కర్లేదు. ఆ ఒక్కటే సరిపోతుంది. కు దీర్ఘం ఇస్తే ’, ‘కు గుడి ఇస్తే ’. ‘కు కొమ్మిస్తే అట్లా ఒకే అక్షరం.
                                , ఆ లకు ఇ, ఈ లకు పోలికేమన్నా ఉందా? ఆ ఒకరకంగా ఉంటుంది. ఈ ఒక రకంగా ఉంటుంది. అసలు వావి వరుస లేకుండా న్నాయి. పొందిక లేకుండా న్నాయి ఈ అక్షరాలు. పసి పిల్లల మెదడు మీద ఇంత భారం మోపితే వాడికి విసుగొచ్చి ఈ అక్షరాలు నేర్చుకోవడం కష్టమని చెప్పి ఈ భాష నేర్చుకోడు. మన పిల్లల చదువులు ఇట్లా వెనుకబడిపోవడానికి ఈ అక్షరమాల, ఈ లిపి ఒక కారణం అని ఆయన కనుక్కొని పసిపిల్లల బాధను కూడా  అతను అర్థం చేసుకొని తను చాలా కష్టపడి ఒక లిపిని తయారు చేశాడు. దాన్ని వీళ్ళు గుర్తించి ఆ సులభ లిపిని గనుక అమలు చేస్తున్నట్లయితే ఎంతో బావుండేది.
....తాతలు తవ్విన బావిగదా అని దానిలోని ఉప్పునీళ్ళే ఎల్లప్పుడూ త్రాగుతూ ఉండొచ్చా? దగ్గరలోనే మంచి నీళ్ళబావి తవ్వుకోకూడదా? అంతేకాదు, ఈనాటి లిపి కూడా ఏమంత స్థిరమైనదికాదు. అయిదొందల ఏళ్ళనాటి లిపికీ మననాటి లిపికీ ఎంతో తేడా ఉంది. ఈనాటి లిపి కూడా ఎన్నో పరిణామాలను పొందుతూ వస్తున్నదే.... అచ్చుల్లో ''కారమొకటి తప్ప మిగతా అక్షరాలన్నీ విడిచిపెట్టాలి. ఇందువల్ల 15రకాల అక్షరాలను పిల్లలు నేర్చుకునే బాధ తగ్గుతుంది.''
నేనూ అక్రమ లిపిక్లేశ బాధితుడినే
                చిన్నప్పుడు '' దాకా నేర్చుకున్నాను '' రాలేదు. సంకా అప్పారావు పంతులు గారు '' అనే అక్షరం రానందుకు చావబాదారు. బడి మానేశాను. సంవత్సరంపాటు గాలికి తిరిగాను. తరువాత మా నాన్న బడి మార్చాడు. ప్రేమయ్య మాస్టరుగారు, '' రాకపోతే రాక పోయిందిలే మిగతా అక్షరాలు నేర్చుకోమన్నారు. చదువులో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. చదువుల పండుగ, అక్షర దీక్ష ఉద్యమాల్లో ఈ సంగతే జనానికి చెప్పేవాడిని. అక్షరాల సంఖ్య తగ్గింది. వత్తులు గుణింతాల్లోని చిక్కు తనం కూడా తగ్గాలి. తెలుగు బాలల అక్షరాభ్యాసం మరింత సుళువు కావాలి. ఈ తరం పెద్దలు త్యాగం చేస్తే రేపటి పౌరులకా ఫలాలు దక్కుతాయి. తెలుగు భాష యంత్రాల కనువైన భాషగా మారి వ్రాతలోనూ, ముద్రణలోనూ వేగం పుంజుకుంటుంది. ఇంగ్లీషుకు ప్రపంచంలో ఎక్కడైనా ఒకే కీ బోర్డ్‌ ఉంటుంది. కాని తెలుగుకు ఎన్నో రకాల  కీబోర్డులు ఉన్నాయి. ఆపిల్‌, మాడ్యులర్‌, ఫోనొటిక్‌, ఐలీప్‌ .... లాంటివి. కంప్యూటర్‌లలో ఒక కీబోర్డ్‌ అలవాటైన వాళ్ళకు మరో కీబోర్డు కొత్తగా ఉంటుంది. అది నేర్చుకునేందుకు సమయం పడుతుంది. లిపి సంస్కరణ జరిపాక ఒకే తెలుగు కీబోర్డును స్థిరపరచాలి. అప్పుడే మన కీబోర్డుపై నిపుణులు తయారవుతారు.
                                                                                                                (గీటురాయి 23-7-2004)

1 కామెంట్‌: