21. తెలుగు లో పెళ్ళి
తెలుగులో పెళ్ళి జరగాలనే కోరిక తెలుగు వారిలో పెరుగుతోంది. 'తెలుగు ప్రజలు తమ నిత్య జీవితంలో ముఖ్య ఘట్టాలన్నిటిలో తమ తల్లి భాషతో సంబంధం కోల్పోయారు. పుట్టుక దగ్గర నుండి చావు వరకు చావు తరవాత కూడా జరిగే ముఖ్య సందర్భాల్లో తెలుగుకు చోటులేదు. అర్థంకాని మంత్రాల ఘోషలో తలలూపడం తప్ప ఏమీ చేయలేని అనాధలయ్యారు తెలుగు వారు. వివాహ విధి విధానమంతా మనకు తెలియాలి' అంటూ సామల రమేష్‌బాబు గారు తన ఇద్దరు కొడుకుల పెళ్ళి తెలుగులోనే చేశారు. ఈ సంస్కరణ కోసం అందరికీ పిలపు కూడా ఇచ్చారు. తెలుగు పెళ్ళి పద్ధతి అంతా నడుస్తన్న చరిత్ర సెప్టెంబర్2009లో వివరించారు.
తెలుగు క్రైస్తవులకు ఈ సమస్య లేదు. వారిలో పెళ్ళి, సమాధి లాంటి జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ తెలుగులోనే జరుగుతున్నాయి. తెలుగు ముస్లిములకు మాత్రం ఇంకా ఈ సమస్య తీరలేదు.
పులికొండ సుబ్బాచారి ఇలా అన్నారు :-
పెళ్ళిలో పూజారి వరుడితో మంత్రం అనిపిస్తాడు. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. పెండ్లి కొడుకులకు దీని అర్థం అర్థంకాదు. కట్టించుకునే పెండ్లి కూతురికీ అర్థంకాదు, చుట్టూ ఊన్న బంధుమిత్రులకూ అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు? నేను నూరేండ్లు హాయిగా ఈమెతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యాన్ని కడుతున్నాను అని పెండ్లి కొడుకు చక్కగా తెలుగులో చెప్పి కట్టవచ్చుగా. కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థంకాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మంత్రాలలో చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందట. మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించుకునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రాలు చదివితేనే తృప్తి. అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగుతుంది.
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయాలని ఒక ూద్యమం చేపట్టారు. వెనిగళ్ళ సుబ్బారావు 'పెండ్లి మంత్రాల వెనుక బండారం' అనే పుస్తకంలో పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడుకు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుంది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు.'' (సూర్య 9.4.2012)
తెలుగు 'నిఖానామా' పత్రాలు జారీ చేయాలి!
మన రాష్ట్రంలో తెలుగు మాతృభాషగల 'తెలుగు ముస్లిములు' లక్షలలో వున్నారు. నిత్యం ఉర్దూ మాట్లాడే ముస్లింలలో కూడా పలువురికి ఉర్దూ చదవడం, రాయడం రాదు. వీరంతా తెలుగులోనే రాతకోతలు సాగిస్తుంటారు. ఉర్దూ రాని ముస్లింలకు కూడ వివాహ ధృవీకరణ (నిఖానామా) పత్రాలను ఉర్దూలోనే జారీ చేస్తున్నారు. తెలుగు ముస్లిముల సౌలభ్యం కోసం ఖాజీలు తెలుగులోనే నిఖా ప్రసంగాలు చేస్తున్నారు. ఖురాన్, హదీస్‌వంటి మూల గ్రంథాలన్నిటిని తెలుగులో ముద్రించారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాలను కూడ తెలుగులో ముద్రించి ఇస్తే తెలుగులోనే పూరించి ఇస్తామని ఖాజీలు అంటున్నారు. కాబట్టి వక్ఫ్‌బోర్డు వివాహ ద్రువపత్రాలను తెలుగు భాషలో కూడా ప్రచురించాలని మనవి. - నూర్‌బాషా రహంతుల్లా, విజయవాడ (సాక్షి 19.10.2011)
తెలుగులో పెళ్ళి పుస్తకం (నిఖానామా)
ఆంధ్రప్రదేశ్‌వక్ఫ్‌బోర్డు ఉర్దూలో ప్రింటు చేసి ఖాజీలకు సరఫరా చేస్తున్న నిఖానామా 'పెళ్ళి పుస్తకం' ఉర్దూ లో 8 పేజీలు ఉంది.దానిని తాడేపల్లి మండలం నులకపేట మసీదు ఇమాం అబ్దుల్‌జలీల్‌గారు తెలుగులోకి అనువదించి ఇచ్చారు. తెలుగు ముస్లిముల కోసం 'పెళ్ళిపుస్తకం' తెలుగులోనే జారీ చేస్తే వాళ్ళు దాన్ని చదువుకొని మరీ సంతకాలు చేస్తారు. అందులో పేర్కొన్న విషయాలపై ఏమైనా అనుమానాలుంటే అడిగి నివృత్తి చేసుకుంటారు. పుస్తకంలో ఏముందో చూడండి :
1వ పేజీ ముఖ పత్రం :
''అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్‌పేరుతో''
''వివాహం నా సంప్రదాయం''
''వివాహ ధృవీకరణ పత్రము''
(వరుడికొక ప్రతి, వధువుకొక ప్రతి)
పెళ్ళి పుస్తకం సంఖ్య :.........................
ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర వక్ఫ్‌బోర్డుచే జారీ చేయబడినది.
(వక్ఫ్‌బోర్డు ముద్ర)
సంతకం సంతకం
Chief Executive Officer Chief Khazi
AP State Wakf Board AP Wakf Board
2వ పేజీ
''వివాహం నా సంప్రదాయం. దీనిని ఇష్టపడని వారు నా వారు కారు.''
భార్యా భర్తల పరస్పర హక్కులు, బాధ్యతలు :
వివాహ బంధము ప్రేమానుబంధము. భార్యాభర్తలు పరస్పరము ప్రేమాను రాగములతో జీవితం గడపాలి.
భర్త తన భార్యా బిడ్డలకు ఆహారము, దుస్తులు, నివాసము ఏర్పాటు చేయాలి. మంచి మర్యాదగా వ్యవహరించాలి. ఇతర జీవిత అవసరాలు సమకూర్చాలి.
నమాజు ఉపవాసములు వగైరా ధర్మోపదేశాలు పాటించాలి.
సంతానానికి ఆహార పానీయాలు దుస్తులు విద్యా ఇతర పోషణ ఏర్పాట్లు చేయాలి.
బలమైన కారణము లేనిదే విడాకులు మాట ఎత్తకూడదు.
తప్పనిసరి పరిస్థితిలో ఒక్క తలాఖ్‌మాత్రమే చెప్పాలి.ఒకేసారి మూడు తలాఖ్‌లు చెప్పకూడదు. అది కూడా బహిష్టు అనంతరం పరిశుభ్రత పొందిన తర్వాత సంభోగము చేయక ముందే చెప్పాలి.
3వ పేజీ
మొదటి పెండ్లి :
విచారణ వివరాలు
ప్రశ్న జవాబు
1. ఈ పెళ్ళి సమయములో వరుడికి నలుగురు భార్యలున్నారా?....................
2. వధూవరులకు ధర్మ నిషిద్ద సంబంధం ఏదైనా ఉందా?.......................
3. వధువు వరుని భార్యకి లేక విడాకులిచ్చి ఉన్న భార్యకి తోబుట్టువా?
వధూవరులు ఒకే తల్లి పాలు త్రాగి ఉన్నారా? వధువు వరుడికి మేనకోడలు,
పిన్ని మేనత్త, అన్న కుమార్తె, సవతి సోదరి అవుతుందా?........................
4. వధువుకు యుక్త వయసు రానట్లయితే ఆమె సంరక్షకుడు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారా?
గమనిక : పెండ్లి తర్వాత సంసారములో కలహాలు ఏర్పడిన ఎడల భార్యా భర్తలు తమ తమ పెద్దల తీర్పుకి లోబడి ఉండవలెను.
వరుడి తరపు సాక్షి వధువుతరపు సాక్షి వధువు సంరక్షకుడిసాక్షి వధువు వరుడు
సంతకం సంతకం సంతకం సంతకంసంతకం
సంతకం తేది. - పెళ్ళి చేసిన ఖాజీ / ప్రతినిధి
4వ పేజీ
రెండవ పెళ్ళి :
విచారణ వివరాలు
ప్రశ్న జవాబు
1. ఈ పెళ్ళి సమయములో వరుడికి నలుగురు భార్యలున్నారా ?....................
2. వధువు, వరుడి యొక్క ప్రస్తుతము ూన్న భార్యకి లేక విడాకులిచ్చి ఉన్న భార్యకి తోబుట్టువా? వధూవరులు ఒకే తల్లి పాలు త్రాగి ఉన్నారా ?
సవతి సోదరి, మేనకోడలు, పిన్ని, మేనత్త, అన్న కుమార్తా ?
4. వధువుకు యుక్త వయసుకి చేరి ఉండని ఎడల ఆమె సంరక్షకుడు ఈ పెళ్ళికి ఇష్టపడ్డారా?
4. వధువు ప్రస్తుతము ఎవరికైనా భార్యగా ఉన్నదా?
5. వధువు, ఈ వరుడు పూర్వము మూడు తలాఖ్‌లు ఇచ్చిన ఆమె అయి ఉన్నదా? అయితే ఈ స్త్రీ మరొకరిని పెండ్లి చేసుకొని ఆ భర్తతో మూడు తలాఖ్‌లు పొంది యున్నదా?
6. వధువు పూర్వపు భర్తతో విడాకులు పొందినా, లేక వితంతువైనా నిర్ణీత కాల పరిమితి (ఇద్దత్) పూర్తి అయినదా?.
7. వధువుకి పూర్వపు భర్త వలన గర్భము ఏమైనా ఉన్నదా?
గమనిక : పెండ్లి తర్వాత సంసారములో కలహాలు ఏర్పడిన ఎడల భార్యా భర్తలు తమ తమ పెద్దల తీర్పుకి లోబడి ఉండవలెను.
వరుడి తరపు సాక్షి వధువుతరపు సాక్షి వధువు సంరక్షకుడిసాక్షి వధువు వరుడు
సంతకం సంతకం సంతకం సంతకం
సంతకం తేది. - పెళ్ళి చేసిన ఖాజీ / ప్రతినిది
5, 6, 7, 8 పేజీలలో వధువు, వరుడు, వారి తండ్రులు, సాక్షుల చిరునామా, వయసు, సంతకాలు ఉంటాయి. భరణం వివరాలు కూడా నమోదు చేస్తారు.
''ఇంగ్లీషులోన మ్యారేజీ
హిందీలో అర్ధము షాదీ
ఏ భాషలో ఏమన్ననూ
మన తెలుగులోన పెళ్ళి'' - ఆరుద్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి