18, జులై 2012, బుధవారం

తెలుగు వారి విశిష్టత


2.తెలుగు వారి విశిష్టత
* విశ్వామిత్రుడి కుమారులు కొందరు ఆంధ్రులనే పేరుతో దక్షిణాపథంలో నివశించారు.                                                    -ఐతరేయ బ్రాహ్మణమ్‌ 8:3.18(క్రీస్తు పూర్వము 500 సం||)
*ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడారు.    -సంస్కృత మహాభారతము
* మగధ చక్రవర్తి బలికుమారులలో ఒకడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించాడు. - గభావతం నవమస్కందం 23వ ఆధ్యాయం
*ఆంధ్రులు బౌద్ధ ధర్శాన్ని అవలంబించారు. -గిర్నర్‌, షాహబాజ్‌గర్‌, కాల్సీ ధర్శలిపి శాసనాలు
*ఉత్తరాన పూరీ జగన్నాధం, మధ్యన శ్రీశైలం, దక్షిణాన చోళదేశం తెలుగుదేశానికి ఎల్లలు.- శబ్దకల్ప ద్రుమమ్‌
* పోలికల్లో ద్రావిడజాతికి చెందిన వారైనా ఆంధ్రులు తమిళుల కంటే పొడగరులు, అందగాళ్ళు, సాహసులు మంచికర్షకులు, నిపుణులైన నావికులు.   -ఎన్‌ సైక్లోపెడియా ఆఫ్‌ బ్రిటానికా 1911
* తెలుగు వారు ఐరోపా ఖండ వాసులవలె నాగరికులు. వారిభాష ఇటలీభాష లాగా ఉంటుంది. - సి.పి.బ్రౌన్‌ 1857                                  
*కృష్ణా గోదావరీ నదుల నడుమ ప్రదేశాన్నుంచి వచ్చామని నంబూద్రీలు నమ్ముతారు. తెలుగుదేశపు ప్రజలకీ నంబూద్రీలకు చాలా పోలికలున్నాయి. - తిరువాన్కూరు జనాభాలెక్కలు 1937
*ఇప్పుడు మన రాష్ట్రంలో 7.8 కోట్లమంది, రాష్ట్రం వెలుపల 6.7 కోట్ల మంది కలిపి మొత్తం 14 1/2  కోట్ల జనం తెలుగు మాట్లాడుతున్నారు. సి.రాజగోపాలాచారి, బంగారప్ప, సినీనటుడు రాజ్‌కుమార్‌ల పూర్వీకులు తెలుగువారే. హోసూరు ఎమ్మెల్యే గోపినాధ్‌ తమిళనాడు అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి ముఖ్యమంత్రి జయలలిత నుండి తెలుగులో సమాధానం రాబట్టారు.- తుర్లపాటి కుటుంబరావు(దిహిందు 1-7-2003)
1901 జనాభాలెక్కల ప్రకారం తమిళనాడులో 9% ఉన్న తెలుగుజనం ఈనాడు 2%కు తగ్గిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి