6, జులై 2012, శుక్రవారం

10. అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు?!


10. అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు?!
                గుంటూరు జిల్లా డా కె.యల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు భూసేకరణ విభాగం`1, స్పెషల్‌డిప్యూటీ కలెక్టరు శ్రీ నూర్‌బాషా రహంతుల్లా, గుంటూరు జిల్లా కలెక్టరు గారికి ‘‘సమ్మతి అవార్డు’’ను తెలుగులో పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా పాలనా వ్యవహారాలు తెలుగులో జరపడానికి అధికారులందరూ  తమ శాయశక్తులా  కృషి  చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీ రహంతుల్లాను అభినందిస్తూ, దీనిని యథాతథంగా ప్రచురిస్తున్నాం.
సమ్మతి అవార్డు
(ఫారం`8)
శ్రీ నూర్‌భాషా రహంతుల్లా, యం.కాం., ప్రత్యేక పకలెక్టరు మరియు భూసేకరణాధికారి, భూసేకరణ విభాగము `1,
డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు, గుంటూరు వారిచే చేయబడిరది.
(ఆంధ్రప్రదేశ్‌భూసేకరణ చట్టం 11(2) సెక్షన్‌మరియు జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ నియమావళి 1998 (జి.ఓ.ఎం.ఎస్‌.382 (రెవెన్యూ) భూసేకరణ తేది. 4.6.1998)
                గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామం సర్వేనెంబరు 229/38 వగైరాలలోని 14.98 ఎకరాల భూమి డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాల పునారావాసం కోసం సేకరించబడుతుందని జిల్లా రాజపత్రంలో ప్రచురించబడిరది. భూసేకరణ అధికారులు ప్రకటించిన నష్టపరిహారం రేటు ఎకరా 1కి 3,32,910 రూపాయలు అంగీకరించక భూ యజమానులు ఎకరానికి 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం కోరారు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీకి నివేదించవలసినదిగా కోరారు. సంప్రదింపుల అనంతరం ఎకరాకు 6,65,820/` రూపాయల చొప్పున పరిహారం ఇవ్వడానికి కలెక్టరుగారు, తీసుకునేందుకు భూయజమానులు పరస్పరం అంగీకరించారు. అందువలన ఆంధ్రప్రదేశ్‌భూసేకరణ చట్టం 11/2, 31/2 సెక్షన్లు మరియు భూసేకరణ సంప్రదింపుల కమిటీ చట్టం 1992 ప్రకారం ఈ సమ్మతి అవార్డును జారీ చేయడమైనది. సెక్షన్‌18 ప్రకారం ఏ న్యాయస్థానములోనూ దావా వేయటానికి వీలు లేదు.
                1.            భూమి నికర విస్తీర్ణం       :         య. 13.96 సెం
                2.            ఎకరాకు 6,65,820/` రూపాయల చొప్పున మొత్తం భూమికి ఇచ్చే పరిహారం       
                                                :               రూ. 92,94,847/`
                3.            భూమి మార్కెట్‌విలువ (బి.ఎ.ఆర్‌. ఓ.సం. 90 పేరా 14(1)(ఐ)
                                నోట్‌1 ప్రకారం) భూమి కౌలు పూర్తిగా మదింపు చేయబడినప్పుడు
                                లేదా ఇండ్ల స్థలాలకైతే మార్కెట్‌విలువతో కాకుండా ఇతర
                                అన్ని స్థలాలకు చెట్లు భవనాలు, పంటలు మినహాయించి       :         ......................
                4.            ఈనాం భూములైతే (బి.ఎస్‌.ఓ.నెం.పేరా(14) (ఐ)(ఐ)
                                ప్రకారం ఈనాం సెటిల్మెంటు సమయంలో ఈనాందారుకు
                                అనుభవ హక్కు కింద నిర్ణయించబడిన నికర మదింపు విలువ :         .......................
                5.            బి.ఎస్‌.ఓ.నెం.90 పేరా 14(ఐ)(ఐ)లో ప్రస్తావించిన ఇతర
                                ఈనాం భూములైతే బి.ఎస్‌.ఓ.నెం. పేరా 14(1) నోట్‌2
                                ప్రకారం ఈనాందారు అనుభవ హక్కును కోల్పోయినందుకు గాను
                                ప్రభుత్వ మదింపుచేసిన శిస్తుకు 20 రెట్లు పరిహారం వర్తించదు  :         ......................
                6.            చెట్ల విలువ (కాయలు కాచేవి మరియు కాయలు కాయనివి)   :         ......................
                7.            కట్టడాల విలువ (బావులు, ఇళ్ళు మొదలైనవి          :         ........................
                                మొత్తము         :         రూ. 92,94,847 /`
(తొంభై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే)
అనుబంధం ` 1
సేకరణ భూమికి సరిహద్దులు
                వరు.    సర్వే     విస్తీర్ణం   పట్టాదారు పేరు   భూమికి సరిహద్దులు
                నెం.      నెం.                         త్తరం   పడమర          తూర్పు            దక్షిణం
                1.            229/38`4       1.00        పోతంశెట్టి గోపయ్య తండ్రి కొండయ్య 229/39  214         229/38`3               229/41
                2.            229/38`4       0.91        కన్నెగంటి రామయ్య తండ్రి నరసింహారావు   229/39  214         229/38`3               229/41
                3.            229/38`4       0.79        కొర్రపాటి శ్రీనివాసరావు తండ్రి రాములు       229/39  214         229/38`3               229/41
                4.            229/39`1బి       1.11        చల్లా పెదమస్తాన్‌రావు తండ్రి లింగయ్య       224         224         229/38`3               229/4
                5.            229/40`2               8.46        బత్తుల వెంకటరమణ భర్త కరీముల్లారావు    229/39  229/41  229/41  229/40`1
                6.            229/40`2               1.69        జంగం చెంచయ్య తండ్రి సుబ్బారావు 229/39  229/41  229/41  229/40`1
                                మొత్తము         13.96
అనుబంధం ` 2
పరిహారం పొందవలసిన భూ యజమానులు
                సర్వే     మొత్తం  క్లెయించేసిన   అవార్డుదారుని పేరు దాఖలు చేసిన హక్కు పత్రం         ప్రకటించిన
                నెం.      విస్తీర్ణం   విస్తీర్ణం            1బి      దస్తావేజు          10(1)      పరిహారం
                229/38`4       1.00        1.00        పోతంశెట్టి గోపయ్య తండ్రి కొమరయ్య         ....       255/66  ....           6,65,820/`
                229/38`4       0.91        0.91        కన్నెగంటి రామయ్య తండ్రి నరసింహారావు   ....       ....       ....       6,05,896/`
                229/38`4       0.79        0.79        కొర్రపాటి శ్రీనివాసరావు తండ్రి రాములు       902         ....           ....           5,25,998/`
                229/39`1బి       1.11        1.00        చల్లా పెదమస్తాన్‌రావు తండ్రి లింగయ్య       808         ....           ....           7,39,060/`
                229/40`2               8.46        8.46        బత్తుల వెంకటరమణ భర్త కరీముల్లారావు    ...        48/07     ....           56,32,837/`
                                                                                తేది      5.1.07
                229/40`2               1.69        1.69        జంగం చెంచయ్య తండ్రి సుబ్బారావు 600         ....           ....           11,25,236/`
                మొత్తము                  13.96                                                                     92,94,847/`
రూ. 92,94,847/` (తొంభై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే)
1.            అవార్డులో భాగంగా భూసేకరణ చట్టం సెక్షన్‌9 ప్రకారం పై అవార్డులందరికీ నోటీసులు అందజేయడమైనది.
2.            సేకరించదలచిన భూమి హద్దులతో కూడిన ప్లాను నాముందు ఉంది.
                                                                   భూసేకరణాధికారి మరియు ప్రత్యేక ప కలక్టరు,
                                                           భూసేకరణ విభాగము ` 1            డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు
                                                                                     గుంటూరు

స్పెషల్‌డిప్యూటీ కలక్టరు, భూసేకరణ విభాగము `1 డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు, గుంటూరు వారి త్తర్వులు
ప్రస్తుతం : శ్రీ నూర్‌భాషా రహంతుల్లా, యం.కాం.
ఫైలు సంఖ్య : 116/2008`సి1                                                                తేది 10.11.2008
                విషయము : భూసేకరణ ` సహాయం మరియు పునరావాసం ` డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టులో నిర్వాసితులకు పునరావాసం కోసం ఇండ్ల స్థలాల సేకరణ ` రాజుపాలెం మండలం ` రాజుపాలెం గ్రామం ` సర్వే నెంబరు 229/38`1 వగైరాలలో 13.96 ఎకరముల భూమి సేకరించడానికి సమ్మతి అవార్డు జారీ చేయడమైనది.
                సూచిక :1.           ముసాయిదా నోటిఫికేషన్‌ఆంధ్రభూమి, కృష్ణాపత్రిక, తేది 10.01.2008
                                 2.       5`ఎ విచారణ తేది 25.03.2008
                                 3.           ముసాయిదా డిక్లరేషన్‌, సాక్షి, తేది 20.05.2008 మరియు ఈనాడు తేది 20.5.2008
                                 4.       ప్రాథమిక విలువ నిర్ధారణ తేది. 26.7.2008
                                 5.           జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ ఎకరా రూ. 6,65,820/`లుగా విలువ నిర్ధారణ తేది 20.09.2008.
                                 6.           ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ) డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు, గుంటూరు వారి ఆర్‌.సి.నెం.1/395/08, తేది 7.11.2008
త్తర్వులు:
                పులిచింతల ప్రాజెక్టులో భూములు, ఇళ్ళు కోల్పోయి నిర్వాసితులౌతున్న వారి పునరావాసం కోసం రాజు పాలెం గ్రామం సర్వే నెంబరు 229/38`4 వగైరాలలో 14.98 ఎకరాల భూమిని సేకరించడానికి పై 1 నుండి 3 సూచికలలో ప్రతిపాదించడమైనది.
సర్వే మరియు సబ్‌డివిజన్‌ల పని
                ప్రతిపాదిత భూమి సర్వే మరియు సబ్‌డివిజన్‌రికార్డు స్క్రూటినీ అనంతరం ఇలా ూంది.
                సర్వే నెం.         వర్గీకరణ విస్తీర్ణము
                229/38`4       పట్టా     2.70
                229/39`1బి       పట్టా     1.11
                229/40`2               పట్టా     10.15
                మొత్తము                  13.96
సీలింగ్‌భూమి
                ఈ భూసేకరణలోని భూ యజమానులందరూ ఆంధ్రప్రదేశ్‌భూ సంస్కరణల (సి.ఒ.ఎ.హెచ్‌) చట్టం 1973 పరిధిలోకి రారు.
ముసాయిదా నోటిఫికేషన్‌:
                కలెక్టరుగారి ఆమోదం ఫైలు సంఖ్య జి1/5042/07, తేది 7.1.08, జిల్లా రాజపత్రం నెం. 3, తేదీ 10.01.2008 మొదటి పేపరు ఆంధ్రభూమి, రెండవ పేపరు కృష్ణా పత్రిక.
                అప్పటి భూసేకరణ అధికారి వారు మరియు రెవిన్యూ డివిజనల్‌అధికారి, గుంటూరు వారు 14.98 ఎకరాల భూమికి ముసాయిదాలో నోటిఫికేషన్‌ఇచ్చినారు. కానీ తదుపరి సబ్‌డివిజన్‌రికార్డు సమయములో వాస్తవముగా ఈ లబ్దిదారులు అనుభవంలో కల్గి న్న భూములు పరిశీలించగా 14.98 ఎకరాలకు బదులుగా 13.96 ఎకరాలుగా నిర్ణయించడమైనది.
ముసాయిదా డిక్లరేషన్‌
                కలెక్టరు గారి ఆమోదం ఫైలు సంఖ్య ఎ/395/08, తేది 15.5.08 మొదటి పేపరు ఈనాడు, తేది. 20.05.2008, రెండవ పేపరు సాక్షి తేది. 20.5.2008
5`ఎ విచారణ
                సెక్షన్‌5`ఎ ప్రకారం స్పెషల్‌డిప్యూటి కలెక్టరు, భూసేకరణ విభాగము`1, డా కె.యల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు, గుంటూరు వారి కార్యాలయములో తేది. 25.3.2008న విచారణ జరిగినది.
స్థల వివరణ
                రాజుపాలెం గ్రామంలో సేకరణ కోసం ప్రతిపాదించబడిన ఈ భూమి రాజుపాలెం మండల కేంద్రంలోనే ఉంది. అర కిలోమీటరు దూరంలో గుంటూరు`మాచర్ల రహదారి ఉంది. స్థలానికి విద్యుత్‌సౌకర్యం వెంటనే కల్పించే వీలు ఉంది. రైతులు ఈ భూమిలో మామిడి, బత్తాయి లాంటివి సాగుచేసుకుంటున్నారు. కొంత భూమి ఇళ్ళ స్థలాలకు లే అవుట్‌వేసి విడగొట్టి ఉంది.
చెట్లు మరియు కట్టడములు
                ఈ భూమిలో చెట్లు మరియు కట్టడములు ఏమియూ లేవు.
బేసిక్‌విలువ
                ఈ సర్వే నంబర్లలోని భూమి బేసిక్‌విలువ రూ. 66,000/`లుగా ఉంది.
భూమి విలువ నిర్ధారణ డి.యన్‌కు మూడేళ్ళ ముందు నుండి జరిగిన క్రయవిక్రయాలు
                నెం.      దస్తావేజు నెం./తేది         సర్వేనెం. విస్తీర్ణము         వర్గీకరణ క్రయ విలువ      ఎకరాకు రేటు
                1.            1009, 01.05.06    229/39`1               201.80   మెట్ట    38,500   9,23,389
                2.            1500, 10.04.07    229/39`1               243         మెట్ట    56,000   11,15,390
                3.            3138, 09.07.07    229/39`1               267.19   మెట్ట    61,500   11,14,309
                4.            3137, 09.07.07    229/39`1               267.68   మెట్ట    61,500   11,16,168
                5.            3136, 09.07.07    229/39`1               266.60   మెట్ట    62,500   11,16,504
                6.            3135, 09.07.07    229/39`1               269.85   మెట్ట    62.000   11,20,993
                7.            3133, 08.07.07    229/39`1               268.57   మెట్ట    62,000   11,17,325
                8.            942, 28.02.08     229/40`2               242         మెట్ట    56,000   11,20,000
                9.               48, 05.01.07     229/40`2               8.46        మెట్ట    4,65,500               55,023
                10.          3518, 30.07.07    229/39`1               0.24        మెట్ట    24,000   1,00,000
సమీప ప్రాంత మార్కెట్‌విలువ
                నోటిఫికేషన్‌కు ముందు మూడు సంవత్సరాల కాలంలో జరిగిన క్రయ విక్రయాల వివరాలు సబ్‌రిజిస్ట్రారు, పిడుగురాళ్ళ కార్యాలయం నుండి సేకరించాము. మొత్తం 10 వ్యవహారాలు జరిగాయి. వాటిలో 2 మాత్రం సేకరణ భూమి సమీపంలో జరిగాయి. వాటి వివరాలు
నెం.      దస్తావేజు నెం./తేది         సర్వేనెం. విస్తీర్ణము         వర్గీకరణ క్రయ విలువ      ఎకరాకు రేటు
                1.               48, 05.01.07     229/40`2               8.46        మెట్ట    4,65,500               55.023
                2.            3518, 30.07.07    229/39`1               0.24        మెట్ట    24,000   1,00,000
                క్రమసంఖ్య 1 నుండి 8 వరకు జరిగిన వ్యవహారాలు చాలా తక్కువ విస్తీర్ణాలకు జరిగాయి. పైగా ఎకరా రేటుకు రూ. 9 లక్షల పైబడి న్నాయి గనుక వదిలిపెట్టడమైనది.
                క్రమసంఖ్య 9,10 లోని క్రయాలు ఎక్కువ విస్తీర్ణానికి సేకరణ భూమి అదే సర్వే నెంబరులో జరిగాయి. 0.24 సెంట్లకు ఎకరా 1 లక్ష చొప్పున జరిగిన క్రయాన్ని (క్రమసంఖ్య 10) పరిగణనలోనికి తీసుకోవడం జరిగింది.
                బేసిక్‌విలువ       రూ. 66,000
                రిజిస్ట్రేషన్‌ప్రకారం అత్యధిక అమ్మకంవిలువ (30.07.2007న క్రయం)       రూ. 1,00,000
                ఈ భూమి రోడ్డు ప్రక్కన సౌకర్యవంతమైన స్థానంలో ఉంది. భూ యజమానులు స్వంత ఖర్చుతో సాగునీటి సౌకర్యంతో అభివృద్ధి చేశారు. భూసేకరణ వెంటనే జరగాల్సి ఉంది. ఇళ్ళ స్థలాలకు బాగా పనికొచ్చే విలువైన భూమి. సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయం ఈ భూములకు గజాల రేటులో లెక్కిస్తుంది. భూమి ఇప్పటికే లే అవుట్‌ప్లాట్లుగా విడగొట్టి ఉంది. సమీపములో తోటలు కూడా న్నాయి. భూమి గ్రామానికి దగ్గరలో ూంది. పైగా మండల కేంద్రం కూడా. కాబట్టి ఎకరా 1కి మార్కెట్‌విలువ రూ. 2,43,000/`గా నిర్ణయించడమైనది.
                నిర్థారించిన మార్కెట్‌విలువ ` ఎకరా రూ.  2,43,000
                30% సొలేషియం రూ.    72,900
                12% అదనపు మార్కెట్‌విలువ (డి.యన్‌. 17.01.2008నుండి)   రూ.    17,010
                నిర్ధారించిన ప్రాథమిక విలువ ` ఎకరాకు      రూ. 3,32,910
జిల్లాస్థాయి కమిటీలో నిర్ణయం
                రైతులు ఈ రేటుకు అంగీకరించలేదు. అందువలన కలెక్టరుగారి అధ్యక్షతన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీకి నివేదించడమైనది. 20.09.2008న జిల్లా కలెక్టరు గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశమై ఎకరానికి రూ. 6,65,820/` ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ రేటుకు భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు.
అవార్డు విచారణ
                భూసేకరణ చట్టం 9(1),10 సెక్షన్‌నోటీసులు రాజుపాలెం తహశీల్దారు, మండలాభివృద్ధి అధికారి, సబ్‌రిజిస్ట్రారు, స్టేషన్‌హౌస్‌ఆఫీసర్‌, గ్రామ పంచాయితీ మొదలైన ప్రభుత్వ కార్యాలయములో ప్రదర్శించడం జరిగింది. సెక్షన్‌9(3), 10ల ప్రకారం నోటీసులను భూ యజమానులకు కూడా అందజేసి 15.07.2008వ తేదీన అవార్డు విచారణకు హాజరు కావలసిందిగా కోరడం జరిగింది. 15.07.2008న భూ యజమానులు హాజరై వారి దగ్గర ూన్న యాజమాన్య హక్కు పత్రాలను ఈ క్రింది విధంగా సమర్పించారు.
                వరు.               అవార్డుదారు పేరు        సర్వే నెం.      క్లెయిం      మొత్తం  సమర్పించినహక్కుపత్రం   అవార్డుచేసిన
                నెం.                  తండ్రి/భర్త పేరు            చేసిన విస్తీర్ణం    విస్తీర్ణం   1బి      దస్తావేజు             మొత్తం
                1.            పోతంశెట్టి గోపయ్య తండ్రి కొండయ్య 229/38`4       1.00        1.00        ...            2651/66                6,65,820
                2.            కన్నెగంటి రామయ్య తండ్రి నరసింహారావు   229/38`4       0.91        0.91        ...            ...            6,05,896
                3.            కొర్రపాటి శ్రీనివాసరావు తండ్రి రాములు       229/38`4       0.79        902                         ...            5,25,998
                4.            చల్లా పెదమస్తాన్‌రావు తండ్రి లింగయ్య       229/39`1బి       1.11        1.11        808         ...            7,39,060
                5.            బత్తుల వెంకటరమణ భర్త కరీముల్లారావు    229/40`2               8.46        8.46        ...            48/07     56,32,837
                                                                                                                5.1.07
                6.            జంగం చెంచయ్య తండ్రి సుబ్బారావు 229/40`2               1.69        1.69        600         ...            11,25,236
                                                మొత్తము                  13.96                                     92,94,847
సబ్‌డివిజన్‌రికార్డు దాఖలా ఈ క్రింది ూదహరించబడిన సంబంధిత రైతులకు నష్ట పరిహారమును సంబంధిత అవార్డునందు పొందుపరచడమైనది.
1.            సర్వే నెంబరు 229/38`4, య.1.00 సెంట్లు, భూమివిలువ రూ. 6,65,820/`
                పట్టాదారు మరియు అనుభవదారు : శ్రీ పోతంశెట్టి గోపయ్య, తండ్రి కొండయ్య
                శ్రీ పోతంశెట్టి గోపయ్య, తండ్రి కొండయ్య ఈ భూమికి పట్టాదారు మరియు అనుభవదారు అయి ూన్నారు. అవార్డు విచారణకు ఇతను హాజరైనాడు. భూమికి తానే పట్టాదారుడనని, ఈ భూమిని పిడుగురాళ్ళ సబ్‌రిజిస్ట్రార్‌ఆఫీసులో రిజిస్టర్‌దస్తావేజు నెం. 2551/66, తేది 26.7.1966న శ్రీ మారబోయిన గురుస్వామి తండ్రి శీతయ్య గారి నుండి సర్వే నెం. 229/33`4ఎలో య.1.50 సెం. భూమిని కొనుగోలు చేసి, ఆనాటి నుండి యింతవరకు సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములతో అనుభవించుచున్నానని, పేర్కొని ూన్నారు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీలో నిర్ణయించిన భూమి విలువ ఎకరా 1 కి రూ. 6,65,820లు ఆమోదించి న్నాడు. ఈ భూమి నష్టపరిహారం విషయమై వేరెవరూ క్లెయిం చేసి ఉండలేదు. కావున రూ. 6,65,820లు పరిహారాన్ని పట్టాదారైన శ్రీ పోతంశెట్టి గోపయ్యగారికి యిచ్చుటకు నిర్ణయించడమైనది.
2.            సర్వేనెంబరు 229/38`4, య.0.91 సెంట్లు, భూమి విలువ రూ. 6,05,896/`
                పట్టాదారు మరియు అనుభవదారు : శ్రీ కన్నెగంటి రామయ్య, తండ్రి నరశింహారావు
                శ్రీ కన్నెగంటి రామయ్య, తండ్రి నరశింహారావు ఈ భూమికి పట్టాదారు మరియు అనుభవదారు. అవార్డు విచారణకు ఇతను హాజరుకాలేదు. ఈ భూమికి తానే యజమాని అనేందుకు రుజువుగా పాస్‌పుస్తకం గానీ, మరియు దస్తావేజులు గానీ దాఖలు చేసియుండలేదు. అతని తరఫున ప్రతినిధులు కూడా ఎవరూ రాలేదు. కాబట్టి ఈ విలువను రెవెన్యూ డిపాజిట్‌నందు ూంచాలని నిర్ణయించడమైనది.
3.            సర్వేనెంబరు 229/38`4, య. 0.79 సెంట్లు, భూమివిలువ రూ. 5,25,998/`
                పట్టాదారు మరియు అనుభవదారు : శ్రీ కొర్రపాటి శ్రీనివాసరావు, తండ్రి రాములు
                శ్రీ కొర్రపాటి శ్రీనివాసరావు, తండ్రి రాములు ఈ భూమికి పట్టాదారు మరియు అనుభవదారు. అవార్డు విచారణకు ఇతను హాజరైనాడు. భూమికి తానే పట్టాదారుడనని, అనుభవదారుడననీ ఈ భూమి తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన పిత్రార్జితమనీ నష్టపరిహారం తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. తానే ఈ భూమి యజమాని అనేందుకు రుజువుగా పాస్‌పుస్తకం మరియు దస్తావేజు నెం. 902ను దాఖలు చేశాడు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీలో నిర్ణయించిన రేటుకు తన భూమిని ఇచ్చేందుకు అంగీకరించాడు. ఇతనికి పోటీగా మరెవరూ ఈ భూమిని క్లెయిం చెయ్యలేదు కాబట్టి రూ. 5,25,998/`లు పరిహార మొత్తాన్ని ఇతనికి ఇవ్వడానికి నిర్ణయించడమైనది.
4.            సర్వేనెంబరు 229/39`1బి, య.1.11 సెంట్లు, భూమి విలువ రూ. 7,39,060/`
                పట్టాదారు మరియు అనుభవదారు : శ్రీ చల్లా పెద మస్తాన్‌రావు, తండ్రి లింగయ్య
                శ్రీ చల్లా పెదమస్తాన్‌రావు తండ్రి లింగయ్య ఈ భూమికి పట్టాదారు మరియు అనుభవదారు. అవార్డు విచారణకు ఇతను హాజరైనాడు. ఈ భూమికి తానే పట్టాదారుడనని, అనుభవదారుననీ ఈ భూమి తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన పిత్రార్జితమనీ నష్టపరిహారం తనకు ఇప్పించవలసిందిగా కోరారు. తానే ఈ భూమికి యజమాని అనేందుకు రుజువుగా పాస్‌పుస్తకం మరియు దస్తావేజు నెం. 808 దాఖలు చేశారు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీలో నిర్ణయించిన రేటుకు తన భూమిని ఇచ్చేందుకు అంగీకరించారు. ఇతనికి పోటీగా మరెవరూ ఈ భూమిని క్లెయిమ్‌చెయ్యలేదు. కాబట్టి రూ. 7,39,060/`లు పరిహార మొత్తాన్ని ఇవ్వడానికి నిర్ణయించడమైనది.
5.            సర్వేనెంబరు 229/40`2, య.8.46 సెంట్లు, భూమి విలువ రూ. 56,32,837/`
                పట్టాదారు మరియు అనుభవదారు : శ్రీమతి బత్తుల వెంకటరమణ, భర్త కరీముల్లారావు
                శ్రీమతి బత్తుల వెంకట రమణ, భర్త కరీముల్లా రావు ఈ భూమికి పట్టాదారు మరియు అనుభవదారు. అవార్డు విచారణకు ఈమె హాజరైనది. భూమికి తానే పట్టాదారుననీ, అనుభవ దారుననీ, ఈ భూమి తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన పిత్రార్జితమనీ, నష్టపరిహారం తనకు ఇప్పించవలసిందిగా కోరారు. తానే ఈ భూమికి యజమాని అనేందుకు రుజువుగా పాస్‌పుస్తకం మరియు దస్తావేజు నెం. 48/2007, తేది 5.1.2007ను దాఖలు చేసినది. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీలో నిర్ణయించిన రేటుకు తన భూమిని ఇచ్చేందుకు అంగీకరించినది. శ్రీమతి బత్తుల వెంకటరమణ రిజిస్టరు అయిన 8.46 ఎకరాల భూమిలో తనకు 1.69 ఎకరాల వాటా ూందనీ, ఈ భూమిని గురించిన తమ వ్యాజ్యం సి.యస్‌.ఆర్‌. 5639/2008 ప్రిన్సిపల్‌జూనియర్‌సివిల్‌జడ్జి, సత్తెనపల్లి వారి కోర్టులో నడుస్తున్నదనీ, అది తేలేదాకా పరిహార మొత్తాన్ని పంపిణీ చేయకుండా ఆపవలసిందిగా శ్రీ జంగం నల్ల కోటయ్య మరియు కిరణ్‌కుమార్‌అనేవారు 22.10.2008న పిటీషన్‌దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లో స్పెషల్‌డిప్యూటీ కలెక్టరును కూడా ప్రతివాదిగా చేర్చారు.
                కాబట్టి 8.46 ఎకరాల భూమిలో కోర్టు దావాలో న్న 1.69 ఎకరాలు మినహాయించి మిగతా 6.77 ఎకరాలకు రూ. 45,07,601 రూపాయల పరిహారం శ్రీమతి బత్తుల వెంకటరమణకు ఇవ్వాలని నిర్ణయించడమైనది. మిగతా 1.69 ఎకరాలకు రూ. 11,25,236 రూపాయల పరిహారం కోర్టు తీర్పు ఎవరి పక్షాన వస్తే వారికి ఇవ్వడానికి నిర్ణయించడమైనది.
6.            సర్వేనెంబరు 229/40`2, య.1.69 సెంట్లు, భూమి విలువ రూ. 11,25,236/`
                పట్టాదారు మరియు అనుభవదారు : శ్రీ జంగం చెంచయ్య, తండ్రి సుబ్బారావు
                నంబర్‌600 పాస్‌పుస్తకం ప్రకారం ఈ భూమికి శ్రీమతి జంగం శ్యామల, భర్త కీశే సుబ్బారావు గారు పట్టాదారు. ఈమె 19.07.2008న చనిపోయారు. ఆమెకు 1. జంగం చెంచయ్య, 2. జంగం రాంబాబు ఇద్దరు కుమారులని తహశీల్దారు, పిడుగురాళ్ళ వారు ధృవపత్రం ఇచ్చారు. (ఎల్‌.పరి.6/1, తేది 26.09.2008). ఈ భూమికి చెందిన నష్టపరిహారం శ్రీ జంగం చెంచయ్యగారు పొందుటకు సరిjైున వ్యక్తిగా తహశీల్దారు వారు ధృవీకరించి ూన్నారు. వీరు జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీలో ఆమోదించిన భూమి విలువ రూ. 6,65,820/` ఆమోదించి ూన్నారు. ఇతని సోదరుడు జంగం రాంబాబు నుండి నిరభ్యంతర వాంఙ్మూలము తీసుకున్న మీదట శ్రీ జంగం చెంచయ్య తండ్రి సుబ్బారావు గారికి నష్టపరిహారం యివ్వడానికి నిర్ణయించడమైనది.
వడ్డీ
                ఈ భూములు యజమానులు సమ్మతించాక, నష్టపరిహారం చెల్లించాకే స్వాధీపరచు కుంటున్నందుకు వడ్డీ చెల్లించడం అనే ప్రశ్న తలెత్తదు.
ఆదాయపన్ను
                వ్యవసాయేతర భూములపై కట్టడాలపై లక్ష రూపాయలు పైబడి ఆదాయం పరిహారంగా పొందే వారి జాబితాను ఆదాయపు పన్ను శాఖకు పన్ను విధింపు నిమిత్తమై పంపడం జరుగుతుంది గనుక మూలంలో పన్ను మినహాయింపు చేయడం లేదు.
క్లరికల్‌తప్పుల సవరణ సెక్షన్‌13ఎ (3)
                క్లరికల్‌తప్పుల మూలంగా ఎవరికైనా ఎక్కువ మొత్తం చెల్లించినట్లు కనుక్కుంటే అలా ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడానికి నిరాకరించిన వారి నుండి రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం సదరు మొత్తాన్ని రాబట్టడం జరుగుతుంది.
యాజమాన్య హక్కు మార్పిడి నమోదులు
                యాజమాన్య హక్కుదారుల పేర్లను మారుస్తూ శాశ్వత రెవెన్యూ రికార్డుల్లో రాజుపాలెం తహశీల్దారు నమోదులు చేయవలసి ఉంది.
నిధులు
                హైదరాబాదు ఇంజనీరు ఇన్‌ఛీఫ్‌ఈ సేకరణకు అవసరమైన నిధులు సమకూర్చారు. కాబట్టి ఇకమీదట ఈ 13.96 ఎకరాల సేకరించబడ్డ భూమి ఎగ్జిక్యూటివ్‌ఇంజనీరు, పులిచింతల ప్రాజెక్టు, డివిజన్‌నెం. 4, సత్తెనపల్లి వారి యాజమాన్యంలోకి మారిపోతున్నది.
                పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రూ. 92,94,847/`(రూపాయలు తొంభై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే) ముసాయిదా అవార్డును 13.96 ఎకరాలకు పాస్‌చేయడమైనది. ఈ మొత్తాన్ని ఈ క్రింద చూపిన ప్రభుత్వ శాఖలనుండి రాబట్టాలి.
నిధుల కేటాయింపు
నిధులు కేటాయించిన అధికారి     ఎల్‌.ఓ.సి. ద్వారా కేటాయించినమొత్తం   ఖాతా పద్దు
ఇంజనీరు ఇన్‌చీఫ్‌, నీటి పారుదలశాఖ ఎర్రమంజిల్‌, హైదరాబాద్‌                    రూ. 5.46 కోట్లు  
MH-4701,Col.on M&MI
01-Major Irrigation
MH-128, Pulichintala Project
GH-11, Normal State Plan
GH-500-501 Compensations
         
10.11.2008న బహిరంగ కోర్టులో ప్రకటించడమైనది.
                నూర్‌బాషా రహంతుల్లా      భూసేకరణాధికారి మరియు ప్రత్యేక ూప కలక్టరు,
                భూసేకరణ విభాగము ` 1   డా కె.ఎల్‌.రావు సాగర్‌(పులిచింతల) ప్రాజెక్టు                 గుంటూరు
                                                       (జనవరి, 2009, పాలనాభాష (సమాచారనేత్రం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి