18, జులై 2012, బుధవారం

తమిళ నాయకుల్నిచూసైనా నేర్చుకోవాలి!


19.తమిళ నాయకుల్నిచూసైనా నేర్చుకోవాలి!
                ''తమిళాన్ని శాస్త్రీయ భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశ భాషల్లో ఈ తరహా హోదా పొందిన తొలిభాష ఇదే. ప్రాచీనత, ఘనతను బట్టి సంస్క ృతంతో సహా మరిన్ని భాషలకు ఈ గుర్తింపు నివ్వాలని యోచిస్తున్నారు. ఇందుకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. సంబంధిత భాషకు కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉండాలి. ఆ భాషలోని సాహిత్య ప్రక్రియ తనదైన శైలిలో ఉండాలి. అరువు తెచ్చుకున్నది కాకూడదు వీటితోపాటు మరికొన్ని పరిమితులకులోబడి... సాహిత్య అకాడవిూలోని ఓ నిపుణుల బృందం భాషల ''శాస్త్రీయత''ను నిర్ణయిస్తుంది. శాస్త్రీయ భాషలకు చెందిన పండితులకు రెండు అంతర్జాతీయ పురస్కారాలు ఇవ్వాలని కూడ కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది''.(ఈనాడు 18-9-2004)
                ''ఈ శాస్త్రీయ భాషపై పరిశోధన విద్య కోసం ఒక కేంద్రాన్ని నెలకొల్పాలని, కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింటిలో ఆచార్య పీఠాలను నెలకొల్పాలని యు.జి.సి.ని కోరినట్లు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు.''(ది హిందూ 18-9-2004)
                27-5-2004న ఐక్య ప్రగతిశీల కూటమి ఉమ్మడి కనీస ప్రణాళికలో తమిళాని కిచ్చిన హావిూ కేవలం నాలుగు నెలల్లోనే అమలయ్యేలా తమిళ మంత్రులు కృషి చేశారు. భాషల శాస్త్రీయతను నిర్ణయించే సాహిత్య అకాడవిూ నిపుణుల బృందం దేశంలోని అన్ని భాషల నుండి ప్రతిపాదనలకు ఎప్పుడు స్వీకరించింది? అతి ప్రాచీనమైన సంస్క ృతాని కంటే, దేశంలో రాజభాషగా రుద్దబడుతున్న హిందీకంటే, ముందుగానే తమిళాన్ని శాస్త్రీయ భాషగా గుర్తించటం వెనుక తమిళ మంత్రుల వత్తిడి తప్పని సరిగా ఉంది. వారి భాషకు వారు గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు ఎవరూ విచారపడనక్కర లేదు. కానీ మన తెలుగు భాషకు కూడా అలాంటి గౌరవం దక్కాలని మన తెలుగు మంత్రులు గట్టిగా అడగాలి. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగారు అసెంబ్లీలోనూ ప్రజలతోను మంచి తెలుగులో మాట్లాడుతున్నారు. ఎంత క్లిష్టమైన విషయమైనా అతిసాధారణమైన తెలుగు భాషలో ఆయన మాట్లాడటం తెలుగు నాయకులందరికీ ఆదర్శనీయం.
                మన స్పీకర్‌ సురేష్‌రెడ్డి గారికి, కేంద్ర సమాచారశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి గారికి తెలుగుకంటే ఇంగ్లీష్‌ బాగా వస్తుందేమో అనిపిస్తుంది. మరివాళ్ళు చదివిన చదువులు అలాంటివి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియం కూడా కొన్నిచోట్ల మొదలుపెట్టారు. భవిష్యత్తులో ఇక మనకొచ్చే నాయకులు పూర్తిగా ఇంగ్లీషులోనైనా మాట్లాడుతారు, లేదా ''తెల్గిష్‌'' (50% తెలుగు 50% ఇంగ్లీష్‌) లేదా ''తెంగ్లీష్‌'' (10% తెలుగు 90% ఇంగ్లీష్‌)లోనైనా మాట్లాడుతారు. తెలుగుకు శాస్త్రీయ భాష హోదా రావటం మాట దేవుడెరుగు, ఉన్నా ఆ కొద్దిపాటి తెలుగు కూడా ఊడ్చుకుపోయే దుర్దశ దాపురించింది. మన భాషను మనమే పాడుచేసుకుంటూ పోతున్నాం.
                ఒక భాషకు శాస్త్రీయత కేవలం ప్రాచీనతను బట్టి మాత్రమే రాదు. ఆ భాష ప్రజల వాడకానికి అనువుగా ఉండాలి. వారి దైనందిన వ్యవహారాలలో ఆ భాష విరివిగా చలామణీ కావాలి. శాస్త్ర సాంకేతిక రంగాలలో తగిన పారిభాషిక పదాలు ఆ భాషలో పుట్టాలి. పాలనారంగం అంతా ఆ భాషలోనే నడవాలి. ప్రజల మనస్సు, వాక్కు, కర్మలన్నీ ఆ భాషతో నిండాలి. అప్పుడే ఆ భాషకు ఘనత, శక్తి, అలవోకగా వస్తాయి.
                ఇటీవల ఒరిస్సాలోని గోపాలపురం బీచ్‌కెళ్ళాను. అక్కడ చేపలు పట్టే వాళ్ళంతా తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్ళు పట్టిన చేపలన్నింటికీ కోనాలు, పారలు, చందువాయలు, మొదలైన పేర్లుపెట్టి పిలుస్తున్నారు. ఈ పేర్లు మన తెలుగు నిఘంటువుల్లో కనబడవు. భాషకు శక్తిరావాలంటే నిఘంటువు పెరగాలి. ప్రజలు మాట్లాడే ఏ పదాన్నీ నిఘంటువు వదలిపెట్టకూడదు.
                హైదరాబాద్‌లోని ''ఫ్లైఓవర్‌''లను చూసి కొందరు పల్లెవాసులు ''పైదారులు'' అన్నారు. తాను చూసిన వస్తువుకు తన భాషలో ప్రతి మనిషీ ఒకపేరు పెట్టుకుంటాడు. ఆ పేరును గౌరవించి నిఘంటువులో చేర్చుకున్న జాతి, ఆజాతి భాషలు బలపడ్డాయి. రాజ్యాలు ఏలాయి. ఇది చరిత్ర నేర్పిన సత్యం.  మన పాలకులు, సాహితీవేత్తలు, అధికారులు ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు నడవాలి.
                ఇప్పుడు గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలకు పరీక్షలు జరగబోతున్నాయి. డిగ్రీ తెలుగు విూడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి.

 .http://www.ap7am.com/lv-88987-special-story-telugu-faces-trouble-in-tamilnadu.html
 ప్రపంచ తెలుగు మహాసభలు జరపదలచిన నాయకులు అసెంబ్లీలో  2.12.2012 న కూడా ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాను గురించిన చర్చ అంతా ఆంగ్లంలోనే జరిపారు.వాస్తవానికి సభాపెద్దలు ఇంగ్లీషే తమ మాతృభాష అన్నంత హాయిగా అనర్గళంగా మాట్లాడుతున్నారు.తెలుగు పదాలకోసమే వెతుకులాడుతున్నారు.ఇంగ్లీషు పదాలతో కూడిన తెలుగు మాట్లాడినా బాగుండేది కానీ "దోస్ హూ సపోర్ట్..కెన్ సే ఆయ్"..ఇలా మొత్తం ఆంగ్లమే.చట్ట నిర్మాతలు తెలుగు పేర్లు పెట్టుకున్న ఆంగ్లేయుల్లాగా కనిపిస్తున్నారు.తమిళనాట తమిళాన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తూ మిగతా భాషలను తొక్కేస్తున్నారని హోసూరు ఎమ్మెల్యే తెలుగులో ఆవేదన చెందితే మన శాసనసభలో ఆంగ్లాన్ని నెత్తిన మోస్తూ తెలుగును కసిరివిసిరి అవతల పారేస్తున్నారు.తెలుగు నాయకుల ఈ ధోరణి మారాలి.క్రమేణా తెలుగుకు అలవాటుపడాలి.తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలలో గోపీనాద్ గారికి "తెలుగు అధికార భాష కావాలంటే..",తెలుగు దేవభాషే " పుస్తకాలను అందజేశాను.
 http://nrahamthulla3.blogspot.in/2012/02/blog-post.html

 https://www.facebook.com/photo.php?fbid=614985771866750&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

తమిళనాట తెలుగు బావుటా 
 తమిళంలో ఉన్న తిరుప్పావై తెలుగునాట విష్ణుభక్తులు పాడినట్లే తెలుగులో ఉన్న త్యాగరాయ కీర్తనలను తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సంగీత కళాకారులందరూ పాడగలరు. పొట్టి శ్రీరాములు నిరా హారదీక్ష చేసి మరణించి, తెలుగుకు గుర్తింపు తెచ్చినా, తమిళనాట ఉన్న తెలుగువారు అక్కడే ఉన్నారు తప్ప, అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి రాలేదు.క్రీస్తుపూర్వం నుంచి తెలుగు వారు తమిళ ప్రాంతాలకు వెళ్ళారు. తమిళ నాడుకు తెలుగువారి వలస క్రీ.శ. 6వ శతాబ్దం పల్లవుల రాజ్యపాలన కాలం నుంచి ఉంది. శాతవాహనులు (క్రీ.పూ. 270) 13వ శతాబ్దంలో కాకతీయులు తమిళ నాడును పరిపాలించారు.తమిళనాట చోళ వంశం, తెలుగు రాజ్యమేలుతున్న చాళుక్య వంశం వియ్యం అందుకున్నాయి. దానితో వలసలకు ప్రోత్సాహం లభించింది. ఆ తరువాత కాకతీయుల కాలంలో తమిళనాట తెలుగు రాజ్యానికి మంచి పునాదులు ఏర్పడ్డాయి.15వ శతాబ్దం కృష్ణదేవరాయల ఏలుబడిలో 'తెలుగు వారికి స్వర్ణయుగం' అయింది. నాయక రాజులు, తంజావూరు ప్రాంతాలను పాలించి, తెలుగు సాంస్కృతిక వైభవానికి వన్నె తెచ్చే విధంగా, కవులను కళలను, కళారూపాలను పోషించి ఆదరించారు.తంజావూరును పాలించిన మరాఠా రాజ వంశీయులు 'సాహాజీ'లు కూడా తాము కవులై తెలుగులో యక్షగానాలు రచించారు.తంజావూరుసరస్వతీ గ్రంథాలయం తెలుగువారి సారస్వత భాండాగారంగా పేర్కొనవచ్చు.రెండవ 'సాహజీ' కాలంలో 1810 ప్రాంతాలలో బ్రిటీష్‌వారి సహకారంతో ఈ లైబ్రరీని దర్శించి, అందులో అప్పటికే శిథిలమై పోతున్న అనే తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేశారు. దాదాపు 10 వేల సంస్కృత తాళపత్ర గ్రంథాలు, 3 వేలకు పైగా తెలుగు సాహిత్య, సంగీత గ్రంథాలు ఇందులో ఉన్నాయి. ఇది మనకు సంబంధించి ఒక 'ప్రాచీననిధి', మన సంపద . తంజావూరు 20 కి.మీ.లలో మేలట్టూరు అనే యక్షగాన నాటక కళాకారులుండే గ్రామం .అక్కడకు 20 కి.మీ.లలో తిరువయ్యూరు ఉన్నాయి. భారతదేశం గర్వించతగ్గ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి నివసించిన ఊరు అది. అక్కడే కావేరి ఒడ్డున వారి సమాధి ఉన్నాయి.మేలట్టూరు భాగవత నాటకాలు 15వ శతాబ్ది నుంచి ప్రారంభమై, ఇప్పటి వరకు అజరామంగా నిలిచినాయి. కృష్ణదేవరాయ భార్య తిరుమలాంబ నాట్యకత్తె, మేలట్టూరు నివాసి. అందువల్ల వీరు తెలుగులోనే సాహిత్యం రూపొందించుకుని, కర్ణాటక సంగీత బాణీలో, భరతనాట్య సంప్రదాయంలో చక్కటి నాటకశైలిలో నడిచే నృత్య నాటకాలు ప్రదర్శిస్తుంటారు.అచ్యుతప్ప నాయకుడు వీరికి ఆ గ్రామం భరణంగా ఇచ్చారు.1810 ప్రాంతాలలో ఉన్న వేదం వెంకట్రాయశాస్త్రి గారిని వారి నాటకాల ఆధునీకరణకు కారణంగా చెపుతారు.ఈ నాటకాల తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. వారిది పురాతన తెలుగు నాటకశైలి. వీరు తెలుగులో పాడతారు.రాయడం మాత్రం తమిళంలో రాస్తారు. ఈ నాటక సంప్రదాయాన్ని తమిళ ప్రభుత్వం ఆదరించలేకపోవడానికి ఒక కారణం - అవి తెలుగులో ఉండడమే! తమిళంలో మార్చడానికి వీలుపడదు. వెంకట్రామ శాస్త్రిగారి నాటకాలే కన్యాశుల్కానికి ప్రేరణ అని గురజాడవారు పేర్కొన్నారు. మగవారు ఆడవేషం వేసిన, మేలట్టూరు నాటకాలు చూసి, మధురవాణి అనే పాత్రను కన్యాశుల్కానికి నాయకుడిని చేశారు గురజాడవారు. మన సాంస్కృతిక శాఖ ఈ మేల ట్టూరును మనదిగా చేసుకోవలసిన అవసరం ఉంది.త్యాగరాజ సమాధి స్థలం తిరువయ్యూరు తెలుగు గ్రామం. 16వ శతాబ్దపు తంజావూరు సంగీత సోద రులు వెంకట మఖి, క్షేత్రయ్య ఇత్యాదులు త్యాగరాజు కాలానికి పూర్వం అచ్చమైన తెలుగు సంగీత సంప్రదాయానికి పునాదులు వేశారు. త్యాగరాజస్వామి తెలుగులో రాసి, తెలుగుభాషకు ఉన్నతిని చేకూర్చారు.ఆయనకు సరైన స్మృతి నిర్మాణాన్ని చేపట్టి, తెలుగు జాతి ఆయన ఋణం తీర్చుకోవాలి.---'కళామిత్ర' ఆర్‌. రవిశర్మ, 'నాటక కళ' సంపాదకులు ప్రజాశక్తి 18.12.2013
 https://www.facebook.com/nrahamthulla/posts/681481355217191?notif_t=like

 (ఈనాడు 30.8.2015)

(ఈనాడు 2.9.2015)

1 కామెంట్‌: