6, జులై 2012, శుక్రవారం

20. అన్ని భాషలూ దేవభాషలే


20. అన్ని భాషలూ దేవభాషలే

                ఖురాను గ్రంధాన్ని వివిధ భాషలలోనికి అనువాదంచేసి దైవసందేశాన్ని సర్వభాషల వారికి అందించాలని ఎందరో మహాత్ములు విశ్వ ప్రయత్నం చేశారు. కొందరు తమ ప్రయత్నంలో సఫలులుకాగా మరికొందరు మత చాందసుల చేతిలో హింసించబడ్డారు. ఖురాను గ్రంధాన్ని ఏ భాషలోనికీ అనువదించకూడదని మూర్ఖంగా వాదిస్తూ హత్యలకు తలపడినవారూ కొన్ని దేశాలలో ఉన్నారు.
                సర్వభాషలూ దేవునివే అని ఒక ప్రక్క చెబుతూనే మరో ప్రక్క అరబ్బీ భాషను సర్వజనంపై నిర్భంధంగా రుద్దజూస్తున్న వారి బెడద నేడు తీవ్రమైంది. ఖురాను గ్రంధం సర్వమానవాళి కోసం వచ్చిందని చెప్పేవారే ఆ మానవాళికి దేవుడు వివిధ మాతృభాషల నిచ్చాడని మరిచిపోయి అరబ్బీని తప్పనిసరి చేస్తున్నారు.
                ప్రతి ప్రవక్తకూడా తన మాతృభాషలోనే మత ప్రచారం చేసేవారు. అసలు దైవసందేశం కూడా ప్రవక్తల యొక్క మాతృభాషలోనే వచ్చేది. ఎందుకని? ప్రవక్తకు ముందు అర్ధం కావాలి. ఆ తరువాత ఏ ప్రజలకైతే  చెప్పబోతున్నాడో ఆ ప్రజలకు అర్ధం కావాలి. అర్ధమయ్యిందే మతం.
                ఈ మర్మం ఖురాను లోనే విప్పి చెప్పబడింది. ఖురానును దేవుడు అరబ్బీ లోనే ఎందుకు పంపాడు?
''నీకు అర్థం కావాలని ఖురానును అరబ్బీభాషలోనే పంపాము.''  (ఖురాను 12:2)
                మేము ఖురానును అరబ్బుకాని వారికెవరికైనా పంపిన తరువాత వారు దాన్ని చదివి అరబ్బులకు వినిపిస్తే వారు దాన్ని నమ్మరు (ఖురాను 26 :198, 199.).
                అరబ్బులు గ్రహించడం కోసం అది ఖురానుగా చేయబడింది. '' మీరు గ్రహించటం కోసం మేము అరబ్బీ ఖురానుగా చేసితిమి '' (ఖురాను 43 :2,3).
                 మరి తెలుగు వాళ్ళు గ్రహించాలంటే అది తెలుగు ఖురానుగా చేయబడవద్దా? ఖురాను అరబ్బీలో ఎవరికోసం వచ్చింది?
                ''నీవు మక్కావారిని చుట్టుపక్కల ఉన్నవారిని హెచ్చరించటం కోసం అరబ్బీ భాషలో ఖురాను ను నీవద్దకు పంపాము.'' (ఖురాను 12:7)
                మరి మచిలీపట్నం వారిని హెచ్చరించాలంటే అరబ్బీ భాషలో ఎంత అరచినా వారికి అర్థంకాదు, ''దేవుని తీర్పు సింహాసనం ముందు మనమంతా ఒక రోజు నిలబడతాము'' అని తెలుగులో చెప్పి హెచ్చరించవచ్చు గదా! అర్థం కాని కర్మకాండ బండెడు చేసేకంటే అర్థవంతమైన సత్క్రియ ఒక్కటేచాలు.
                స్వర్గప్రాప్తి కోసం మనిషి చేయవలసింది ఏమిటి?
                '' దేవుడే మాప్రభువు అని, ఎవరు సద్వర్తనులై ఉంటారో వారికి ఎలాంటి భయంగాని దుఖం గాని లేవు. వారు స్వర్గనివాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అది వారు చేసుకున్న కర్మల ఫలితం.'' (ఖురాను 46:13,14)
                అంటే సత్క్రియల ఫలితమే స్వర్గం! ఈ పరమ సత్యాన్ని అన్నిమతాలు బోధిస్తున్నవి. వివిధ ప్రాంతీయ భాషలలోనికి చొచ్చుకొని వెళ్ళి, ఆయా ప్రజల సంస్కృతిని దెబ్బతీయకుండా వారివారి భాషల్లోనే ''ఏకేశ్వరోపాసన'' వ్యాప్తి చేయవచ్చు. అర్థం కాని, అరబ్బీని ఆంధ్రముస్లింలపై రుద్దటం కంటే ....... తెలుగులోనే వారిని ఖురాను చదువుకోనివ్వటం, నమాజు చేసుకోనివ్వటం, వివాహాలు జరుపుకోనివ్వటం మేలు. ఈ విషయంలో సంస్కరణలు జరగాలి.                                      (ఆంధ్ర పత్రిక 19.7.87)

                మానవ నిర్మితమైన పారంపర్యాచారాలను నిలుపుకోవాలనే తలంపుతో, దైవోపదేశాలను వదిలివేసి, కేవలం మన హేతుబుద్ధితో అగోచర విషయాలను తర్కించబూనటం అవివేకం అవుతుంది. (ఇమ్రాన్‌: 7)
                అరబీ భాష అత్యున్నతమైనదే కావచ్చు. అది అర్థం అయ్యే వారికే దాని గొప్పతనం తెలుస్తుంది. అందరికీ అదే భాషను అవశ్యం చెయ్యటం కంటే ఆ భాషలో వెలువడిన దైవ సందేశాన్ని అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పటం వివేకవంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ద్రుష్టిలో కూడా భాషకంటే భావమే విలువైనది. 
                ఖురాన్‌బోధ చాలా సులువైనది.     (చంద్రుడు 17,22,40)
                కానీ ప్రపంచంలోని కోట్లాది అరబ్బేతరులకు అది అర్థం కాని మంత్ర పఠనం లాగా ఎందుకు ఉంది? కేవలం ఆ మహా ఘనత గల దైవ సందేశాన్ని (కహఫ్‌:1) అరబీ భాషలో బంధించటం వల్లనే కదా?
                'ఏ జాతి వారి తాత ముత్తాతలకు భయబోధ చేయబడలేదో వారిని భయపెట్టటం కోసం ఈ అరబ్బు ప్రవక్తగా పంపబడ్డారు. (యూసీన్‌: 6)
                ఈ అరబ్‌ప్రవక్త తెచ్చిన భయబోధ ఆ జాతి వారికే పరిమితమై ఉంటుందని, అరబ్బేతరులకు వర్తించదని ఎవరైనా చెప్పగలరా? అందరికీ వచ్చే భాష అందరికీ అర్థమయ్యే భాష ఏది?
                ''వీళ్ళు గ్రహించటం కోసం ఈ కురాన్ను నీ భాషలో సులువుగా చేశాము'' (పొగ : 58)
                అంటే అరబ్బులు తప్ప ఇతర భాషల జనం దాన్ని గ్రహించకూడదని దేవుని భావం కాదు. ప్రవక్త అరబీయుడు, అతని స్వజనం అతని మాటలు వినాలంటే అతని భాషలోనే దైవ సందేశం రావాలి. ప్రవక్తకే అర్థం కాని భాష ప్రవక్త జాతి ప్రజలకు అర్థం ఎలా అవుతుంది?
                ఒకవేళ దేవుడు పరాయి భాషలను అర్థం చేసుకునే అద్భుత శక్తిని ప్రవక్తకు ఇచ్చి సందేశాన్ని పంపినప్పటికీ ఆ జనం ''అరబ్బీ ప్రవక్త - అర్థంకాని అజమీ కురాన్‌'' అని ఎగతాళి చేస్తారు.    (సజ్దా : 44)
                అరబ్బేతరుడు అరబీలో ప్రవచిస్తూ వస్తే అతన్నీ నమ్మరు (కవులు :198, 199)
                అందువలన ప్రవక్త స్వభాషలోనే ప్రవచనం రావటం ఎంత ఆవశ్యకమో ఆ ప్రవచనం ఆయా ప్రజల మాతృభాషలలోనే వారికి అందించబడటం కూడా అంతే అవసరం. అద్వితీయ దేవుని గురించి అరబ్బులకు అరబీలో చెబుతుంటేనే, ''నీ మాటలు మా హృదయాల్లో దూరవు. మా చెవులు చెవిటివైపోయాయి. నీకూ మాకూ మధ్య పెద్ద తెర ఒకటి అడ్డంగా ఉంది, నీ దారి నీదీ మా దారి మాదీ'' అన్నారు.          (హామీం : 5)
                అరబ్బేతరులకు అరబీలో చెప్పి ఒప్పింపచేయటం అలవి అయ్యే పనేనా? రాజ్యాధికారం పొందిన ఆంగ్లేయులు ఇంగ్లీషును అందరిమీదా రుద్దినట్లు అరబీని అందరికీ అంటగట్టగలిగితేనే అది సాధ్యం అవుతుంది.
                అయినా ఇక్కడ సమస్యను చిటికెలో తీర్చగల సర్వలోకాల ప్రభువు కురాన్ను అరబీలో పంపిన ఉద్దేశం వెల్లడించాడు. అది విశ్వాసులకు స్థిరత్వం ఇవ్వాలి, సన్మార్గం చూపించాలి, సువార్త వినిపించాలి.        (తేనెటీగ : 103)
                నమాజులోకానీ, మరో చోట కానీ అరబీ కురాన్‌వింటుంటే మనకు పై మూడు ప్రయోజనాలు కలగటం లేదు, తెలుగు కురాన్‌ద్వారా అవి మనకు సిద్ధిస్తున్నాయి. నిశ్చయంగా కురాన్‌మనను కష్టపెట్టడానికి గాక మనకు బోధ చెయ్యడానికే వచ్చింది (ఓ మానవుడా:2,3).
                ప్రతి ప్రవక్త కూడా తన మాతృభాషలోనే దైవ సందేశం ప్రచారం చేసేవాడు. దైవసందేశం కూడా ప్రవక్తల మాతృభాషలోనే వచ్చేది. ఎందుని? ముందు ప్రవక్తకి అర్థం కావాలి. ఆ తరువాత ఏ ప్రజలకైతే చెప్పబోతున్నాడో ఆ ప్రజలకూ అర్థం కావాలి. అర్థమయ్యిందే సరైన మతం. ఈ మర్మం కురానులోనే విప్పిచెప్పబడింది. 
                కురానును అల్లా అరబ్బీలోనే ఎందుకు పంపాడు?. ''ప్రవక్తకు అర్థం కావడానికి'' (కురాను 12:2) 2. ''అరబ్బులు గ్రహించటం కోసం'' (43:2,3). 3. ''మక్కా చుట్టుపక్కల ఉన్నవారిని హెచ్చరించటం కోసం'' (కురాను 12:7). మరి మన తెలుగువాళ్ళు గ్రహించాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, హెచ్చరిక పొందాలన్నా అది తెలుగులోనే సాధ్యం. మాటిమాటికి పఠించే వాక్యాలు ప్రతి ప్రార్ధనలో మనకు బోధ చేస్తూ ఉండాలి. అది మన మాతృభాషలోనే మనకు సాధ్యమవుతుంది.
మనిషిని ఉద్ధరించగల ప్రార్థనలో 4 ముఖ్య విషయాలున్నాయి :-
1.            మనల్ని చూస్తున్న దేవుని ముందు మనం నిలబడ్డామని గ్రహించాలి.
2.            ఆయన గొప్పతనం మన హీనత్వం గుర్తించాలి.
3.            ఆయన మనల్ని ప్రేమించి సహాయం చేయజూస్తున్నాడని తెలిసికొని అడగాలి.
4.            మనం అడిగేదేమిటో మనకు అర్థమై ఉండాలి.
                ఇలా చేసే ప్రార్థన మనల్ని దేవునికి సన్నిహితులుగా మారుస్తుంది. పాపకార్యాలకు పాల్పడనీయదు. దుష్టతలంపులను కలుగనీయదు. దేవుని సర్వోన్నతను పదే పదే గుర్తు చేస్తుంది. క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవునిపై ఆధారపడే స్వభావాన్ని పెంచుతుంది. దేవుని ప్రీతికోసం ఎట్టి త్యాగానికైనా తగిన తెగింపును ఇస్తుంది. మరి ఇదంతా నైతికమైన సముద్ధరణే గదా?
                'నిశ్చయంగా నమాజు సిగ్గుమాలిన పనుల నుండి అధర్మకార్యాల నుండి ఆటంకపరుస్తుంది'' (సాలెపురుగు : 46)
ఈ వచనాన్ని గురించి అబ్దుల్‌గఫూర్‌గారు ఇలా వ్యాఖ్యానించారు.
                ''నమాజు చాలా మహిమగలది. దానిని నియమముగా భక్తి పూర్వకముగా చేసినచో అది భక్తులను సిగ్గుమాలిన పనులనుండి పాపకార్యముల నుండి మానిపించును. దుర్గుణములను తొలగించి మంచి గుణములను కలిగించుట దాని స్వభావము. ఎట్లు మందును నియమముగా పథ్యముతో సేవించిన రోగము పోయి ఆరోగ్యము చేకూరునో, అట్లే నమాజు సలుపుచు దానికి విరోధ కార్యములను మానుకొనినచో, ఆత్మ సంబంధమైన రోగములు అను దుర్గుణములు నశించి, ఆత్మకు ఆరోగ్యము అనెడి సుగుణములు అలవడును. భక్తుడు పాపములు వదలుకొనును, దొంగ భక్తి వలన పాపములు తొలగనిచో అది వాని తప్పుయే. కాని నమాజు చేసి నమాజు ముగించిన పిదప పాప కార్యములు చేయువాడు మాట తప్పిన వాడగును. అట్లు చేయవలదు అని నమాజు హెచ్చరించు చుండును.
''నేను జిన్నాతులను మానవులను పుట్టించినది వారు నన్ను ఆరాధించుట కొరకే'' (51:56)
                అంటే మనిషి జీవిత ఉద్దేశమే దైవారాధన. మీరు నన్ను పోషించనవసరం లేదు. నాకు అన్నం పెట్టనక్కరలేదు. నేనే మీకు అవన్నీ ఇస్తాను. నా ద్వారా మేళ్ళు పొంది కృతజ్ఞులై నన్ను ఆరాధించండి అని దేవుడు అంటున్నాడు. తీర్పు దినాన దేవుని సింహాసనానికి కుడివైపు చేరిన సజ్జనులు నరకాగ్నిలో మాడుతున్న వారిని ఒక ప్రశ్న వేస్తారు :
                ''మీరు నరకంలో త్రోయబడటానికి కారణం ఏమిటి?'' అంటే వాళ్ళు నాలుగు కారణాలు చెబుతారు. అందులో మొదటిది ''నమాజు చెయ్యకపోవటం'' (74 :43)
                ''ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకు పిలుపు వినబడగానే మీ వ్యాపారాన్ని వదిలిపెట్టి దేవుని ధ్యానించటానికి పరుగెత్తి రండి. అది మీకెంతో మేలైనదని తెలిసికోండి'' (62:9)                 ( గీటురాయి వారపత్రిక 29.6.2012)
                మరి ఇంతమేలైనది, మనల్ని నరకశిక్ష నుండి తప్పించేది, నైతికంగా ఉద్ధరించేది అయిన నమాజు అనేక మందికి నిరుపయోగంగా ఉంటున్నది. నమాజు ద్వారా మనిషి పొందవలసినంత ప్రయోజం పొందటం లేదు. అర్థంకాని మంత్రాల లాంటి కొన్ని పదాలను వల్లించటం అనే తంతుతో నమాజు ముగుస్తున్నది. గొంతులోనుండి వెలువడే నమాజు ఉచ్ఛారణ కంటే, హృదయంలో నుంచి పెల్లుబికే ప్రార్థన నిశ్చయంగా గొప్పది.
                నమాజు అనేకుల జీవితాల్లో మార్పుతేలేకపోవటానికి ఒక కారణం 'ఆ నమాజు వాళ్లకు అర్థంకాక పోవటం''. అర్థంకాకపోవటానికి కారణం అతనికి అరబ్బీ భాష రాకపోవటం. దేవునికి అరబ్బీ భాషలో మాత్రమే నమాజు చెయ్యాలి అని కట్టడి చేయటం. ప్రతి విశ్వాసీ తప్పని సరిగా అరబ్బీ  నేర్వాలి అని నిర్బంధించటం. అర్థం అయినా కాకపోయినా సరే అరబ్బీలో రాయబడిన కురానే చదవాలి అని ఒత్తిడి చెయ్యటం. ఇది అనుల్లంఘనీయమైన సంప్రదాయం కావటం.
                ''మోకరించి మీ మాతృభాషలో దేవుని అయిదుపూటలా ప్రార్థించుకోండి, మీకు వచ్చిన భాషల్లోనే కురాన్‌చదువుకోండి అంటే ప్రపంచ ప్రజలందరికీ ''అర్థం అయ్యే నమాజు'' అందుబాటులో ఉండేది. కానీ అరబ్బీలో మాత్రమే ఇలా ఇలా వంగుతూ లేస్తూ నమాజు చెయ్యాలి అనటంతో ఈ శారీరక విన్యాసంలోని అంతరార్ధమేమిటో ప్రజలకు అర్థం కాలేదు. ''అర్థం లేని చదువు వ్యర్థము'' అన్నట్లే ''అర్థం కాని ప్రార్ధన కూడా వ్యర్థమే.''
                మహా ప్రవక్త గారి మాతృభాషలోనే దైవ సందేశం ఎందుకు వచ్చింది? మరో భాషలోవస్తే ఆయనకు అర్థం కాదనే గదా!''
                ''సకలలోకాల ప్రభువా! అనంత కరుణామయుడా! అపారకృపాశీలుడా! తీర్పు దినపు యజమానీ! మా దేవా! నీకే స్తోత్రములు! మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము. నీవు దీవించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం, మార్గభ్రష్టులు కాని వారి రుజుమార్గం మాకు చూపించు.'' అని చెప్పుకుంటే ఒక తెలుగు వానికి నమాజు అర్థవంతంగా ఉంటుంది. అల్లా అంటే ఒక్కడేననీ ఆయనకు ఆలుబిడ్డలు లేరనీ, ఆయన ఎవరికీ పుట్టలేదనీ, ఆయన ఎవరినీ కనలేదనీ ఆయన సర్వోన్నతుడైన ఏకైక దేవుడనీ - విగ్రహారాధన హేయమనీ, తీర్పు రోజున మనం లెక్క అప్పజెప్పుకోవలసి ఉంటుందనీ తెలుగు జనానికి తెలుగులోనే అర్థం అవుతుంది. ఆయన అద్వితీయుడనీ ఆయనకు సాటి కల్పించరాదని తెలుగులో చెబితే తెలుగుజనం సుళువుగానే అర్థం చేసికొంటారు. కానీ అక్కడి నుండి ఆరంభమయ్యే అరబ్బీ ఆంక్షలు, నియమనిష్టలు, ప్రత్యేక తరహాలో సాగే ప్రార్థనా పద్ధతులు వారిని అల్లా సన్నిధికి రాకుండా ఆటంకపెడుతున్నాయి.
                ఆయన సన్నిధికి వచ్చి ''అలహందులిల్లాహి'' అనవలసినదే గాని ''సర్వలోకాల ప్రభూ'' అని సంబోధించలేడు తెలుగువాడు. గుండెలోని భావం గొంతుదాటి రాకూడదా? అది దేవుడు వినడా? అరబ్బీ రాని ప్రజల యాతన చూడండి. మతంలో బలాత్కారం లేదన్న వాళ్ళే బలవంతంగా ఒక భాషను నిర్బంధం చేసారు. ఆ భాషరానిదే నీవు ముస్లిం కాదు పొమ్మన్నారు. దేవుని ప్రార్థించుకోటానికి ఆ భాషలో ఉచ్ఛరించనిదే మసీదు గడపతొక్కటానికి సైతం నీకు అర్హత లేదు పొమ్మన్నారు. అన్ని రంగులూ అన్ని భాషలూ దేవునివేనని చెప్పేవారూ ఈ భాష తప్ప మరో భాషలో చేసే ప్రార్థన దేవునికి అర్థం కాదు అన్నట్లుగా అరబీ పట్టుపడుతున్నారు.  అదేమంటే అరబీ ప్రార్థన అల్లానే విధించాడు. మనిషి దానిని మార్చకూడదు అంటున్నారు.
                నమాజు మనిషిని నైతికంగా ఉద్ధరిస్తుంది. కాని అరబిక్‌సూరాల కంఠస్థం అవశ్యం కావటం వల్ల అన్యుల ప్రవేశానికి ఆటంకం కలిగిస్తోంది. హృదయంలో వున్న విషయాలను చెప్పుకొను వీలు లేదు. తెలుగు భక్తుడు, అరబ్బీ దేవుడు. తెలుగు ముస్లిములు అయిదు వేళలా దేవుని తెలుగులోనే ధ్యానిస్తే వారి మది సేద తీరుతుంది. దేవుని స్తుతించి, హృదయమంతా ఆయన ప్రసన్నతను నింపుకొని, ఆయన ఆజ్ఞలను మనస్సులో నిలుపుకొని జాగ్రత్తతో బ్రతుకవచ్చు. కానీ అరబ్బీ ఆచార సంపన్నులు తెలుగు ముస్లిముల తెలుగు ప్రార్ధనలకు ఆమోదముద్ర వేయరట! మరి మన తెలుగు ప్రార్ధనలు అల్లా దరి జేరవా? గడ్డం పెంచలేదనీ, నమాజు సమయంలో కాలి గిలకలు కానరాలేదనీ, అన్నం తిన్నాక ఫలానా వరుసలో చేతివేళ్ళు నాకలేదనీ, అరబ్బీ రాదనీ విమర్శలు ఎందుకు? అన్ని భాషలూ దేవునివే గనుక అయితే, అన్ని భాషలను ఆయనే అనుమతించి వుంటే ఈ ప్రత్యేక భాషాదాస్యం చెయ్యమని ఆయన చెప్పడు. తెలుగు ముస్లిములకోసం తెలుగులో నమాజును, తెలుగు మసీదులను ప్రారంభించాలి. అప్పుడు అల్లా సన్నిధికి చేరి మన హృదయాలను ధారాళంగా తెరిచే అవకాశం మనకు తెలుగులోనే దొరుకుతుంది.''
 
తెలుగు ఖురాన్ అనువాదకులు అజీజుర్రహమాన్, హమీదుల్లా షరీఫ్, మలిక్ ,అబుల్ ఇర్ఫాన్ లతో 20.11.2011
ఇస్లాం ఒక 'జాతికి' చెందిన మతం కాదు :
                ''దూదేకుల సాయిబుకి ఉర్దూ రాకపోవటానికి కారణం ఏమిటి?''  అని గుంటూరు నుండి షేక్‌వహాబ్‌అడిగిన ప్రశ్నకు 21.8.87 గీటురాయిలో మలిక్‌గారిచ్చిన సమాధానం చూడండి.
                'దూదేకుల సాయిబులు' అని పేరు పెట్టి ర్దూ మాట్లాడే 'సాయిబులు' వారిని దూరం చెయ్యడం మూలాన.
                అన్ని రకాల తారతమ్యాలను, నిమ్నోన్నతా భావాలను, హెచ్చుతగ్గుల్ని, దూరం చెయ్యడానికి కంకణం కట్టుకున్న ఇస్లాంను స్వీకరించినప్పటికీ ముస్లిములు తమలో తాము ఈ విధంగా విభేదాలు సృష్టించుకుని ఇలాంటి ప్రశ్నలకు తావివ్వడం ఎంత శోచనీయం?! మరో విషయం ఏమిటంటే ర్దూ ముస్లిముల భాష కాదు. ఆ మాటకు వస్తే ముస్లిముల భాష అంటూ ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని భాషలూ దైవం సృష్టించినవే. అందువల్ల అన్ని భాషలు ముస్లిములవే.
                ముస్లిములు ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో వున్నా, ఏ దుస్తులు ధరించినా వారు మౌలికంగా ఇస్లామీయ సిద్ధాంతాలను, విశ్వాసాలను, విధానాలను అవలంభించినంత వరకు వారు ముస్లిములే. ఇస్లాం ఓ జీవన విధానం, ఒక సంతతికి, ఒక 'జాతికి' చెందిన మతం కాదు. దాన్ని ఎవరు ఆచరిస్తే అది వారిదే అవుతుంది. భారతదేశంలోని ముస్లిములు ఏ ప్రాంతంలో ఉండేవారు ఆ భాష మాట్లాడతారని తెలుసుకోండి. కేరళలో ఉండే ముస్లిములు మలయాళం, తమిళనాడులో ఉండే ముస్లిములు తమిళం, కర్ణాటక కెనరా జిల్లాల్లో ఉండే ముస్లిములు కన్నడ భాషలే మాట్లాడతారు. అలాగే గుజరాతీ, సింధీ, బెంగాలీ అస్సామీ భాషలు మాట్లాడే ముస్లిములున్నారు. అలాంటప్పుడు తెలుగు మాట్లాడే ముస్లిములు ఆశ్చర్యం గొలుపుతున్నారా? విద్యా విజ్ఞానాలు ఇంతగా పెంపొందిన ఈ రోజుల్లోను ఇలాంటి ప్రశ్నలడిగే వారున్నారంటే ఆశ్చర్యం వెయ్యదూ?  21.8.87 గీటురాయి
                ''నేను ముస్లిమునేగాని నా మాతృభాష తెలుగు'' అంటే తుర్లపాటి కుటుంబరావు గారు ఒక పట్టాన నమ్మలేకపోయారు. ముస్లిముల మాతృభాష ర్ధూ మాత్రమేనని ఆంధ్రలో చాలా మంది అనుకొంటారు. నేను పాలకొల్లు ఎమ్మార్వోగా పని చేసేటప్పుడు హైదరాబాద్‌నుండి ఒక ర్దూ ముస్లిం అధికారి వచ్చారు.పాలకొల్లు ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ మమ్మల్నిద్దర్నీ కలిపి ''ఇక మీరు మీ భాషలో మాట్లాడుకోండి'' అన్నారు. ఆ అధికారికి ర్దూభాషొచ్చి నోరు తెరిస్తే నాకు ర్దూ భాషరాక నోరు తెరిచాను. నాకు ర్దూరాదు బాబో అంటే ఇంగ్లీషులోకి మళ్ళాడు.ర్దూరాని సాయిబులు (తెలుగు ముస్లిములు) కూడ ఉంటారని ఎమ్మెల్యే గారికి తెలిసొచ్చింది.
అల్లాహు అక్బర్‌ అంటే అక్బర్‌ చక్రవర్తిని తలుచుకుంటున్నారేమో అనుకున్నా:
                ఆకివీడులో కొన్నేళ్ళ క్రితం రంజాన్‌నెలలో ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నాను. స్థానిక ముస్లిములంతా అజాన్‌ ఇచ్చి నమాజు చేసుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళ నమాజును చూస్తూ పుర ప్రముఖులంతా కూర్చున్నారు. తరువాత విందు ఆరగించారు.అప్పుడు నేను మీరిచ్చిన అజాన్‌ అర్థం,మీరు చేసిన ప్రార్థన అర్ధం తెలుగులో చెబితే తెలుగు వాళ్ళందరికీ అర్ధమవుతుంది అన్నాను. అప్పుడొకాయన దాని అర్ధం తెలుగులో చెప్పాడు. అది విన్న ఆనాటి మంత్రి కలిదిండి రామచంద్రరాజు గారు ''అజాన్‌ లోఇంత మంచి అర్ధం వుందా? నేను చిన్నప్పటి నుంచి ఈ అజాన్‌ వింటున్నాను. మా గాయత్రీ మంత్రానికీ మీ అజాన్‌ కీ తేడా ఏమీ లేదు, అల్లాహు అక్బర్‌అంటే మీరు అక్బర్‌ చక్రవర్తిని తలుచుకుంటున్నారేమో అని ఇంతకాలం అనుకున్నాను'' అన్నారు. అంతేగాకుండా ఆయన హాజరయిన ప్రతి జన్మభూమి సభలో ''ముస్లిముల పిలుపుల్లో ప్రార్ధనల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి, వాటిని మనమంతా తెలుసుకోవాలి'' అంటూ ఈ సంఘటనను ప్రజలకు తెలియజేశారు. రోజుకు అయిదుసార్లు మసీదు మైకుల్లో నుండి అందించే అజాన్‌ (ప్రార్థనా పిలుపు) ముస్లిమేతరులకు, ముస్లింలకు కూడ అర్థం కాకపోవటానికి కారణం అది అరబీ భాషలో మాత్రమే ఉండటం. దాని అర్థాన్ని తెలుగులో కూడా చెబుతూ వచ్చినట్లయితే మసీదు చుట్టు ప్రక్కల న్న తెలుగు సోదరులంతా విని స్పందించేవారు.
                అరబీ భాష మాట్లాడే యూదులూ క్రైస్తవులు కూడా దేవుడిని అల్లాహ్‌అనే పిలుస్తారు. మొత్తం ప్రపంచ ముస్లిముల్లో అరబ్బు ముస్లిములు 25 శాతం మాత్రమే.
ఏ భాషకైనా పరిమితులుంటాయి :
                ''అరబీ భాష దాని నుడికారం రీత్యా ఎంతో సుసంపన్నమయిందే, అయినా అదీ మానవ భాషే. మనిషి మాట్లాడే భాషలు ఏవైనా సరే ఎన్నో పరిమితులతో కూడుకున్నవి. అవి ఖురాన్‌లోని సువిస్తారమైన విషయాలకు సమగ్రమయిన మకుటాలు కాగల పదాలు, సమాసాలు అందజేయలేవు.''- (అల్‌బకర సూరా ప్రవేశికలో మౌలానా మౌదూదీ గారి వ్యాఖ్యానానికి మలిక్‌గారి అనువాదం.)
                Many more Surahs of the Quran have been named in the same way because no comprehensive words exist in Arabic (in spite of its richness) to denote the wide scope of the subject discussed in them. As a matter of fact all human languages suffer from the same limitation. - మౌదూదీ
భాష అర్థం కావాలి :
 తన సొంత జనం భాష రాని ఏ వ్యక్తినీ దేవుడు ప్రవక్తగా పంపలేదు. (ఖురాన్‌14.1)
                దావూదు, సులైమానులకు పక్షుల జంతువుల భాషలు, దేవదూతల (జిన్నాతులు) భాషలు కూడా అర్థం చేసుకునే శక్తి అల్లాహ్‌ప్రసాదించాడట. ఖుత్బా ప్రసంగం ప్రజలు అర్థం చేసుకునేలా ూండాలి (2.140 సున్నా ఫిఖా)
అవసరం కొద్దీ కొత్త భాష :
                ప్రవక్త అరబ్బేతర భాషల వారితో వ్యవహారాలు నడిపేందుకు వీలుగా జైదును హెబ్రూ, సిరియా భాషలు నేర్చుకొమ్మన్నారు.
                సుహైబ్‌గ్రీకు భాష వారి మధ్య పెరిగి అరబ్బీ మరచిపోయాడు. అయినా అతను విశ్వాసాన్ని బట్టి ముస్లింగానే పరిగణించబడ్డాడు.
                సల్మాన్‌అనే పర్షియన్‌కు జొరాష్ట్రియన్‌, క్రైస్తవ లేఖనాలూ, ఖురాన్‌లోనూ మంచి పరిజ్ఞానం ఉంది. ముహమ్మద్‌ప్రవక్త గారి జీవిత కాలం లోనే ఖురాన్‌ను ఫారసీ భాషలోకి తర్జుమా చేసిన మొదటి వ్యక్తి ఈయనే.
విలక్షణమైన, ప్రభావవంతమైన ఖురాన్‌భాష :
                ఖురాన్‌గ్రంధం జబీర్‌అనే క్రైస్తవుడు రాశాడని కొందరు ఖురైషులు విమర్శిస్తే అతను అరబ్బు కాదనీ, అతనికి అరబ్బీ భాష బాగా రాదనీ, ఎవరైనా సరే ఖురాన్‌వాక్యం లాంటి వాక్యం తేవచ్చు అని సవాలు చేస్తే ఎవరూ తేలేకపోయారు.
                ఖలీఫా అలీ ఖురాన్‌జ్ఞాని. ఆయన్ని ''రెండవ సోలోమోన్‌'' అంటారు. ఆయన అరబ్బీ భాషకు వ్యాకరణం రాసిన మొదటి వ్యక్తి. ఖురాన్‌వాక్యాల నిర్మాణం అద్భుతమని చెప్పాడు.
అర్థమైతే మనసు మార్చే భాష :
                ఖురాన్‌వాక్యాలు విన్న ూమర్‌మనసు మారి పోతుంది. ప్రవక్తను చంపుదామని బయలు దేరిన వాడు సంధి చేసుకుంటాడు. ఖురాన్‌ఎవరికి వారే చదివి అర్థం చేసుకోవాలని అందరికీ అరబ్బీలో చదువు నిర్బంధం చేశాడు.ఆయనకు హెబ్రూ కూడా వచ్చు. జుహైర్‌కవితలు చాలా సుళువైన భాషలో ఉంటాయని తెగ మెచ్చుకునేవాడు.
                12 మంది అరబీ క్రైస్తవ పండితుల బృందం ఖురాన్‌వాక్యాలు విని ముస్లిములుగా మారారు.
                గీటురాయి వార పత్రిక సంపాదకులు మలిక్‌గారు భాషలపై పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన కొన్ని సమాధానాలు :
                ముస్లిం సమాజానికి సంబంధించిన విషయాల చర్చలు, పెళ్ళిళ్ళు,కుటుంబ తగాదాల తీర్పులు. ప్రయోజనకరమయిన సామాజిక కార్యకలాపాలు మస్జిదుల్లో జరపవచ్చు (16.3.84)
                పఠనం సరిగ్గా జరగాలి, అంత సమయం లేదనుకుంటే కొంతభాగమే పఠించాలి. అర్థం కాని భాషలో, శబ్దాలు కూడా సరిగ్గా వినరాకుండా కునికిపాట్ల మధ్య వినే ఖురాన్‌ఏ విధంగానూ ఫలప్రదం కాదు (19.7.85)
                చదవడమంటే అర్థం చేసుకుని చదవడమే. అర్థం చేసుకుంటూ 'చదివితే' పుణ్యమూ లభిస్తుంది. జీవితంలో అది కోరే మార్పూ వస్తుంది. అలాకాక కేవలం పారాయణం చేసుకున్నట్లయితే స్వచ్ఛమయిన నీటి సెలయేరు పారుతుండగా దప్పిక గొన్న వాడు దాని ఒడ్డున కూర్చుని ''దాహం, దాహం'' అని అరవడంతో సమానం. పారాయణ పుణ్యంతో సరిపెట్టుకునే దురదృష్టవంతులు ఎందుకవ్వాలి ముస్లిములు? (20.4.87)
                మస్జిద్‌లో తెలుగు భాషలో ధార్మిక విషయములు మైకులో చెప్పటం ఏ మాత్రం తప్పు కాదు. చాలా మంది తెలియక ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు. దైవ ప్రవక్తలు కూడా తమ జాతి ప్రజలు మాట్లాడే భాషల్లోనే వారిని సంబోధించారు. భాషతో ధర్మానికి సంబంధం లేదు. దివ్య ఖురాన్‌మూలగ్రంధం అరబీలో ఉండటం మూలాన మనం దానికి ప్రత్యేకతనిస్తాము. కానీ ప్రసంగాలు, బోధనలు, పదేశాలు, హితబోధలు అన్నీ ఆయా ప్రజల భాషల్లోనే జరగాలి, జరుగుతున్నాయి కూడా. దాహరణకు ర్దూ అర్థం చేసుకునే త్తర భారతీయులకు ర్దూలో అవన్నీ జరిగినట్లే దక్షిణ రాష్ట్రాల్లో ర్దూ పదం ఒక్కటీ అర్థం కాదు. అక్కడ మలయాళం, తమిళం, కన్నడం, తెలుగు భాషల్లోనే జరుగుతున్నాయి బోధనలన్నీ. అంతే కాని ఏదో తెలియని భాషలో అన్యమనస్కంగా, పరిపరి విధాల పోయే హృదయాన్ని అదుపులో పెట్టుకోవడం చేతకాక పన్యాసాలు చెయ్యడం, వినడం, ఎక్కడా జరగడం లేదు. సంకుచిత భాష, వర్గ, జాతి పరిధుల నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. (11.10.85)
                చమురు నిక్షేపాలు బయటపడిన తరువాత ప్రపంచంలో అరబీ తిరిగి ప్రాముఖ్యం సంతరించుకోసాగింది. అయితే ఈసారి సాంస్కృతిక, నాగరిక, శాస్త్రీయ ప్రాధాన్యతలు లేవు. కేవలం వాణిజ్యమే మూలకారణం. అనేక విధాలుగా దిగజారిపోయిన ముస్లిములు అరబీ భాష విషయంలో పూర్తిగా పడిపొయ్యారు. చివరికి ఖురాన్‌పారాయణం చెయ్యడానికి (చదివి అర్థం చేసుకోవడం కాదు) కూడా వారికి తీరిక లేదు. కేవలం తాము జీవికకై చదువుకున్న భాషలో 'లిప్యంతరీకరణ' (transliteration ) చేసిన ఖురాన్‌ప్రతులు కావాలని అడుగుతుంటారు. ఆ భాషల్లో అరబీలోని చ్ఛారణలన్నీ సరిగ్గా రావని తెలిసినా అదే కావాలంటారు. (29.7.88)
                బ్రహ్మీ లిపి కూడా మౌలికంగా కుడి నుంచి ఎడమకు వ్రాయబడేదే. కాలానుగుణంగా మార్పులు సంభవించాయి. లిపులకన్నా, భాషలకన్నా అవి అందజేసే భావాలే  ముఖ్యమైనవి. భాషల గురించి లిపులగురించి ఎన్ని వివాదాలున్నా భావాలే మనసుల్ని ఏలగలవన్నది మాత్రం నిర్వివాదాంశం. (29.7.83)
                ఖురాన్‌ ఉరవడిని, వేడిమిని గ్రహించిన కవులు దాని ఎదుట తమ కవితా ఖండాలను ఇట్టే వదులుకున్నారు. అంతేకాక ఇది మానవ మాత్రుని శైలి కాదు అని దాన్ని దైవవాక్కుగా అంగీకరించి ఇస్లాం స్వీకరించారు. (10.1.86)
కవిభాష కాదు:
                తుపైల్‌బిన్‌అమర్‌అనే ప్రసిద్ధ అరబీ కవి ఖురాన్‌వాక్యాలు వినిన వెంటనే అవి కవుల కల్పనా వాక్యాలు కాదని తెలుసుకొని ముస్లిం అయ్యాడు.
ఎవరి భాష వారిది :
                యోనా తిమింగలం కడుపులో దైవస్తోత్రం చేస్తుంటే మిగతా జల చరాలు చుట్టూ చేరి వాటివాటి భాషల్లో స్తోత్రం చేశాయట.




ప్రవక్త నా గడ్డ మీద పుడితే పవిత్ర గ్రంథం నా భాషలోనే ఉండేది - స్కైబాబా, జగ్‌నేకీరాత్‌

1 కామెంట్‌:

  1. తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
    "భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే.భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును.ముందు 'భాష' పుట్టుతుంది.తర్వాత 'లిపి' పుట్టుతుంది.ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలు.లిపి లేని భాషలు 696.మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు.కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రము శబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు.తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు.నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. చాలా భాషల పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది ,ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును.తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది.సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగు భాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోని లిపి వలన వ్రాయవచ్చును.సంస్కృత భాషకు లిపిలేదు.సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగా వాడబడుచున్నది.అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది.ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు.ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి.తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్ద భాష ఏదీ లేదు.వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా ,చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి.శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప.ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు.''ఆత్మ'' అను పదము తెలుగు భాషలోనే పుట్టినది.వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". --- ఆచార్య ప్రభోదానంద యోగి (లు అంటే ఏమిటి? 2016)https://www.facebook.com/nrahamthulla/posts/1167077539990901

    రిప్లయితొలగించండి