18, జులై 2012, బుధవారం

లిపి సంస్కరణ తప్పదు


14.లిపి సంస్కరణ తప్పదు
                బ్రహ్మ ఏర్పరచిన లిపి 'బ్రహ్మలిపి' అనుకుంటున్నారేమోగాని మనవాళ్ళు లిపి సంస్కరణకు భయపడుతున్నారు. సవరభాషకు గిడుగు లిపిని తయారు చేయటం మన కళ్ళముందే జరిగింది. భాష వాక్కు రూపంలో ధ్వనిస్తే, ఆ ధ్వనికి సంకేతమే లిపి, ఈ లిపి మనిషి తన సౌలభ్యంకోసం తయారు చేసుకున్నాడు. మోషేకు పది ఆజ్ఞలు దేవుడు  రాతి పలకల విూద హెబ్రూ లిపిలో చెక్కి ఇచ్చాడట. ఎందుకంటే మోషే భాష హెబ్రూగనుక. మనమంతా కలిసి ఈ శబ్దాన్ని ఈ అక్షరంతో రాయాలి. ఇలా రాయాలి అని నిర్ధారించుకుంటే అదే మన లిపిగా నిలబడుతుంది. ప్రపంచంలో వేలాది బాషలకు లిపి లేదు. ఆ భాషలు రానురాను నాశనమై పోతున్నాయి. కేవలం 26 అక్షరాలతో వత్తులు, గుణింతాలను కూడా కల్పించుకొని సాఫీగా యంత్రాల విూద సాగిపోతున్న ఇంగ్లీష్‌ తరహలో తెలుగు లిపిని కూడా సంస్కరించుకోవాలి.
                భూపతి నారాయణమూర్తి 'భోధన, పాలన జనజీవన రంగాలలో తెలుగు' (1998) అనే పుస్తకంలో ఇలా అంటారు: మన లిపిలో ఉపయోగం లేని అక్షరాలు మూడోవంతు వరకు ఉన్నాయి. వాటిని రద్దుచెయ్యాలి. ఉ,,,,,,ణ వగైరా అక్షరాలను తీసి వేయాల్సి ఉంది. చైనా 3 సార్లు తన లిపిని సంస్కరించింది. శాస్త్ర సాంకేతిక పరికరాలకు అనుకూలంగా లిపిని తయారు చేసుకున్నారు.  అలాగే తెలుగు లిపిని కూడా సంస్కరించాలి. అప్పుడే అధికార భాషగా తెలుగు రాణించగలదు. లిపిని సంస్కరించటం వల్ల అత్యధిక సంఖ్యలో ఉన్న నిరక్షరాస్యుల్ని కూడా అక్షరాస్యులుగా చేయటం తేలిక అవుతుంది.'' ఇప్పటికే మనం ఋ,బుూ,,,,,లాంటి అక్షరాలను వదిలించుకున్నాము. ''అక్షర దీక్ష'' వాచకాల్లో కేవలం 30 అక్షరాలే ఉపయోగించారు.
                బూదరాజు రాధాకృష్ణ ''భాషాశాస్త్ర వ్యాసాలు'' (1990) అనే పుస్తకంలో ఇలా అన్నారు. ''నిజానికి పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక పునరుజ్జీవనం  మొదలైన రోజుల్లో యూరప్‌లోని దేశాలు లాటిన్‌, గ్రీకు భాషల ప్రభావం నుంచి వేర్పడి దేశభాషల్లో సమస్త వ్యవహారాలు జరుపుకోవటం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మనం పడుతున్న కష్టాలన్నీ తామూ అనుభవించాయి. అన్ని సమస్యలూ మనకే రాలేదు. ప్రయత్నలోపం వల్ల, భాషాస్వభావ పరిజ్ఞాన లోపం వల్ల, మాతృభాషాభిమాన లోపంవల్ల, తెచ్చిపెట్టుకున్న చిక్కులే మనకెక్కువ. ఉపయోగం వల్ల భాష పెరుగుతుంది. తెలుగును అధికార భాషగా వినియోగించినప్పుడు అదే సహజంగా అభివృద్ధవుతుంది.''
ఇంకేంచేస్తే బాగుంటుంది?
1.            ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు విూడియంలో చదివిన వారికి ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, బి.ఇడి. కోర్సుల్లో రిజర్వేషన్‌, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ ఇవ్వాలి. కర్నాటకలో 5% రిజర్వేషన్‌ ఇస్తున్నారు.
2.            తెలుగు విూడియంలో చదివిన వారికి ఉద్యోగ పోటీపరీక్షల్లో గతంలోలాగా 5% వెయిటేజి మార్కులు ఇవ్వాలి.
3.            వృత్తివిద్యా కోర్సులన్నింటి సిలబస్‌ (ఇంజనీరింగ్‌, మెడికల్‌, లీగల్‌, బి.ఇడి తదితరా)లను తెలుగు అకాడవిూ చేత పాఠ్యపుస్తకాలుగా తెలుగులో ముద్రింప చేయాలి.
4.            తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్‌. ఐ.పి.యస్‌ అధికారుల్ని, గవర్నర్లును మాత్రమే మన రాష్ట్రంలో నియమించేలా కేంద్రాన్ని కోరాలి.
5.            కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి భయంకరమైన సంస్కృత పదాలను వాడి తెలుగు విూడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి.
6.            కేవలం తెలుగు విూడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టర్‌, డాక్టర్‌, ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు.
7.            పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి.
8.            తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి.
9.            లిపి సంస్కరణ యంత్రాలకనుగుణంగా జరగాలి. కంప్యూటర్‌లలో వాడకానికి ప్రస్తుతం తెలుగు సాఫ్ట్‌వేర్‌లో ఏయే సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని నిశితంగా, పరిశీలించి నిరంతరం వాటిని బాగుచేసే నిపుణుల్ని నియమించాలి. పరిశోధకుల్ని ప్రోత్సహించాలి.
అప్పటి అధికార భాషా సంఘం కార్యదర్శి సి.ధర్మారావు గారు వ్రాసిన ''అధికార భాష తీరు తెన్నులు'' అనే పుస్తకానికి మున్నుడి రాస్తూ 25-3-1989న నండూరి రామకృష్ణమాచార్య ''తెలుగు జగన్నాధ రథం కదిలింది'' అన్నారు. ఎన్టీరామారావు గారి తెలుగు ఆవేశాన్ని, ఆదేశాలను చూసి ఆయన ఆనందంతో ఆమాట అని ఉంటారు. కానీ 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు చూస్తే  ఆ తెలుగు జగన్నాథ రధం వాస్తవానికి వెనక్కి వెనక్కి సాగి అక్కడే కూలబడిపోయింది. జగన్నాధుని రధం ప్రతి ఏటా కొత్తది కడుతుంటారు. అయితే కూలబడిన ఈ తెలుగు రధాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. భాషను పాడుచేసుకొవడం, మళ్ళీ బాగుచేసుకోవాలన్న అలోచనే లేకపోవటం, అరకొరగానైనా చేపట్టిన పనిని పూర్తి చేసుకోలేక చతికిల పడటం వల్ల, ఆంధ్రులు ఆరంభ శూరులు అన్న నానుడిని సార్థకం చేసుకుంటున్నాం.
షెడ్యూల్‌లో ఉన్న భాషలు - 18
 క్రమ    భాషపేరు         మాట్లాడేవారి సంఖ్య (లక్షలలో)
 సంఖ్య  (జమ్మూ కాశ్మీర్‌ను మినహాయించి)
                                1991       శాతం             2001
  1            హిందీ   3372       39.85
  2            బెంగాలీ  695         8.22
  3            తెలుగు  660         7.80
  4            మరాఠీ  624         7.38
  5            తమిళం 530         6.26
  6            ఉర్దూ    434         5.13
  7            గుజరాతీ          406         4.81
  8            కన్నడ  327         3.87
  9            మళయాళం      304         3.59
 10          ఒరియా 280         3.32
 11          పంజాబీ 233         2.76
12           అస్సామీ          130         1.55
13           కాశ్మీరి   31           0.46
14           సింధీ    21           0.25
15           నేపాలీ   20           0.25
16           కొంకణి   17           0.21
17           మణిపురి         13           0.15
18           సంస్కృతం        0.49        0.01
                అంటే మొత్తం దేశజనాభా 1991లో 8463 లక్షలైతే ఈ 18 భాషలు మాట్లాడేవారు 8097 లక్షలు అంటే 96% ఇంకా 365లక్షల మంది షెడ్యూల్‌లో చేరని భాషలు మాట్లాడుతున్నారన్న మాట
షెడ్యూల్లో చేరని భాషలు - 96
సంస్కృతం కంటే ఎక్కువ మందిమాట్లాడే భాషలు - 45 వాటి వివరాలు:
 క్రమ    బాషపేరు          మాట్లాడేవారి సంఖ్య (వేలలో)       
 సంఖ్య                    1991         2001            

   1           ఆది     158
   2           అవో     172
   3           అంగామి          97
   4           బివి     5572
   5           బోటియా          55
   6           బిష్ణుపూరియా    59
   7           బోడో     1222
   8           కూర్గి కొడగు      97
   9           దిమాసా 88
  10         డోగ్రి      90
  11         ఇంగ్లీషు 179
  12         గారో     676
  13         గోండి    2125
  14    హలబి    534
  15         హ్మర్‌    65
  16         హో    949
  17         కబుయి 69
  18         కర్బి/మిక్రి 366
  19         కెందేషి   974
  20         కారియా 226
  21         కాసా    912
  22         కోండు   221
  23         కిన్నౌరి  62
  24         కిసాన్‌   162
  25         కొలిమి   98
  26         కుకి      58  27       
27      కురుక / బరవ 14
  28         లోతా    85
 29          లుషాయి / బరవ 539
  30         మాల్టో   108
  31         మావో   78
  32         మిరి / మిషింగ్‌   391
  33         ముండా 414
  34         ముందరి          816
  35         నిస్సి / దఫ్ల       173
  36         పోము  65
  37         రబా     139
  38         సంతాలి  5216
  39         సవర    273
  40         సేమ    166
  41         తంగకుల్‌          102
  42         తాడో     108
  43         టిబెటిన్‌  69
  44         త్రిపురి   694
  45         తుళు   1552
బిలి, సంతాలి, గోండు, తుళు, కురుక, బోడో, లాంటి పది లక్షల పై బడిన జనం మాట్లాడే భాషల్ని షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతున్నారు. దేశమంటే మట్టికాదోయ్‌ మనుషులోయ్‌ అన్నారు కదా!
      తెలుగు జనం             1991                                    2001
        ఆంధ్రప్రదేశ్‌                          56375755
        తమిళనాడు            3975561
        కర్నాటక                  3325062
        ఒరిస్సా                 502102
        పాండిచేరి             34799
                                          6,42,13,279
     మిగతా రాష్ట్రాలలో       18,04,336
     మొత్తం దేశంలో       6,60,17,615
                                                                                                     ( గీటురాయి 26-09-2003 )

                ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి గారికి తెలుగు భాషోద్యమ సమాఖ్య ఈ క్రింది విజ్ఞప్తిని అందజేసింది.15 కోట్ల మందిమి మన తెలుగు జాతి. ప్రపంచంలో మొదటి 10 పెద్ద భాషల్లో తెలుగు ఒకటి. వివరాలు:
                రాష్ట్రం             జనాభా కోట్లలో   శాతం
1.ఆంధ్రప్రదేశ్‌               7.5                          88
2.తమిళనాడు              2.8                          42
3.కర్ణాటక                            1.7                          33
4.మహారాష్ట్ర                            1.5                              16
5.ఒరిస్సా                            0.8                          22
6.కేరళ, పాండిచేరి, చత్తీస్‌గఢ్‌         0.6                          -
7. మిగతా దేశంలో                   0.1                          -
                మొత్తం            15 కోట్లు          ....
                తెలుగు ప్రాథమిక విద్యార్థులు రాష్ట్రంలో ఇప్పటికే 20 శాతం పైగా  తెలుగు చదవటమే మానేశారు. ఇది జాతి మనుగడకే ప్రమాద సూచికగా యు.ఎన్‌.వో. సంస్థ హెచ్చరిస్తున్నది.తెలుగు(మాతృభాష)ను 5వ తరగతి వరకు అన్ని రకాల స్కూళ్లలోను మీడియం చెయ్యాలి. ఇంగ్లీషును రెండో భాషగా బోధించాలి.మన రాష్ట్రంలో ''ప్రాథమిక విద్య, భాషా సంస్కృతులు'' పేర ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. విద్య, భాష పట్ల ఆసక్తి ఉన్న మంత్రి ఈ శాఖను నిర్వహించాలి.
                                                                                                                              (నడుస్తున్న చరిత్ర, జూన్‌ 2004)

1 కామెంట్‌: