6, జులై 2012, శుక్రవారం

6. ప్రజల పదాలతో నిఘంటువు చేయాలి


6. ప్రజల పదాలతో నిఘంటువు చేయాలి
(‘తెలుగువెలుగుఈటీవీ 2 ఇంటర్య్వూ 20.5.2007)
                ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నూర్‌బాషా రహంతుల్లాకి తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం. గత 25 సంవత్సరాలుగా తెలుగు భాష అభివృద్ధి గురించి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు.పుస్తకాలు రాశారు. ప్రస్తుతం విశాఖ జిల్లా డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తూ అధికార భాషగా తెలుగు వినియోగానికి అహర్నిశలూ కృషి చేస్తున్న ఆయనే ఈ నాటి మన తెలుగు వెలుగు విశిష్ట అతిథి.
                నూర్‌బాషా రహంతుల్లా స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం. తెలుగు మాధ్యమంలోనే ఆయన చదువుకున్నారు. 1978లో ఎల్‌.డి.సి. గా ప్రభుత్వ ద్యోగంలో చేరింది మొదలు అనేక పదవులు పొంది నేడు డిప్యూటీ కలెక్టరు స్థాయికి ఎదిగారు. ద్యోగంలో ఎదగటం ఒక్కటే ఆయన లక్ష్యం కాదు. అధికార భాషగా తెలుగుకి పరిపాలనా వ్యవహారాల్లో పట్టం కట్టాలన్నదే ఆయన ప్రధాన ఆశయం. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక శ్రద్ధతో తెలుగుభాష గురించి అధ్యయనం చేశారు. ఈ అంశాలన్నీ ప్రోది చేసి ‘‘తెలుగు అధికారభాష కావాలంటే..’’ అనే శీర్షికన ఒక పుస్తకాన్ని ప్రచురించారు. తాను నిర్వహించే కార్యకలాపాలన్నింటా అధికార భాషకి పెద్దపీట వేసి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఇలా తెలుగు భాషకి బహుముఖ సేవలందించడం ద్వారా అధికార భాషా సంఘం నుంచి విశిష్ట భాషా పురస్కారం అందుకున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో రహంతుల్లాని అడిగి ప్రపంచీకరణ నేపధ్యంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి, అధికార భాషగా తెలుగు అమలుకి చేపడుతున్న చర్యల గురించి తెలుసుకుందాం.
మృణాళిని        :         నమస్కారమండీ రహంతుల్లాగారు..
రహంతుల్లా       :         నమస్కారమండీ.
మృణాళిని        :         అధికార భాషగా తెలుగును అమలు చేయడంలో మనం ఎందుకు విఫలమయ్యాం?
రహంతుల్లా       :         రానురాను తెలుగు భాషను అమలు చేసే విషయంలో, తెలుగును నేర్పే విషయంలో ప్రభుత్వ ఆదరణ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రాజపోషణ, ప్రభుత్వ ఆదరణ దొరుకుతూ ఉంటుందో అప్పుడు మన భాషకి ఆదరణ కూడా పెరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం చేశాడు. ఆయనే స్వయంగా తెలుగు అభిమాని, తెలుగులో మంచిగా రాసినటువంటి వ్యక్తి కాబట్టి పరిపాలనంతా తెలుగులో బాగా జరిగింది. మనమే ఆయన కాలం స్వర్ణయుగం అని అనుకుంటున్నాం. ఎందుకనుకుంటున్నామంటే రాజపోషణ ఉంది. రాజపోషణ గనుక ఉంటే క్రింద ద్యోగులంతా కూడా ఖచ్చితంగా తెలుగుని అమలు చేస్తారు.
మృణాళిని        :         అధికార భాషగా తెలుగును అమలు చేయాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా తెలుగు వాడాలి. అయితే దానికి పై అధికారులే అడ్డుపడుతున్నారు అనే ఒక వాదన ూంది.
రహంతుల్లా       :         పై అధికారులేంటంటే వాళ్ళూ ఇంగ్లీషులోనే చదువుతారు. ఇంగ్లీష్‌నే అమలు చేయమని ఒత్తిడి చేస్తారు. కారణం మీరు తెలుగులో రాస్తే పై అధికారికి అర్థం కాదు అనుకోండి అతను ఏం చేస్తాడు? ఈ ఫైల్‌ని మళ్ళీ ఇంగ్లీషులోకి తర్జుమా చేసి చెప్పమంటారు. లేకపోతే ఇంగ్లీష్‌లోకి మార్చి మళ్ళీ పంపించమంటారు. అప్పుడు రెండు పనులవుతాయి. అలా కాకుండా మన తెలుగు అధికారులే మన తెలుగు ప్రాంతం మీద పై స్థాయి అధికారులై ూన్నారనుకోండి పరిస్థితి తేడాగా ఉంటుంది. వాళ్ళు తెలుగుని ఆదరిస్తారు.
మృణాళిని        :         అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉంది కదా మిగతా రాష్ట్రాల్లో అధికార భాషగా ఆయా భాషలు కొనసాగుతున్నాయి కదా?
రహంతుల్లా       :         ఇప్పుడు, కన్నడం తీసుకోండి, తమిళం తీసుకోండి ఈ ప్రాంతాల్లో కూడా వేరే  భాషస్థులు వచ్చి అక్కడ ఐఎఎస్‌ ఆఫీసర్లుగా, న్నతస్థాయి అధికారులుగా పనిచేస్తున్నటువంటి సందర్భాలున్నాయి. అయినప్పటికీ అక్కడ ప్రజల కోరిక చాలా బలంగా ఉంటుంది. తమిళనాడులో లాంగ్‌లివ్‌క్లాసికల్‌డివైన్‌తమిళ్‌అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. వాళ్ళు తమిళాన్ని క్లాసికల్‌గానే కాకుండా డివైన్‌ తమిళ్‌ అంటున్నారు. అంటే భక్తి కూడా ఉంది ఆ భాష మీద. ఆ భాషను అంతగా గౌరవిస్తున్నారు. అటువంటి చిత్తశుద్ధి ఎక్కడైతే ఉంటుందో, ఏ భాషస్థులకైతే ఉంటుందో అప్పుడు అధికారులు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లోకి వస్తారు. మరి మన రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటే పరాయి భాషకు సంబంధించిన ఐఎఎస్‌ఆఫీసర్‌వచ్చినా సరే మన భాషలో పని చెయ్యక తప్పదు.
మృణాళిని        :         మీరు తెలుగుభాషని అధికార బాషగా అమలు చెయ్యాలి అని అనుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
రహంతుల్లా       :         మాకేమీ సమస్యలు ఎదురు కావడం లేదు. చక్కగా అమలు చేస్తున్నాను. మాకు సాఫ్ట్‌వేర్‌ ప్రాబ్లం న్నా, లేకపోతే రకరకాల సమస్యలు, చిన్నచిన్నవి వచ్చినా పదకోశాలు తెప్పించుకొని మరీ వాటిని చూసి దానికి సరైన పదం మన తెలుగులో ఉంటే వాడుతున్నాం. లేకపోతే ఇంగ్లీషు పదాన్నే వాడుతున్నాం. భూసేకరణకి అవార్డులున్నాయి. ఆ అవార్డులిచ్చే పద్ధతంతా కూడా బ్రిటిష్‌వాళ్ళు పెట్టినటువంటి పద్ధతుల్లో ఇంగ్లీషులోనే కొనాసగేవి. అటువంటి అవార్డుల్ని కూడా మేము తెలుగులో మార్చుకున్నాము. మనకి ఆసక్తి ఉంటే చట్టాన్ని తెలుగులోకి మార్చుకొని మన భాషల్లోనే ఆ నమూనా ఫారాలను రాసుకొని చక్కగా చెయ్యొచ్చు.
మృణాళిని        :         మీరు తెలుగు సమానార్థకాలు వాడాలి. ఈ ఇంగ్లీషు పదాలకి అవి చెప్తున్నప్పుడు చాలా జఠిలంగా ఉండే పదాలని కనిపెట్టాలనుకుంటున్నారా లేక కొన్ని యదాతథంగా వాడేసుకుందామనుకుంటున్నారా?
రహంతుల్లా       :         ఇప్పుడు పేపరు, పెన్ను, పెన్సిల్‌, రబ్బరు, రోడ్డు, కారు, బస్సు ఇలాంటి పదాలు ఎన్నో ూన్నాయి. బ్రిటీష్‌వాళ్ళు మనల్ని పరిపాలించినందువల్ల ఇంగ్లీషు పదాలు, అలాగే నిజాం రాజులు, ముస్లిం రాజులు పరిపాలించినందువల్ల ర్దూ పదాలు మన భాషలో అంతర్భాగమై పోయాయి. వాటిని వాడితేనే అర్థమవుతుంది. వాటికి సమానార్థక పదాలు సృష్టించుకొని శ్రమపడేదానికంటే వాటిని మన నిఘంటవుల్లోకి తీసేసుకుని ఇవీ మన పదాలే అన్నట్లు స్వతంత్రించుకోవాలి. ఎప్పుడూ ఇవి నావి కాదు అనే అంటరాని తనాన్ని పాటిస్తూ ఉంటే మన భాష బలహీనపడి పోతుంది.
మృణాళిని        :         అయితే మరి దాన్నే ఇంకొంచెం విస్తరించి ఎక్కువ పదాల్ని మనం వాడుతున్నాం కదా తెలుగుకు అన్యాయం చేస్తూ ఈ పరిమితి ఎక్కడ విధించుకోవాలి?
రహంతుల్లా       :         న్న పదాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంగ్లీష్‌పదాన్నే వాడుతున్నామనుకోండి అది అన్యాయం అనండి. అసలు పదం లేదు, కొత్తగా వచ్చింది మీరు ూదాహరణగా తీసుకోండి అమానత్‌రిజిస్టర్‌అని ఉంటుంది. బ్రిటీష్‌వాళ్ళు కూడా దానికి ఏ పదం తోయక అమానత్‌ రిజిస్టర్‌అనే పెట్టారు. ఇది ఇంగ్లీషు పదం కాదు కదా. జమాబందీ ఉంది రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో శిస్తు ఉంది, రసీదు ఉంది, అసలు ఉంది, నకిలీ ఉంది. ఇవన్నీ ర్దూ పదాలే మరి బ్రిటీష్‌వాళ్ళు కూడా దాన్నే వాడుకున్నారు. ఇవి మనవి అన్నట్లు అయిపోయాయో వాటిని వదులుకోవడం మంచిదికాదు.
మృణాళిని        :         మీరు సాఫ్ట్‌వేర్‌సమస్య అన్నారు. అది ఏరకంగా మీ పనులను ఆటంకపరుస్తోంది?
రహంతుల్లా       :         సాఫ్ట్‌వేర్స్‌లో కొన్ని అలవాటు కాక, అవి అసలు ఇన్‌స్టాలేషన్‌దశలోనే ఇన్‌స్టాల్‌కాక, ఒకవేళ ఇన్‌స్టాల్‌అయినా ఈ ఒత్తులు, గుణింతాలు వీటిల్లో సరిగ్గా దాన్ని కొట్టలేక అటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలే వాటిని తెలిసినవాళ్ళని రప్పించుకొని మరీ చేయడం జరుగుతోంది. కొన్నిసార్లు మేము ఈ పేపర్ల ఆఫీసులకు కూడా వెళ్ళి, వాళ్ళు ఏ సాఫ్ట్‌వేర్‌అయితే వాడుతున్నారో అందులో బాగా సులభంగా ఉండేవాటిని తెచ్చుకొని మరీ వాడుతున్నాం.
మృణాళిని        :         మీకింది స్థాయి ద్యోగుల సహకారం మీకు లభిస్తోందా?
రహంతుల్లా       :         కిందిస్థాయి  ద్యోగుల  తోటి  మనకెప్పుడూ సమస్య  ఉండదు.  అధికారికి ఫస్టు చిత్తశుద్ది ఉండాలి. ఇది చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి. మొట్టమొదట్లో వాళ్ళు కాస్త సణుక్కుంటారు. ఇదేంటీ దీనికి తగిన పదాల్లేవు. లేకపోతే కంప్యూటర్‌మీద కూడా విసుక్కుంటారు. అయితే వాళ్ళకి ఓర్పుతో చెప్పాలి. వారికి జవాబు కూడా మనం తెలుగులోనే ఇద్దామని. చాలా సంతోషంగా వాళ్ళు ఒప్పుకుంటారు. తెలుగు రాయడంగాని, తెలుగులోనే ఫైళ్ళను నిర్వహించడం గానీ వాళ్ళకి ఇష్టమేనండి.
మృణాళిని        :         వీళ్ళకి శిక్షణ అనేది నిర్ధిష్టంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా?
రహంతుల్లా       :         సొంత భాష తెలుగు అయినప్పుడు దాంట్లో రాయమంటే చాలా స్వేచ్ఛగా రాస్తారు. తప్పులు లేకుండా రాస్తారు. చెప్పదలుచుకున్న భావాన్ని చాలా సూటిగా చెప్తారు. శక్తివంతంగా చెప్తారు. చిక్కల్లా ఎక్కడొస్తుందంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ల వ్యవస్థలోకి పాత ద్యోగస్థులు మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మారాలంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఇచ్చారు కూడా. ప్రతి ద్యోగస్థుడికి కూడా ఆయా మండల స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఒక సాఫ్ట్‌వేర్‌అధికార భాషా సంఘం వాళ్ళు మండల స్థాయికి కూడా అందరికీ సరఫరా చేశారు. దానిలో ఎంత స్వేచ్ఛగా మన భాషని వాడొచ్చో చూసుకుని అది బాగుంటే సక్సెస్‌అవుతుంది.
మృణాళిని        :         ఇప్పటి ఆధునిక అవసరాలకు తగినట్టుగా తెలుగు లిపిని మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా?
రహంతుల్లా       :         ‘‘తెనుగు మెరుగులు’’ అని 1945లో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఒక పుస్తకం రాశారు. ఈ సంస్కర్తలెవరన్నా ఉంటే వాళ్ళందరూ ఆ పుస్తకం చదవడం మంచిది. దాంట్లో ఆయన రెండు రకాల లిపులను తానే స్వయంగా తయారుచేసి అమలు చేయండి అన్నారు. అప్పుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు ఆ లిపి  నేర్చుకొని ఆ లిపితోటే ఆయనకు జవాబు ఇచ్చారు. ఆ త్తరం కూడా ఆ పుస్తకంలోనే ప్రచురించారు. అందులో ఆయన చేసింది ఏమీలేదు. అ,,,ఈ.... 16 అచ్చులు ూన్నాయి. ఈ శబ్దాలు నేర్పడానికి 16 అచ్చులు అక్కర్లేదు. ఆ ఒక్కటే సరిపోతుంది. కు దీర్ఘం ఇస్తే ’, ‘కు గుడి ఇస్తే ’. ‘కు కొమ్మిస్తే అట్లా ఒకే అక్షరం.
                                , ఆ లకు ఇ, ఈ లకు పోలికేమన్నా ఉందా? ఆ ఒకరకంగా ఉంటుంది. ఈ ఒక రకంగా ఉంటుంది. అసలు వావి వరుస లేకుండా న్నాయి. పొందిక లేకుండా న్నాయి ఈ అక్షరాలు. పసి పిల్లల మెదడు మీద ఇంత భారం మోపితే వాడికి విసుగొచ్చి ఈ అక్షరాలు నేర్చుకోవడం కష్టమని చెప్పి ఈ భాష నేర్చుకోడు. మన పిల్లల చదువులు ఇట్లా వెనుకబడిపోవడానికి ఈ అక్షరమాల, ఈ లిపి ఒక కారణం అని ఆయన కనుక్కొని పసిపిల్లల బాధను కూడా  అతను అర్థం చేసుకొని తను చాలా కష్టపడి ఒక లిపిని తయారు చేశాడు. దాన్ని వీళ్ళు గుర్తించి ఆ సులభ లిపిని గనుక అమలు చేస్తున్నట్లయితే ఎంతో బావుండేది.
మృణాళిని        :         మీకు భవిష్యత్తు ప్రణాళికలేమైనా ూన్నాయా? ఈ భాషకి సంబంధించి.
రహంతుల్లా       :         మహానిఘంటువు నిర్మాణం జరగాలని ఒక ఆకాంక్ష ఉంది నాకు. అది ఎందుకొంస్తుందంటే మన తెలుగు పదాలు చాలా పదాలు నిఘంటువులోకి ఎక్కలేదు. ముఖ్యంగా ఈ పల్లెటూళ్ళలో చాలా చిన్న చిన్న కులాల్లోనూ, వృత్తుల్లోనూ మాట్లాడే వాళ్ళ పదాలు కొన్ని విస్మరించబడ్డాయి. సగానికి సగం సంస్కృత పదాలున్నాయి. ఒక 20 శాతం ర్దూ పదాలున్నాయి. నేను కొన్ని పదాలు చదువుతాను అవి న్నాయేమో మీరు చెప్పండి.
                                కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్ళిన విలేకరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షుల పేర్లు చెప్పారో చూడండి :` మట్టగిడిస, కొర్రమేను, బొమ్మిడాయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జల్ల, బొచ్చ, జడ్డువాయి, చేదుపరిగె, వాలుగ, పండుకప్ప, గండి బొడిగి, కొయ్యంగ, మునగపాము, గుడగ్గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకిరొయ్య, గడ్డికొయ్య, మాలతప్పడాలు, ఏటిజల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజల్ల, పారాటాయి. మనవాడు, మన కొల్లేరులో ూన్న వ్యక్తి అనునిత్యం చేపలు పట్టుకుంటూ ఈ చేప ఇది, ఈ చేప ఇది అని దాని నిర్మాణాల్ని బట్టి దానికి పేరు పెట్టుకున్నాడు. ఇది తెలుగు పేరు కాదా? ఇది మన నిఘంటువులోకి రావద్దా? పక్షులు చూడండి పరజ, ఆసాబాతు, కళాయి, చేతేనబాతు, నల్లముక్కలు, సముద్రపు చిలక, నత్తకొట్టుడు ఇలా చాలా న్నాయి. ఈ భాషా పదాలు వాడుతున్నప్పుడు వాటిని నిఘంటువులోకి తేవాల్సిన బాధ్యత ఎవరిదండి? అందుకని, ఆ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పల్లెటూళ్ళ ప్రజల్లో ఏమీ తప్పులేదు. వాళ్ళు దాన్ని నిలుపుకుంటున్నారు. కావాల్సిందల్లా దానికి ప్రోత్సాహం, ఎక్కువ నిధులు రావాలి. ఈ భాష మీద పరిశోధన పెరగాలి. పునాది పుస్తకాలు అంటారు చూడండి అవి పెరగాలి.
మృణాళిని        :         రహంతుల్లా గారు అధికార భాషగా తెలుగుని అమలు చెయ్యాలంటే పై అధికారుల్లో మరింత చొరవ, చిత్తశుద్ధి అవసరం అని అన్నారు. అలాగే తెలుగు భాష మరింత సుసంపన్నం కావాలంటే మామూలు ప్రజల భాషల్లోంచి పదాలను తీసుకొని ఒక మహానిఘంటువును తయారు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
                                తన అభిప్రాయాలను, సూచనలను మనతో పంచుకున్నందుకు ఈటీవి ప్రేక్షకుల తరఫున రహంతుల్లా గారికి ధన్యవాదాలు. నమస్కారమండీ...
రహంతుల్లా       :         నమస్కారం.
                                                                                       (20.6.2008, గీటురాయి వారపత్రిక)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి