6, జులై 2012, శుక్రవారం

8. మాతృభాషలో జరిగే పాలనలో దళారులుండరు


8. మాతృభాషలో జరిగే పాలనలో దళారులుండరు
(ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇంటర్వ్యూ 21.2.2007)

నాగసూరి వేణుగోపాల్‌: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ ‘‘ప్రపంచ మాతృభాషా దినోత్సవం’’గా జరుపుకుంటున్నాం. అది అందరికీ తెలిసిందే. మాతృభాషకు సంబంధించి చాలా రకాల విషయాలు గుర్తు చేసుకోవడం, మనం చేయాల్సిన పనులేంటి, ఇలా నిర్లిప్తంగా ఉంటే జరగబోయే ప్రమాదం ఏంటి? మొదలైన అంశాల గురించి చర్చించుకోవడం పరిపాటి. మరి ఆ సందర్భాన్ని  పురస్కరించుకొని ఈ రోజు మా ఆకాశవాణి కేంద్రానికి నూర్‌భాషా రహంతుల్లా గారు వచ్చారు. వీరు ఎన్‌.టి.పీ.సీ భూసేకరణకు సంబంధించిన డిప్యూటీ కలెక్టరు. వీరు తెలుగును అధికార భాషగా చక్కగా వర్తింపచేసి మన్ననలు పొందడమే కాకుండా తెలుగు అధికార భాషా సంఘం నుంచి పురస్కారాన్ని గత సంవత్సరం అంటే 2006 ఫిబ్రవరి 21న అందుకున్నారు.
నాగసూరి         : రహంతుల్లా గారు నమస్కారమండీ...
రహంతుల్లా       :         నమస్కారం
నాగసూరి         :         తెలుగు అధికార భాషగా అంటే పాలనా భాషగా న్నప్పుడు క్లుప్తత ఉంటుంది. స్పష్టత ఉంటుంది. అమలు విషయంలో కావాలసినంత రీతిలో అమలు కావడం లేదు అని అంటున్నారు. మరి ఎందువల్ల ఇలా జరుగుతోంది? ద్యోగుల ఆలోచనా ధోరణి ఎంత వరకు దీనికి కారణం అంటారు?
రహంతుల్లా       :         అమలులో ఇబ్బందులు ఎదురౌతున్న మాట వాస్తవమే. అయితే తెలుగు ప్రజల నుంచే ద్యోగులొస్తున్నారు. తెలుగు మాతృభాషగా న్న ద్యోగులు వేలాదిమంది, లక్షలాది మంది ఇక్కడ పని చేస్తున్నారు. మీ మాతృభాషలోనే ఫైళ్ళు రాయండి, మీ మాతృభాషలోనే ఆఫీస్‌కార్యక్రమాలు నడపండి అని అన్నప్పుడూ మాతృభాషలో నడపడానికి ఏ ద్యోగి కూడా వెనుకాడడు. చాలా సంతోషంగా మాతృభాషలో ఫైళ్ళు నడుపుతారు. అయితే ఇక్కడొచ్చిన ఇబ్బందల్లా ఏంటంటే మన సాంకేతిక పరిజ్ఞానం మనం ఇప్పుడు కంప్యూటర్ల యుగంలో న్నాం. ఈ కంప్యూటర్లు కూడా మన మాతృభాషకి సహకరించేటట్లుగా, మన మాతృభాషలోనే కంప్యూటర్లను ప్రతీ దానికీ వాడేటట్లుగా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు కూడా నేను కొన్ని ూదాహరణలు చెప్తాను. ఆఫీసర్‌కి ఎంతో చిత్తశుద్ధి ఉండి, పట్టుదలగా దాన్ని అమలు చేయాలని చూస్తే, ఒక టైపిస్టు దగ్గర నుండి, ఒక కంప్యూటర్‌ఆపరేటర్‌దగ్గర నుండి దానిని వాడటానికి అమలులో ఆటంకాలు ఎన్నైతే ఎదురౌతున్నాయో వాటిని ఇంకా పూర్తిగా పరిష్కరించుకోలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలుగుకు సంబంధించిన ఒక సాఫ్ట్‌ వేర్‌ను వారు చితంగానే ఇచ్చారు. అయితే దాన్ని కనీసం ఇన్‌స్టాల్‌ చేయడానికి కూడా సమస్యలు ఎదురైనాయి. ఫాంట్స్‌ మరొక సమస్య. వీటిని మనం ప్రాక్టికల్‌గా చూస్తే ఈ ఫాంట్స్‌ ఇన్‌స్టాల్‌చేయడం గానీ, ఇంగ్లీషును ఏ విధంగానైతే టైప్‌చేయగలుగుతున్నామో అంత సుళువుగా తెలుగుని కూడా టైప్‌చేయగలగాలి. ప్రింట్‌తీయాలి. ఎక్కడైతే సమస్యలున్నాయో వాటిని ఎదుర్కోవడానికి కూడా మరి ఈ ప్రభుత్వం నుంచి నిరంతరం దాని మీద పరిశీలన జరుగుతూ అభివృద్ధి చేయటానికి కొంత మందిని దాని మీద వినియోగించినట్లయితే ఇటువంటి సమస్యలని ఎదుర్కొనవచ్చు. సాంకేతిక పదజాలం గురించి పెద్ద వర్రీ ఏమీ లేదు. దానికి ప్రజలు అర్థం చెప్పగలుగుతారు. ప్రజలు కొత్త పదాలను పుట్టిస్తుంటారు. అయితే సామాన్య ప్రజానీకంలో ూన్నటువంటి మాటల్ని నిఘంటువుల్లోకి ఎక్కించి, వాటికి కూడా విలువ ఇచ్చి, ఇవి మన పదాలే కదా అని వాటిని తీసుకున్నట్లయితే మనకు పదసంపద పుష్కలంగా ూంటుంది. నన్నయ్య కంటే ముందు కాలం నుంచి ఎంతో మంది సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళున్నారు. సాహిత్యభాష, అట్లాగే గ్రామీణుల్లో ూన్నటువంటి సజీవ భాష, వాళ్ళు పుట్టిస్తున్నటు వంటి పదాలు, వీటన్నింటినీ మనం తీసుకొని మన నిఘంటువుల్ని పటిష్ట పరచుకొని వాటిని కంప్యూటర్ల మీద వినియోగించే స్థాయికి తీసుకెళ్తే తప్పనిసరిగా ఇది విజయవంతం అవుతుంది. మనం భయపడకూడదు. సిగ్గుపడకూడదు. ఇంగ్లీషులో చేస్తేనే గొప్పవాడు, ఆఫీసరంటే ఖచ్చితంగా ఇంగ్లీషు వచ్చి ఉండాలి అనుకోకూడదు. ఇంగ్లీషులో చేయగలిగితేనే అతన్ని ఆఫీసర్‌అనాలి, కేవలం తెలుగులో చేసేవాళ్ళను ఆఫీసర్‌అని లెక్కకట్ట కూడదు అనే ఒక చిన్నచూపు మనందరిలో వేళ్లూనుకొని పాతుకొని పోయి వుంది. ఇప్పుడు ఐఏఎస్‌అన్నారండీ, ఐఏఎస్‌అంటే వానికి ఖచ్చితంగా ఇంగ్లీష్‌వచ్చి ూండాలి. ఏం మనకు పరిపాలకులు లేరండీ? శ్రీకృష్ణదేవరాయలుకి ఏం ఇంగ్లీషు వచ్చు? శివాజీ గారికి ఏం ఇంగ్లీషు వచ్చు? లేదు. తెలుగులో పరిపాలన చక్కగా చెయొచ్చు. కానీ మనలో మనకే ఒకలాంటి చెప్పుకోలేని సిగ్గుతనం. ఈ ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం. ఎవరి మాతృభాషను వారు గౌరవించుకోవడం తనను తాను గౌరవించుకోవడమే. గిడుగు రామమూర్తి పంతులుగారు ఏమన్నారు? ‘‘మాతృభాషను ప్రేమించే వాడే నిజమైన దేశభక్తుడు’’. కాబట్టి మన భాషను మనం అమ్మలా ప్రేమించడం. మన భాషలో పాలన ఎక్కడెక్కడ ఎలా అమలు చెయ్యొచ్చో అలా చేద్దామన్నది నా ద్దేశ్యం.
నాగసూరి         :         ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే వేరే భాషలో మాట్లాడుకుంటారు అని వెటకారంగానో, ఎకసెక్కంగానో అంటుంటారు. మరి తమిళం, కన్నడం, మళయాళం లేదా హిందీ ఇటు వంటి ప్రాంతాలతో పోలిస్తే మన నిర్లిప్తత ఏ మేరకు ఉంది? అంటే కనీసం ఆ కోణం నుంచైనా చూస్తే మనకు కాస్త ూత్తేజం కలిగే అవకాశం ూంటుంది.
రహంతుల్లా       :         నిజమేనండీ, మన తెలుగు వాళ్ళలో నిర్లిప్తత చాలా ఎక్కువ. ఈ విషయంలో మనం తమిళుల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఇటు కర్నాటకలోగానీ, తమిళనాడులో గానీ, కేరళలోగానీ ఎక్కడైనా సరే ప్రతీ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ భాషల్ని రక్షించుకోవడం కోసం పటిష్టమైన చట్టాల్ని తెచ్చుకున్నారు. విద్యా వ్యవస్థలో కూడా వాళ్ళు తగిన మార్పులు చేసుకుంటున్నారు. అసలు వాళ్ళ మాతృభాషలో చదవకుండా పదో తరగతి దాటి విద్యార్థి బయటకు రాడు. ఖచ్చితంగా నేర్చుకొని ఉండాల్సిందే. అది ఎందుకు చేస్తున్నారు అంటే ఇంకా కొంతకాలం అట్లాగే నిర్లిప్తంగా ఉండేటట్లయితే వారి భాషలు అంతరించి పోతాయి. వాటిని రక్షించుకోవడం కోసమైనా వారు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నం మన రాష్ట్రంలో కనిపించడం లేదు. రెండోదేంటంటే, ఆలోచన ఏ భాషలో పుడుతుందో అదే మాతృభాష ఎవడికైనా. ఒక దెబ్బ తగిలిందనుకోండి అతను ఏ భాషలో బాధపడతాడో అదే అతని మాతృభాష. అంటే ఆలోచన ఆ భాషలో అతనికి మొదలౌతుంది. కొన్ని కోట్ల మంది గ్రామీణ జనం న్నారు. వీళ్ళందరికీ ఒక భాష ఉంది. ఆ భాషలోనే పరిపాలన జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ మొర వాళ్ళ మాతృభాషలో విన్నవించుకుంటున్నారు. దీన్ని కృత్రిమంగా ఇంకొక భాషలోకి మార్చి ఆ భాషలోనే తీర్పులిస్తున్నారు. తెలుగు తగాదాలకు ఇంగ్లీషు తీర్పు ఇటువంటి పరిస్థితికి మనం వచ్చిపడ్డాం. ఎవరి భాషలో వారికి తీర్పులొచ్చేటటువంటి రోజు రావాలి. ఆఫీసుల్లో పనులన్నీ మన వాళ్ళ భాషలో జరగాలి. అప్పుడే ప్రజలు సుఖపడతారు. ఇప్పుడు ఇంకొక భాషలోకి మార్చి కృత్రిమంగా ఇస్తే దానికి అర్థం చెప్పడానికి ఇంకొకడి దగ్గరికి వెళ్ళాలి. చెప్పించుకోవాలి. చదివించుకోవాలి. ఇదంతా ప్రజలపై కొత్తభారం పెట్టినట్లు కాదా? ఇది మొదటి విషయం రెండోదేంటంటే ` ఆర్థికంగా మనవాళ్ళు బలపడాలంటే తెలుగుభాష నసలు బలి చేసైనా సరే ఇంగ్లీషు నేర్చుకోవాల్సి వస్తుంది. అది నేర్చుకుంటేనే అతనికి మనుగడ, అభివృద్ధి, అది నేర్చుకుంటేనే అతనికి ద్యోగం. అలా కాకుండా తెలుగు మీడియంలోనే చదివి, తెలుగులోనే త్తర ప్రత్యుత్తరాలు నడపగలిగే వారికి కూడా ద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి ఏదైనా ఉంటే తెలుగు ఎగబడి చదువుకుంటారు. తెలుగు మీడియంను ఎవరూ కాదనరండీ.
నాగసూరి         :         రహంతుల్లా గారు... మీరు తెలుగు అధికార భాష కావాలంటేఅనే చక్కని తెలుగు పుస్తకాన్ని వెలువరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగుకు సంబంధించి చాలా పత్రికల్లో వ్యాసాలు రాశారు. తెలుగు వాడకంలో మరీ ముఖ్యంగా కంప్యూటర్‌, టైపింగ్‌వీటికి సంబంధించి కొన్ని సమస్యలు  ూన్నాయి. ఇంకోరకంగా చూస్తే హిందీ విషయం తీసుకుంటే కంప్యూటర్‌వచ్చాక లిపికి సంబంధించి చాలా సంస్కరణలు చేసినట్లు మనకు చాలా సులువుగా తెలుస్తుంది. అలాగే, తమిళం గానీ, మరో భాషగానీ అటువంటి పరిస్థితే ఉంది. మరి అధికార భాషగా తెలుగుని వర్తింపచేయాలంటే సాంకేతికంగా ఎటువంటి మార్పులు రావాలి? ఎందుకంటే ఈ దిశలో పెద్దగా కృషి జరిగినట్లు కనడడం లేదు కాబట్టి.
రహంతుల్లా       :         మీరు చెప్పింది నిజమేనండీ. లిపి వేరు భాష వేరు అని అనుకునేటట్లయితే మొత్తాన్ని సంస్కరించవచ్చు. సంస్కరించేటప్పుడు లిపి ఏమన్నా మారితే భాషే నాశనమై పోయినట్లుగా గుండెలు బాదుకునేవాళ్ళు న్నారు ఇక్కడ. మన లిపి యంత్రానికి అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు దాన్ని యంత్రానికి అనుకూలంగా మార్చాలి. ఇప్పుడు ఒత్తులు, గుణింతాలు అనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అదే మీరు ఇంగ్లీషు గానీ, తమిళంగానీ తీసుకోండి. హిందీ అయినా తీసుకోండి. అంతా ఒక లైన్‌లో సాఫీగా సాగిపోయేటట్లుగా అక్షరాలు ఉంటాయి. ఒత్తుగానీ, గుణింతం కానీ ఒకే లైన్‌లో వస్తాయి. అది కంప్యూటర్‌కి చాలా సౌలభ్యంగా ఉంటుంది. లిపిని కంప్యూటర్‌కి అనుకూలంగా మార్చుకోవాలి. మార్చలేమా? అంటే దానికి తగిన సాంకేతిక నిపుణులు ూన్నారు మార్చగలరు. కానీ మార్పుని ఎవరో పండితులు అంగీకరించాలి. అట్లా అంగీకరింపజేస్తే సరిపోతుంది. లేదంటే ఇంగ్లీషు లిపినే తెలుగుకి వాడుకుంటే అంతా చక్కగా జరిగిపోతుంది. భాషంటే ఏంటి? శబ్దం ఆ శబ్దాన్ని ఇలా రాయాలి అని మనం ఏర్పాటు చేసుకున్న అక్షరాలే లిపి. ఈ అక్షరాలు ఇంగ్లీషు వాళ్ళు అమర్చిపెట్టి మన మీద కొన్ని వందల సంవత్సరాలు పాలించటం వల్ల మన భారతీయులంతా ఇంగ్లీషు అక్షరాలకి అలవాటుపడిపోయారు. అ,ఆ..లు రాక పోయినా ఏ,బి,సి,డిలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ లిపిని యధాతథంగా వాడుకోవడం అన్నా జరగాలి. లేదా మన అక్షరమాలను, అక్షరాలను, ఒత్తులు, గుణింతాలు కూడా ఒకే లైన్‌లో వచ్చేలా సరిచేసుకుంటే భవిష్యత్తు తరాలు సుఖంగా ఈ అక్షరాలను వాడుకొని తెలుగును బాగా అమలు చేస్తాయి అని నా ద్దేశ్యం.
నాగసూరి         :         రహంతుల్లా గారు, మాతృభాషా దినోత్సవం ప్రపంచస్థాయిలో జరుపు కుంటున్నాం. ఫిబ్రవరి 21న ఈ మాతృభాషా దినోత్సవం నేపథ్యం ఏమిటి? అలా జరుపుకోకపోతే రాబోయే సమస్యలేంటి? కాస్త గుర్తు చేస్తే బాగుంటుంది.
రహంతుల్లా       :         చూడండి, పాకిస్తాన్‌ఇది వరకు తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌అని రెండు భాగాలుగా ఉండేది. అప్పుడు బంగ్లాదేశ్‌అనేవాళ్ళం కాదు. తూర్పు పాకిస్తాన్‌అనేవాళ్ళం. అయితే దీని అజమాయిషీ అంతా పశ్చిమ పాకిస్తాన్‌నుండి జరుగుతుండేది. అప్పుడు ర్దూలో పరిపాలన జరుగుతుండేది. తూర్పు పాకిస్తాన్‌వాళ్ళ మాతృభాషేమో బెంగాలీ, మా మాతృభాష బెంగాలీలోనే మా పరిపాలన జరగాలని పోరాటం మొదలు పెట్టారు. ఆ పోరాటంలో చాలా మంది బెంగాలీయులు చనిపోయారు. మతం కంటే భాషే గొప్పదనీ, భాష ఊపిరిలాంటిదనీ నిరూపించారు. చివరికి అది ఒక దేశంగా ఏర్పాటు అవడం, తప్పనిసరిగా బెంగాలీ భాషలోనే పరిపాలన జరగాల్సి రావడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఐక్యరాజ్యసమితి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవం జరగాలని నిర్ణయించారు. అలాగే మన దేశంలో ఒరియా అంటే బెంగాలీలో ఒక యాస అనేవాళ్ళు. బెంగాలీలు ఒరియా అధికార భాష  కావడానికి  ఒప్పుకోలేదు.  ఒరియా వాళ్ళు ద్యమాలు చేసి వాళ్ళకొక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒరియాలో పరిపాలన సాగించుకున్నారు. అక్కడిదాకా ఎందుకు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన రాష్ట్రం మొట్టమొదటిది. అది స్ఫూర్తిగా తీసుకుంటున్నారే తప్ప మరి ఎంత వరకు ఆ భాష మీద ఆ భాషతోటి పరిపాలన జరుగుతుందనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. దాన్ని సార్థకం చేయడానికి, అధికార పీఠం మీద మన భాషను కూర్చోబెట్టడానికి మనమంతా కూడా కృషి చెయ్యాలి.
నాగసూరి         :         చాలా చాలా ధన్యవాదాలండీ... రహంతుల్లా గారు. భాషకు సంబంధించి మన దృక్పథం కాస్త విభిన్నంగా, ప్రయోజనకరమైన ఆలోచనా ధోరణితో ఉండి, అవసరమైన రీతిలో మార్పులు చేసుకుంటూ కాస్త చిత్తశుద్ధితో చేస్తే ప్రజలకు అంటే ఎక్కువ మందికి ఇది పయోగపడుతుంది. తక్కువ శ్రమౌతుంది. అలాగే దళారీలు ఉండరు అని చాలా విషయాలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారిని ఆలోచింపచేశారు. ధన్యవాదాలు, నమస్కారం.
                                                                                    (13.6.2008, గీటురాయి వారపత్రిక)  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి