6, జులై 2012, శుక్రవారం

12. అధికార భాషా కార్యశీలి ప్రసాద్‌


12. అధికార భాషా కార్యశీలి ప్రసాద్‌
                ఏ తరానికా తరం విద్యార్థులు తెలుగులో చదువుతుంటేనేగదా తెలుగు బ్రతికేది? తెలుగుమీడియంలో చదివితే ూద్యోగాలు రావనే భయం వెన్నాడుతుంటే మన పిల్లలు తెలుగులో ఎందుకు చదువుతారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ద్యోగపరీక్షలు, నియామకాలన్నింటిలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు 5 శాతం అదనపు మార్కులిస్తే తెలుగు విద్యార్థులకు పాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో కార్యాలయాల్లో తెలుగు వాడకం పెరుగుతుంది.
                మన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఎ.బి.కె. ప్రసాద్‌గారు బాధ్యతలు చేపట్టిననాటి నుంచీ, తెలుగు భాషకు అన్నీ శుభాలు చేకూరుతున్నాయి. అవధానాలతో, అర్థంకాని కవిత్వాలతో కాలం గడిపే వ్యక్తికాదీయన. కార్యశీలి, ప్రణాళికా బద్ధంగా, నిర్ధుష్టమైన కార్యక్రమాలతో, ఒక్కొక్క పనీ సాధించుకుంటూ ముందుకెళుతున్నారు. అందుకే ఆయన్ని మరో ‘‘వావిలాల’’ అంటున్నారు.
                కరీంనగర్‌జిల్ల సిరిసిల్ల ఆర్డీవో నాగేందర్‌150 పేజీల రిట్‌ను తెలుగులో రూపొందించి హైకోర్టులో దాఖలు చేస్తే, దానిని హైకోర్టు కూడా సదభిప్రాయంతో స్వీకరించింది. ఇందుకు ఎ.బి.కె. ప్రసాద్‌హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్డీవోకు అభినందనలు తెలియజేశారు. (ఈనాడు 28.6.2006) ఇలాంటి వారిని గుర్తించడం, ప్రోత్సహించడం ఎ.బి.కె. చేస్తున్న మంచిపని. తెలుగులో కోర్టు వ్యవహారాలు నడపాలని ఆయన గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని స్వయంగా కలిసి కోరారు. కొంత మేరకు ఒప్పించారు కూడా.
                నేను మొగల్తూరు ఎమ్మార్వోగా పనిచేసినప్పుడు, 1994 ప్రాంతాల్లో హైకోర్టులో మాపై దాఖలైన రిట్‌పిటీషన్లన్నింటికీ తెలుగులో జవాబులిచ్చాను. అయితే తెలుగులో ూండే ప్రతివాదాలను హైకోర్టు స్వీకరించదు అని జిల్లా అధికారులే వాదించి, వాటన్నింటినీ ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి హైకోర్టులో దాఖలు చేశారు. ఎ.బి.కె. ప్రసాద్‌అలాంటి దురవస్థ తెలుగు అధికారులకు లేకుండా చేశారు. హైకోర్టులో కూడా తెలుగు స్వేచ్ఛగా వాడే రోజు రావాలి.
                ప్రసాద్‌గారు న్యాయస్థానాల్లో తెలుగు అర్జీల నమూనాలు తయారు చేయించారు. ఈ నమూనాలను పోలీసు స్టేషన్‌లోను, కోర్టులోనూ ూపయోగించాలని, 1974 నాటి జీవో ప్రకారం వాదోపవాదాలు, తీర్పులు తెలుగులోనే జరపటానికి సహకరించాలని రాష్ట్ర బార్‌కౌన్సిల్‌అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డిని కోరారు. అన్ని జిల్లాల న్యాయవాద సంఘాలకు నమూనాల కాపీలను పంపించారు (ఈనాడు 29.6.2006). ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇకమీదట మన అధికారులు తెలుగులోనే ప్రతివాదాలు రాసి ప్రభుత్వ న్యాయవాదుల్ని తెలుగులోనే కోర్టులో దాఖలు చేయమని కోరాలి.
                24 పేజీలతో అధికారభాషా సంఘం, తెలుగు మాసపత్రిక ప్రారంభించబోతున్నదని ఎ.బి.కె. ప్రసాద్‌వెల్లడిరచారు. ఇందువల్ల నిరంతరాయంగా తెలుగు పురోభివృద్ధికై అధికారభాషా సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలుస్తుంటాయి. ప్రజలనుండి సూచనలు అందుతుంటాయి. పాలకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ కొత్తచట్టాలు చేయడానికి ద్యుక్తులవుతారు.
                21.2.2006‘‘తెలుగు అధికారభాష కావాలంటే’’ అనే నా పుస్తకాన్ని తెలుగు ఇస్లామిక్‌పబ్లికేషన్స్‌వారు ప్రచురిస్తే, హైదరాబాద్‌ప్రెస్‌క్లబ్‌లో ఎ.బి.కె. ప్రసాద్‌గారు ఆవిష్కరించారు. ఆనాటి సభకు  హాజరైన రాజకీయ నాయకులు మండలి బుద్ధప్రసాద్‌గారు, పీతాని సత్యనారాయణ గారు, పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌బాబ్జీగారు. వారికి నేను మనవి చేసిందేమిటంటే, ‘‘తెలుగు భాషాభివృద్ధి కోసం ఎబికె చేసే ప్రతిపాదనలకు అన్ని పార్టీల వాళ్ళూ మద్దతిచ్చి చట్టాలు చేయండి’’ అని. తెలుగుకు ప్రాచీనభాష హోదా సాధన కోసం అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి ఢల్లీి వెళ్ళి ప్రధానికి విజ్ఞప్తి చేసి వచ్చినట్లే, తెలుగుకు సంబంధించి మన ఇంట్లో, మన రాష్ట్రంలో సరిచేసుకోవాల్సిన విషయాలపై కూడా కలిసి రావాలి. ఈ క్రింది విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
1. తెలుగు సాప్ట్‌వేర్‌తయారీదారులు : టైపు చేయడం రాని వాళ్ళు కూడా ఇంగ్లీషు కీబోర్డు మీద ఒంటిచేత్తో కొడుతూ ఏదో రకంగా తమ పని పూర్తి చేస్తుంటారు. ఆ స్థాయికి తెలుగు కీబోర్డు ఎదగాలి. తెలుగు కీబోర్డును ప్రమాణీకరించి స్థిరపరచాలి. వివిధ రకాల ఫాంట్లను ప్రభుత్వం కొనుగోలు చేసి అన్ని కార్యాలయాలకు సరఫరా చెయ్యాలి. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలను, తెలుగు సాఫ్ట్‌వేర్‌ఇంజనీర్లను కలిసి పరిశోధన మరియు అభివృద్ధి కోసం పురమాయించాలి.
2. లిపి సంస్కర్తలు : గుణింతాలు, వత్తులు కంప్యూటర్‌లకు కొరుకుడు పడే విధంగా లిపినైనా మార్చాలి లేదా వాటిని సరళంగా సులభంగా టైపు చేయగలిగేలా సాఫ్ట్‌వేర్‌ల తయారీనైనా, ముమ్మరం చెయ్యాలి. తమిళులు ఈ రెండు పద్ధతులూ పాటించి ముందుకెళ్ళారు కాబట్టే వాళ్ళ పుస్తక ప్రచురణ వేగం మనకంటే మూడురెట్లు ఉంటుంది.
3. తెలుగు టైపిస్టులు : టైపుమిషన్లు, కంప్యూటర్ల మీద తెలుగులో టైపు చేయగల యువతీ యువకులు వేలమంది రాష్ట్రంలో ూన్నారు. తెలుగు పత్రికారంగం వీళ్ళ వల్లనే నడుస్తోంది. ప్రతి కార్యాలయానికీ, కోర్టుకూ, పోలీస్‌స్టేషనుకూ తెలుగు టైపిస్టు తప్పనిసరిగా ూండేలా చేస్తే అటు తెలుగువాళ్ళకు ూపాధీ,ఇటు భాషాభివృద్ధి రెండూ సాధ్యమవుతాయి.
4. తెలుగు మీడియం విద్యార్థులు : ఏ తరానికా తరం విద్యార్థులు తెలుగులో చదువుతుంటేనే గదా తెలుగు బ్రతికేది? తెలుగుమీడియంలో చదివితే ద్యోగాలు రావనే భయం వెన్నాడుతుంటే మన పిల్లలు తెలుగులో ఎందుకు చదువుతారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ద్యోగపరీక్షలు, నియామకాలన్నింటిలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు 5 శాతం అదనపు మార్కులిస్తే తెలుగు విద్యార్థులకు ూపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో కార్యాలయాల్లో తెలుగు వాడకం పెరుగుతుంది.
5. నిఘంటుకర్తలు : నిఘంటువులు శాస్త్రాలవారీగా ప్రచురించే వాళ్ళను ప్రోత్సహించాలి. తెలుగు అకాడమీ వృత్తిపదకోశాల ప్రచురణలో ఎంతో కృషి చేసింది. మారుతున్న కాలంతోపాటు, కొత్తగా వచ్చి పడే పదాజాలాన్నీ ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ మన తెలుగు నిఘంటువుల్ని తాజా పరచుకోవాలి. తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు, విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలన్నింటికీ నిఘంటువుల నవీకరణ పని అప్పజెప్పాలి.
                అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఈ అంశాలన్నింటినీ సాధించటం కోసం వాటికి సంబంధించిన నిపుణులెందరినో సంప్రదించాలి, సమన్వయపరచాలి. అధ్యక్షపదవి అలంకరించినప్పటి నుండీ అలుపెపరుగకుండా నిరంతరం మన భాషాభివృద్ధికోసం శ్రమిస్తున్న ఎబికె ప్రసాద్‌అభినందనీయులు. అతనిలో సదాలోచనలున్నాయి. సమర్ధిద్దాం. అన్నె భవానీ కోటేశ్వరప్రసాద్‌గారి జన్మదినం ఆగస్టు 1 నాటికి మరో మంచి కార్యక్రమం చూద్దాం.
                                                                                   (4.8.2006, గీటురాయి వారపత్రిక)

3 కామెంట్‌లు:

 1. సచివాలయంలో అధికార భాషకు దిక్కుదివాణం లేదు -1 ---- ఎ.బి.కె. ప్రసాద్‌,అధికార భాషా సంఘం అధ్యక్షులు,ఫోన్‌ : 9848318414
  తెలుగు వ్యాప్తి కోసం తెలుగు భాషాభివృద్ధి కోసం, పరిపాలనా భాషగా తెలుగు ఇరుగు పొరుగు దక్షిణాదిరాష్ట్రాల మాతృభాషలతో సమంగా నిత్య వ్యవహారంలో ఎదిగి రావాలని తపనపడుతూన్న విద్యావంతులలో ఇటీవల నా దృష్టికి వచ్చిన వారు ఇరువురున్నారు. వారిలో ఒకరు విశాఖపట్నంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న నూర్‌బాషా రహంతుల్లా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన షేక్‌బడేసాహెబ్‌.
  ఇటీవల మిత్రులు రహంతుల్లా ''తెలుగు అధికార భాష కావాలంటే ...'' అన్న మకుటంతో రాసిన పుస్తకం ఎంత ప్రాచుర్యం పొందిందంటే, కొద్ది మాసాలలోనే అది పునర్ముద్రణకు వచ్చింది. రహంతుల్లా పుస్తకానికి ఇంత విలువ ఎందుకు వచ్చింది?
  ప్రపంచీకరణ పూర్వరంగంలో తమ సరకులతో వర్ధమాన దేశాల మార్కెట్లను నింపి, స్థానికప్రజల వస్తూత్పత్తులను దెబ్బతీసి సంతలపై సంపూర్ణ ఆధిపత్యం నెలకొల్ప డానికి ముందు ప్రపంచ సమాచార వ్యవస్థను అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా - ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని సుప్రసిద్ధ అమెరికన్‌ మీడియా నిపుణులైన ఎడ్వర్డ్స్‌, మెక్‌సినేలు వెల్లడించారు. ఈ నిర్ణయం 1980-90ల మధ్య జరిగింది. దీని పర్యవసానంగానే, ఈ పూర్వరంగంలోనే మాతృభాషల స్థానే ఇంగ్లీషును సర్వత్రా ప్రాథమిక విద్యాదశనుంచి బోధనా భాషగా, మల్టీనేషనల్‌ గుత్తకంపెనీల వ్యాపార వ్యవహార లావాదేవీల ప్రయోజ నాలు సాధించిపెట్టడం కోసం అమలులోకి తేవాలన్న నిర్ణయం జరిగింది.
  వర్ధమాన దేశాల మాతృభాషలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాబోతున్న ప్రమాదం గురించి ఐక్యరాజ్యసమితి (192 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచ సంస్థ) సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక విభాగంగా ఉన్న ''యునెస్కో'' 2000 సంవత్సరం లోనే హెచ్చరించింది. మాతృభాషలకు ఈ ప్రమాదం ఎందుకు ఎదురవుతోందో కూడా ఆ సంస్థ వివరించింది. వాటిలో ప్రధాన కారణం 200 ఏండ్లకు పైగా ఇంగ్లీషువాళ్ళ పరాయిపాలన కింద మగ్గిపోవటం, మాతృభాషల అభివృద్ధిని కుంటుపరచడం.

  రిప్లయితొలగించు
 2. సచివాలయంలో అధికార భాషకు దిక్కుదివాణం లేదు -2 ---- ఎ.బి.కె. ప్రసాద్‌,అధికార భాషా సంఘం అధ్యక్షులు,ఫోన్‌ : 9848318414
  నిజానికి 17వ శతాబ్దం వరకూ ఇంగ్లీషుకు ప్రపంచంలో ఇతరచోట్ల సంగతి అలావుంచి దాని పురిటి గడ్డయిన ఇంగ్లాండ్‌లోనే గతి లేదు. లాటిన్‌, ఫ్రెంచి భాషలదే (రాజకీయంగానూ, ఆర్ధికంగానూ రోమన్‌, ఫ్రెంచి సామ్రాజ్యాలు బలంగా ఉన్నందున) పెత్తనం అంతా. ఆ ''పెత్తనం'' తోనే ఆ రెండు సామ్రాజ్యాలూ ఇంగ్లీషును ''నీచమైన'', ''తుచ్ఛమైన'', ''అనాగరిక'' భాషగా వర్ణిస్తూ వచ్చారని మరవరాదు! ఈ అవమానం భరించలేని ఇంగ్లాండ్‌ పార్లమెంటు ప్రత్యేక తీర్మానం ద్వారా ఇంగ్లీషును తమ మాతృభాషగానూ, జాతీయ భాషగానూ ప్రకటించుకోవలసి వచ్చింది!
  అలాంటి ఇంగ్లీషు చరిత్ర ఎక్కడ? 2000 సంవత్సరాలకు పైబడిన భాషాచరిత్ర గల దక్షిణ భారత భాషలలో ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటైన తేటతెలుగు ఎక్కడ? అలాంటి తెలుగును ప్రాథమిక విద్యాదశ నుంచీ కనుమరుగు చేయాలని, దానిస్థానే సమాచార సాంకేతిక విప్లవం పేరిట, కంప్యూటరీకరణ పేరిట, విద్యను వ్యాపారీకరించి, ప్రయివేట్‌ స్కూళ్ళతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషును ప్రాధమిక స్థాయిలోనే బోధనాభాషగా ప్రవేశ పెట్టాలని చూస్తున్న సమయంలో రహంతుల్లా పుస్తకం వచ్చింది.
  ఆంగ్లభాషా వ్యామోహితులైన కొందరు తెలుగు ''పెద్ద మనుషులు'' కూడా బానిస విద్యావ్యవస్థకు పాదులు తవ్విన వలస ప్రభుత్వాధికారి అయిన లార్డ్‌ మెకాలేకు తెలుగునాట పుట్టిన ''మునిమనవళ్ళ'' మాదిరిగా కొత్త వంతలు పాడుతున్న సమయంలో రహంతుల్లా పుస్తకం వెలువడి విస్తృతమైన చర్చకు దారితీసింది.
  సంస్కృతంతో కొంత, ఇంగ్లీషు ప్రభావంతో మరింతగానూ, అపారమైన పదసంపదతో తులతూగుతూ వచ్చిన తెలుగు ఎన్నో సొంత పదాలు కోల్పోయింది. పరభాషా సంపర్కం వల్ల భాషలు సుసంపన్నం కావటం, పెరగడం ఒకఎత్తు కాగా తన వ్యక్తిత్వాన్నీ, తన మొక్కట్లనూ చెదర గొట్టుకునేంతగా మాతృభాషను దిగజార్చుకోవడం వేరు. తెలుగునాటి ఇంగ్లీషును ఒక భాషగా నేర్చుకోవడం, నేర్పడం వేరు, ప్రాధమిక విద్యాదశ అంతటా (1 నుంచి 10వ తరగతి వరకూ) మాతృ భాషలోనే విద్యాబోధన సాగించడం వేరు. ఈ తేడాను గమనించక బలవంతంగా 1-2 తరగతుల నుంచి ప్రయివేట్‌ స్కూళ్ళతో పోటీగా ఇంగ్లీషునే మాధ్యమ (బోధన) భాషగా ఎక్కించడానికి ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి.
  ఇప్పటికే విద్యను వ్యాపారీకరించడం (ప్రయివేటీకరించడం) ద్వారా దాదాపు 30% దాకా మన తెలుగు పిల్లలు తల్లిభాషకు దూరమవుతున్నారని అనధికార అంచనాలు. ఈ విషయంలో జనాభాలో 30% పిల్లలు తమ మాతృభాషకు దూరమయి నప్పుడు వ్యవహారంలో ఆ భాషను మృతభాషగా ప్రకటించుకోవలసిన దుస్థితి క్రమంగా వస్తుందన్న 'యునెస్కో' హెచ్చరికను తెలుగు భాషాభిమానులెవరూ మరువరాదు. సాహిత్యవేత్తలు, కవులు, పరిశోధకులు, వారి రచనలు, గ్రంధాలు బాగానే ఉంటారు, ఉంటాయి, వాటికి ఇబ్బంది లేకపోవచ్చు; కాని వ్యవహారంలో, వాడుకలో భాష చచ్చిపోకుండా ఉండాలంటే ప్రాధమిక విద్యాదశ అంతా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.

  రిప్లయితొలగించు
 3. సచివాలయంలో అధికార భాషకు దిక్కుదివాణం లేదు -3 - ఎ.బి.కె. ప్రసాద్‌,అధికార భాషా సంఘం అధ్యక్షులు,ఫోన్‌ : 9848318414
  ఈ విషయాన్ని రహంతుల్లా 19 అద్యాయంలో చాలా చక్కగా చర్చించారు. పరభాషలను గౌరవిస్తూనే మాతృభాష ప్రాశస్త్యం గురించి, తెలుగు లిపిలో రావలసిన సంస్కరణల గురించి, అధికార భాషగా తెలుగు ఎలా ఉండాలి, దాస్యం చేసే భాష అధికార భాషగా ఎలా చెలామణీ అవగల్గుతుంది ఇత్యాది ప్రశ్నలతో, చదవముచ్చటగా రాశారు. అలాగే తెలుగు నిఘంటువులకు ఎక్కవలసిన ఇంగ్లీషు పదాల గురించీ రాశారు. ప్రజల వాడుకలో రూఢమైన పరభాషా పదాలను ''ఇవి తెలుగే'' అనిపించగల, గ్రాహ్యశక్తిలో తెలుగు పటువుకు, దిటవుకు నిదర్శనంగా ఉండే పారశీ, ఉర్దూ భాషా పదాలను ఉదాహరించారు. ముఖ్యంగా తెలుగు చేసుకోగల్గిన ఇంగ్లీషు పదాలను కూడా యధాతథంగా వాడే అలవాటును ఏవగించుకున్నారు.
  మనం కోల్పోయిన ఎంతో పదసంపద నేటికీ అంతో ఇంతో జానపదాలలో, పల్లెవాసుల్లో, వృత్తిదారుల మధ్యనే పదిలంగా ఉంది. ''మీట'' మానేసి ''స్విచ్‌''ని ''రెక్క'' ను పక్కకు నెట్టి ''సిగ్నల్‌''ను పట్టుకున్నాం. ''బుగ్గ''ను మరిచిపోయి ''బల్బు''ను ''విద్యుద్దీపాన్ని'' ఎరువుతెచ్చుకున్నాం. మేలు చేసేవాడు ''మేలరి'' కాని ఆ పదం వదిలేసి ''శ్రేయోభిలాషి''ని ఆశ్రయించాం. ''ఫ్లై ఓవర్‌''కు మనకన్నా పల్లెవాసులు ''పై దారులని'' చెప్పి కమ్మగా దారిచూపారు! ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు.
  ఇక అధికార భాషా చట్టం (1966) వచ్చి నలభైయేళ్ళు గడిచిపోతున్నా దానికి సచివాలయ స్థాయిలో ''దిక్కు దివాణం'' లేకుండా ఉండిపోయింది. ఈ సమస్యను కూడా రహంతుల్లా ''అధోగతిపాలైన అధికార భాష'' అన్న శీర్షికలో చర్చించారు. అన్నింటికన్న అత్యంత విచారకరమైన విషయం- ప్రజలభాషను తిరిగి ప్రజల వద్దకు తీసుకుపోడానికి పాలకుల్ని ఇంతగా ప్రాధేయపడవలసి రావడమూ, తెలుగును బతికించుకోండని తెలుగువాళ్ళను తెలుగువాడే మొత్తుకోవలసిన దుర్గతిలో ఉండడమూ! రహంతుల్లా వేదన తెలుగువారందరి ఆవేదన అయినప్పుడు పరిస్థితుల్ని మార్చుకోవచ్చు!

  రిప్లయితొలగించు