6, జులై 2012, శుక్రవారం

3. మహానిఘంటువు నిర్మాణమే జీవితాశయం


3. మహానిఘంటువు నిర్మాణమే జీవితాశయం
                దాదాపు పాతికేళ్ళుగా ఆయన తెలుగు భాషాభివృద్ధి, అధికార భాషగా అమలయ్యేందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎక్కడ ఎందుకు అధికార భాషగా తెలుగు పటిష్టంగా అమలవడం లేదు? అన్న అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. తానో ప్రభుత్వ ద్యోగి అయినా, భాషాభివృద్ధి, భాష పరిరక్షణలపై తనకున్న ప్రత్యేక ఆసక్తితో  తెలుగు భాష గురించి, రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు అమలు గురించి ఎంతో సమాచారాన్ని ప్రోది చేశారు. తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తులనాత్మక విశ్లేషణ చేస్తూ, తప్పొప్పుల్ని సరిచూసుకుంటూ, ఆయా విషయాల్ని గ్రంథంగా మలిచారు. తెలుగు అధికార భాష కావాలంటే!?’ శీర్షికతో వెలువడిన ఆ పుస్తకం పలువురు విజ్ఞుల్ని, భాషాభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రభుత్వోద్యోగి అయినా తెలుగు భాష వీరాభిమానిగా ఆయన చేస్తున్న భాషా సేవ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే రాష్ట్ర అధికార భాషా సంఘం ఆయన సేవల్ని గుర్తించి అధికార భాషను సమర్థంగా అమలుచేస్తున్న ూత్తమ అధికారిపురస్కారంతో సత్కరించింది కూడా. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి సంప్రదాయాలంటే ప్రాణం పెట్టే ఆయనే... విశాఖపట్నం స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్‌నూర్‌భాషా రహంతుల్లా. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా మారి ప్రాంతీయ, దేశ భాషల్ని మింగేస్తున్న నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి తదితర అంశాలపై ఆయన స్పందన ఇది....
ప్రశ్న    :         మాతృభాష పరిరక్షణ కోసం పాతికేళ్ళుగా ూద్యమం చేసేంత ఆసక్తి, స్ఫూర్తి మీకు ఎప్పుడు ఎలా కలిగాయి?
జవాబు :         నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటే ప్రత్యేక అభిమానం. నా చదువంతా తెలుగు మీడియంలోనే చదివా. నా మాతృభాష తెలుగు. ూర్దూ, ఇతర భాషలేవీ రావు. నా తల్లి నాకెంత ఇష్టమో... నా తల్లి భాష నాకు అంత ఇష్టం. ఆ భాషంటే నాకెంతో ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా గత్యంతరం లేని స్థితిలో ఇంగ్లీషు మాట్లాడటం పలు సందర్భాల్లో ఎంతో బాధ కల్గించేది. ఆ బాధ, తీయనైన తెలుగు భాషను మింగేస్తున్న ఇతర భాషల ఆధిపత్యంపై అసంతృప్తి, ఆవేధనల నుంచే భాషాభివృద్ధి, పరిరక్షణకు ఏదో చేయాలన్న తపన జనించింది. పదో తరగతి స్కాలర్‌షిప్‌దరఖాస్తుల నుంచి జీవితంలో అన్ని దశల్లోనూ ఇంగ్లీషు ప్రమేయం నన్ను ఎంతగానో బాధించింది. అదే చివరికిలా తెలుగు భాష ప్రేమికుడిగా మారేందుకు స్ఫూర్తినిచ్చింది.
ప్రశ్న    :         ఇన్నేళ్ళలో మీ ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని భావిస్తున్నారా?
జవాబు :         అసలిది యుద్ధమే కాదు కాబట్టి విజయం ` పరాజయం వంటి ప్రశ్నలే లేవు. నా వరకూ నా వ్యక్తిగతంగా ఇది సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఏదీ చెయ్యలేదు. విజయమా? అనేది కచ్చితంగా చెప్పలేను గానీ, మొదట్లో తిరస్కరించినవాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు సైతం నేడు నన్ను మంచి పని చేస్తున్నావ్‌ అంటూ ప్రోత్సహిస్తున్నారు. మరింత చురుగ్గా పనిచేయమని వెన్ను తడుతున్నారు. ప్రస్తుతానికి ఇది నాకెంతో స్ఫూర్తినిస్తోంది. అయినా నా ప్రయత్నమల్లా తెలుగు భాషను బతికించండి... అనే అభ్యర్థినే తప్ప మరేం లేదు. తెలుగు భాషను జ్వలంగా, సమాజం దృష్టిలో సమున్నతమైన భాషగా నిలబెట్టాలన్నదే నా అభిలాష. ఇందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ... ప్రత్యేకించి తెలుగు ప్రజలంతా నడుం బిగించాలని అభ్యర్థిస్తున్నా.
ప్రశ్న    :         మాతృభాష పరిరక్షణతో సమాజాభివృద్ధి జరుగుతుందంటారా? నిజమేనా? అయితే ఎలా?
జవాబు :         తప్పకుండా మాతృభాషాభివృద్ధితో సమాజాభివృద్ధి జరుగుతుంది. ఎలా అంటే మానవ సమాజావసరాలూ, సాంఘిక సంక్షేమం, జాతి అవసరాలు ఆయా మాతృభాషల్లో చెప్పినంత స్పష్టంగా పరాయి భాషల్లో చెప్పలేం. పరుగులు పెడుతున్న ప్రపంచాభివృద్ధితో పోల్చితే.. మాతృభాషలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగా చేయలేకపోతున్నందున తెలుగు ప్రజల్లో అభివృద్ధి అంతగా జరుగలేదనే చెప్పాలి. మాతృభాషలో భావవ్యక్తీకరణ జరగకపోతే మనిషి ఆలోచనలు వికసించవు. అభివృద్ధి జరుగదు. ూదాహరణకు కోర్టులో వాద ప్రతివాదనలు, తీర్పులు వంటివన్నీ ఇంగ్లీషులో జరగటం వల్ల న్యాయమూర్తులకు ` బాధితులు, ముద్ధాయిలకు మధ్య లాయర్లు కేవలం దుబాసీల పాత్రకే పరిమతం కావాల్సి వస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా శాస్త్రాలూ, మేధావుల బోధనలు అన్నీ ఇంగ్లీషులో జరుగుతుండటంతో ఆ విజ్ఞానమేదీ సామాన్యులకు సరిగా అందటం లేదు. మాతృభాషని వదిలేసి పరాయి భాషలో భావ వ్యక్తీకరణ జరిగినంత కాలం సమాజాభివృద్ధి అనుకున్నంతగా సాగదు. రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చెప్పినట్లుగా విద్యార్థుల గ్రాహ్యతకు, భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకం. మాతృభాషలో విద్య నేర్వడం, నేర్పడం ఎంతో సులభం’’ అన్న అంశాన్ని నేను మనఃస్ఫూర్తిగా నమ్ముతా.
ప్రశ్న    :         తెలుగు అధికారభాషగా అమలు కావటానికి ూన్నతాధికారులే ఆటంకమన్న వాదనలున్నాయి. మీరేమంటారు?
జవాబు :         వ్యక్తిగా ఏ ూన్నతాధికారీ తెలుగు అధికారభాషగా అమలయ్యేందుకు ఆటంకమని నేను అనుకోను. వ్యవస్థలో ూన్నతాధికారులు అధికార భాష తెలుగును పక్కాగా అమలు చేయటంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆ ఇబ్బందులు ` సమస్యల్ని తొలగించాల్సి వుంది. అలా చేస్తే ూన్నతాధికారులు అడ్డు... అన్న అభిప్రాయం తొలగిపోతుంది. రాష్ట్ర ూన్నతాధికారులు కేవలం కేంద్ర ూన్నతాధికారులు, ఇతర రాష్ట్రాలతో జరిపే సంప్రదింపులు, త్తర ప్రత్యుత్తరాలన్నీ ఇంగ్లీషులో చేసినా ఫర్వాలేదు. కానీ హైదరాబాద్‌నుంచి జిల్లాలకు, రాష్ట్రంలోనే జారీ చేసే ఆదేశాలు మాత్రం తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలన్న నిబంధన తేవాలి. ఆ నిబంధన కచ్చితంగా అమలయ్యేలా అధికారభాషా సంఘం (అ.భా.సం) ఒత్తిడి తేవాలి. అప్పుడు అధికారుల పాత్ర పరిమితమై, రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా సక్రమంగా అమలవుతుంది.
ప్రశ్న    :         పాలకుల్లో... పాలితుల్లో... మార్పు ప్రధానంగా ఎవరి నుంచి మొదలవ్వాలి?
జవాబు :         ఇద్దరిలోనూ మార్పు మొదలవ్వాలి. యధారాజా తధా ప్రజ... యధా ప్రజా తధా రాజా... అన్న రెండు వాక్యాలూ నేడు సత్యాలుగానే కనిపిస్తున్నాయి. అధికార భాష అమలు విషయంలో ఎక్కడ ఎవరి ఒత్తిడి సత్ఫలితాలిస్తుందంటే వారే చొరవ చూపటం అవసరం. ప్రస్తుతం అటు పాలకులు, ఇటు పాలితులు ఇరువర్గాలూ మాతృభాష రక్షణకు, అధికార భాషగా తెలుగు అమలుకు చిత్త శుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న    :         తెలుగు భాష అంతరించి పోదని, పైగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని... పనీ పాటా లేని వాళ్ళే భాషా పరిరక్షణ పేరుతో హడావుడి చేస్తున్నారని కొందరి విమర్శ. వీరిలో భాషా పండితులూ ూన్నారు. తెలుగుభాష నిజంగా ప్రమాదంలో పడిరదా? లేక ఇది నిజంగా అనవసర ఆందోళనేనా?
జవాబు :         అలా ఎందుకు వివమర్శిస్తున్నారో ఆ మహాభాషా పండితులే చెప్పాలి మరి! వాళ్ళ దగ్గరేమైనా తెలుగు మాట్లాడేవాళ్ళు క్రమేణా పెరుగుతున్నారన్న డేటా ఏమైనా ూందా? 2001 జనాభా లెక్కల ఆధారంగానూ, ఐక్య రాజ్యసమితి చేసిన సర్వే ఆధారంగా కూడా తెలుగు భాష ప్రాభవం క్రమేణా తగ్గుతోందని స్పష్టం అయింది. ఏటికేడుగా తెలుగువారి జనాభా పెరుగుతున్నా, భాషగా తెలుగు మాత్రం పూర్వప్రాభవాన్ని కోల్పోతోంది. మరి ఆయా నివేదికల సమాచారాన్ని తెలుగు భాషకు రానున్న ప్రమాదాన్ని ముందుగానే తెలిపే హెచ్చరికలుగా భావించి తదనుగుణంగా చర్యలు చేపట్టడంలో తప్పేం ూంది? ఒకవేళ భాషా పండితుల విమర్శలే నిజమైతే... అంతకన్నా కావాల్సింది లేదు. కానీ...ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల హెచ్చరికలే నిజమైతే... అమ్మో....! అప్పుడీ భాషా పండితులేం చేస్తారు? అయినా మాతృభాషను విరివిగా వినియోగించండి... భాషను సుసంపన్నంగా, శక్తిమంతంగా తయారు చేయండని చెప్పడం హర్షణీయమే కదా!
ప్రశ్న    :         రాష్ట్రంలో తెలుగు అధికారభాషగా అమలు కాకపోవటానికి ప్రధాన అవరోధాలు ఏమిటి?
జవాబు :         దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సేతు భాష (లింక్‌లాంగ్వేజి)గా ఇంగ్లీషు రూపొందడమే అధికార భాషగా తెలుగు అమలుకు ప్రధాన అవరోధంగా కనబడుతోంది. ఆంగ్లం ప్రబావం ముందు ప్రాంతీయ భాషల ప్రాభవం వెలవెలబోతోంది. దీనికి పరిష్కారంగా స్థానికంగా ప్రాంతీయ మాతృభాషల్లో, జాతీయ ` అంతర్జాతీయ వ్యవహారాల్లో సేతు భాషల్ని విజ్ఞతతో ప్రయోగించటంలో మెలకువ పాటించాలి. తెలుగును శక్తిమంతంగా వినియోగించేందుకు తగిన పారిభాషిక పదకోశాలు ` వాటిని నిత్యం నవీకరించకపోవడం రెండో ప్రధాన సమస్య. ఇక తెలుగు రాతకు సంబంధించి అన్నిచోట్లా, అందరికీ సులభంగా అందుబాటులో ఉండే తెలుగు సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయకపోవడం మూడో అవరోధం. ప్రధానంగా ఈ మూడు అడ్డంకులూ తెలుగు అమలును నిరోధిస్తున్నాయి.
ప్రశ్న    :         ప్రపంచీకరణ పవనాలు ూధృతంగా వీచే నేటి తరుణంలో పిల్లలు తెలుగు మాధ్యమంలో చదివి నెగ్గుకురాగలరా? ద్యోగ పాధి అవకాశాల్లో వెనుకబడి పోరా?
జవాబు :         విషయ పరిజ్ఞానం, భాషా పాండిత్యాలు రెండు వేర్వేరు అంశాలు. రెంటిల్లోనూ ప్రావీణ్యం అభిలషణీయం. కానీ ప్రస్తుతం విషయ పరిజ్ఞానాన్ని పట్టించుకోకుండా, కేవలం భాషా పరిజ్ఞానంపై అంతర్జాతీయంగా విద్యా, ూపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది సహజంగానే భావితరాల్ని పరభాషలవైపు ఆకర్షిస్తోంది. ూపాధి హామీ లభించే విద్యను నేర్చేందుకు, భావి జీవితానికి భరోసా ఇచ్చే భాషనే నేర్చుకునేందుకు సాధారణ విద్యార్థి ఆసక్తి చూపటం చాలా సహజం. అదే ఇప్పుడు జరుగుతోంది. తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల వరకూ ఆంగ్లం బాగా నేర్పితే జీవితం బంగారు బాటన నడుస్తుందని వారిలో నమ్మకం కలిగించారు. అలా కాకుండా తెలుగు భాషలో చదివినా పాధికి ఢోకా లేదన్న భరోసా కలిగిస్తే వాళ్ళంతా మళ్ళీ తెలుగువైపు పరుగు పెడతారు. తెలుగు చదివినా, తెలుగులో చదివినా పాధి తథ్యం అన్న హామీ లభిస్తే, తప్పకుండా మళ్ళీ తెలుగుకు గౌరవస్థానం, అద్వితీయ ఆకర్షణ సమకూరుతాయి. ఇందుకు నేనే దాహరణ. ఎలాగంటే.. గ్రూప్‌1 వంటి సర్వీస్‌కమిషన్‌పరీక్షల్లో అప్పట్లో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన వాళ్ళకి 5 శాతం మార్కులు అదనంగా ఇచ్చారు. అలా ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులతోనే నేను అధికారిని అయ్యా... కాబట్టి మళ్ళీ అలాంటి అదనపు ఆకర్షణలు మన మాతృభాష అభివృద్ధికి చేసాయంగా అందించాలన్నది నా అభిప్రాయం.
ప్రశ్న    :         ఆధునిక సాంకేతిక అవసరాలకు తగ్గట్టు తెలుగు లిపిలో మార్పులు చేయాలని మీ వ్యాసాల్లో సూచించారు. అది మరింత గందరగోళానికి దారి తీయదా?
జవాబు :         ప్రస్తుతమున్న తెలుగు లిపిలో మార్పులు చేయాలన్న స్వర్గీయ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. నిపుణులు శ్రద్ధ పెడితే ఇందులో గందరగోళమేదీ ఉండదని భావిస్తున్నా. అయితే లిపిని మార్చటం, లేక ఇప్పుడున్న లిపికి అనుగుణమైన  సాఫ్ట్‌ వేర్‌ను సమకూర్చు కోవడం రెండిరటిల్లో ఏదీ సులభం... అనుసరణీయం అనేది ఆలోచించి, ఆ రెండిరటిల్లో ఏది చేసినా నాకు సమ్మతమే. మొత్తమ్మీద అంతర్జాతీయంగా ఇప్పుడు ఇంగ్లీషును అంతా ఎంత సులభంగా, ఎంత చౌకగా నేర్చుకుంటున్నారో ` వినియోగిస్తున్నారో అంతకన్నా సులభంగా, చౌకగా తెలుగు భాషను నేర్చుకోవడం, వినియోగించడం జరిగేలా చూడాలన్నదే నా కోరిక.
ప్రశ్న    :         తెలుగు సాఫ్ట్‌ వేర్‌తయారీదారులు స్వార్థవైఖరి వల్లే ఆ రంగంలో తెలుగు వాడకం మందగించిందని మీరు విమర్శించటానికి ఆధారాలేమిటి?
జవాబు :         ఇంగ్లీషు సాఫ్ట్‌వేర్‌అంత సులభంగా విస్తారంగా తెలుగు సాఫ్ట్‌వేర్‌దొరకడం లేదు. దీనికి కారణం తెలుగు సాఫ్ట్‌వేర్‌తయారీదారుల ఏకస్వామ్య పోకడలే కారణం. రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు పూర్తి స్థాయిలో అమలు అవ్వాలంటే తెలుగు సాఫ్ట్‌వేర్‌తయారీదారుల ఏకచ్ఛత్రాధిపత్యం పోవాల్సిందే. తెలుగు సాఫ్ట్‌వేర్‌తయారీదారులంతా కలిసి సాధారణ పౌరులు సైతం సులభంగా వినియోగించేలా ఒకే తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి చౌకగా అందచేసేందుకు దారంగా ముందుకు రావాలి.
ప్రశ్న    :         మహా నిఘంటువు తెలుగు భాషావ్యాప్తికి ఏరకంగా దోహదం చేస్తుందని భావిస్తున్నారు?
జవాబు :         మహా నిఘంటువు నిర్మాణం తెలుగు భాషాభివృద్ధికి తప్పకుండా దోహదం చేస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల్లోని ప్రజల తెలుగు మాండలికాలు, ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని వేల ప్రత్యేక పదాలు ఇపుడున్న నిఘంటువుల్లో లేవు. దీంతో ప్రస్తుతమున్న నిఘంటువులు కొంతమేరకే ూపయోగ పడుతున్నాయి. ఆయా కొత్త పదాలన్నింటినీ సేకరించి, వరుస క్రమంలో పేర్చి కొత్తగా మహా నిఘంటువు నిర్మాణం చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
                ఉదా :   కొల్లేరు ప్రాంతంలో పదుల సంఖ్యలో చేపల పేర్లు వాడకంలో న్నాయి. అలాగే ఇతర ప్రాంతాల్లో పంటలు, ధాన్యాల పేర్లు కూడా.
ప్రశ్న    :         ఇన్నేళ్ళలో తెలుగు అధికార భాషా సంఘం ఏం చేసిందని మీ అభిప్రాయం?
జవాబు :         ఇన్నేళ్ళల్లో అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూనే వుంది. కాకుంటే తొలి అ.భా.సం. అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య మొదలు ప్రస్తుత అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్‌వరకూ అధ్యక్షులంతా వారి వారి అభిరుచి, ఆసక్తి మేరకు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. ప్రత్యేకించి గత రెండేళ్ళుగా అ.భా.సం. మరింత క్రియాశీలకంగా పని చేస్తోంది. న్యాయస్థానాల్లో తీర్పులు, రాష్ట్రవ్యాప్తంగా అధికార భాష అమలుపై చైతన్య సదస్సుల నిర్వహణ, తెలుగులో ప్రభుత్వ త్తర్వుల (జీవోలు) జారీ వంటి కొన్ని చెప్పుకోదగిన విజయాలు ఈ కాలంలో సాకారం అయ్యాయి.
ప్రశ్న    :         తెలుగు భాషా పరిరక్షణలో ప్రసార మాధ్యమాల పాత్ర ఎలా ఉండాలి?
జవాబు :         తెలుగు భాషా పరిరక్షణలో ప్రసార మాధ్యమాలది కీలక పాత్ర. ప్రస్తుతం తెలుగు భాషాభివృద్ధికి ఈనాడువంటి దినపత్రికలు చిత్తశుద్ధితో పాటుపడుతున్నాయి. తెలుగు టీవి ఛానెళ్ళు, పత్రికలు తెలుగు భాషను సజీవంగా, బలోపేతంగా నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. కార్యాలయాల్లో, ప్రభుత్వాధికారులు తెలుగు సాఫ్ట్‌వేర్‌వినియోగంలో పడుతున్న ఇబ్బందుల్ని ఈనాడు  తెలుగు పత్రికలు సునాయాసంగా అధిగమిస్తున్నాయి. ఇలాంటి సులభమైన సాంకేతిక మెలకువల్ని అందరికీ వివరించి, ఆయా సాఫ్ట్‌వేర్‌లను ప్రభుత్వానికి అందించి సాధారణ పౌరులు సైతం ఆయా సాఫ్ట్‌వేర్‌లను వినియోగించేలా సాయం చేయాలి. నేడు తెలుగు పత్రికలు ఎన్నో శాస్త్ర సాంకేతిక పదాలకు చక్కటి తెలుగు పదాల్ని వాడుతున్నాయి. తెలుగు పదం లేని చోట కొత్త పదాన్ని సృష్టిస్తున్నాయి. దీన్ని కొనసాగించాలి. పత్రికలు, ఎలక్ట్రానిక్‌మీడియాలన్నీ ప్రజల్లో తెలుగు భాషపై అనురక్తిని పెంచేందుకు కృషి చేయాలి. తెలుగుభాష సేవ చేసే వాళ్ళను గుర్తించి వారి పరిచయాలను ప్రచురిస్తే, మరింత మంది ఆ స్ఫూర్తితో తెలుగు భాషాభిమానులుగా మారే అవకాశముంది.
ప్రశ్న    :         భవిష్యత్తులో మీ భాషోద్యమాన్ని ఎలా విస్తరించదలిచారు?
జవాబు :         తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణలకు అంకిత భావం ూన్న కార్యకర్తలాగా నా కృషిని కొనసాగిస్తా,అ.భా.సం. అధ్యక్షుడు ఏబీకే నా కృషిని చూసి నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేనూ ఇకపై నాలా భాషాభివృద్ధిని కాంక్షించే వారిని ప్రోత్సహిస్తా, నాలాంటి భావజాలంతో తెలుగు భాషాభివృద్ధిపై ఆసక్తి న్నవాళ్ళందరితో కలిసి తెలుగుభాషను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దటమే నా ఆశయం. ఎవరూ పూనుకోకుంటే, ఇప్పటికి చేరని కొన్ని వేల కొత్త పదాలతో మహా నిఘంటువునిర్మాణం చేపట్టాలన్నది నా ఆకాంక్ష. మరోవైపు 50 ఏళ్ళ క్రితం నాటి తెలుగు పాటల్ని సేకరించి, నేటి తరానికి మన తెలుగు పాటల గొప్పతనాన్ని, ఆయా పాటలు ఏ రాగంలో స్వరపరిచారు?ఎవరు రాశారు? వంటి వివరాలన్నింటితో మంచి పుస్తకం తేవాలని ప్రయత్నిస్తున్నా. దీనికి వి.ఎ.కె. రంగారావు లాంటి వారి సహకారంతో ఇప్పటికి మొత్తం 830 పాటల్ని రాగాల వివరాలతో సేకరించా. అలాగే ప్రస్తుతం వాడుకలోని తెలుగు సామెతల్ని సేకరించి గ్రంథస్థం చేయాలని కృషి చేస్తున్నా.
ప్రశ్న    :         న్నత ప్రభుత్యోద్యోగిగా మీ కార్యాలయంలో తెలుగు అమలుపై మీరు ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారు? సిబ్బందిని ఎలా మలుచుకు వస్తున్నారు. వ్యక్తిగా ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నారు?
జవాబు :         మా కార్యాలయంలో గతంలో ఇంగ్లీషులో న్న అన్ని దరఖాస్తు నమూనాల్ని తెలుగులోకి మార్పించా. మా కార్యాలయం నుంచి జరిగే ూత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా తెలుగులోనే నిర్వహించాలని ఆదేశించా. దాన్ని వందశాతం అమలు చేసేందుకు కృషి చేస్తున్నా. సాధ్యమైనంత వరకూ అన్ని అధికారిక కార్యక్రమాల్లో తెలుగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యంగా న్యాయ స్థానాలతో చేసే త్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నా. సిబ్బంది అంతా తెలుగులోనే నిత్య వ్యవహారాలు నిర్వహించేందుకు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నాను.
                                                                                        29.2.2008, గీటురాయి వారపత్రిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి