6, జులై 2012, శుక్రవారం

2. తెలుగు నిఘంటువులు


2. తెలుగు నిఘంటువులు
                ‘‘తెలుగు వాళ్ళు పలికే ర్దూ పదాలు’’, ‘‘తెలుగు నిఘంటువుల్లో చేరాల్సిన ఇంగ్లీషు పదాలు’’ గురించి ‘‘తెలుగు అధికార భాష కావాలంటే’’ పుస్తకంలో సవివరంగా రెండు అధ్యాయాలున్నాయి. 1900 సంవత్సరానికి ముందు వెలువడిన పాత నిఘంటువుల జాబితా కూడా ఉంది. వాటిలో నా వాదన ఒకటే, తెలుగులో పద సంపద పెరగాలి. తెలుగు ప్రజలు వాడుకలోకి తెచ్చిన పరభాషా పదాలు కూడా చక్కగా మన వాడుకలో ఇమిడిపోయి, తెలుగుపదాలే అన్నంతగా మనలో స్థిరపడిపోతే వాటిని ఎప్పటికప్పుడు మన నిఘంటువుల్లోకి చేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ నిఘంటువులన్నీ ఇంటర్నెట్‌లో ఉంచాలి. ఆయా పదాల అర్థాలను వెతుక్కునే సౌలభ్యం, సాంకేతిక నిపుణులు కల్పించేలా నిధుల విడుదల జరగాలి.
                లకంసాని చక్రధరరావు, ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్‌సంపాదకత్వంలో ‘‘తెలుగు వ్యుత్పత్తి కోశం’’ పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.
1.            `ఔ (1978) 412 పేజీలు, పొట్టి శ్రీరాములు కి అంకితం. ఎమ్‌.ఆర్‌. అప్పారావు తొలిపలుకులు. 12219 పదాలు.
2.            `ఘ (1981) 455 పేజీలు, కట్టమంచి రామలింగారెడ్డికి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట. 19670 పదాలు.
3.            `ణ (1981) 277 పేజీలు, ఆవుల సాంబశివరావు ముందుమాట. 11000 పదాలు.
4.            `న (1985) 440 పేజీలు, వాసిరెడ్డి శ్రీకృష్ణకి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి. 16000 పదాలు.
5.            `భ (1987) 498 పేజీలు, లంకపల్లి బుల్లయ్యకి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి. 19000 పదాలు.
6.            మ (1987) 268 పేజీలు, ఎమ్‌.ఆర్‌. అప్పారావుకి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట. 9754 పదాలు.
7.            `వ (1989) 272 పేజీలు, ఆవుల సాంబశివరావుకి అంకితం కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు. 10132 పదాలు.
8.            `హ (1995) 315 పేజీలు, కోనేరు రామకృష్ణారావుకి అంకితం మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. 6651 పదాలు. 3904 (`హ) అనుబంధం.
                ఈ సంపుటాలను ఆన్‌లైన్‌లో పెడితే బాగుంటుంది.
తెలుగు`ఉర్దూ నిఘంటువులు :
                మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవగాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి. ర్దూ`తెలుగు నిఘంటువు,     ర్దూ`తెలుగు జాతీయాలు, తెలుగు`ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కువగా దొరకడం లేదు. ముద్రించాల్సిన అవసరం వుంది.
శ్రీ        1938`మొదటి ూర్దూ ` తెలుగు నిఘంటువు 1938లో వరంగల్‌ స్మానియా కాలేజీలో అరబిక్‌ప్రొఫెసర్‌ఐ. కొండలరావు సంకలనపరచి ప్రచురించారు. ఇది అలీఫ్‌నుండి లామ్‌వరకు ఆహ్మదియా ప్రెస్‌కర్నూలులో మీమ్‌నుండి యే వరకు వరంగల్‌కుమార్‌ప్రెస్‌లోను ప్రింటు చేయబడిరది. మొత్తం 857 పేజీల పుస్తకం.
శ్రీ        ఈ పురాతన ప్రతిని తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్‌ఏబికె ప్రసాద్‌గారికి 6.10.2008న అందజేశాను. 2009 ఏప్రిల్‌25వ తేదీన 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించి అధికార భాషా సంఘం అధ్యక్షుడు  ఏబికె ప్రసాద్‌గారు విడుదల చేశారు.
శ్రీ        ర్దూ అకాడమీ ముప్ఫై ఆరు వేల పదాలతో శ్రీ పటేల్‌అనంతయ్య కమిటీ చేత తెలుగు`ఉర్దూ నిఘంటువు డి.టి.పి చేయించింది కానీ నిధులలేమి కారణంతో ప్రచురించలేదు.
శ్రీ        కొండలరావు గారి తెలుగు ` ర్దూ నిఘంటువు కూడా పునర్ముద్రణకు నోచుకోలేదు.
శ్రీ        2010లో ఎమెస్కో సంస్థ లక్షణరావు పతంగే సంకలన పరచిన ర్దూ`తెలుగు నిఘంటువును 328 పేజీలతో తెలుగు లిపిలో తెలుగు అక్షరక్రమంలో ప్రచురించింది.ఇందులో 12500 పదాలున్నాయి.
శ్రీ        తెలుగు పరిశోధన అనే http : //www.teluguthesis.com / forumdisply.php?fid=27@action=indice&order=subject లో ఆర్‌.పి.శర్మ, విమల్‌తదితరులు సేకరించిన అమరకోశము, అచ్చ తెలుగు పదాల నిఘంటువు, తెలుగు వ్యుత్పత్తి కోశం, త్రిభాషా నిఘంటువు, పత్రికా భాషా నిఘంటువు, పత్రికా పదకోశం, ప్రాసాక్షర పదకోశం, బాలల శబ్దరత్నాకరం, బ్రౌణ్య నిఘంటువు, లలిత కళా పదకోశం, విద్యార్థి కల్పవల్లి, విద్యార్థి కల్పతరువు, విశ్వకోశము, వేదాంత పారిభాషిక పద కోశం, శబ్దరత్నాకరము, సంస్కృతాంధ్ర నిఘంటువు వంటి చాలా రకాల నిఘంటువులు దొరుకుతున్నాయి.
                ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది. కాగితం, కలం రోజులు పోయాయి. ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో న్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, చ్ఛారణ ` పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడిరచే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా న్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
 https://www.facebook.com/nrahamthulla/media_set?set=a.823100821055243.1073741838.100000659993594&type=3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి