6, జులై 2012, శుక్రవారం

19. తెలుగుతల్లి భాష కూడా దేవభాషే


19. తెలుగుతల్లి భాష కూడా దేవభాషే
                హిందూ గ్రంథాల్లో చాలా చోట్ల దేవతలు సంస్కృతంలో మాట్లాడతారని ఉంది కాబట్టి అది దేవతల భాష, అదే దేవ భాష అని హిందూ భక్తుల నమ్మకం. యూదులకు దేవుడు తోరాహ్‌ను హెబ్రూ లో ఇచ్చాడు కాబట్టి యూదులకది దేవభాష.యేసు క్రీస్తు మాతృభాష ఆరామిక్‌కాబట్టి ఆరామిక్‌దేవుని ప్రత్యేక భాష అని క్రైస్తవులు నమ్ముతారు. అరబ్బీ స్వర్గలోకపు భాష అనీ, స్వర్గవాసులందరూ అరబ్బీలోనే మాట్లాడుతారనీ, అల్లాహ్‌అరబ్బీలోనే తీర్పు తీరుస్తాడనీ, అసలు ప్రతీ శిశువూ అరబీ భాషాజ్ఞానంతోనే పుడుతుందనీ, తల్లిదండ్రులే వారి వారి భాషలు పిల్లలకు నేర్పుతారనీ ''కొందరు ముస్లిములు వాదిస్తున్నారు. నా వాదన ఏంటంటే ఖురాన్‌అరబ్బీలో రాశారు. కానీ అల్లాహ్‌అరబ్బీలో మాట్లాడతాడని లేదా జన్నత్‌లో అరబ్బీయే సాధికారభాష అని ఎక్కడా చెప్పలేదు'' ''అన్ని భాషలూ దేవుడే పుట్టించాడు'' ''అన్ని భాషలూ అల్లావే'' అని ఖురాన్‌(49:13, 11:118-119) చెబుతోంది'' ఎవరి మాతృభాష వారికి దేవుడిచ్చిన భాషే కాబట్టి, అదేవారికి దేవభాష అవుతుంది.
                పరాయి భాష మాత్రమే మాట్లాడే దేవుడి దగ్గరకు ప్రజలు పోతారా ? పర భాషలో భక్తుల ఆత్మ నివేదన ఏదో మొక్కుబడి వ్యవహారం అన్నట్లుగానే ఉంటుంది తప్ప ప్రార్థనలో తాదాత్మ్యం చెందటం,ఆరాధనలో ఆనందం పొందటం ఉండవు. మన తెలుగు నేలపై మొక్కులందుకుంటున్న తెలుగు దేవుళ్ళూ, తెలుగు దేవతలూ ఎంతో మంది సొంత భాష తెలుగే కదా? లెక్కకు మిక్కిలిగా న్న మన గ్రామ దేవతల సొంత భాష తెలుగే.తెలుగు నేలపై అవతరించిన తెలుగు దేవుళ్ళు మాట్లాడే భాష తెలుగే అని కూడా చెప్పుకోలేని దైన్య స్థితి ఎందుకు? అది సంస్కృత ప్రభావమా, భయమా లేక నిజాన్ని దాచిపెట్టడమా?
                2010 కోట్ల బడ్జెట్‌తో దేశంలోనే అతి పెద్ద దేవునిగా అలరారుతున్న మన ఆపద మొక్కుల వాడు, ఏడుకొండల వెంకన్న మాట్లాడేది తెలుగు కాదా? శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణ, మంగళగిరి పానకాల స్వామి, యాదగిరిగుట్ట నరసింహుడు, కాణిపాకం వినాయకుడు, బాపట్ల భావన్నారాయణ, నరసరావుపేట కోటప్ప, బెజవాడ కనకదుర్గ, బాసర సరస్వతి, విశాఖ కనకమహాలక్ష్మి, కొండపాటూరు పోలేరమ్మ, శ్రీహరికోట శాస్త్రజ్ఞులకు సదా అభయమిస్తున్న సూళ్ళూరుపేట చెంగాళమ్మ, కాల జ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, పుట్టపర్తి సాయిబాబా, తెలుగు తల్లి, తెలంగాణా తల్లి... ఇలా కొన్ని వందల మంది తెలుగు దేవుళ్ళూ, తెలుగు దేవతలూ, స్వాములవార్లూ హాయిగా తెలుగులో మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు చక్కగా తెలుగులోనే జవాబులిస్తుంటే తెలుగును దేవ భాష కాదనటం ఆత్మ వంచన కాదా? సోది చెప్పే వాళ్ళు నయం అనిపించారు. మన తెలుగు దేవుళ్ళ జాబితా చక్కగా సగర్వంగా చెబుతారు.
                సంస్కృతం నేర్చిన తెలుగు పండితులు, పురోహితులు, కూడా వాళ్ళ సొంత అవసరాలు వచ్చేటప్పటికి ఆయా దేవుళ్ళకు సంస్కృతంలో కాకుండా తెలుగులోనే మొర్ర పెడతారు. ఆ దేవుళ్ళు కూడా తెలుగులోనే వరాలిస్తుంటే తెలుగు దేవ భాష అనటానికి ఒక్కరికీ నోరు రాదేమిటి? మన తెలుగు దేవుళ్ళు తెలుగులో మాట్లాడటం కూడా అపరాధమైనట్లు, తెలుగు దేవుళ్ళు తెలుగులో మాట్లాడరాదనీ, వాళ్ళను తెలుగులో పలకరించకూడదనీ వీళ్ళకు వీళ్ళే తీర్మానించటం న్యాయమా? తెలుగు దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడాలో కూడా అర్చకులే చెప్పాలా? తెలుగు భాష గురించి తెలుగు దేవుళ్ళకు లేని అభ్యంతరాలు యాజక వర్గానికి ఉండడం అప్రజాస్వామికం నియంతృత్వం. మొదటి నుండీ ఈ వైఖరే మన భాషకు శాపం అయ్యింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యలేదు అనే సామెత ఇందుకే పుట్టి ఉంటుంది.
                మన కార్యాలయాల్లో, కోర్టుల్లో, పాఠశాలల్లో పరాయి భాషలను ఎలా నిర్బంధం చేశారో అలాగే మన గుళ్ళూ గోపురాల్లో తెలుగు దేవుళ్ళకు కూడా ఆంగ్లంలోనే అన్నీ అమర్చేలా న్నారు. పోను పోను ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో!
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే :
                పిల్లలు పుట్టకముందే మాతృభాషను నేర్చుకుంటారు. మాతృభాషలో ఎన్నడూ మాట్లాడనంటూ రాసి న్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయడం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో న్న తొమ్మిది నెలల్లో... చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది. పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ చ్ఛారణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి న్నప్పటికీ, మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటాడు. (ఈనాడు 7.11.2009). కాబట్టి అన్ని మతాల దైవప్రార్థనలు కూడా మాతృభాషల్లో ఉండడం సమంజసమే, న్యాయమే.
                పొట్టి శ్రీరాములు గారు చనిపోయింది మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం. అయితే తరువాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తరువాత తెలంగాణాను కలుపుకున్నారు. అప్పటికే అక్కడ ర్దూ రాజ్యమేలుతూ ఉంది. ర్దూను రెండవ అధికార భాష అన్నారు. వాళ్ళ ూర్దూ పోయింది, మన తెలుగూ పోయింది. ఇంగ్లీషు రాజ్యమేలుతోంది. ఇక  మనం ఆంగ్లాన్ని మోయక తప్పలేదు. తెలుగు రాష్ట్ర పాలనా భాషగా ఇంగ్లీష్‌వైభవం వెలిగిపోతోంది. ఎవరి తల్లి వారికిష్టం. ఎవరి మాతృభాష వారికి గొప్ప. సంస్కృతాన్ని కాదని Long Live Classical Divine Tamil  అని తమిళులు వారి భాషాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. తమిళులు భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి. తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు. మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా Long Live Classical Divine Telugu  అంటూ గౌరవిద్దాం. మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం. వాడని భాష పాడుపడుతుంది. తెలుగుతల్లికి 18 కోట్ల బిడ్డలున్నారు. ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళపాటు శ్రమపడి పునరుద్ధరించిన హీబ్రూ ను మించిన పుష్టి తెలుగుతల్లికి ఉంది. సకల విజ్ఞానశాస్త్రాలనూ మనభాషలోకి అనువదించుకొని మన భాషలోనే చదువుకొనే అవకాశాలు కలగాలి. తెలుగులో చదివినా పాధి దొరకాలి.
                ఒంగోలులో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవం సందర్భంగా 1.1.2012న జన సాహితి ''తెలుగు భాష నికి - ప్రగతి; సంక్షోభం - సంఘర్షణ'' అనే కరపత్రం నాలుగోసారి ముద్రించి పంచింది. అందులోనుంచి కొన్ని మాటలు :
                ''ఏ భాషను ఏ దేవుడూ సృష్టించలేదు. మతాల వారీగా దేవుడ్ని పంచుకున్నట్టు భాషల వారీగా దేవుళ్ళు లేరు. దైవ సృష్టే నిజమైతే 'బ్రహ్మ మొక్కడే' నన్న అన్నమాచార్యుని ప్రకారం, ప్రపంచ ప్రజలందరికి భాషకూడా ఒక్కటే అయ్యేది. కనుక భాషను ఏ భగవంతుడు ఆఖరికి ఆ ''బ్రహ్మ'' కూడా సృష్టించలేదు.భాష కేవలం మానవ సృష్టి. భాషా బ్రహ్మ మానవుడే. దేవుడికి సంస్కృతం మాత్రమే వచ్చుననుకునేవారు, సంస్కృత భాషనుండే ప్రపంచభాషలన్నీ పుట్టాయనే మౌఢ్యంతో ఆలోచిస్తుంటారు. వారి సంకుచితత్వం దేవుడి నుండి భాష దాకా విస్తరిస్తుంది. ఈ దృక్పథం తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడదు. భావ వ్యక్తీకరణలన్నింటికీ మూలం  'మాతృభాష'. జాతి సంస్కృతి చ్ఛ్వాస నిశ్వాసాలు భాష. బ్రిటీష్‌పాలకులు తెలుగును కూటికి గుడ్డకూ పనికి రాని భాషగా చేశారు.''
                ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మందికి తెలుగు మాతృభాష. అంటే అమ్మ నాన్నల నుంచి వారసత్వంగా వచ్చిన భాష. నామిని సుబ్రమణ్యం పుస్తకాలలోంచి 4 మాటలు గుర్తు చేసుకొందాం.
1.            తల్లిదండ్రీ ఇచ్చిన భూమిని సంసారి నాకొడుకు ఎవుడన్నా అమ్ముతాడా?
2.            సాహిత్యం సమాజంలో నుంచే పుడతాది.అది ఆకాశంలో నుంచి దబీమని నేల పడదు. సమజంలో గూడా మహారాజులూ బీదలూ న్నట్టే సాహితీ వేత్తల్లో గూడా మహా రచయితలూ మామూలు రచయితలు ఉంటారు. మహా రచయితలు మహారాజుల గురించీ మామూలు రచయితలు మామూలు వాళ్ళ గురించి రాస్తారు.
3.            ''నా బతుకు నీటికన్నా పలసనా! దూదికన్నా సులకనా!'' అని దేవుడి ముందు ఏడుపు పాట పాడేది మా అమ్మ.
4.            ''దేముళ్ళనే వాళ్ళకు కోపం రాగానే బాణాలు తీసియేసి అవతల వాళ్ళను దెబ్బకు చంపేస్తుంటారు. కానీ జీసస్‌మాత్రం ఆయన మొకాన ఎంగిలూంచినా, ఎనకనుంచి ఎగతాళిగా ఎంటికలు పెరికినా, యింకా సిలువెక్కినాక కూడా కొడతావున్నా గమ్మునున్నాడే గాని నోరు తెరిచి ఒక్క తిట్టు తిట్టినాడా!''
5.            ''ఈ మఖా తల్లికి బ్రహ్మ రెక్కలిచ్చినాడే గానీ కష్టింజేసుకునేదానికి బూములు బావులిచ్చినాడా? పైగా ఏటా బాలింతను జేసి పిల్లకాయల్నిచ్చినాడు ఘనంగా, మనపిలకాయలకంత సంగటి పెడతాడు గదాని ఈ మఖాతల్లి కొంగు పరిచింది గానీ, బ్రహ్మ పెట్టింది తిని మదంబట్టిపోయి గాదు. నీకు ధర్మమనేది తెలిసుంటే ఆదున్నపోతు మీద బ్రహ్మనెక్కించుకుని నరకానికి తోడకపోయ్‌ నీతనివిదీరా చిత్రింసలు బెట్టుకో'' అని శివుడు యమ ధర్మరాజుతో అంటాడు.
పై మాటలన్నీ మన తెలుగు భాషకు వర్తింపజేసుకుంటే నాకు ఇలా అనిపిస్తోంది.
1.            తల్లీ దండ్రీ వారసత్వంగా ఇచ్చిన తెలుగు భాషను కాపాడుకోవాలి.
2.            మనం  దేవుళ్ళ బాషతో పాటు మామూలు తెలుగు భాషను కూడా గౌరవించాలి.
3.            అలా గౌరవించి కాపాడకపోతే మన తల్లి బాష తెలుగు భాష పలచనా, చులకనా అయిపోయిందని మళ్ళీ ఆ దేవుడి ముందే ఏడవాల్సి వస్తుంది.
4.            శక్తి చాలని వాడు సాధుత్వం వహించాడనీ, తప్పించే దిక్కు లేక దెబ్బలకోర్చాడనీ ఎగతాళి చేసే దుర్మార్గపు సమాజం మనది. తెలుగు భాషకు జరిగిన అవమానం మహానుభావుడైన ఏసు క్రీస్తుకు జరిగిన అవమానంలాగానే వుంది.
5.            యమ దేవ భాషల పాశాల నుండి కాపాడే పరమ శివుడు తెలుగు భాషకు కావాలి.
                సంస్కృత పదాలను పూర్తిగా నిరాకరించిన బంగారయ్య గారి మాటలను ఎత్తి చూపిస్తూ జయధీర్‌తిరుమలరావు గారు ఇలా అన్నారు.
                ''సంస్కృతం కలగలిసిన తెలుగుని ఆంధ్రం అంటున్నాం. ఇది తెలుగు భాషని దూరం నెట్టి తాను ఆంధ్రమైంది. ఆంధ్రభాష పేరుతో అది పుస్తకాలకెక్కింది. ఇది తెలుగు లిపిలో న్న సంస్కృతం. దీనిని ప్రజలు మాట్లాడరు. అది వ్యవహార దూరమైన భాష. ప్రజలు తమ నిత్యవ్యవహారంలో మాట్లాడే తెలుగుభాషకు రాతరూపం ఏర్పడలేదు.పండిత వర్గం పట్టునుండి తెలుగును విడిపించడం సులభం కాదు. కింది వర్గాల నుండి వచ్చిన వాళ్ళని కూడా వ్యతిరేకించేట్లుగా పండితవర్గం చేయగలదు. ఆంగ్ల భాషా
వ్యామోహంలో కొట్టుకుపోయే ఆలోచనా పరులకు ఇదొక వ్యర్థ ప్రయాసగా తోస్తుంది. ఆలోచించడానికి కూడా సమయం కేటాయించడం కష్టంగా ఉంటుంది. ఈ ధోరణే తెలుగుభాషకు శత్రువు.తెలుగు మీదకన్నా సంస్కృతంపై ఎక్కువ అభిమానం చూపే (సంస్కృతమే తెలుగు అనుకునే) వారు తెలుగువారా? సంస్కృతీయులా?
                ''తెలుగులో ఏ పరిభాష ఉందండీ కుక్క, నక్క, పిల్లి వంటివి తప్ప'' అని తెలుగు శిష్ఠులు అంటారు. మీరు తమని తాము తెలుగువారని అనుకోరు. ఆర్యులమనే భావిస్తారు. కుక్క నక్కల భాషని చదవడం కన్నా అవమానం ఏముంటుంది. అందుకే ఇంగ్లీషు చదువులకు ప్రజలకు సులభంగా దారి ఏర్పడుతుంది. తెలుగు భాషకి జరిగిన అన్యాయం అంతా కవులవల్లే జరిగింది. 'ఎందుకంటే' కవుల చేతిలో నుడి సరిగా పెరగదు' అని ఖరాఖండిగా చెప్పారు బంగారయ్య. అంతేకాదు మనకి కవులు కాదు రచయితలు కావాలి. రచయితే భాషని బ్రతికిస్తాడు. తెలుగులో కవులూ, అనువాదకులే చాలామంది ూన్నారు. కాని రచయితలు లేరు. ఈ అనువాదకులు తెలుగులో సొంతంగా రాయలేదు. కవి కంటే రచయితే ముఖ్యం అని 23 అంశాలను పట్టికగా తయారు చేసి దహరించి చూపాడు. అంతేకాదు కవిత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుందో 12 అంశాలలో విడమరచి చెప్పాడు. తెలుగులో వివిధ అంశాలకు సంబంధించిన పదజాలం ఉంది. కాని అదంతా ఎటుపోయింది. దాన్ని గుర్తించనీయకుండా కేవలం కవిత్వం మాత్రమే రాయడం వల్ల ఆ భాషని పట్టించుకోలేకపోయాం. కవిత్వ భాషే ప్రాధాన్యత సంతరించుకొంది.''
                తెలుగు పద సంపద గురించి పరివేదన చెందిన  బంగారయ్య గారి మాటలు ఒకసారి విందాం. :
                ''నుడిగంటుకారులు-తెలుగు దేసి గ్రామ్యపు మాటలను విడతియ్య లేకపోయిన అప్పుడు - వాటిని అన్నిటిని తెలుగు మాటలుగానే సూచించి ఉండవచ్చునుగా? ఎందుకు అలాగ చెయ్యలేదు? ఎందుకు అన్నిటిని దేసీయాలు అని చూపించినారు. దీనికి ఒకటే జవాబు. వారికి తెలుగు అంటే కంటగింపు ! తెలుగు అనే మాటను చూస్తేనే చీదర ! తెలుగు జాతి అంటే లోకువ.
                గత వెయ్యి ఏళ్ళుగా తెలుగునాటిలో మనుసులు నివసించలేదా? వారి బొందిలోని బాగాలకు పేర్లులేవా? గత వెయ్యి ఏళ్ళుగా తెలుగునాటిలో మంది ఇళ్ళు కట్టి కాపురాలు చెయ్యలేదా?  మరి  ఇంటిలోని  బాగాలకు, ఇల్లు కట్టే పనిముట్లకు పేర్లులేవా? గత వెయ్యి ఏళ్ళుగా తెనుగులు బట్టలు నెయ్యలేదా? కట్టలేదా? అయిన అప్పుడు బట్టలకు నేతకు సంబంధించిన మాటలు పెరగలేదా? గత వెయ్యి ఏళ్ళుగా తెలుగు జాతి నేలను సాగు చెయ్యలేదా?
అలాటి అప్పుడు సాగుకు చెందిన మాటలు ఏర్పడలేదా? గత వెయ్యి ఏళ్ళుగా తెనుగులు పోరులు చెయ్యలేదా? తళ్ళులు వెళ్ళలేదా? రాజ్జా'లను జయించలేదా? వాటిని ఏల లేదా, పరిపాలించ లేదా? రాయబారాలను నడపలేదా? సంది సరతులను విదించలేదా, అంగీకరించలేదా? మరి ఈ మాట మూట అంతా ఏమి అయింది? గత వెయ్యి ఏళ్ళుగా తెలుగుజాతి బేరసారాలు చెయ్యలేదా? పడవ, ఓడ, నావ పయినాలు చెయ్యలేదా? ఈ పొత్తులో పెరిగిన మాటలు ఏమి అయినాయి? గత వెయ్యి ఏళ్ళుగా తెలుగునాటిలోను జనులు జబ్బులు పడలేదా, మందులు వాడలేదా?  ఈ మాట సంపద  అంతా ఏమి  అయింది? గత వెయ్యి ఏళ్ళు తెలుగు జాతి బతకలేదా, పెళ్ళిళ్ళు చేసుకోలేదా, పిల్లలను కనలేదా, వారిని పెంచలేదా? ఈ పొత్తులో పెరిగిన మాట మూట ఏమి అయింది? తెలుగులో మాటలు లేవు అని చెప్పతెగించే తెంపరులు ఈ అడకలకు జవాబు చెప్పరు, చెప్పలేరు.
                నామిని అనేక అవమానాలు పడి, తిట్టించుకుని, తన్నించుకుని మరీ వాళ్ళ 'అమ్మ చెప్పిన కథలు' 'చదువులా చావులా?' లాంటి పుస్తకాలు సైకిలు మీద కట్టుకుని స్కూళ్ళకు తీసికెళ్ళి అమ్ముతాడు. మా తెలుగు తల్లికి పాట రాసిన శంకరంబాడి సుందరాచారి కూడా అంతే. కొన్ని భాషలు దేవభాషలుగా సంపన్నమైపోతుంటే, నా తల్లి భాష, తెలుగుభాష, నానాటికీ పేదదైపోతూ చులకనై పలచనైపోతుంటే, సంపన్న భాషలతో సంపర్కమై సంకరమైపోతే ఇంత సంకటన్నా దొరుకుతుందిలే అనే పేద స్థితికి దిగజారిపోతుంది.
ఇప్పుడు నా ప్రశ్నలు ఏంటంటే :
1.            'అన్ని భాషల రుచికన్న మిన్న తెలుగు' అంటాము కానీ 'కొలువుకు పరభాషయే మేలు. పొట్టనింపని తెలుగేల మట్టికుడువ?' అనీ సమాధానం చెప్పుకుంటాము. ఎంత విచిత్రమైన పరిస్థితి?
2.            మన గ్రంథాలలో న్నది ఎక్కువ శాతం తెలుగులిపిలో న్న దేవభాష సంస్కృతమే అయినపుడు దేవభాష హోదా తెలుగుకు ఎందుకురాదు?
3.            మనం అనునిత్యం మల్లె పూదండలు వేసి మంగళారతులిస్తున్న తెలుగుతల్లి మాట్లాడే భాష దేవభాషే కదా? తెలుగుతల్లి దేవత అయితే ఆ దేవత మాట్లాడే భాష ఖచ్చితంగా దేవభాషే అవుతుంది కదా?
4.            ''తెనుగు దేశమే దేశం, తెనుగు భాషే భాష
                తెనుగు మనుషులే మనుషులు, తెనుగు వేషమే వేషం.
                ఏ జాతి యెదటా ఏ సందర్భంలోనూ
                ఎందుకున్నూ నా తెనుగు జాతి తీసిపోదు''
                అని శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు.


''ప్రతి తెలుగు వాడూ తెలుగుభాషను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు. దేనినైనా మార్చుకుంటాడు గానీ మాతృభాషను మాత్రం మార్చుకోడు'' అని ధీమాగా చెప్పుకున్నాడు బుచ్చిబాబు.
                వీళ్ళంత గట్టిగా వాదించలేను గానీ కనీసం నా భాషలో కూడా దైవప్రార్థనలూ, కర్మకాండలూ చేయకూడదా? అని అడుగుతున్నాను.
కర్మకాండలలో తెలుగు
                నమాజు తెలుగులో చేయాలని నేను చాలా కాలంగా వాదిస్తున్నాను. 'నడుస్తున్న చరిత్ర' మే 2011 సంచికలో డా. జి.వి. పూర్ణచందు గారు రాసిన 'నిత్య జీవితంలో కర్మకాండలకు తెలుగు పనికారాదా?' అనే వ్యాసం చూసి ఆనందంతో ఒక లేఖ రాశాను. వ్యాసం ఆద్యంతం ఆసక్తిదాయకంగా, హేతుబద్ధమైన ఆలోచనలు రేపుతూ సాగింది. సంస్కృతాధిపత్యం నిలబడాలనే కొందరికి ఈ వ్యాసం రుచించకపోవచ్చు కానీ రచయిత మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష పక్షాన నిలబడి న్యాయం అడిగాడు. తెలుగు పట్ల చిన్న చూపు ఎందుకు అన్నాడు? దేవుడికి తెలుగు రాదా? అని తార్కికంగా ప్రశ్నించాడు. కర్మకాండలలో మాతృభాషా వినియోగం జరగాలనీ, తెలుగులో పెళ్ళి జరపాలనీ సమంజసమైన న్యాయమైన ఆలోచనలు రేకెత్తించాడు. పూర్ణచందు గారి ఆలోచనలు ఆచరణలోకి వస్తే తెలుగు ప్రజల పరాధీనత పోతుంది. తెలుగు ప్రజల హృదయాలు మాతృభాషలో స్వేచ్ఛగా తెరుచుకుంటాయి. అర్థంకాని మంత్రాలకంటే గుండె లోతుల్లోంచి అమ్మభాషలో పెల్లుబికివచ్చే ప్రార్థన ఎంతో బాగుంటుంది. ఎంతో హాయినిస్తుంది. సంకెళ్ళు తెగిపోయి మన ప్రజలు సుఖపడతారు. మానవహక్కుల పరిరక్షణ కోసం మతము, న్యాయము, విద్య, పాలన, వ్యాపారము మాతృభాషలో జరగాలి.         (నడుస్తున్న చరిత్ర జూన్‌2011)
పులికొండ సుబ్బాచారి ఇలా అన్నారు :-
                ''తెలుగు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను చదివే మంత్రాలు పూజలు తెలుగు భాషలో జరగవు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా? కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా? పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా? చాలా మత గ్రంథాలు సామాన్య మానవులు మాట్లాడే భాషలో లేవు. మత సంబంధమైన కార్యక్రమాలు అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదనుకుంటారు.
చాలా గ్రామ దేవతల గుడులలో తెలుగులోనే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామదేవతల గుడులలో రజకులు, క్షురకులు, కొమ్ములవాళ్ళు, బైండ్లవాళ్ళు, దళిత పూజారులు వారి పూజలు మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మతకార్యాలకు తెలుగే ఎందుకు వాడకూడదు?
                ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు. వారు మత కార్యక్రమాలు అన్నీ ఆయా ప్రజల మాతృభాషలోనే చేస్తారు. క్రీస్తు భాష అని హిబ్రూ భాషలో చేయరు.
                తెలుగు మతసంస్కారస్థాయిని, పవిత్రస్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయి కూడా తెచ్చుకోవాలి.        (సూర్య 9.4.2012)

బైబిల్‌ప్రకారం దేవ భాషలు - మానవ భాషలు
భాషలు తారుమారు చేసింది దేవుడే
                ''భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ూండెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు గోపురం పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను.  (ఆదికాండము 11:1-9)
యూదేతర భాషల వారిపై నెహెమ్యా దౌర్జన్యం :
                ''ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా ? అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్ద నుండి తరిమితిని. నెహెమ్యా 13:24-28

మాతృభాష బదులు పితృభాష శాసనం :
                ''పురుషుడు తన యింటిలో అధికారి''గా నుండవలెననియు, ''ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెనని'' యు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు అహష్వేరోషు హిందూ దేశం నుండి ఇథియోపియా వరకు తన ఏలుబడిలో ూన్న 127 దేశాలకు తన సకలమైన సంస్థానములకు తాకీదు పంపాడు.        (ఎస్తేరు 1:22)
రాత్రికి పగలుకు భాష లేదు :
                ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి బాషలేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు.     (కీర్తన 19.3)
రాజభాషకు సాష్టాంగం :
                ''కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.''
మొదట : ఆయా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నె జరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.
తరువాత : యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును;    (దానియేలు 3)
                ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ూన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.  (జెకార్యా 1)
                నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు.     (యేషయా 33:19)
ఎక్కువ భాషలలో ఉంటే ఎక్కువ మంది చదువుతారు :
                యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. (యోహాను 19:20)
దేవభాషకు దివ్య శక్తులు
                నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు; కొత్త భాషలు మాటలాడుదురు.  (మార్కు 16:17)
                అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో మీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకుభాష మాట్లాడుయూదులు సణుగసాగిరి. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు ? అని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. (అపోస్తలుల కార్యములు 2)
దేవదూతల భాషలలో మాట్లాడితే సరిపోదు అర్థం చెప్పాలి
                మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా ? (కొరింథీయులకు 12:10,30)
                మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. (1 కొరింథీ 13.1)
                సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.  (1 కొరింథీ 14.5)
                భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. (1 కొరింథీ 14.13)
                భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. (1 కొరింథీ 14.27)
మర్మభాష
                భాషలో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. (1 కొరింథీ 14.2)
                లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు. (1 కొరింథీ 14.10)
ఆత్మకొక భాష మనసు కొక భాష
                నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ూండదు. (1 కొరింథీ 14.14)
                సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.(1 కొరింథీ 14.19)
                భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి (1 కొరింథీ 14.22)
వెర్రి భాష :
                సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ూపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాట లాడుచున్నారని అనుకొందురుకదా ?  (1 కొరింథీ 14.23)
క్రూర మృగ భాష
                పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగముకు అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను. (ప్రకటన 13.7)
బైబిల్‌తెలుగు అనువాదాలు :
                ప్రపంచంలోని అత్యధిక భాషలలోకి అనువదింపబడ్డ గ్రంధం బైబిల్‌.
1727       -              బెంజమిన్‌షూల్జ్‌(జర్మన్‌లూథరన్‌మిషనరీ) కొత్త నిబంధన (అముద్రిత ప్రతులు జర్మనీలో ఇప్పటికీ ూన్నాయి)
1732       -              బెంజమిన్‌ఘాల్జ్‌పాత నిబంధన (అముద్రిత ప్రతులు జర్మనీలో ఇప్పటికీ న్నాయి)
1742       -              ఫిలిప్‌వేబ్రియన్‌(ఆముద్రితం)
1795       -              కెప్టెన్‌డాడ్స్‌(ఈస్ట్‌ఇండియా కంపెనీలో స్కాట్లాండ్‌ ద్యోగి). ఇతని మరణానంతరం తోటి ద్యోగులు ఇతని అనువాదాన్ని చిత్తు కాగితాలుగా భావించి పొరపాటున తగలబెట్టారట.
1800       -              తొలి క్యాథలిక్‌బైబిల్‌
1812       -              డిగ్రాంజన్‌, ఆనందరాయరు - నాలుగు సువార్తలు (కలకత్తా కరెస్పాండింగ్‌కమిటీ)
1818       -              జాన్‌గోర్డన్‌, ఎడ్వర్డ్‌ప్రిచెట్‌, ఆనందరాయరు (విశాఖపట్నం బైబిల్‌సొసైటీ)
1818       -              విలియం కేరీ - కొత్త నిబంధన (మద్రాసు)
1821       -              విలియం కేరీ పాత నిబంధనలోని అయిదు కాండాలు (మద్రాసు)
1841       -              జె. రీడ్‌ఆదికాండం (మద్రాసు ఆగ్జిలరీ సొసైటీ)
1844       -              న్యూవెల్‌- కొత్త నిబంధన (మద్రాసు)
1844       -              తెలుగు బైబిల్‌అనువాద సంఘం ఏర్పాటు
1853       -              చార్లెస్‌ఫిలిప్‌బ్రౌన్‌(ఆముద్రితం)
1881       -              బాప్టిస్ట్‌అనువాదం (మద్రాసు)
1888       -              డౌనీ, రాఘవయ్య - తెలుగు రిఫరెన్స్‌కొత్త నిబంధన
1898       -              బైబిల్‌సవరణ సంఘం ఏర్పాటు (ూల్ఫ్‌, ఆబర్లీ, అనంతం, శీనయ్య... 8మంది సభ్యులు)
1904       -              సవరించిన పూర్తి ప్రొటెస్టెంట్‌బైబిల్‌, రెండవ క్యాథలిక్‌బైబిల్‌(తోమాసు, బాలానందం, రాజేందర్‌, లాటిన్‌నుండి)
1914       -              లక్కవరం జమీందారు రాజా మంత్రి ప్రేగ్గడ భుజంగరావు - కొత్త నిబంధన కావ్యం
1927       -              ఇ. ఒమాగ్రన్‌- మత్తయి, లూకా, యోహాను సువార్తలు
                                జేమ్స్‌- నాలుగు సువార్తలు
1941       -              బాగ్స్‌- తెలుగు రిఫరెన్స్‌బైబిల్‌
1976       -              కొండవీటి వేంకట కవి - రక్షణ వేదం (క్యాతలిక్‌బైబిల్‌) (సంపాదకులు గాలి బాలి, పాటిబండ్ల విలియం, సి.ఇగ్నేషియస్‌)
1990       -              లివింగ్‌బైబిల్స్‌ఇండియా - వాడుక భాషలో పరిశుద్ధ బైబిల్‌, పూదోట జోజయ్య - సంపూర్ణ క్యాతలిక్‌బైబిల్‌'పవిత్ర గ్రంథము'
1987       -              జి.ఆర్‌.క్రో - పవిత్ర గ్రంధం
1994       -              జి.ఆర్‌.క్రో - పవిత్ర గ్రంథం (వ్యాఖ్యాన సహితం)
1995       -              వాడుక భాషలో బైబిల్‌                     - హెప్సీబా సుంకరి (తెలుగు బైబిలు అనువాద చరిత్ర)

1 కామెంట్‌:

  1. తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
    "భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే.భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును.ముందు 'భాష' పుట్టుతుంది.తర్వాత 'లిపి' పుట్టుతుంది.ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలు.లిపి లేని భాషలు 696.మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు.కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రము శబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు.తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు.నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. చాలా భాషల పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది ,ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును.తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది.సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగు భాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోని లిపి వలన వ్రాయవచ్చును.సంస్కృత భాషకు లిపిలేదు.సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగా వాడబడుచున్నది.అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది.ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు.ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి.తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్ద భాష ఏదీ లేదు.వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా ,చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి.శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప.ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు.''ఆత్మ'' అను పదము తెలుగు భాషలోనే పుట్టినది.వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". --- ఆచార్య ప్రభోదానంద యోగి (లు అంటే ఏమిటి? 2016)https://www.facebook.com/nrahamthulla/posts/1167077539990901

    రిప్లయితొలగించండి